Monthly Archives: February 2020

జగన్‌కు మోదీ సర్కార్ గుడ్ న్యూస్..

మహిళలు, చిన్నారుల రక్షణతో పాటు బాధితులకు సత్వర న్యాయం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ చట్టంపై కేంద్ర హోం శాఖ కసరత్తు చేపట్టింది. దిశ బిల్లుకు చట్ట రూపం కల్పించే చర్యలను కేంద్రం ప్రారంభించింది. కొన్ని సాంకేతిక అంశాలపై కేంద్ర హోం శాఖ కోరిన వివరాలను ఏపీ ప్రభుత్వం ఇప్పటికే అందజేసింది. ఈ నేపథ్యంలో బిల్లుకు చట్ట రూపం ఇచ్చే దిశగా కేంద్ర కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నగర శివార్లలో మూడు నెలల క్రితం ‘దిశ’ అనే యువతిపై నలుగురు వ్యక్తులు ...

Read More »

‘భీష్మ’కు పవన్ ప్రశంసలు

‘భీష్మ’కు పవన్ ప్రశంసలు

తన వీరాభిమాని, భక్తుడు అయిన నితిన్ సినిమా ‘భీష్మ’పై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రశంసలు కురిపించారు. చిత్ర యూనిట్‌ను అభినందించారు. ప్రస్తుతం హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల ప్రస్తుతం ఆ ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఇది వెలకట్టలేని క్షణమని నితిన్ అంటుంటే.. తనకు లైఫ్ టైమ్ మూమెంట్ అని దర్శకుడు వెంకీ ఉప్పొంగిపోతున్నారు. ‘‘భీష్మ సినిమా ఘన విజయం సాధించినందుకు గాను చిత్ర యూనిట్‌ను పవర్ స్టార్ ప్రశంసించారు. వెలకట్టలేని క్షణం.. మిమ్మల్ని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను సార్’’ అని నితిన్ ...

Read More »

ట్రంప్‌ గో బ్యాక్‌

ట్రంప్‌ గో బ్యాక్‌

దేశ రాజధాని ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా అమె రికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌ పర్యటనను నిరసిస్తూ సోమవారం ఆందోళనలు చోటుచేసు కున్నాయి. ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ లో అఖిల భారత స్వేచ్ఛ, సంఘీభావ సంస్థ (ఎఐపిఎస్‌ఒ) సమన్వయంలో సిపిఎం, సిపిఐ, ఎస్‌యుసిఐ, సిజిపిఐతో పాటు ఎస్‌ఎఫ్‌ఐ, ఐద్వా, సిఐటియు, ఎఐవైఎఫ్‌, ఎఐడిఎస్‌ఒ, ఢిల్లీ సైన్స్‌ ఫోరం, కెవై ఎస్‌, ఎఐడివైఒ తదితర సంఘాలు ‘గో బ్యాంక్‌ ట్రంప్‌’ కార్యక్రమం నిర్వ హించాయి. సిపిఎం పొలిట్‌ బ్యూరో సభ్యుడు నిలోత్పల్‌ బసు, సిపిఐ ప్రధాన కార్యదర్శి ...

Read More »

నేడు ఢిల్లీకి కేసీఆర్‌

నేడు ఢిల్లీకి కేసీఆర్‌

తెలంగాణ సీఎం కేసీఆర్‌ మంగళవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. భారత పర్యటనకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గౌరవార్థం మంగళవారం రాత్రి 8 గంటలకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌ ఏర్పాటు చేసిన విందుకు కేసీఆర్‌ హాజరుకానున్నారు. సోమవారం రాత్రి తన వ్యవసాయ క్షేత్రం నుంచి సీఎం హైదరాబాద్‌కు వచ్చారు. మంగళవారం మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు.

Read More »

తాజ్‌ మహల్‌ ను సందర్శించుకున్న ట్రంప్‌ దంపతులు

తాజ్‌ మహల్‌ ను సందర్శించనున్న ట్రంప్‌ దంపతులు

అహ్మదాబాద్‌లోని మోతెరా స్టేడియంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగాలు ముగిశాయి. అనంతరం తన పర్యటనలో భాగంగా… ట్రంప్‌ తన భార్యతో కలిసి ఆగ్రా లోని తాజ్‌ మహల్‌ ను సందర్శించేందుకు బయలుదేరారు. సోమవారం సాయంత్రం 4.45 గంటలకు అక్కడికి చేరుకోనున్నారు. సాయంత్రం 5.15 గంటలకు తాజ్‌ మహల్‌ ను ట్రంప్‌ దంపతులు సందర్శిస్తారు. అనంతరం సాయంత్రం 6.45 గంటలకు ట్రంప్‌ తిరిగి ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. మోడి రాక సందర్భంగా.. ఆగ్రాను, తాజ్‌ మహల్‌ పరిసరాలను సుందరంగా అలంకరించారు.

