Monthly Archives: May 2020

అందుకు గర్వపడుతున్నాను -రాహుల్ గాంధీ

నిజమైన దేశభక్తుడికి కుమారుడిగా జన్మించినందుకు గర్విస్తున్నానని కాంగ్రెస్‌ నాయకులు రాహుల్‌ గాంధీ అన్నారు. నేడు తన తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ 29వ వర్ధంతి సందర్భంగా రాహుల్‌ ఆయనకు నివాళులర్పించారు. ఈ మేరకు రాహుల్‌ ట్విటర్‌లో ఓ పోస్ట్‌ చేశారు. ‘నిజమైన దేశభక్తుడు, ఉదారవాది, పరోపకారి అయిన తండ్రికి కొడుకు అయినందుకు గర్విస్తున్నాను. ప్రధాన మంత్రిగా రాజీవ్‌ గారు దేశాన్ని ప్రగతి పథంలోకి నడిపించారు. తన దూరదృష్టితో దేశాన్ని శక్తివంతం చేయడానికి అనేక చర్యలు చేపట్టారు. ఈ రోజు ఆయన వర్ధంతి సందర్భంగా.. ...

Read More »

ఏపీలో కొత్తగా 45 కరోనా పాజిటివ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో గురువారం కొత్తగా 45 మందికి కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ఏపీ వైద్యారోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 2452కు చేరింది. గడిచిన 24 గంటల్లో 8,092 మంది సాంపిల్స్‌ పరీక్షించగా 45 మందికి కోవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్థారణయింది. కాగా కొత్తగా 41 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా నుంచి డిశ్చార్జ్‌ అయిన వారి సంఖ్య 1680కి చేరింది. కరోనాతో ఇవాళ నెల్లూరు ...

Read More »

పీజీ మెడికల్ ఫీజుల పెంపుపై హైకోర్టు ఉత్తర్వులు

పీజీ మెడికల్‌, దంత వైద్య ఫీజుల పెంపు జీవోపై తాజాగా తెలంగాణ హైకోర్టు బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల పీజీ మెడికల్‌, దంతవైద్య ఫీజులను పెంచుతూ ఇటీవల ప్రభుత్వం జీవో జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ హైకోర్టులో పిల్‌ దాఖలైంది. ఈ పిల్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు ఏ కేటగిరీ విద్యార్థులకు ఫీజుల్లో యాభై శాతం చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేసింది.అంతేగాక బి కేటగిరీ విద్యార్థులు ఫీజులో 60 శాతం చెల్లించాలని హైకోర్టు ...

Read More »

డబుల్‌ బెడ్‌రూం నిర్మాణాలపై కేటీఆర్‌ సమీక్ష

డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణ కార్యక్రమంపై బుధవారం ఆయన ప్రశాంత్‌రెడ్డిలు ఉన్నత స్థాయితో సమీక్ష సమావేశంచ నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. హైదరాబాద్‌ నగరంలో ఇప్పటికే చాలా చోట్ల 80 శాతానికిపైడా నిర్మాణాలు పుర్తయ్యాయని తెలిపారు.కొన్ని చొట్ల లబ్ధిదారులకు డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల పంపిణీ చేయడం జరిగిందని చెప్పారు. త్వరలోనే మిగితా నిర్మాణాలను కూడా పూర్తి చేసి లబ్థిదారులకు అందించే ప్రయత్నం చేస్తామని ...

Read More »

ఏపీలో కొత్తగా 68 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో బుధవారం కొత్తగా 68 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ఏపీ వైద్యారోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 2407కు చేరింది. గడిచిన 24 గంటల్లో 9,159 మంది సాంపిల్స్‌ పరీక్షించగా 68 మందికి కోవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్థారణయింది. కాగా గత 24 గంటల్లో కొత్తగా 43 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 1639 మంది డిశ్చార్జ్‌ కాగా, కరోనాతో ఇవాళ కర్నూలు నుంచి ఒకరు ...

Read More »

ఒక్క రోజే 5,600 కరోనా కేసులు

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 5,611 కరోనా కేసులు నమోదయయ్యాయి. దేశంలో ఒక్క రోజు వ్యవధిలో ఇంత పెద్ద మొత్తంలో కరోనా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. దీంతో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,06,750కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. ఇప్పటివరకు 42,297 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా, 3,303 మంది మృతిచెందారు. ప్రస్తుతం దేశంలో 61,149 ...

Read More »

కేసీఆర్ కి కిషన్ రెడ్డి కౌంటర్

కేంద్ర ప్యాకేజీపై సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలను కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. కేసీఆర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికారు. కేసీఆర్‌ భాష అభ్యంతరకరంగా ఉందన్నారు. మోదీ వెనుక దేశమంతా ఉందని న్యూయార్క్‌ టైమ్స్‌ సహా.. 50 అంతర్జాతీయ పత్రికలు ప్రచురించాయన్న సంగతి కేసీఆర్‌ తెలుసుకోవాలన్నారు. అడ్రస్‌ లేనివాళ్లు చెబితే ప్రధానిని విమర్శించడం కేసీఆర్‌కు తగదని చెప్పారు. కష్టకాలంలో ఓటు బ్యాంక్‌ రాజకీయాలు సరికాదన్నారు.

Read More »

ఏపీలో ఆగస్ట్‌ 3న పాఠశాలలు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్తను అందించింది. ప్రాణాంతక కరోనా వైరస్‌ కారణంగా మూతపడ్డ పాఠశాలను ప్రారంభించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఆగస్ట్‌ 3న రాష్ట్రంలోని పాఠశాలన్నీ ప్రారంభించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు నాడు-నేడు కార్యక్రమంపై సమీక్షంలో భాగంగా పాఠశాలల అభివృద్ధిపై సీఎం ఆరా తీశారు. జులై నెలా ఖరులోగా మొదటి విడతలో చేపట్టిన 15,715 స్కూళ్లలో నాడ-–నేడు కింద అభివృద్ధి పనులు పూర్తిచేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు.ప్రతి పాఠశాలలో 9 రకాల సదుపాలను కల్పించాల్సి ఉందన్నారు. దీనికి సంబంధించి రూ.456 ...

Read More »

తెలంగాణ లో పదో తరగతి పరీక్షలకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. టెన్త్ పరీక్షలు జరపడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని దాఖలు చేసిన అఫిడవిట్‌పై హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణ చేపట్టిన హైకోర్టు జూన్‌ 8 నుంచి పదో తరగతి పరీక్షలను నిర్వహించుకోవాలని అనుమతి ఇచ్చింది. విచారణ సందర్భంగా పరీక్ష కేంద్రాల వద్ద అన్ని చర్యలు తీసుకుంటామని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ కోర్టుకు తెలిపారు.జూన్ 3న కోవిడ్ పరిస్థితులను సమీక్షించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అదేవిధంగా జూన్ ...

Read More »

స్పందన కార్యక్రమంపై సీఎం జగన్‌ సమీక్ష

స్పందన కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు కోవిడ్ 19 నివారణ, లాక్ డౌన్ అమలుపై సమీక్ష నిర్వహించనున్నారు. పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ, గృహ నిర్మాణాలపై చర్చ, ఖరీఫ్ సాగుకు సన్నద్ధత, రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుపై చర్చించనున్నారు. గ్రామ సచివాలయాలు, వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్ పై జిల్లా కలెక్టర్లకు మార్గ నిర్దేశకాలు జారీ చేయనున్నారు. పాఠశాలల్లో నాడు-నేడు కార్యక్రమం అమలవుతున్న ...

Read More »