Monthly Archives: May 2020

ఏపీకి ప్రత్యేక బలం ఉంది : సీఎం జగన్‌

హైదరాబాద్‌, బెంగళూరులాంటి నగరాలతో పోటీపడే సత్తా విశాఖకు మాత్రమే ఉందని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. విశాఖలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోసం అత్యున్నతస్థాయి ఇంజినీరింగ్‌ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. మౌలిక సదుపాయాల విషయంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక బలం ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం ఉందని.. లోక్‌సభలో నాలుగో అతిపెద్ద పార్టీగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఉందని సీఎం జగన్‌ గుర్తుచేశారు. గత ప్రభుత్వం రాయితీలను కూడా అమ్ముకుందని.. కానీ ఈ ప్రభుత్వంలో అవినీతికి తావులేదని స్పష్టం చేశారు. వ్యవస్థలో పూర్తిస్థాయిలో ...

Read More »

ఏపీలో కొత్తగా 54 కరోనా కేసులు..

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 54 కరోనా పాజటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలోని మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,841కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కరోనాపై హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 9,858 మంది శాంపిల్స్‌ను పరీక్షించగా 54 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయినట్టుగా తెలిపింది. తాజాగా నమోదైన కేసుల్లో నలుగురు తమిళనాడులోని కోయంబేడు నుంచి వచ్చినవారు ఉన్నారు

Read More »

భారత్ లో కొత్తగా 6 ,566 కరోనా కేసులు

భారత్‌లో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 6,566 కరోనా కేసులు నమోదు కాగా, 194 మంది మరణించారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,58,333కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం ఉదయం కరోనాపై హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. ఇప్పటివరకు 67,691 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా, 4,531 మంది మృతిచెందారు. ప్రస్తుతం దేశంలో 86,110 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి

Read More »

పిల్లలకు ఇవ్వగలిగే ఆస్తి విద్య మాత్రమే -సీఎం జగన్

అమ్మఒడి, విద్యాదీవెన, వసతి దీవెన పథకాలపై పెడుతున్న ఖర్చు.. మన పిల్లల భవిష్యత్‌ కోసం తాను పెడుతున్న పెట్టుబడి అని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. మనం పిల్లలకు ఇవ్వగలిగే ఆస్తి విద్య మాత్రమేనని మరోసారి స్పష్టం చేశారు. ఇంగ్లిషు మీడియం వద్దనే పెద్ద మనుషులు.. వాళ్ల పిల్లలను ఎక్కడికి పంపిస్తున్నారో ఆలోచించుకోవాలన్నారు. మన పాలన-మీ సూచన కార్యక్రమంలో భాగంగా నేడు విద్యారంగంపై తాడేపల్లిలోని క్యాంపు ఆఫీస్‌లో సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో నాడు-నేడు, ఇంగ్లిష్‌ మీడియం ...

Read More »

చంద్రబాబు పై మండిపడ్డ విజయసాయి రెడ్డి

ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి ట్విటర్‌ వేదికగా ధ్వజమెత్తారు. ఈ మేరకు తన ట్విటర్‌ ఖాతాలో.. ‘విశాఖ గ్యాస్ బాధితులను పరామర్శిస్తా. వాళ్లకు భారీగా ఆర్ధిక సాయం చేసి ఆదుకుంటా అని చెప్పినోడు కరకట్ట నుంచి కదలడం లేదు. ఎమ్మెల్యేల కాళ్లు పట్టుకునే పనిలో పడ్డాడు. అధికారం పోయినా, పార్టీ వదిలి పోవద్దని కోట్ల డబ్బు ఆశ చూపిస్తున్నాడంటే ఏ రేంజిలో దోచుకున్నాడో ఊహించొచ్చు’ అంటూ ట్వీట్‌ చేశారు.

