Monthly Archives: June 2020

వర్మ మరో సినిమా ‘పవర్‌ స్టార్‌’

వివాదాస్పద చిత్రాలు తీయటానికి అలవాటు పడ్డ రాం గోపాల్‌ వర్మ … ఆ వరుసలో తరువాత సినిమాగా ‘పవర్‌స్టార్‌’ టైటిల్‌ ప్రకటించాడు. ఆమేరకు ఆదివారం ట్విట్టర్లో పోస్ట్‌ చేశారు. ఈ చిత్రంలోని తారాగణం పికె, ఎంఎస్‌, ఎన్‌బి, టిఎస్‌, ఒక రష్యన్‌ భామ, నలుగురు పిల్లలు, ఎనిమిది గేదెలు అని పేర్కొన్నాడు. తరువాత పవన్‌ కల్యాణ్‌ రూపురేఖలతో ఉన్న ఈ చిత్రం హీరో ఫొటో కూడా విడుదల చేశాడు. గతంలోని చిత్రాల వలె ఇది కూడా వివాదాస్పదం కావొచ్చని సినీ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా, ...

Read More »

అతి పెద్ద రూమర్‌ ఇదే.. రేణూ దేశాయ్‌

కరోనా సంక్షోభం సమయంలో.. టాలీవుడ్‌కు సంబంధించి సోషల్‌మీడియాలో తప్పుడు వార్తలు వైరల్‌గా మారుతున్నాయి. ప్రతిరోజూ ఏదో ఒక కొత్త వార్త అప్‌లోడ్‌ అవుతోంది. వీటిలో అధిక భాగం ఫేక్‌ న్యూస్‌లే ఉంటున్నాయి. ఇటీవల వైరల్‌ అయిన మరో ఫేక్‌ న్యూస్‌ రేణూ దేశాయ్‌ మహేష్‌ నిర్మాణంలో నిర్మించే చిత్రంలో నటించేందుకు అంగీకరించారనే వార్త. మేజర్‌ సందీప్‌ ఉన్ని కృష్ణన్‌ బయోపిక్‌ అయిన మేజర్‌లో అడవి శేష్‌ నటిస్తున్నారు. ఈ చిత్రానికి మహేష్‌బాబు జిఎంబి ఎంటర్‌టైన్‌మెంట్‌ సహనిర్మాతగా వ్యవహరిస్తోంది. ఈ చిత్రంలోని ఒక కీలక పాత్రలో ...

Read More »

గోపీచంద్‌ ‘సిటీమార్‌’లో సునీల్‌

గోపీచంద్‌ చేస్తోన్న తాజా సినిమా ‘సిటీమార్‌’. సంపత్‌ నంది దర్శకత్వంలో రాబోతున్న ఈ స్పోర్ట్స్‌ బేస్డ్‌ మూవీలో తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. కామెడీ కోసం కోచ్‌ అసిస్టెంట్‌ పాత్రను చాలా వైవిధ్యంగా మలిచారని తెలుస్తోంది. ఆ పాత్రలో సునీల్‌ నటిస్తున్నాడని సమాచారం. ఈ సినిమాలో గోపీచంద్‌ ఆంధ్రాకి లీడ్‌ చేసే ఫీమేల్‌ కబడ్డీ టీమ్‌కి కోచ్‌గా చేస్తుండగా.. తమన్నా తెలంగాణ ఫీమేల్‌ కబడ్డీ టీమ్‌ కోచ్‌గా నటిస్తోంది.

Read More »

పరిశ్రమలకు రెండో విడత బకాయిలు విడుదల

పరిశ్రమలకు రెండో విడత బకాయిలు విడుదల

కరోనా విపత్తు సమయంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఆదుకునేందుకు రూ.1,168 కోట్లతో రీస్టార్ట్‌ ప్యాకేజీని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం రెండో విడత రాయితీ బకాయిలను సోమవారం విడుదల చేసింది. రిస్టార్ట్‌ ప్యాకేజీలో భాగంగా మే నెలలో రూ.450 కోట్లను మే నెలలో విడుదల చేయగా, ఈ రోజు రూ.512 కోట్లను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విడుదల చేశారు. దాదాపు లక్ష సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు 2014–15 నుంచి గత సర్కారు రూ.827.5 కోట్ల మేర బకాయిలు పెట్టింది. టీడీపీ ...

Read More »

తెలంగాణ హోంమంత్రికి కరోనా పాజిటివ్‌

తెలంగాణ హోంమంత్రికి కరోనా పాజిటివ్‌

తెలంగాణలో కరోనా వైరస్‌ రాజకీయ నేతలను వెంటాడుతోంది. ఇప్పటికే జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, నిజామాబాద్‌ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు బిగాల గణేశ్‌గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్‌ కోవిడ్‌ బారిన పడగా, తాజాగా రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌ అలీ కూడా ఈ జాబితాలో చేరారు. హోంమంత్రికి కరోనా టెస్టులు చేయగా వైరస్‌ సోకినట్లు సోమవారం నిర్ధారణ అయింది. కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్న మంత్రి మూడు రోజుల క్రితం కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం ఆస్తమా ఉండటంతో ముందు జాగ్రత్తగా కుటుంబ సభ్యులు ఆయనను ...

