Monthly Archives: June 2020

కూరగాయలను డిటర్జెంట్స్‌తో కడిగితే కరోనా వైరస్ పోతుందా..

ప్రపంచ దేశాలను కరోనా గజగజ వణికిస్తోంది.. రోజురోజుకి ఈ వైరస్ విస్తరిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. దీంతో ప్రతి ఒక్కరూ వైరస్‌ నుంచి తమని తాము కాపాడుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంట్లో వాడే ప్రతి వస్తువుని జాగ్రత్తగా వాడడం. తెచ్చుకుంటున్న వస్తువులని జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు కడగడం ఇలా చేస్తున్నారు. లాక్ డౌన్ కారణగా కూడా బయటికి వెళ్లడం లేదు. ఒకేసారి ఇంట్లోకి కావాల్సిన వస్తువులని తెచ్చి పెట్టుకుంటున్నారు. ఇంటికి కావాల్సిన రేషన్ సరుకులు నెలకోసారి తెచ్చిపెట్టుకోగా, కూరగాయలు, ఆకుూరలు వారానికి ...

Read More »

నేడు పంటల బీమా సొమ్ము 596.36 కోట్లు చెల్లింపు

నేడు పంటల బీమా సొమ్ము 596.36 కోట్లు చెల్లింపు

గత టీడీపీ ప్రభుత్వం 2018 రబీ పంటల బీమా సొమ్మును రైతులకు చెల్లించకుండా ఎగనామం పెట్టింది. అయితే తమది రైతు పక్షపాత ప్రభుత్వమని ఇప్పటికే నిరూపించిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డి.. గత సర్కారు ఎగనామం పెట్టిన పంటల బీమా సొమ్మును రైతులకు చెల్లించాలని నిర్ణయించారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయం నుంచి 13 జిల్లాల్లోని 5,94,005 మంది రైతుల ఖాతాలకు రూ.596.36 కోట్లు నేరుగా జమ చేయనున్నారు. 2018 రబీ పంటల బీమా కింద గత చంద్రబాబు ప్రభుత్వం బీమా కంపెనీలకు ప్రీమియంను చెల్లించలేదు. దీంతో ...

Read More »

భారత్‌లో ఒక్క రోజే 17,296 కరోనా కేసులు

భారత్‌లో ఒక్క రోజే 17,296 కరోనా కేసులు

దేశంలో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ పోతోంది. గడిచిన 24 గంటలలో అత్యధికంగా 17,296 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా 407 మంది మృత్యువాత పడ్డారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,90,401కు చేరుకోగా, మొత్తం 15,301 మంది మరణించారు. శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ కరోనాపై హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసుల సంఖ్య 1,89,463గా ఉంది

Read More »

మొక్కలు నాటిన మంత్రి కేటీఆర్‌

మొక్కలు నాటిన మంత్రి కేటీఆర్‌

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఆరో విడత హరిత హారం కార్యక్రమం కొనసాగుతోంది. ఇందులో భాగంగా బోయగూడలో నూతన పార్కును మంత్రి కేటీఆర్ గురువారం‌ ప్రారంభించారు. అనంతరం ఆయన పాటు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మేయర్‌ బొంతు రామ్మోహన్‌, అధికారులు పార్కులో మొక్కలు నాటారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అధికారులు మొక్కలు నాటారు. హరిత తెలంగాణగా రాష్ట్రాన్ని మార్చాలన్న సీఎం కేసీఆర్ ఆశయానికి అనుగుణంగా అందరూ మొక్కలు నాటాలని మంత్రులు పిలునిచ్చారు.

Read More »

ఎమ్మెల్సీ పదవికి వైసిపి తరపున డొక్కా నామినేషన్‌

ఎమ్మెల్సీ పదవికి వైసిపి తరపున డొక్కా నామినేషన్‌

రాష్ట్రంలో ఒక్క ఎమ్మెల్సీ స్థానానికి జరగబోయే ఎన్నికలో వైసిపి అభ్యర్ధిగా డొక్కా మాణిక్యవరప్రసాద్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. వైసిపి ఎంపి సురేష్‌, ఎమ్మెల్యే అంబలి రాంబాబు, శాసనమండలి పక్ష నేత ఉమారెడ్డి వెంకటేశ్వర్లు వెంటరాగా డొక్కా మాణిక్యవరప్రసాద్‌ శాసనమండలి కార్యాలయంలో నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. గతంలో టిడిపి తరపున ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయిన డొక్కా మాణిక్య వరప్రసాద్‌ రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత టిడిపికి రాజీనామా చేసి వైసిపిలో చేరారు. అప్పుడే తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాతో ఇప్పుడు ...

