Monthly Archives: July 2020

మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్‌ ఆమోదం

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అంశంలో శుక్రవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఆర్‌డీఏ-2014 రద్దు, వికేంద్రీకరణ-ప్రాంతీయ సమానాభివృద్ధి బిల్లు, పాలనా వికేంద్రీకరణ బిల్లులకు గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌ ఆమోదం తెలిపారు. రాష్ట్ర శాసనసభను ఆమోదం తెలిపి బిల్లును పరిశీలించిన గవర్నర్‌.. తన ఆమోద ముద్రవేశారు. తాజా నిర్ణయంతో ఇకపై పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు గుర్తింపు పొందనున్నాయి. కాగా పరిపాలనా వికేంద్రీకరణను దృష్టిలో ఉంచుకుని మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించిన విషయం తెలిసిందే.రాజధానిపై ...

Read More »

మహేష్ బాబుకి ఇష్టమైన గుత్తి వంకాయ్ పలావ్

సూపర్ స్టార్ మహేష్ బాబు వయసు చెప్తే నమ్మరు కాని… ఆయన మరో ఐదేళ్లలో హాఫ్ సెంచరీకి చేరువవుతున్నారు. 1975 ఆగష్టు 9న పుట్టిన మహేష్ బాబు 45 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్నారు. ఊరికోండి బాస్.. ఈమధ్య ఆయన కొడుకు గౌతమ్‌తో కలిసి దిగిన ఫొటోలు చూస్తే ఎవరైనా ఆయనకు 45 ఏళ్లు అంటే నమ్ముతారా?? గౌతమ్ అన్నయ్యో.. కుదిరితే తమ్ముడన్నా నమ్మేస్తారు అంత యంగ్‌గా ఉన్నారు మహేష్ బాబు. పైగా ఈ లాక్ డౌన్‌లో పూర్తి విరామం దొరకడంతో ఫిట్ నెస్‌పై ఫుల్ టైం కేటాయించారు ...

Read More »

వరలక్ష్మి వ్రత కథ

ఒకనాడు పరమేశ్వరుడు కైలాస గిరియందు సకల మునిగణ సంసేవితుడైయున్న సమయంబున పార్వతీ దేవి వినయంబుగా, “ప్రాణేశ్వరా! స్త్రీలు సకలైశ్వర్యములు కలిగియుండుటకు ఆచరించదగిన వ్రతమేదియో సెలవీయు”డని కోరెను. అంతట పరమేశ్వవరుడు, “దేవీ! వరలక్ష్మి వ్రతమనునది స్త్రీలకు సౌభాగ్యమొసగును. దానిని శ్రావణమాసమందు పౌర్ణమికు ముందు వచ్చు శుక్లపక్ష శుక్రవారము నాడు చేయవలెను” అనెను. అది విని యామె, “స్వామీ! ఆవ్రతం ఎలా ఆచరించవలెనో సెలవీ”య వేడెను. ,, “ఆ వ్రతాన్ని మునుపు ఎవరాచరించి తరించారో తెలుపగోరెద” ననెను. అంతట పరమేశ్వరుడు “ఓ పడతీ! ఆ వ్రతకథను చెప్పెదను ...

Read More »

ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ

కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆస్పత్రిలో చేరారు. గురువారం సాయంత్రం 7 గంటలకు ఆమె న్యూఢిల్లీలోని సర్‌ గంగారామ్‌ హాస్పిటల్‌లో అడ్మిట్‌ అయ్యారు. సాధారణ ఆరోగ్య పరీక్షల నిమిత్తం తమ ఆస్పత్రిలో చేరినట్టు ఆ హాస్పిటల్‌ చైర్మన్‌ డీఎస్‌ రానా తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వెల్లడించారు

Read More »

మాట నిలబెట్టుకున్న కేటీఆర్‌

ఇటీవల తన పుట్టినరోజు సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు గురువారం ఆరు కోవిడ్‌ రెస్పాన్స్‌ అంబులెన్సులను ప్రభుత్వానికి అందజేశారు. తన జన్మదినం సందర్భంగా ‘గిఫ్ట్‌ ఏ స్మైల్‌’పేరిట ఇచ్చిన నినాదంలో భాగంగా సొంత డబ్బుతో అంబులెన్సులు అందజేస్తున్నట్లు కేటీఆర్‌ వెల్లడించారు. ప్రగతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో కలిసి కేటీఆర్‌ అంబులెన్సులను జెండా ఊపి ప్రారంభించారు. కేటీఆర్‌ భార్య శైలిమ, కుమార్తె అలేఖ్యతో పాటు పలువురు మంత్రులు, ...

