Monthly Archives: June 2020

వరవరరావు బెయిల్ పిటిషన్‌‌ నిరాకరణ

వరవరరావు బెయిల్ పిటిషన్‌‌ నిరాకరణ

విప్లవ రచయితల సంఘం (విరసం) నేత వరవరరావు బెయిల్‌ పిటిషన్‌ను ముంబై కోర్టు నిరాకరించింది. వరవరరావు అనారోగ్యంగా ఉన్నారని, బెయిల్‌ ఇవ్వాలంటూ ఆయన తరపున న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం కొట్టి వేసింది. భీమా కోరేగావ్‌ కేసులో వరవరరావు కీలక నిందితుడని, ఆయనకు బెయిల్‌ ఇవ్వొద్దని జాతీయ దర్యాప్తు సంస్థ (ఏన్‌ఐఏ) అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో కోర్టు పిటిషన్‌ను తిరస్కరించింది.

Read More »

లోకేష్ పై పంచులు వేసిన విజయసాయిరెడ్డి

లోకేష్ పై పంచులు వేసిన విజయసాయిరెడ్డి

వైఎస్సార్‌సీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్‌ వేదికగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో పాటు నారా లోకేష్‌పై వ్యంగ్యస్త్రాలు సంధించారు. ”అచ్చెన్నాయుడు ఒక సంతకంతోనే అరెస్టు అయితే.. మంత్రిగా నేను అలాంటివి రోజుకు వంద పెట్టా.. ‘ అన్న లోకేష్ స్టేట్ మెంట్ చూసి.. చంద్రబాబు.. ‘ఆహా..! నా కొడుకు ఏం మాట్లాడుతున్నాడు’ అని గర్విస్తాడా, లేక…’ అంటూ ట్వీట్‌ చేశారు. మరో ట్వీట్‌లో ‘లోకేష్…! సొంత పెళ్ళానికి వాట్సాప్ మెసేజ్ పెట్టాలంటే.. జగన్ గారి పర్మిషన్ తీసుకోవాల్సి వస్తోందన్నావ్. అవునా…! తీసుకుంటున్నావా…? ఎందుకయ్యా.. రాజకీయాల్లో ...

Read More »

సమంత అదుర్స్‌

లాక్‌డౌన్‌లో సినిమా షూటింగ్‌లు లేకపోవడంతో సినీతారలు శారీరకంగా దృఢపడడానికి కరసత్తులు చేస్తున్నారు. అందులో తెలుగులో నటి సమంత కూడా ఉంది. ఈమె ఒక పక్క జిమ్‌లో కుస్తీలు పడుతూనే మరో పక్క యోగా చేస్తున్నారు. ఆకుకూరలు పండిస్తున్నారు. తాజాగా యోగా సెషన్‌లో ఆమె ప్రదర్శించిన భంగిమను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. అది కొద్దిగా కష్టమైనదే అయినా సులువుగా చేసేసిందట. ఆ సమయంలో తన భర్త నాగచైతన్య కూడా ఉన్నారు. చైతన్యతో కలసి ఇలా యోగా చేయడం చాలా సంతోషంగా ఉందని ఇన్‌స్టాలో పేర్కొంది.

Read More »

అమెరికా ఉత్పత్తులకు భారత్‌లో చుక్కెదురు

అమెరికా ఉత్పత్తులకు భారత్‌లో చుక్కెదురు

అమెరికా ఉత్పత్తులకు భారత్‌లో చుక్కెదురైంది. చైనాతో సరిహద్దు వివాదం మొదలైన తర్వాత ఆ దేశ ఉత్పత్తులపై నిషేధం విధించాలని భారత్‌ పట్టుబడుతోంది. ఈ నేపథ్యంలో చైనా నుండి దిగుమతి అవుతున్న వస్తువులను ప్రధాన భారతీయ ఓడరేవుల్లోని కస్టమ్స్‌ అధికారులు తిరిగి వెనక్కు పంపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా, వీటిలో చైనాలో తయారవుతున్న ఆపిల్‌, డెల్‌, సిస్కో, ఫార్వర్డ్‌ మోటారు కంపెనీలకు చెందిన అమెరికా ఉత్పత్తులు కూడా ఉన్నాయి. ఈ విషయాన్ని అమెరికా-భారత్‌ వ్యూహాత్మక భాగస్వామ్య ఫోరం, అమెరికా సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఓ లాబీయింగ్‌ ...

Read More »

‘వైఎస్సార్ యాప్’‌ను ప్రారంభించిన సీఎం జ‌గ‌న్‌

‘వైఎస్సార్ యాప్’‌ను ప్రారంభించిన సీఎం జ‌గ‌న్‌

దేశంలో ఏ రాష్ట్రంలోనూ చేయని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు మేలు చేసేందుకు ప్రభుత్వం ప్రారంభించిన రైతు భరోసా కేంద్రాలను మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్రం ప్ర‌భుత్వం చ‌ర్యలు చేపట్టింది. రైతుభరోసా కేంద్రాల ద్వారా రైతులకు అందుతున్న సేవలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు వ్యవ‌సాయశాఖ రూపొందించిన వైఎస్సార్ యాప్‌ను ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి క్యాంప్ కార్య‌ల‌యంలో శుక్రవారం ప్రారంభించారు. ఈ యాప్‌ను రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా కేంద్రాల సిబ్బంది డౌన్‌లోడ్ చేసుకోవడం ద్వారా ప్రభుత్వ పరంగా వ్యవసాయం, అనుబంధ రంగాల్లో అమలు చేస్తున్న కార్యక్రమాలు, ప్రభుత్వ ...

