Monthly Archives: March 2020

కరోనాపై రాజ‌మౌళి ట్వీట్‌

కరోనాపై రాజ‌మౌళి ట్వీట్‌

ప్రమాదకర కరోనా వైరస్‌ కారణంగా ప్రపంచ దేశాలన్నీ స్తంభించాయి. ఏ రంగాన్నీ వదలని కోవిడ్‌.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే 6వేల మందికిపైగా మృతి చెందగా.. లక్షా 80వేలకు పైగా కేసులు ప్రపంచ వ్యాప్తంగా వెలుగుచూశాయి. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజ‌మౌళి కరోనా వైరస్‌పై స్పందించారు. ‘క‌రోనా కార‌ణంగా ప్రపంచం నిలిచిపోవ‌డం చూస్తుంటే షాకింగ్‌గా ఉంది. ఇలాంటి ప‌రిస్థితుల‌లో భ‌యాందోళ‌న‌లు వ్యాప్తి చెంద‌కుండా చూడాల్సిన అవ‌స‌రం ఎంతైన ఉంది. కోవిడ్ 19 వ్యాప్తిని నివారించ‌డానికి తగిన చర్యలను ...

Read More »

ఎన్నికలపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం

ఎన్నికలపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం

స్థానిక ఎన్నికలపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కరోనా నేపథ్యంలో ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికలను నిర్వహించాలంటూ ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్‌ న్యాయవాది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి లలిత్.. రేపు రెగ్యులర్‌ లిస్ట్‌లో కేసును విచారణకు ఉంచాలని సూచించారు. అలాగే స్థానిక ఎన్నికలను వెంటనే జరిపించాలంటూ ఏపీ హైకోర్టులో సైతం ఇప్పటికే లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలైంది. తాండవ యోగేష్‌, జనార్ధన్‌ అనే ఇద్దరు వ్యక్తులు ...

Read More »

ఎన్నికల కమిషనర్‌ను వివరణ కోరిన గవర్నర్‌

ఎన్నికల కమిషనర్‌ను వివరణ కోరిన గవర్నర్‌

స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ను రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషన్‌ హరిచందన్‌ రాజ్‌ భవన్‌కు పిలిపించుకుని వివరణ కోరారు. గవర్నర్‌ పిలుపుమేరకు రాజ్‌ భవన్‌కు చేరుకున్న ఈసీ ఎన్నికల వాయిదాపై వివరణ ఇచ్చారు. సుమారు గంటకుపైగా సాగిన వీరిభేటీలో.. ఎన్నికల వాయిదాపై సుదీర్ఘంగా చర్చించారు. ఎన్నికలను ఏకపక్షంగా వాయిదా వేయడంపై రమేష్‌ కుమార్‌ నుంచి గవర్నర్‌ వివరణ కోరినట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం సరైనది కాదని ఈసీకి తెలిపినట్లు సమాచారం. అయితే గవర్నర్‌తో భేటీ వివరాలను మీడియాకు ...

Read More »

రాజమండ్రి సెంట్రల్ జైల్లో రవితేజ

రాజమండ్రి సెంట్రల్ జైల్లో రవితేజ

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘క్రాక్’ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రవితేజ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న మూడో సినిమా ఇది. ‘బలుపు’ వంటి హిట్ సినిమా తరవాత వీరి కాంబోలో వస్తోన్న చిత్రం కావడంతో ‘క్రాక్’పై అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవల విడుదలైన టీజర్ కూడా బాగుండటంతో మళ్లీ ప్రేక్షకుల దృష్టి మాస్ మహారాజాపై పడింది. ప్రస్తుతం ‘క్రాక్’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమా 60 శాతం షూటింగ్ పూర్తయింది. ...

Read More »

జగన్ సర్కార్ అదిరే ట్విస్ట్.. సీఎస్‌తో ఈసీకి చెక్!

జగన్ సర్కార్ అదిరే ట్విస్ట్.

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి నడుస్తోంది. ఆరు వారాల పాటూ ఎన్నికల ప్రక్రియ వాయిదా వేస్తూ ఏపీ ఎన్నికల అధికారి రమేష్ కుమార్ నిర్ణయం తర్వాత రాజకీయ దుమారం రేగింది. జగన్ సర్కార్ సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉందనే ప్రచారం జరుగుతోంది. అలాగే ఇవాళ గవర్నర్‌ను రమేష్ కుమార్ కలవబోతున్నారు.. ఎన్నికల వాయిదాకు కారణాలు వివరించనున్నారు. ఇలాంటి సమయంలోనే సీఎస్ నీలం సాహ్ని ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.. తమను సంప్రదించే ఉంటే కరోనా పరిస్థితిపై సరైన సమాచారం ఇచ్చేవాళ్లమని లేఖలో సీఎస్ ప్రస్తావించారు. స్థానికంగా ...

