Monthly Archives: March 2020

ఎర్రగడ్డ కి క్యూ కడుతున్న మందు బాబులు

ఎర్రగడ్డ కి క్యూ కడుతున్న మందు బాబులు

కరోనా వైరస్‌ కట్టడి చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్‌డౌన్‌ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీంతో కేవలం నిత్యావసరాలకు సంబంధించిన షాప్‌లు తప్ప మిగతా షాప్‌లు మూత పడ్డాయి. వైన్‌ షాప్‌లు కూడా మూతపడటంతో మందుబాబులు పరిస్థితి దారుణంగా తయారైంది. రోజు మద్యం సేవించడం అలవాటు ఉన్నవారికి ఒక్కసారిగా మందు దొరక్కపోవడంతో తట్టుకోలేకపోతున్నారు. మరోవైపు వారం రోజుల నుంచి మద్యం దొరక్కపోవడంతో మందుబాబులు వింతగా ప్రవరిస్తున్నారు. దీంతో ఆందోళనకు గురైన మందుబాబుల కుటుంబసభ్యులు.. వారిని ఎర్రగడ్డ ప్రభుత్వ మానసిక వైద్యశాలకు తీసుకువస్తున్నారు. దీంతో ...

Read More »

షియోమీ భారీ విరాళం

షియోమీ భారీ విరాళం

భారతదేశంలో విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్‌పై పోరాటంలో ప్రభుత్వానికి ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ షియోమీ అండగా నిలిచింది. ఈ మహమ్మారిపై జరుగుతున్న పోరాటంలో ప్రభుత్వానికి షియోమీ రూ.15 కోట్లు విరాళాన్ని ప్రకటించింది. ఈ విషయాన్ని షియోమీ గ్లోబెల్ వైస్ ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ మను కుమార్ జైన్ ఓ లేఖ ద్వారా వెల్లడించారు. ప్రధాన మంత్రి అత్యవసర సహాయ నిధి (పీఎం-కేర్స్)కు రూ.10 కోట్లను విరాళంగా ఇస్తున్నామని తెలిపిన మను. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధులకు కూడా ఆర్థి సహాయాన్ని అందజేస్తామని ...

Read More »

ఢిల్లీ ప్రార్థనల్లో తెలంగాణ నుంచి 1030 మంది

ఢిల్లీ ప్రార్థనల్లో తెలంగాణ నుంచి 1030 మంది

ఢిల్లీలోని నిజాముద్దీన్‌ ప్రాంతంలో గల మర్కజ్‌ మసీదు దేశ వ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. అక్కడకు మత ప్రార్థనలకు వెళ్లినవారిలో కొందరికి కరోనా పాజిటివ్‌ అని నిర్ధారణ అయింది. అందులో తెలంగాణకు చెందిన వారు కూడా ఉన్నారు. ఇక తెలంగాణ నుంచి ఢిల్లీ ప్రార్ధనలకు 1030 మంది వెళ్లినట్టు ప్రభుత్వం గుర్తించింది. వారిలో హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ పరిధి నుంచి 603 మంది హాజరైనట్టు మంగళవారం వెల్లడించింది.నిజామాబాద్ 80, నల్లగొండ 45, వరంగల్ అర్బన్ 38, ఆదిలాబాద్ 30, ఖమ్మం 27, నిర్మల్ 25, సంగారెడ్డి 22 ...

Read More »

ఉచితం గా మాస్కులు పంపిణి చేసిన ఎమ్మెల్యే రోజా

ఉచితం గా మాస్కులు పంపిణి చేసిన ఎమ్మెల్యే రోజా

ఎమ్మెల్యే ఆర్కే రోజా గారు నగరి పురవీధులలో గల అన్ని దుకాణాలను మరియు కూరగాయల మార్కెట్ ను సందర్శించారు. డిమాండ్ చూపించి అధిక ధరలకు అమ్మ రాదని ఆ విధంగా అమ్మినవారు శిక్షార్హులు అవుతారని హెచ్చరించారు . ప్రతి ఒక్క వ్యాపారస్ధుడు కూడా విధిగా మాస్క్ లు ధరించాలని ఆదేశించారు.మరియు మాస్కులు ను ఉచితంగా పంపిణీ చేసి ఖచ్చితంగా సామాజిక దూరం పాటించాలని సూచించారు

Read More »

సల్మాన్ ఖాన్ కుటుంబం లో విషాదం

సల్మాన్ ఖాన్ కుటుంబం లో విషాదం

బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ ఖాన్‌ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఆయన మేనల్లుడు అబ్దుల్లా ఖాన్‌ (38) మృతి చెందారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న అబ్దుల్లా సోమవారం రాత్రి ముంబైలోని లీళావతి ఆస్పత్రిలో చికిత్స పొందతూ తుదిశ్వాస విడిశారు. ఈ విషాయాన్ని సల్మాన్‌ ధృవీకరిస్తూ ‘ఎల్లప్పుడూ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాము’ అంటూ తన సోషల్‌ మీడియా ఖాతాలో పోస్ట్‌ చేశాడు.

