Monthly Archives: May 2020

విదేశాంగమంత్రికి సీఎం జగన్‌ లేఖ

విదేశాంగమంత్రికి సీఎం జగన్‌ లేఖ

కేంద్ర విదేశాంగ మంత్రి సుబ్రమణ్యం జైశంకర్‌కు శనివారం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లేఖ రాశారు. విదేశాల్లో చిక్కుకున్న తెలుగు వారిని రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు సహకరించాలని కేంద్ర మంత్రిని వైఎస్‌ జగన్‌ కోరారు. కువైట్, దుబాయ్‌లలో వలస వచ్చిన వారి రిజిస్ట్రేషన్ జరుగుతోందని, రిజిస్ట్రేషన్ సందర్బంగా కువైట్‌లో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయన్నారు. వాటిని పరిష్కరించేందుకు సంబంధిత ఎంబసీ అధికారులకు సూచనలు చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ కోరారు

Read More »

హైకోర్టు నూతన న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం

హైకోర్టు నూతన న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం

రాష్ట్ర హైకోర్టు నూతన న్యాయమూర్తులుగా నియమితులైన బొప్పూడి కృష్ణమోహన్, కంచిరెడ్డి సురేష్ ‌రెడ్డి, కన్నెగంటి లలితకుమారి శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జితేంద్రకుమార్‌ మహేశ్వరి ఇవాళ ఉదయం 11 గంటలకు వీరితో ప్రమాణం చేయించారు

Read More »

1,218కు చేరిన కరోనా మృతుల సంఖ్య

1,218కు చేరిన కరోనా మృతుల సంఖ్య

కరోనా మహమ్మారి విజృంభన కొనసాగుతూనే ఉంది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమల్లో ఉన్నప్పటికీ పాజిటివ్‌ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా భారత్‌లో కరోనా బారినపడినవారి సంఖ్య శనివారానికి 37,336కు చేరగా, ఇప్పటివరకూ 1,218 మృతి చెందారు. అలాగే 26,167 యాక్టివ్‌ కేసులు ఉండగా, 9,950 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కాగా గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 2293 కొత్త కేసులు నమోదు అయ్యాయి. 71మంది మరణించినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ ఇవాళ ఉదయం ఓ ప్రకటన చేసింది.

Read More »

మే 17 వరకు లాక్‌డౌన్‌ పొడగింపు

మే 17 వరకు లాక్‌డౌన్‌ పొడగింపు

కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతుండటంతో దేశవ్యాప్తంగా మరో రెండు వారాల పాటు లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నట్టు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. మే 4 నుంచి మరో రెండు వారాల పాటు లాక్‌డౌన్‌ కొనసాగనుంది. ఈ మేరకు కేంద్రహోంశాఖ ఉత్తర్వులు జారీ జారీచేసింది. గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లలో సాధారణ కార్యకలాపాలకు అనుమతించారు. .కరోనా పాజిటివ్‌ కేసులు, మరణాలు నానాటికీ దేశవ్యాప్తంగా పెరుగుతుండడంతో లాక్‌డౌన్‌ పొడిగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. లాక్‌డౌన్‌ మొదటి దశ మార్చి 22న ప్రారంభమై మార్చి 31న ముగిసింది. లాక్‌డౌన్‌ రెండో దశ ఏప్రిల్‌ 1న ...

Read More »

రక్తదానం చేసిన మాజీ ఎంపీ కవిత

రక్తదానం చేసిన మాజీ ఎంపీ కవిత

యువత రక్తదానం చేసి ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలని మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్ పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వారంరోజుల పాటు రక్తదాన కార్యక్రమాలు నిర్వహించాల్సిందిగా టీఆర్ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు హైదరాబాద్‌లోని తన నివాసంలో కవిత రక్తదానం చేశారు. టీఆర్ఎస్ కార్యకర్తలు వీలైనంత ఎక్కువగా రక్తదాన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు.