Read More »

ఎన్నికల కమిషనర్‌కు సీఎస్‌ లేఖ

ఎన్నికల కమిషనర్‌కు సీఎస్‌ లేఖ

ఆంధ్రప్రదేశ్‌ స్థానిక సంస్థల ఎన్నికలను యథాతథంగా కొనసాగించాలని కోరతూ రాష్ట్ర ప్రధాన కార్యదర్మి నీలం సాహ్ని ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. కరోనా వైరస్‌ సాకుతో ఎన్నికలు ఆరు వారాల పాటు వాయిదా వేయాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సీఎస్ కోరారు. రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు సర్వసన్నద్ధంగా ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బంది శిక్షణ, బ్యాలెట్ బాక్సుల సేకరణ, ఓటర్ల జాబితా ముద్రణతో పాటు మిగతా కార్యక్రమాలు సైతం పూర్తి అయ్యాయని వివరించారు. ప్రజారోగ్యం బాధ్యత పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి ...

Read More »

కరోనా ఎఫెక్ట్ : తెలంగాణాలో విద్యా సంస్థలు, మాల్స్‌ మూసివేత

కరోనా ఎఫెక్ట్ : తెలంగాణాలో విద్యా సంస్థలు, మాల్స్‌ మూసివేత

రాష్ట్రంలో కరోనా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 31 వరకు అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. ఈ మేరకు కరోనాపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ శనివారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి ప్రస్తుత పరిస్థితిపై సమీక్షించారు. కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా ముందు జాగ్రత్తగా పాఠశాలలతో పాటు, సినిమా హాల్స్‌, మాల్స్‌ను కూడా మూసివేయాలని సీఎం నిర్ణయించారు. మరో నాలుగు రోజుల్లో ఇంటర్‌ పరీక్షలు ముగియనున్న నేపథ్యంలోనే పరీక్షలను షెడ్యూల్‌ ప్రకారమే నిర్వహించనున్నారు. పదో ...

Read More »

సోమిరెడ్డి కి సవాల్ విసిరిన కాకాని

సోమిరెడ్డి కి సవాల్ విసిరిన కాకాని

స్థానిక ఎన్నికల్లో టీడీపీ నేతలను నామినేషన్లను వేయనీయకుండా అడ్డుకుంటున్నారని చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని సర్వేపల్లి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి విమర్శించారు. నామినేషన్‌ వేయనీయకుంటే వేలాది మంది టీడీపీ అభ్యర్థులు ఎలా నామినేషన్లు వేశారని ప్రశ్నించారు. నంద్యాల ఎన్నికల్లో టీడీపీ ఎన్ని అక్రమాలకు పాల్పడిందో దానికి తనే ప్రత్యక్ష సాక్షి అని పేర్కొన్నారు. అప్పట్లో అదనపు డీజీ వెంకటేశ్వరరావు దగ్గర ఉంటూ వైఎస్సార్సీపీ నేతలను పలు రకాలుగా హింసించి, తప్పుడు కేసులు పెట్టి వేధించారని గుర్తు చేశారు. విశాఖ విమానాశ్రయంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని అడ్డుకోలేదా ...

Read More »

వైసీపీ లో చేరిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే

వైసీపీ లో చేరిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే

పలు పార్టీల నుంచి వైఎస్సార్‌సీపీలోకి వలసల జోరు కొనసాగుతోంది. స్థానిక ఎన్నికల ముందు ఈ చేరికలు పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతున్నాయి. తాజాగా విశాఖ నార్త్‌ నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, మంత్రి కన్నబాబు, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ సమక్షంలో టీడీపీకి చెందిన పలువురు నేతలు వైఎస్సార్‌సీపీలోకి చేరారు.టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే గురుమూర్తి రెడ్డి, మాజీ కార్పొరేటర్‌ పిఎల్‌ఎస్‌ఎన్‌ ప్రసాద్‌, టీఎస్‌ఎన్‌ మూర్తి, రజక సంఘం నార్త్‌ అధ్యక్షుడు సత్యనారాయణ పార్టీలోకి చేరారు. వారికి ఎంపీ విజయసాయిరెడ్డి పార్టీ ...

Read More »

ఎర్రబెల్లి దయాకర్ రావు పై ప్రశంసలు కురిపించిన కేసీఆర్

ఎర్రబెల్లి దయాకర్ రావు పై ప్రశంసలు కురిపించిన కేసీఆర్

నంబర్‌–1 మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు.. ఇంటర్నల్‌ సర్వేల్లో వచ్చిన రిపోర్టులు తేల్చిన సత్యమిది… పని చేస్తుంటే ప్రశంసలు అవే వస్తుంటాయి.. ఆయన పని తీరు బాగుంది.. ఆ శాఖ ఉద్యోగులతోనూ మంచిగా పనిచేయించడం ద్వారానే ఇది సాధ్యమైంది.. అందుకే మంత్రి దయాకర్‌రావు, ఆయన సిబ్బందిని అభినందిస్తున్నా..’ అని సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో శుక్రవారం ప్రశంసల వర్షం కురింపించారు.అసెంబ్లీలో పల్లె ప్రగతిపై శుక్రవారం జరిగిన స్వల్ప కాలిక చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. ఈ మధ్య చేసిన తమ ఇంటర్నల్‌ సర్వే టాప్‌ ఫర్‌ఫార్మర్‌గా ...

Read More »