Read More »

మలేసియా ప్రధాని రాజీనామా

మలేసియా ప్రధానమంత్రి అనూహ్యంగా పదవినుంచి తప్పుకున్నారు. ప్రధాని మహతీర్ మొహమాద్ (94)తన రాజీనామాను ఆ దేశ రాజుకు సమర్పించినట్టు సమాచారం. దీనిపై స్పందించడానికి ఆ దేశ ప్రధానమంత్రి కార్యాలయం తిరస్కరించినప్పటికీ త్వరలో ప్రకటన విడుదల చేయనున్నట్టు మాత్రం వెల్లడించారు. ఇటీవల నెలకొన్ని రాజకీయ సంక్షోభం, త్వరలో కొత్త సంకీర్ణాన్ని ఏర్పాటుచేయనున్నారన్న అంచనాల మధ్య ప్రధాని రాజీనామా ప్రాధాన్యత సంతరించుకుంది.

Read More »

నిరుపేదల జీవితాలు మారాలి -సీఎం జగన్

నిరుపేదల జీవితాలు మారాలి -సీఎం జగన్

దేశంలోనే కనీవినీ ఎరుగని రీతిలో చదువుల విప్లవం ప్రారంభించామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. సోమవారం విజయనగరంలో జగనన్న వసతి దీవెనపథకాన్ని ఆయన ప్రారంభించారు. వసతి దీవెన సాయాన్ని విద్యార్థుల ఖాతాలకు ఆన్‌లైన్‌ ద్వారా జమ చేశారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లైనా పేదల బతుకు మారలేదని.. నిరుపేదల జీవితాలలో మార్పులు రావాలని ఆకాక్షించారు. పేదల బతుకులు మారాలంటే వారి కుటుంబాలలో ఎవరో ఒకరు ఇంజనీర్, డాక్టర్, ఐఏఎస్ అవ్వాలన్నారు. డిగ్రీ, పీజీ జరిగే విద్యార్థులకు రెండు ...

Read More »

మోడీపై ప్రశంసలు కురిపించిన ట్రంప్

మోడీపై ప్రశంసలు కురిపించిన ట్రంప్

ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం మొతెరా వేదికగా సాగిన నమస్తే ట్రంప్‌ కార్యక్రమంలో అగ్రదేశాధినేత డొనాల్డ్‌ ట్రంప్‌ ఆద్యంతం ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసలతో ముంచెత్తుతూ ప్రసంగం కొనసాగించారు. నమస్తే అంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన ట్రంప్‌ దేశం కోసం మోదీ రాత్రింబవళ్లు కష్టపడుతున్నారని ప్రశంసల్లో ముంచెత్తారు. భారత్‌- అమెరికాలు 3 బిలియన్‌ డాలర్ల రక్షణ ఒప్పందంపై సంతకాలు చేస్తాయని ప్రకటించారు. మోదీ తనకు గొప్ప స్నేహితుడని అంటూ అమెరికా భారత్‌ను అభిమానిస్తుందని అన్నారు. ట్రంప్‌ ఇంకా ఏమన్నారంటే…‘ భారత్‌, అమెరికా ఎప్పటికీ నమ్మదగ్గ స్నేహితులు..లక్ష మందికి ...

Read More »

జగనన్న వసతి దీవెన పథకాన్ని ప్రారంభించిన ఏపీ సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పేద విద్యార్థులకు అండగా మరో విశిష్ట పథకానికి శ్రీకారం చుట్టారు. ‘జగనన్న వసతి దీవెన’పథకాన్ని సోమవారం ఆయన విజయనగరం జిల్లాలో ప్రారంభించారు. విజయనగరం పోలీస్‌ ట్రైనింగ్‌ కళాశాలకు చేరుకున్న సీఎం జగన్‌ విజయనగరం అయోధ్య మైదానంలో వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించించారు. అనంతరం వేదికపై దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళర్పించి.. ‘జగనన్న వసతి దీవెన’ పథకాన్ని ప్రారంభించారు.

Read More »

ట్రంప్ దంపతులకు ఘన స్వాగతం పలికిన మోడీ

ట్రంప్ దంపతులకు ఘన స్వాగతం పలికిన మోడీ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌ అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. వారికి ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా రెడ్‌ కార్పెట్ స్వాగతం పలికారు. గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ, పలువురు కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు ప్రధాని వెంట ఉన్నారు. ట్రంప్‌తో పాటు ఆయన కూతురు, అధ్యక్షుడి సీనియర్‌ సలహాదారు ఇవాంక, అల్లుడు జారెడ్‌ కుష్నర్‌, అమెరికాకు చెందిన పలువురు మంత్రులు, ఉన్నతాధికారుల బృందం కూడా భారత్‌కు విచ్చేసింది. ఎయిర్‌పోర్టు సర్కిళ్లో ఏర్పాటు చేసిన కళకారుల ప్రదర్శన బృందాలు ట్రంప్‌కు ...

Read More »