దేశంలో ఒమిక్రాన్ కేసులు నెమ్మది నెమ్మదిగా పెరుగుతున్నాయి. తాజాగా గుజరాత్లో రెండు కేసులు వెలుగుచూశాయి. వీరిలో ఒకరు దక్షిణాఫ్రికా నుండి వచ్చారు. తాజా కేసులతో కలిపి మొత్తం సంఖ్య 25కు చేరుకుంది. డిసెంబర్ 4న జింబాబ్వే నుండి ఓ వ్యక్తి గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు రాగా, ఆయనకు చేపట్టిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. జినోమ్ స్వీకెన్స్‌లో ఒమిక్రాన్‌గా నిర్ధారణైంది. ఆయనతో సన్నిహిత సంబంధాలు కొనసాగించిన వారికి పరీక్షలు నిర్వహించగా.. ఒకరికి వైరస్ ఉన్నట్లు తేలింది. దక్షిణాఫ్రికా నుండి వచ్చిన వ్యక్తి పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ తీసుకున్నారు. ఆయనతో సన్నిహితంగా ఉన్న 10 మందిని అధికారులు క్వారెంటైన్లో ఉంచి.. పరీక్షలు నిర్వహిస్తున్నారు.