Read More »

టీఆర్‌ఎస్ పై రెచ్చిపోయిన డీకే అరుణ

టీఆర్‌ఎస్ పై రెచ్చిపోయిన డీకే అరుణ

కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, అందుకే హైదరాబాద్‌ కరోనా హబ్‌గా మారిందని మాజీ మంత్రి, బీజేపీనేత డీకే అరుణ తీవ్ర స్థాయిలో విమర్శిం చారు. సీఎం కేసీఆర్‌కు ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్‌ మీద ఉన్న కోపం ఇప్పుడు తెలంగాణ ప్రజలకు శాపమైందని వ్యాఖ్యానించారు. ఆదివారం పార్టీ ఎంపీ సోయం బాపూరావుతో కలసి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. టీఆర్‌ఎస్‌లో ఓనర్లు, క్లీనర్ల పంచాయితీ నడుస్తోందని, వైరస్‌ను అడ్డం పెట్టుకుని టీఆర్‌ఎస్‌ చేస్తున్న ...

Read More »

తెలంగాణ పోలీసు అకాడమీలో కరోనా కలకలం

తెలంగాణ పోలీసు అకాడమీలో కరోనా కలకలం

తెలంగాణలో కరోనా వైరస్‌ తీవ్రత రోజురోజుకు పెరుగుతుంది. తాజాగా తెలంగాణ పోలీసు అకాడమీలో కరోనా కలకలం రేపుతోంది. అకాడమీలోని 180 మందికి కరోనా సోకినట్లు తెలంగాణ స్టేట్‌ పోలీస్‌ అకాడమీ (టీఎస్‌పీఏ) డైరెక్టర్ వీకేసింగ్‌ ధ్రువీకరించారు. కాగా, పోలీస్‌ అకాడమీలో 200 మందికి పైగా కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది. కరోనా సోకిన వారిలో ఓ డీఐజీ ర్యాంకు అధికారి, ఒక అడిషనల్ ఎస్పీ, 4 డీఎస్పీ, 8 సీఐ స్థాయి అధికారులు సహా వందమంది శిక్షణ ఎస్‌ఐలు, 80 మంది ఇతర సిబ్బంది ...

Read More »

కరోనా గురించి భయపెట్టకండి -అమిత్ షా

కరోనా గురించి భయపెట్టకండి -అమిత్ షా

దేశ రాజ‌ధాని న్యూఢిల్లీలో జూలై 31 నాటికి 5.5 ల‌క్షల క‌రోనా కేసులు న‌మోద‌య్యే అవ‌కాశ‌ముందన్న ఆ రాష్ట్ర ఉప‌ ముఖ్య‌మంత్రి మ‌నీష్ సిసోడియా వ్యాఖ్య‌ల‌ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఖండించారు. జూలై చివ‌రినాటికి ఢిల్లీ ఆసుప‌త్రుల్లో బెడ్లు కూడా ఖాళీగా ఉండ‌ని పరిస్థితి నెల‌కొంటుందంటూ ఆయన ఢిల్లీ ప్ర‌జ‌లను భ‌య‌భ్రాంతుల‌కు గురి చేస్తున్నాడ‌ని విమ‌ర్శించారు. అయితే ఆయన అంచ‌నా స‌రైన‌దా? కాదా? అని విష‌యంపై స్పందించ‌బోన‌ని తెలిపారు. కానీ సిసోడియా మాట‌ల వ‌ల్ల ప్ర‌జ‌ల మ‌న‌సులో భ‌యం వెంటాడుతుంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం ...

Read More »

పలాస ఘటనపై సీఎం జగన్ సీరియస్

పలాస ఘటనపై సీఎం జగన్ సీరియస్

పలాసలో కోవిడ్ మృతదేహాన్ని జేసీబీతో తరలించిన ఘటనపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. మానవత్వాన్ని చూపాల్సిన సమయంలో కొంతమంది వ్యవహరించిన తీరు బాధాకరమని వ్యాఖ్యానించిన ఆయన… బాధ్యులపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టలర్ నివాస్‌ను ఆదేశించారు. ఈ ఘటనపై విచారణ జరిపిన జిల్లా కలెక్టర్ నివాస్.. పలాస మున్సిపల్ కమిషనర్ టి. నాగేంద్రకుమార్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఎన్. రాజీవ్‌ను సస్పెండ్ చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.

Read More »

53 వేల కోట్లు నష్టపోయిన జుకర్​బర్గ్

53 వేల కోట్లు నష్టపోయిన జుకర్​బర్గ్

నకిలీ వార్తలు, విద్వేషపూరిత పోస్టుల కట్టడికి సరైన చర్యలు తీసుకోవడం లేదన్న కారణంతో పలు కంపెనీలు ఫేస్​బుక్​కు ఇస్తున్న యాడ్స్​ను నిలిపేశాయి. దీంతో 53 వేల కోట్ల రూపాయల ఫేస్​బుక్​ సంపద ఒక్క రోజులోనే ఆవిరయ్యింది.ఆ సంస్థ షేర్ విలువ శుక్రవారం దాదాపు 8.3 శాతం పతనమైంది. యూనిలీవర్ తో పాటు వెరిజోన్ కమ్యూనికేషన్స్, హెర్షీస్ తదితర సంస్థలు ఫేస్​బుక్ ను బాయ్​కాట్ చేస్తున్నట్లు పేర్కొన్నాయి. ఇకపై ఆ సంస్థకు యాడ్స్ ఇవ్వబోమని ప్రకటించాయి. మరో అంతర్జాతీయ సంస్థ కొకాకోలా నెల రోజుల పాటు ...

Read More »