Read More »

రైతు బజార్లను పరిశీలించిన టీఆరఎస్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి

రైతు బజార్లను పరిశీలించిన టీఆరఎస్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి

కరోనానివారణ చర్యల్లో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో రైతు బజార్లతోపాటు స్థానిక మార్కెట్‌ను ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పరిశీలించారు. వనస్థలిపురంలోని రైతు బజార్‌ను రెండు భాగాలుగా చేసి ఒకటి పక్కనే ఉన్న భవనంలోకి, మరొకటి పార్క్‌లోకి మార్చారు. కరోనా బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులు, వినియోగదారులకు సుధీర్ రెడ్డి వివరించారు. ఎన్టీఆర్ నగర్ మార్కెట్‌ను సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియానికి తరలించినట్లుగా ఎమ్మెల్యే తెలిపారు.

Read More »

చంద్రబాబు పై మండిపడ్డ కొడాలి నాని

చంద్రబాబు పై మండిపడ్డ కొడాలి నాని

చోడవరంలో వృద్ధురాలి మృతిపై చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని విమర్శించారు. కరోనా వైరస్‌కు భయపడి చంద్రబాబు ఇంట్లో దాక్కున్నారని, ఇంతటి విపత్కర పరిస్థితుల్లో రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. ప్రభుత్వానికి సూచనలు ఇచ్చే విధంగా ప్రతిపక్షం ఉండాలని అన్నారు. ఎల్లో వైరస్ కోరలు పీకే మందు తమ దగ్గర ఉందన్నారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా నిత్యావసరాలు సరఫరా చేస్తున్నామని మంత్రి కొడాలి నాని వెల్లడించారు. రేషన్ డిపోల వద్ద జనం గుమిగూడకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రేషన్‌ ...

Read More »

స్వీయ నిర్బంధంలోకి ఇజ్రాయిల్‌ ప్రధాని

స్వీయ నిర్బంధంలోకి ఇజ్రాయిల్‌ ప్రధాని

ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజిమన్‌ నెతన్యాహు స్వీయ నిర్బంధంలోకి వెళ్లినట్టు ఆయన కార్యాలయ అధికారులు వెల్లడించారు. నెతన్యాహు సహాయకుడికి కరోనా వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ముందు జాగ్రత్త చర్యగా ప్రధాని క్వారంటైన్‌లో ఉన్నారని అధికారులు తెలిపారు. ఇజ్రాయిల్‌లో మహమ్మారి వైరస్‌ వేగంగా ప్రబలుతుండటంతో దేశమంతటా పూర్తిస్ధాయి లాక్‌డౌన్‌ అమల్లో ఉంది. ప్రజలను వారి ఇళ్ల నుంచి కనీసం 100 మీటర్లు మించి బయటకు అనుమతించడంలేదు. ఆహార పదార్ధాలను తెచ్చుకునేందుకే ప్రజలను అనుమతిస్తున్నారు. ఇప్పటివరకూ 4347 మంది ఇజ్రాయిల్‌ పౌరులు కరోనావైరస్‌ బారినపడగా, 134 మంది ...

Read More »

డాక్ట‌ర్ల కోసం ప్ర‌త్యేక క్వారంటైన్ హాస్పిట‌ల్‌

డాక్ట‌ర్ల కోసం ప్ర‌త్యేక క్వారంటైన్ హాస్పిట‌ల్‌

క‌రోనా బాధితులకు నిర్విరామంగా కృషిచేస్తున్న డాక్ట‌ర్ల ఆరోగ్యం దృష్ట్యా కేజ్రివాల్ ప్ర‌భుత్వం ప‌లు కీల‌క చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఢిల్లీలోని లోక్‌నాయ‌క్‌, జీబీ పంత్ ఆసుప‌త్రుల‌లో ప‌నిచేస్తున్న వైద్యుల‌ను ల‌లిత్ హోట‌ల్‌లో ఉంచ‌నున్న‌ట్లు ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం సోమవారం ప్ర‌క‌టించింది. క‌రోనా వైర‌స్ వేగంగా ప్ర‌బలుతున్న నేప‌థ్యంలో విధుల్లో ఉన్న వైద్య‌నిపుణులు, ఆరోగ్య కార్య‌క‌ర్త‌ల‌ను 14 రోజుల‌పాటు ల‌లిత్ హోట‌ల్‌లోనే ఉంచాల‌ని నిర్ణ‌యించింది. ప్రాణాంత‌క ఈ వైర‌స్ డాక్ట‌ర్లు, వారి కుటుంబాల‌కు కూడా సోకుతున్న నేప‌థ్యంలో స‌ర్కార్ ఈ ప్ర‌ణాళిక ద్వారా క‌రోనా వ్యాప్తిని అరిక‌ట్ట‌వచ్చ‌ని ...

Read More »

గవర్నర్‌తో సీఎం జగన్‌ భేటీ

గవర్నర్‌తో సీఎం జగన్‌ భేటీ

ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌తో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం సమావేశమయ్యారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణకు తీసకుంటున్న చర్యలను, లాక్‌డౌన్‌ పరిస్థితులను సీఎం జగన్‌ ఈ సందర్భంగా గవర్నర్‌కు వివరించారు. కరోనా ముందు జాగ్రత్త చర్యలో భాగంగా గవర్నర్‌ కార్యాలయంలోకి వెళ్లే ముందు సీఎం వైఎస్‌ జగన్‌ శానిటైజర్‌తో తన చేతులను శుభ్రం చేసుకున్నారు. అలాగే సమావేశంలో కూడా గవర్నర్‌, సీఎం జగన్‌లు సామాజిక దూరం పాటించారు.

Read More »