Read More »

భారత్‌లో లక్షా 50వేలు దాటిన కరోనా కేసులు

భారత్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 6,387 కరోనా కేసులు నమోదు కాగా, 170 మంది మృతిచెందారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,51,767కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం ఉదయం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. ఇప్పటివరకు 64,425 మంది కరోనా నుంచి కోలుకోగా.. 4,337 మంది మృతిచెందారు. ప్రస్తుతం దేశంలో 83,004 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Read More »

నేడు విద్యా రంగంపై సీఎం జగన్ సమీక్ష

‘మన పాలన– మీ సూచన’ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం విద్యా రంగంపై సదస్సు నిర్వహించనున్నారు. విద్యా రంగంలో ఏడాది కాలంలో చేపట్టిన కార్యక్రమాలు, వాటి అమలు తీరు, తదితర అనేక అంశాలపై ఈ సదస్సు జరుగుతుంది. ఈ సదస్సుకు పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి సమన్వయకర్తగా వ్యవహరిస్తారు. విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్, ఉన్నత విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, వివిధ విద్యా విభాగాలకు సంబంధించిన పలువురు ఉన్నతాధికారులు, ఆయా కార్యక్రమాల ద్వారా ప్రయోజనం పొందిన ...

Read More »

కర్ణాటక లో త్వరలో తెరుచుకోనున్న ఆలయాలు

భ‌క్తుల‌కు క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం శుభ‌వార్త తెలిపింది. జూన్ 1 నుంచి ఆల‌యాలు తెర‌వ‌నున్న‌ట్లు క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. ఈ మేర‌కు 51 ఆల‌యాల్లో ద‌ర్శ‌నానికి బుధ‌వారం నుంచే ఆన్‌లైన్ బుకింగ్స్ ప్రారంభిస్తున్న‌ట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించి రెండు నెల‌లు దాటిపోయింది. ఇప్ప‌టికే ప్ర‌భుత్వాలు ఇచ్చిన‌ లాక్‌డౌన్ స‌డ‌లింపుల వ‌ల్ల అనేక కార్య‌క‌లాపాలు తిరిగి కొన‌సాగుతున్నాయి. దీంతో ఈ నెలాఖ‌రుకు ముగియ‌నున్న‌ నాల్గ‌వ లాక్‌డౌన్ అనంత‌రం దేవాల‌యాల‌ను తెర‌వ‌నున్న తొలి రాష్ట్రంగా క‌ర్ణాట‌క నిలిచింది.త్వ‌ర‌లోనే ఆల‌యాల్లో ద‌ర్శ‌నాల‌కు అనుస‌‌రించాల్సిన విధివిధానాల‌పై‌ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను విడుద‌ల చేయ‌నుంది. ...

Read More »

సీఎం జగన్‌కు నాగబాబు అభినందనలు

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిరర్థక ఆస్తుల అమ్మకాలపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని నిలుపుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా అభినందనలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా దీనిపై సినీ నటుడు నాగబాబు స్పందించారు. టీటీడీ భూముల అమ్మకాన్ని నిలివేసిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అభినందనలు తెలిపారు. ఈ మేరకు ట్వీటర్‌లో ఓ పోస్ట్‌ చేశారు. ‘టీటీడీ భూముల అమ్మకాన్ని నిలిపివేసిన సీఎం జగన్‌మోహన్ రెడ్డి గారికి అభినందనలు. అలాగే పింక్ డైమండ్ గురించి కూడా ఎంక్విరీ చేసి ...

Read More »

చంద్రబాబుపై హైకోర్టులో పిల్‌

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో ప్రజాప్రయోజన వాజ్యం దాఖలైంది. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘన కింద చంద్రబాబుపై కేసు నమోదు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్‌ వంగా వెంకట్రామిరెడ్డి, న్యాయవాది పోనక జనార్ధన్‌రెడ్డి న్యాయస్థానాన్ని కోరారు. హైదరాబాద్‌ నుంచి విజయవాడకు భారీ కాన్వాయ్‌తో ప్రయాణించిన చంద్రబాబు.. మార్గమధ్యంలో పలుచోట్ల జనసమీకరణ, బైక్‌ ర్యాలీలతో లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించారని తెలిపారు. రాజకీయ ర్యాలీలపై నిషేధం ఉన్నప్పటికీ.. చంద్రబాబు ఆ విషయాన్ని పట్టించుకోలేదన్నారు. కరోనా వ్యాప్తి జరిగేలా చంద్రబాబు వ్యవహరించాడని పిటిషన్‌లో పేర్కొన్నారు. బాబుకు ...

Read More »