Read More »

బీజేపీ నేత కన్నాకు సవాల్ విసిరిన బుగ్గన

బీజేపీ నేత కన్నాకు సవాల్ విసిరిన బుగ్గన

కరోనా నిర్ధారణ పరీక్షల కిట్ల కొనుగోలు కంపెనీలో తాను డైరెక్టర్‌ను కాదని ఆర్థిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి స్పష్టం చేశారు. కిట్ల కొనుగోలు అంశంలో బీజేపీ నేత కన్నా లక్ష్మీ నారాయణ ఆరోపణలపై శుక్రవారం ఆయన స్పందించారు. తాను సదరు కంపెనీలో డైరెక్టర్‌ను అని నిరూపిస్తే రేపు ఉదయం 9 గంటలకే రాజీనామా చేస్తానని సవాల్‌ విసిరారు. కాగా కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా దక్షిణ కొరియా నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ర్యాపిడ్‌ టెస్టింగ్‌ కిట్లను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ...

Read More »

గుజరాత్‌ సీఎంకు కృతజ్ఞతలు చెప్పిన సీఎం జగన్‌

గుజరాత్‌ సీఎంకు కృతజ్ఞతలు చెప్పిన సీఎం జగన్‌

గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీకి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. లాక్‌డౌన్ కారణంగా‌ గుజరాత్‌లో చిక్కుకుపోయిన తెలుగు మత్స్యకారులను ఏపీకి తరలించడంలో సహకరించినందుకు విజయ్‌ రూపానీకి, అక్కడి అధికారుల బృందానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సీఎం వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు. అలాగే వారు తీసుకున్న చర్యలను ప్రశంసించారు. గుజరాత్ చిక్కుకున్న తెలుగు మత్స్యకారులను ఏపీకి తీసుకురావడానికి సీఎం వైఎస్‌ జగన్‌ తీవ్ర ప్రయత్నాలు చేసిన సంగతి తెలిసిందే. గుజరాత్‌ సీఎంకు ఫోన్‌ చేయడమే కాకుండా.. పలుమార్లు వారి పరిస్థితి గురించి సమీక్ష ...

Read More »

కార్మికులతో కలిసి అల్పహారం చేసిన హరీష్ రావు

కార్మికులతో కలిసి అల్పహారం చేసిన హరీష్ రావు

ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్బంగా రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. సిద్దిపేట పట్టణంలోని పారిశుధ్య కార్మికులను శుక్రవారం ఉదయం సన్మానించారు. అనంతరం వారితో కలిసి అల్పాహారం స్వీకరించారు. కొండమల్లయ్య గార్డెన్‌ ఫంక్షన్‌ హాల్‌లో ఈ కార్యక్రమం జరిగింది. కోవిడ్‌ పోరులో పారిశుధ్య కార్మికులు నిరంతరం శ్రమిస్తున్నారని మంత్రి కొనియాడారు.

Read More »

చంద్రబాబు కి సవాల్ విసిరిన విజయసాయిరెడ్డి

చంద్రబాబు కి సవాల్ విసిరిన విజయసాయిరెడ్డి

ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి ట్విటర్‌ వేదికగా సవాల్‌ విసిరారు. ‘చంద్రబాబూ … చందాలూ దందాలూ అంటూ నాపై ఆరోపణలు చేశారు. మీ ఆస్తులు, నా ఆస్తులపై సీబీఐ విచారణ కోరుతూ లేఖలు రాద్దాం, పిటీషన్లు వేద్దాం. కచ్చితంగా విచారణ జరిగేలా చూద్దాం. రెడీనా?’ అని అన్నారు.

Read More »

ఏపీలో మే నెల పెన్షన్ల పంపిణీ

ఏపీలో మే నెల పెన్షన్ల పంపిణీ

లాక్‌డౌన్‌తో తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్న నిరుపేద కుటుంబాలకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం బాసటగా నిలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక పంపిణీ ప్రారంభమైంది. శుక్రవారం ఉదయం నుంచే వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి లబ్ధిదారుల చేతికి మే నెల పెన్షన్లు అందిస్తున్నారు. కరోనా నియంత్రణలో భాగంగా బయో మెట్రిక్‌కు బదులుగా పెన్షనర్ల ఫోటోల జియో ట్యాగింగ్‌ ద్వారా పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు.దీంతో లాక్‌డౌన్‌ వల్ల వేరే ప్రాంతాల్లో ఉన్నవారికి కూడా పోర్టబిలిటీ ద్వారా పెన్షన్లు అందిస్తున్నారు. ఉదయం 5 గంటల నుండి ...

Read More »