Monthly Archives: June 2020

చంద్రబాబు పై మండిపడ్డ అంబటి

చంద్రబాబు పై మండిపడ్డ అంబటి

ఆంధ్రప్రదేశ్‌ మాజీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ బీజేపీ నేతలు సుజానా చౌదరి, కామినేని శ్రీనివాస్‌లతో రహస్యంగా భేటీ కావడం వెనక అంతర్యమేమిటని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రశ్నించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు డైరక్షన్‌లోనే వారు ముగ్గురు రహస్య మంతనాలు జరిపారని చెప్పారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీసీటీవీ ఫుటేజ్‌ బయటకు వచ్చాకే వారిని కలిసినట్టు సుజనా ఎందుకు చెప్పారని నిలదీశారు. 13వ తేదీన భేటీ జరిగితే.. ఇన్నాళ్లు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. కలిస్తే తప్పేంటని ...

Read More »

లక్షణాలు లేకుంటే రావొద్దు: మంత్రి ఈటల

లక్షణాలు లేకుంటే రావొద్దు: మంత్రి ఈటల

కరోనా విషయంలో కొందరు ప్రభుత్వం మీద బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోగ్యమంత్రి ఈటల రాజేందర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ ఆస్పత్రిపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, వైద్యుల మనోభావాలను కించపరిచేలా వ్యాఖ్యలు చేయొద్దని హితవు పలికారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. లక్షణాలు లేనివారు కరోనా నిర్ధారణ పరీక్షల కోసం ఆస్పత్రులకు రావొద్దని ఆరోగ్యమంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. దీనివల్ల కరోనా పేషంట్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. లక్షణాలు ఉంటే ఎంతమందికైనా పరీక్షలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు

Read More »

యూజీ, పీజీ పరీక్షలపై క్లారిటీ ఇచ్చిన మంత్రి సురేష్

యూజీ, పీజీ పరీక్షలపై క్లారిటీ ఇచ్చిన మంత్రి సురేష్

పదో తరగతి పరీక్షల మాదిరి యూజీ, పీజీ పరీక్షలు రద్దయ్యే అవకాశం లేదని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా ముందుకెళ్లాలో ఆలోచిస్తున్నామే తప్ప రద్దన్న ప్రశ్న ఉత్పన్నమే కాలేదని స్పష్టం చేశారు. బుధవారం ఆయన ఉన్నత విద్యా కోర్సులు చదువుతున్న విద్యార్థుల పరీక్షల నిర్వహణ, రాబోయే విద్యా సంవత్సరంలో చేయాల్సిన పనులపై రాష్ట్రంలో ఉన్న 16 యూనివర్సిటీల వీసీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రస్తుతం పరిస్థితులపై ఏ విధంగా ముందుకు వెళ్లాలో సమీక్షించారు. అనంతరం మంత్రి సురేష్‌ మీడియాతో ...

Read More »

కరోనాతో తృణమూల్ ఎమ్మెల్యే కన్నుమూత

కరోనాతో తృణమూల్ ఎమ్మెల్యే కన్నుమూత

తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే తమోనాశ్ ఘోష్(60) కరోనా వైరస్ తో పోరాడుతూ బుధవారం తుది శ్వాస విడిచారు. గత నెలలో ఆయనకు నిర్వహించిన టెస్టుల్లో కరోనా పాజిటివ్ గా తేలింది. ఆ తర్వాత నుంచి ఆసుపత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు తమోనాశ్ మృతి పట్ల టీఎంసీ అధ్యక్షురాలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘35 ఏళ్ల పాటు ప్రజలు, పార్టీ కోసం తమోనాశ్ పని చేశారు. ఆయన లేని లోటు పూడ్చుకోలేం. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ ...

Read More »

విజ‌య‌శాంతికి మ‌హేశ్ బాబు బ‌ర్త్ డే విషెష్

లేడీ అమితాబ్‌, లేడీ సూప‌ర్‌స్టార్‌గా హీరోయిన్స్‌కు స్పెష‌ల్ క్రేజ్ తీసుకొచ్చిన న‌ట విశ్వ‌భార‌తి విజ‌య‌శాంతి గురించి సినీ ప్రేక్ష‌కుల‌కు ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. త‌న‌దైన న‌ట‌న‌తో గ్లామ‌ర్ సినిమాలే కాదు. మ‌హిళా ప్ర‌ధాన చిత్రాల్లోనూ న‌టించి మెప్పించారు. అప్ప‌టి సీనియ‌ర్ హీరోల‌కు ధీటుగా యాక్ష‌న్ సినిమాల్లోనూ, విప్ల‌వాత్మ‌క చిత్రాల్లో న‌టించి మెప్పించారు. చాలా కాలం సినిమాల‌కు దూరంగా ఉన్న విజ‌య‌శాంతి రీసెంట్‌గా మ‌హేశ్ హీరో గా చేసిన‌‘స‌రిలేరు నీకెవ్వ‌రు’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో ఆమె పోషించిన భార‌తి ...

