2019లో షిర్డీ సాయి బాబా ఆదాయం ఎంతో తెలుసా

2019లో షిర్డీ సాయి బాబా ఆదాయం ఎంతో తెలుసా?

దేశంలో ఉన్న పవిత్ర పుణ్య క్షేత్రాల్లో ముఖ్యమైనది షిర్డి.సాయి బాబా భక్తులు అమితంగా షిర్డి పుణ్యక్షేత్రం వెళ్తూ ఉంటారు.ఏడాదిలో ప్రతి రోజు వేలాది మంది భక్తులు షిర్డి సాయి బాబాను దర్శించుకుంటూనే ఉంటారు.ప్రత్యేక సమయాల్లో ఆ సంఖ్య డబుల్‌ అయ్యే అవకాశం కూడా ఉంటుంది.దేశ వ్యాప్తంగా ఉన్న పుణ్యక్షేత్రాల ఆదాయాన్ని పరిశీలిస్తే సాయి బాబా ఆలయం ఆదాయం టాప్‌లో ఉంటుందనే విషయం తెల్సిందే.ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా పెద్ద మొత్తంలో షిర్డి సాయి బాబాకు విరాళాలు వచ్చాయి.

షిర్డి సాయి బాబాకు 2019 జనవరి 1 నుండి డిసెంబర్‌ 31 వరకు మొత్తంగా 287 కోట్ల రూపాయలు వచ్చాయి.బంగారం, వజ్రాలు, చెక్కులు, డీడీలు, ట్రాన్సపర్‌లు ఇంకా ఇతర రూపాలు మొత్తం కలిపి 287 కోట్ల వరకు వచ్చినట్లుగా ఆలయ అధికారులు ప్రకటించారు.

బంగారం సాయిబాబాకు 19 కేజీలు వచ్చినట్లుగా పేర్కొన్నారు.ఇక వెండి 391 కేజీలు అంటూ ప్రకటించారు.చెక్కులు డీడీలు కూడా భారీగానే వచ్చినట్లుగా ప్రకటించారు.ఈ ఆదాయం వచ్చే ఏడాదికి మరింత పెరుగుతుందని, ప్రతి ఏడాది షిర్డి సాయి ఆదాయం పెరుగుతుందని వారు అంటున్నారు.వచ్చే ఏడాదికి షిర్డి సాయి విరాళాల మొత్తం 300 కోట్ల రూపాయలకు చేరుకుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.