Read More »

భారత్ లో 16 లక్షలు దాటిన కరోనా కేసులు

భారత్‌లో కరోనా వైరస్‌ శరవేగంగా వ్యాపిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆశ్చర్యపరిచే రీతిలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. దేశంలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 16 లక్షలు దాటింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా అత్యధికంగా 55,079 కేసులు వెలుగు చూశాయి. గురువారం 779 మరణాలు సంభవించాయి. దీంతో ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 16,38,871కు చేరింది. మొత్తం 35,747 మంది కరోనాతో పోరాడి ప్రాణాలు విడిచారు

Read More »

వరలక్ష్మి వ్రతం రోజు ఎందుకు ఈ వ్రతం చేస్తారో తెలుసా

అష్టలక్ష్ముల్లో వరలక్ష్మీదేవికి ఓ ప్రత్యేకత ఉందంటారు. మిగిలిన లక్ష్మీ పూజలకంటే వరలక్ష్మీ పూజ శ్రేష్ఠమని శాస్త్ర వచనం. శ్రీహరికి ఇష్టమైన, పైగా విష్ణువు జన్మనక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయంటారు. సర్వమంగళ సంప్రాప్తి కోసం, సకలాభీష్టాలకోసం, నిత్య సుమంగళిగా తాము వర్ధిల్లాలని పుణ్యస్త్రీలు ఈ వ్రతం చేస్తారు. దక్షిణ భారతదేశంలో ఈ వరలక్ష్మీ వ్రతాన్ని వివిధ సంప్రదాయాల్లో ఆచరిస్తారు. ఎవరు ఏ పద్ధతులు పాటించినా శ్రీ లక్ష్మిని కొలిచే తీరు మాత్రం అందరిదీ ఒక్కటే! ...

Read More »

వరలక్ష్మీ వ్రతం పూజా సమయం

చంద్రమానం ప్రకారం తెలుగు సంవత్సరాదిలోని ఐదో నెల శ్రావణం. ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టమైన ఈ మాసంలో ప్రతిరోజూ పండగే. శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా జరుపుకోవడం హిందూ ఆచారం. అంతే కాదు ఈ మాసంలో మంగళవారం శ్రావణ గౌరీ వ్రతం, శుక్రవారం మహాలక్ష్మీ పూజలు ఎంతో ప్రత్యేకం. వరాలు యిచ్చే దేవతగా వరలక్ష్మీ దేవిని కొలుస్తారు. వరలక్ష్మీ దేవత విష్ణు మూర్తికి భార్య. శ్రీమహావిష్ణువు దేవేరి మహాలక్ష్మీ అష్టవిధ రూపాలతో సర్వ మానవాళి కోరికలు తీరుస్తూ, ఎల్లవేళలా రక్షిస్తుంది. ...

Read More »

వరలక్ష్మీ వ్రతం: పూజా విధానం.. పాటించాల్సిన నియమాలు

శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్నిఆచరించాలి. ఆ రోజున వీలుకాకపోతే తరువాత వచ్చే శుక్రవారాలలో కూడా ఈవ్రతాన్ని చేసుకోవచ్చు. వరలక్ష్మీ వ్రతానికి ఆది దేవతయైన లక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో సాక్షాత్కరించింది. సువాసినులందరూ చేసే ప్రాభవ వ్రతం. ‘శ్రీ వరలక్ష్మీ నమస్తు వసుప్రదే, సుప్రదే’ శుక్రవారం రోజున జరుపుకునే వరలక్ష్మీవ్రతంతో ధన, కనక, వస్తు,వాహనాది సమృద్ధులకు మూలం. శ్రావణ శుక్రవార వ్రతాలతో పాపాలు తొలిగి లక్ష్మీ ప్రసన్నత కలుగుతుంది. వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించే రోజున ఉదయాన్నే లేచి ...

Read More »

సుశాంత్ మృతిపై స్వామి సంచలన వ్యాఖ్యలు

బాలీవుడ్‌ యువ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణంపై రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి సంచలన ఆరోపణలు చేశారు. సుశాంత్‌ను హత్య చేశారని ఆరోపించిన స్వామి ముంబై పోలీసుల ఎఫ్‌ఐఆర్‌పై పలు సందేహాలు వ్యక్తం చేశారు. తన ఆరోపణలకు మద్దతుగా ఓ డాక్యుమెంట్‌ను ట్విటర్‌లో పోస్ట్‌ చేసిన సుబ్రహ్మణ్యస్వామి ఇందులో పేర్కొన్న 26 పాయింట్లలో 24 పాయింట్లు ఇది హత్యేనని పేర్కొంటున్నాయని వ్యాఖ్యానించారు. స్వామి ట్వీట్‌ చేసిన డాక్యుమెంట్‌ ప్రకారం ఆయన పలు వాదనలను ముందుకుతెచ్చారు. సుశాంత్‌ రాజ్‌పుత్‌ మెడపై ఉన్న గుర్తు ఆత్మహత్యతో ...

Read More »