Monthly Archives: June 2020

ఏపీలో కరోనా పంజా..24 గంటల్లో 351కేసులు

ఏపీలో కరోనా పంజా.

ఏపీని కరోనా మహమ్మారి వెంటాడుతూనే ఉంది. రోజు, రోజుకు పెరుగుతున్న కేసులు భయపెడుతున్నాయి. రాష్ట్రంలో వైరస్ ప్రభావం ఏమాత్రం తగ్గడం లేదు.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 15,188 శాంపిల్స్ పరిశీలిస్తే 275మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు మీడియా బులిటెన్‌లో వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇతర రాష్ట్రాలు (50), విదేశాల నుంచి (26) వచ్చిన వారి కేసులతో కలిపి మొత్తం 351 కేసులు నమోదయ్యాయి. కొద్దిరోజులుగా జిల్లాల వారీగా కేసుల వివరాలను ప్రభుత్వం తెలియజేయలేదు. తాజా కేసులు కలిపితే రాష్ట్రానికి సంబంధించిన కేసులు 5555కు ...

Read More »

శుక్రవారం సాయంత్రం అఖిలపక్షసమావేశం

శుక్రవారం సాయంత్రం అఖిలపక్షసమావేశం

భారత్‌-చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో.. ప్రధాని మోడీ అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చారు. ఈ అంశంపై ఇప్పటికే కేంద్ర మంత్రులు, ఆర్మీ అధికారులతో ప్రధాని చర్చించారు. దేశంలోని అన్ని పార్టీల అధ్యక్షులతో శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడనున్నారు. కాగా, గాల్వన్‌లో ఉద్రిక్తతలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఇరు దేశాలు పెద్ద సంఖ్యలో తమ సైన్యాన్ని సరిహద్దుల వద్దకు తరలిస్తున్నాయి. సోమవారం రాత్రి ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన దాడిలో 20మంది భారత సైనికులు మరణించగా, ...

Read More »

కల్నన్ సంతోష్ మృతికి ఏపీ మండలి సంతాపం

ఏపీ శాసనమండలి సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. శాసనమండలి చైర్మెన్‌ అధ్యక్షతన బుధవారం రోజు 12 నిమిషాలు ఆలస్యంగా సభ ప్రారంభమైంది. సమావేశాలు మొదలు కాగానే సీఆర్డీఏ రద్దు, వికేంద్రీకరణ బిల్లులు మండలి ముందుకు వచ్చినట్లు మండలి ఛైర్మన్‌ షరీఫ్‌ తెలిపారు. మొదట బడ్జెట్‌పై చర్చ మొదలుపెట్టి.. ఆ తర్వాత బిల్లులపై చర్చ చేపడదామని ఆయన పేర్కొన్నారు. మరోవైపు తూర్పు లద్దాఖ్‌లోని గాల్వన్‌ లోయ ప్రాంతంలో భారత్‌-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబుకు శాసనమండలి సంతాపం తెలిపింది. ...

Read More »

మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడిపై నిర్భయ కేసు

మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడిపై నిర్భయ కేసు

టిడిపి నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు మునిసిపల్‌ కమిషనర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదు మేరకు ఆయనపై నిర్భయ చట్టం కింద కేసు నమోదైంది. ఇటీవల మున్సిపల్‌ కౌన్సిల్‌ హాల్‌ ఆధునికీకరణ పనుల నేపథ్యంలో అయ్యన్నపాత్రుడు తాత లత్సాపాత్రుడు చిత్ర పటాన్ని అధికారులు ఇటీవల చైర్మన్‌ గదిలోకి మార్చారు. విషయం తెలిసిన మాజీ మంత్రి ఆ ఫొటోను యథాస్థానంలో ఉంచాలంటూ మునిసిపల్‌ కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. ఆ సమయంలో మునిసిపల్‌ కమిషనర్‌ టి. కఅష్ణవేణిపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆమె పోలీసులకు ఫిర్యాదు ...

Read More »

40ఏళ్లలో తొలిసారిగా ఆస్కార్ అవార్డులు వాయిదా.. !

కరోనా వైరస్ ఎఫెక్ట్ అన్ని రంగాలపై పడింది. సినిమా రంగంపై కూడా ఈ వైరస్ ప్రభావం బాగానే చూపించింది. ఇప్పుడు దీని ప్రభావం సినీ ప్రపంచంలోనే ప్రతిష్టాత్మక అవార్డులైన ఆస్కార్ అవార్డులపై పడింది. ఆస్కార్ అవార్డ్స్ తేదీని వాయిదా వేస్తున్నట్టు ది అకాడమి ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ తాజాగా ప్రకటించింది. ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా సినిమా షూటింగులకు బ్రేక్ పడటంతో.. 2021 ఫిబ్రవరి 28వ తేదీన జరగాల్సి ఉన్న కార్యక్రమాన్ని ఏప్రిల్ 25కు వాయిదా వేసినట్టు వెల్లడించింది. వచ్చే యేడాది 2021లో ...

