సెకండ్‌ వేవ్‌లో రూ.2 లక్షల కోట్ల ఆర్థిక నష్టం

కరోనా సెకండ్‌ వేవ్‌ జీవనోపాధిని చిధ్రం చేయడంతో దేశ ఆర్థిక వ్యవస్థ పురోగతి మసకబారింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ. 2 లక్షల కోట్లు నష్టం వాటిల్లినట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బిఐ) నెలవారీ బులెటిన్‌లో భాగంగా జూన్‌ వివరాలను వెల్లడించింది. ప్రాంతీయ-నిర్ధిష్ట నియంత్రణ చర్యలు, చిన్న గ్రామాలకు కూడా వైరస్‌ సోకడం వంటివి కారణాలుగా పేర్కొంది. ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని ఆశలు వ్యక్తమౌతున్నప్పటికీ సెకండ్‌ వేవ్‌తో ఇంకా భారత్‌ కుస్తీ పడుతూనే ఉందని ఆర్‌బిఐ అభిప్రాయపడింది. ప్రాథమికంగా దేశీయ డిమాండ్‌ను తీవ్రంగా దెబ్బతీసిందని అంచనా వేసింది. నెలవారీ బులెటిన్‌లో భాగంగా దేశ ఆర్థికవ్యవస్థ, దేశ ఆర్థిక చట్రం, దిగుబడి అంశాలపై దృష్టి సారించింది.