Read More »

రియల్ హీరో అనిపించుకున్న మహేష్ బాబు.. చిన్నారి ప్రాణాలు కాపాడిన సూపర్ స్టార్

సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ చిన్నారి ప్రాణం కాపాడి ఉదారత చాటుకున్నారు. తెర మీదే కాదు నిజ జీవితంలోనూ హీరో అనిపించుకున్నారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన నెలరోజుల శిశువుకు ఉచితంగా ఆపరేషన్ చేయించారు. తుమ్మలపల్లి గ్రామానికి చెందిన ప్రదీప్, నాగజ్యోతి దంపతులకు అరుదైన గుండె జబ్బుతో ఓ పాప పుట్టింది. ఆమె శరీరంలో చెడు రక్తంతో మంచి రక్తం కలిసిపోతోంది. రోజులు గుడుస్తుంటే పాప ఆరోగ్య పరిస్థితి దెబ్బ తింటుండటంతో ఆమె తల్లిదండ్రులు ప్రదీప్, నాగజ్యోతి దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. పాప ఆరోగ్య పరిస్థితి గమనించిన ...

Read More »

వచ్చేనెల్లో ఆర్‌ఆర్‌ఆర్‌ షూటింగ్‌ ప్రారంభం

దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తునన ఆర్‌ఆర్‌ఆర్‌ షూటింగ్‌ వచ్చే నెలలో ప్రారంభం కానుంది. ముందు వచ్చేవారం టెస్ట్‌ షూట్‌ జరపనున్నారు. దీని ద్వారా పూర్తిస్థాయి షూటింగ్‌ చేయడానికి గల సాధ్యాసాధ్యాలను పరిశీలించుకొని వచ్చే నెల్లో షూటింగ్‌ ప్రారంభిస్తారు. లాక్‌డౌన్‌ అనంతరం సినిమా షూటింగ్‌లకు అనుమతి ఇచ్చిన వెంటనే ఈ చిత్రానికి షూటింగ్‌ ప్రారంభించాలని భావించారు. కానీ టెస్ట్‌ షూటే చేయలేకపోయారు. అయితే ఇప్పుడు మాత్రం పూర్తిస్థాయిలో సిద్దమయ్యారు. ఇప్పటికే 80 శాతం సినిమా షూటింగ్‌ పూర్తయిన ఈ సినిమాకు మిగిలిన షెడ్యూల్‌ను ఇప్పుడు ...

Read More »

ఉండవల్లిలో టిడిపి నేతల అరెస్ట్‌

ఉండవల్లిలో టిడిపి నేతల అరెస్ట్‌

ప్రజా వేదిక కూల్చి ఏడాది అయిన సందర్భంగా ఆ ప్రాంతాఁ్న పరిశీలించేందుకఁ టిడిపి నేతల ప్రయత్నించడం ఉద్రిక్తతలకఁ దారి తీసింది. టిడిపి నేతలు దేవినేఁ ఉమామహేశ్వరరావు, వర్ల రామయ్య, కొల్లు రవీంద్ర, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, టి.శ్రావన్‌కఁమార్‌, నక్కా ఆనందబాబు తదిరతులు ప్రజా వేదిక వద్దకఁ బయల్దేరారు. అయితే వీరి రాకను గమఁంచిన పోలీసులు ఉండవల్లి వద్దే అడ్డుకఁన్నారు. మొత్తం నాలుగు చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి ఎక్కడి వారిఁ అక్కడే ఆపేశారు. టిడిపి నేతల వరకఁ ఆపేసి సామాన్య ప్రజలను వదిలేశారు. అడ్డుకఁన్నప్పటికీ టిడిపి నేతలు ...

Read More »

వైసీపీకి షాకిచ్చిన ఎంపీ రఘురామకృష్ణంరాజు.. షోకాజ్‌కు ఊహించని సమాధానం

వైసీపీకి షాకిచ్చిన ఎంపీ రఘురామకృష్ణంరాజు.

వైఎస్సార్‌సీపీ అధిష్టానం ఇచ్చిన షోకాజ్ నోటీసుకు ఎంపీ రఘురామకృష్ణంరాజు సమాధానం ఇచ్చారు. ఊహించని విధంగా.. చాలా లాజికల్‌గా స్పందించారు. సమాధానం ఇస్తూ రాసిన లేఖలో కీలక అంశాలను ప్రస్తావించారు. తనకు పంపిన షోకాజ్ నోటీస్‌‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని రాశారని.. కానీ తాను ఎంపీగా గెలిచింది యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ పేరు మీద అంటూ ట్విస్ట్ ఇచ్చారు. అంతేకాదు అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరొకటి ఉందన్నారు. ఎన్నికల సంఘానికి సంబంధించిన కొన్ని నిబంధనల్ని వివరించారు. అంతేకాదు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ...

Read More »

ఒకే రోజు 36,047 కరోనా పరీక్షలు

ఒకే రోజు 36,047 కరోనా పరీక్షలు

కరోనా పరీక్షల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ సరికొత్త రికార్డు సృష్టించింది. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి బుధవారం ఉదయం 9 వరకు ఏకంగా 36,047 కరోనా పరీక్షలు నిర్వహించింది. ఈ నెల 21వ తేదీన 24,451 పరీక్షలు నిర్వహించగా.. ఆ రికార్డును ఇప్పుడు బద్దలుకొట్టింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 7,50,234 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ప్రతి పది లక్షల జనాభాకు 14,049 మందికి పరీక్షలు నిర్వహించడం ద్వారా అన్ని రాష్ట్రాల కంటే ఏపీ మొదటి స్థానంలో ఉంది. గడిచిన 24 గంటల్లో 497 ...

Read More »