Read More »

ప్రముఖ దర్శకుడికి గుండెపోటు.. పరిస్థితి విషమం

సాచీగా పాపులర్ అయిన ప్రముఖ మలయాళ రచయిత, దర్శకుడు కె.ఆర్.సచ్చిదానందన్ గుండెపోటుకు గురయ్యారు. మంగళవారం ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు త్రిశూర్‌లోని జూబిలీ మిషన్ హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం ఆయనకి క్రిటికల్ కేర్ యూనిట్‌లో చికిత్స అందిస్తున్నారు. 48 ఏళ్ల సాచీ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు డాక్టర్లు వెల్లడించారు. జూబిలీ మిషన్ హాస్పిటల్ డాక్టర్లు ఇచ్చిన మెడికల్ రిపోర్ట్ ప్రకారం.. త్రిశూర్‌లోని వేరే హాస్పిటల్‌లో సాచీకి టోటల్ హిప్ రీప్లేస్‌మెంట్ సర్జరీ నిర్వహించారు. ఆ శస్త్రచికిత్స జరిగిన కొన్ని గంటల్లోనే సాచీకి ...

Read More »

గోకుల్‌చాట్‌ యజమానికి కరోనా

హైదరాబాద్‌లో పేరుపొందిన కోఠి గోకుల్‌చాట్‌ యజమాని (72)కి కరోనా పాజిటివ్‌ రావడం కలకలం సృష్టించింది. అధికారులు గోకుల్‌చాట్‌ను మూసివేయించడంతో పాటు 20 మంది సిబ్బందిని, కుటుంబ సభ్యులను క్వారంటైన్‌కు తరలించారు. కరోనా పా జిటివ్‌ వచ్చిన యజమాని ఎవరెవరితో కాంటాక్ట్‌ అయ్యారో వైద్య సిబ్బంది, పో లీసులు వివరాలు సేకరిస్తున్నారు. సాధారణంగా ఎక్కువ సంఖ్యలోనే ప్రజలు గోకుల్‌చాట్‌ రుచులను ఆస్వాదిస్తుం టారు. దీంతో ఎక్కువ మంది వివరా లు సేకరించాల్సి రావొచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు. గోకుల్‌చాట్‌లో కట్లెట్, పావుబాజి, కుల్ఫీ వంటి పదార్థాలను ఎక్కువ ...

Read More »

అగ్రిగోల్డ్‌ బాధితులకు మరో 200 కోట్లు

అగ్రి గోల్డ్‌ బాధితులను ఆదుకోవడం.. పోలీసుల సంక్షేమం.. మహిళల రక్షణకు బడ్జెట్‌ కేటాయింపుల్లో ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చింది. రాష్ట్ర హోం శాఖకు రూ.5,988.72 కోట్లు కేటాయించగా.. న్యాయ శాఖకు 913.76 కోట్లు కేటాయించింది. పాదయాత్ర సందర్భంగా అగ్రి గోల్డ్‌ బాధితులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకునేలా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో మరో రూ.200 కోట్లు కేటాయించింది. గతేడాది రూ.264 కోట్లు కేటాయించగా.. రూ.10 వేలలోపు డిపాజిట్లు చేసిన బాధితులకు సొమ్ము చెల్లించారు.

Read More »

వికేంద్రీకరణ బిల్లుకు ఆమోదం

ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ సమావేశాల్లో రాష్ట్ర శాసన సభ పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. అభివృద్ధి వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమానాభివృద్ధి బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లు, దేవాదాయ చట్టంలో రెండు సవరణ బిల్లులకు శాసనసభ మంగళవారం ఆమోదం తెలిపింది. వీటితోపాటు పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రవేశపెట్టిన పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును శాసనసభ ఆమోదించింది. స్థానిక సంస్థల ఎన్నికల సంస్కరణల బిల్లు, జీఎస్టీ సవరణ బిల్లు, వ్యాట్ సవరణ బిల్లు, 2020 ఎక్సైజ్‌ సవరణ బిల్లు, ప్రొహిబిషన్ చట్ట సవరణ ...

Read More »

కరోనా వారియర్స్‌కు ధన్యవాదాలు

కరోనా వారియర్స్‌కు ధన్యవాదాలు

రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందికి ప్రభుత్వం తరఫును ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. బడ్జెట్‌ ప్రసంగ సందర్భంగా కోవిడ్‌ వారియర్స్‌ ప్రస్తావన తెచ్చిన మంత్రి.. వారి సేవలను కొనియాడారు. ప్రపంచమంతా కోవిడ్‌-19 మహమ్మారితో కనీవిని ఎరుగని సంక్షోభాన్ని ఎందుర్కొంటోందని, దాని కారణంగా జీవన వ్యవహారమంతా ఒక్కసారిగా ఆగిపోయిందని అన్నారు.‘కరోనా వైరస్‌తో సాగిస్తున్న సమరంలో ప్రభుత్వం ముందు వరుసలో నిలబడమే కాకుండా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో పూర్తి అంకింతభావంతో శాయశక్తులు ఒడ్డి పోరాడుతోంది. అన్నింటికన్నా ...

Read More »