Read More »

ఏపీలో కొత్తగా 570 కరోనా కేసులు

ఏపీలో కొత్తగా 570 కరోనా కేసులు

రాష్ట్రంలో కొత్తగా 570 కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 11,489కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. గత 24 గంటల్లో 22,305 శాంపిల్స్‌ను పరీక్షించగా 570 మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. కర్నూల్‌, కృష్ణలలో నలుగురు చొప్పున, గుంటూరు, విశాఖపట్నంలో ఒక్కరు చొప్పున మృత్యువాత పడగా.. 191మంది కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు.

Read More »

జగన్ సర్కార్‌పై యూకే డిప్యూటీ హైకమిషనర్ ప్రశంసలు..

జగన్ సర్కార్‌పై యూకే డిప్యూటీ హైకమిషనర్ ప్రశంసలు..

కరోనా కట్టడికి జగన్ సర్కార్ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. టెస్టుల సంఖ్యను భారీగా పెంచింది.. అలాగే పొరుగు రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి వస్తున్నవారిపై ఫోకస్ పెట్టింది. టెస్టుల్లోనూ రికార్డులు సృష్టిస్తోంది.. ఇప్పటి వరకు ఏడు లక్షలకు పైగా పరీక్షలు నిర్వహించింది. అంతేకాదు ఎన్నో రాష్ట్రాలకు ఆదర్శం నిలుస్తోంది. అయితే కరోనా కట్టడిలో జగన్ సర్కార్ తీసుకుంటున్న చర్యలకు ప్రశంసలు వస్తున్నాయి. తాజాగా యూకే డిప్యూటీ హై కమిషనర్ ఫ్లెమింగ్ ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. దీనిపై వైఎస్సార్‌సీపీ నేత పీవీపీ ట్వీట్ చేశారు. కరోనా ...

Read More »

ఢిల్లీకి వైసీపీ ఎంపీ… లోక్‌సభ స్పీకర్‌తో భేటీ

ఢిల్లీకి వైసీపీ ఎంపీ..

వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఢిల్లీ చేరుకోనున్న వైసీపీ ఎంపీ అక్కడ లోక్‌సభ స్పీకర్‌తో పాటు.. హోంశాఖ కార్యదర్శితో భేటీ కానున్నారు. అనంతరం కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ను కూడా వైసీపీ ఎంపీ కలవనున్నట్లు సమాచారం. తనకు రక్షణ కల్పించాలని ఇప్పటికే స్పీకర్‌ను రఘురామ కృష్ణం రాజు కోరిన విషయం తెలిసిందే. వైసీపీ ఎంపీ ఇప్పుడు ఢిల్లీ పర్యటనకు వెళ్లడంతో అధికార పార్టీ నేతలు ఆలోచనలో పడ్డారు. తాజాగా ఏపీలో అధికార పార్టీ ...

Read More »

రామ్‌చరణ్‌ స్థానంలో మరో హీరో, చిరంజీవి సలహా

చిరంజీవీ, కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ఆచార్య. నక్సలైట్‌ బ్యాక్‌డ్రాప్‌లో తీస్తున్న ఈ చిత్రంలో మరో యువ హీరో పాత్రకు కూడా అవకాశముంది. ఈ పాత్రకు ఇప్పటికే పలువురి పేర్లు ప్రచారంలోకి వచ్చినప్పటికీ ఎవ్వరి పేరూ ఖరారు కాలేదు. మొదట రామ్‌చరణ్‌తో ఈ పాత్ర చేయించాలని కొరటాల శివ అనుకున్నారు. కానీ రామ్‌చరణ్‌ ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా చిత్ర నిర్మాణంలో లాక్‌ అయి పోయారు. ఇక రామ్‌చరణ్‌ నటించే అవకాశం లేదని తెలియడంతో మహేష్‌ బాబు ఈ చిత్రంలో చేయనున్నారని, పారితోషకం కూడా భారీగా ...

Read More »

టీవీ సీరియల్‌ నటుడికి కరోనా

కరోనా మహమ్మారి ఏ రంగాన్ని వదలడం లేదు. తాజా టీవీ కళాకారులను కూడా కరోనా భయపెడుతోంది. మా ఇంటి గృహలక్ష్మీ సీరియల్‌ నటుడు హరికృష్ణకు కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంత ఈరోజు షూటింగ్‌ను రద్దు చేశారు. ఈ సీరియల్‌కు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న ప్రభాకర్‌కు మొదట కరోనా వచ్చింది. ఆయనతో కలిసి తిరగడంతో హరికృష్ణకు కూడా పాజిటివ్‌గా తేలింది. ప్రభాకర్‌తో కాంటాక్ట్‌ అయిన 33 మందిని పరీక్షించారు. ఈ పరీక్షల ఫలితాలు రాకముందే టీవీ సీరియర్‌ షూటింగ్‌ మొదలుపెట్టారు. కాగా షూటింగ్‌లో పాల్గంటున్న ఆర్టిస్టులకు ...

Read More »