Read More »

ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు షోకాజ్‌ నోటీసు

ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు షోకాజ్‌ నోటీసు

పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఎంపీ కనుమూరు రఘురామ కృష్ణంరాజుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ బుధవారం షోకాజ్‌ నోటీసు జారీ చేసింది. పార్టీ ఎమ్మెల్యేలపై నిరాధార ఆరోపణలు చేయడంపై ఈ మేరకు నోటీసులు ఇచ్చింది. ప్రభుత్వం, పార్టీ నిర్ణయాలను వ్యతిరేకించడంపై వారంలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

Read More »

నేడు ‘వైఎస్సార్‌ కాపు నేస్తం’ ప్రారంభం

నేడు ‘వైఎస్సార్‌ కాపు నేస్తం’ ప్రారంభం

కోవిడ్‌–19 లాక్‌ డౌన్‌ నేపథ్యంలో ప్రభుత్వానికి ఆదాయం తగ్గిపోయినప్పటికీ ఎన్నికల హామీలను అమలు చేయడంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముందడుగు వేస్తున్నారు. ఇందులో భాగంగా దారిద్య్ర రేఖకు దిగువనున్న అర్హులైన కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు చెందిన మహిళల్లో 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న వారికి ‘వైఎస్సార్‌ కాపు నేస్తం’ అమలుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ రంగం సిద్ధం చేశారు. నవరత్నాల్లో భాగంగా 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్య కాపు మహిళల జీవనోపాధిని మెరుగు పరిచేందుకు ఏడాదికి ...

Read More »

తెలంగాణలో కొత్తగా 879 కేసులు

తెలంగాణలో కొత్తగా 879 కేసులు

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మంగళవారం ఒక్కరోజే 879 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. రోజువారీగా నమోదవుతున్న కేసుల్లో ఇదే అత్యధికం. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 9,553కి చేరింది. ప్రస్తుతం 5,109 మంది వివిధ ఆస్పత్రులు, హోం ఐసోలేషన్‌లలో చికిత్స పొందుతుండగా.. 4,224 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మంగళవారం రాష్ట్రంలో మరో ముగ్గురు మృతి చెందడంతో రాష్ట్రంలో కరోనాతో మరణించినవారి సంఖ్య 220కి పెరిగింది. ఇక తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో ...

Read More »

ఆ వ్యాపారవేత్తతో కాజల్‌ పెళ్లి..!

రానా, నిహారిక, నిఖిల్‌ లాగానే ప్రముఖ టాలీవుడ్‌ తార కాజల్‌ అగర్వాల్‌ కూడా పెళ్లి చేసుకోబోతోంది. ఇన్నాళ్లూ కాజల్‌పై లవ్‌ ఎఫైర్ల విషయంలో పెద్దగా పుకార్లు రాలేదు. కానీ ఇటీవల కాలంలో ఆమె ఓ వ్యక్తితో సన్నిహితంగా మెలుగుతున్నట్లు వార్తలచ్చాయి. తన బారుఫ్రెండ్‌తో కలిసి ఇతర స్నేహితులను కలుపుకొని విహార యాత్రకు వెళ్లచ్చింది. ఆ బారుఫ్రెండ్స్‌తో పార్టీలు, పబ్బులకు కూడా వెళ్తోంది. అతని కుటుంబానికి, కాజల్‌ కుటుంబానికి దగ్గరి సంబంధాలు ఉన్నాయి. ఆయన మంబయిలోని ఓ బిజినెస్‌ మ్యాన్‌. ఇరు కుటుంబాల్లోనూ వీరి పెళ్లికి ...

Read More »

జగన్‌ కేబినెట్‌లో కొత్త మంత్రులు ఆ ఇద్దరేనా..?

జగన్‌ కేబినెట్‌లో కొత్త మంత్రులు ఆ ఇద్దరేనా

రాష్ట్ర మంత్రివర్గంలో పని చేస్తున్న పిల్లి సుభాస్‌చంద్రబోస్‌, మోపిదేవి వెంకటరమణ రాజ్యసభ సభ్యులుగా ఎంపికవ్వడంతో ఆ రెండు స్థానాలను భర్తీ చేయాలని సిఎం జగన్‌మోహన్‌ రెడ్డి భావిస్తున్నారు. ఈనెలాఖరులోగా కొత్త మంత్రుల ఎంపిక ఉంటుందంటూ ఇప్పటికే రాష్ట్ర గవర్నర్‌కు సమాచారమిచ్చారు. ఇప్పుడు ఆ ఇద్దరి ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. కాగా రాజ్యసభకు ఎంపికయిన పిల్లి సుభాష్‌చంద్రబోస్‌, మోపిదేవి వెంకటరమణ ఇద్దరూ బిసిలే. వీరి స్థానంలోనూ బిసిలనే తిరిగి మంత్రులుగా ఎంపిక చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇన్నాళ్లూ టిడిపికి ఓటు బ్యాంక్‌గా ఉన్న బిసిలను ...

Read More »