Monthly Archives: July 2020

తెలంగాణ ప్రభుత్వానికి హై కోర్ట్ ఆదేశాలు

ఆన్‌లైన్‌ క్లాసుల ద్వారా పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని పేరెంట్స్‌ అసోసియేషన్‌ తెలంగాణ హైకోర్టుకు వివరించింది. ప్రస్తుతం పాఠశాలలు ప్రారంభం కాకున్నా అడ్డగోలు ఫీజులు చెల్లించాలని ప్రైవేటు పాఠశాలలు తమపై ఒత్తిడి తెస్తున్నాయని తెలిపింది. ప్రైవేటు స్కూళ్ల దోపిడిని అరికట్టాలంటూ పేరెంట్స్‌ అసోసియేషన్‌ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ప్రైవేటు స్కూళ్ల ఫీజులు, ఆన్‌లైన్‌ క్లాసులపై హైకోర్టును ఆశ్రయించిన పేరెంట్స్ అసోసియేషన్ పిటీషన్‌పై హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా జీవో 46ను ఉల్లంఘించి ఫీజులు వసూలు చేస్తున్నారని పేరెంట్స్ అసోసియేషన్ కోర్టుకు తెలిపింది. ...

Read More »

మండలికి పిల్లి సుభాష్‌, మోపిదేవి రాజీనామా

మండలికి పిల్లి సుభాష్‌, మోపిదేవి రాజీనామా

ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, మంత్రి మోపిదేవి వెంకట రమణ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో విజయం సాధించి పెద్దల సభకు ఎన్నికైనందున వీరిద్దరు మండలి సభ్యత్వానికి రాజీనామా సమర్పించారు. ఈ మేరకు మండలి చైర్మన్‌కు బుధవారం తన రాజీనామా లేఖను పంపించగా ఆయన ఆమోదించారు. రాజ్యసభ ఎన్నికల్లో వీరిద్దరితో పాటు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమల్‌ నత్వాని ఎన్నికైన విషయం తెలిసిందే.

Read More »

జూన్ నెలలో జూలు విదిల్చిన కరోనా

జూన్ నెలలో జూలు విదిల్చిన కరోనా

మూడో వారం నుంచి పరిస్థితి అంతా ఒక్కసారిగా మారిపోయింది. మార్చిలో విధించిన లాక్‌డౌన్‌కు మే నాటికి విడతల వారీగా సడలించడం, శ్రామిక్‌ రైళ్లు ప్రారంభించడం, వలస కూలీల తరలింపు వంటి నిర్ణయాలతో వైరస్‌ వ్యాప్తి మరింత పెరిగింది.కేంద్ర గణాంకాల ప్రకారం.. ఏప్రిల్‌ నెలలో మొత్తం 33,248 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఆ సంఖ్య మే మాసంలో 1,50,195గా పెరిగింది. ఇక జూన్‌ నెల ముగిసే నాటికి దేశంలో కరోనా వైరస్‌ జూలు విదిల్చింది. ఒక్క నెలలోనే ఏకంగా నాలుగు లక్షలకు పైగా ...

Read More »

108 సిబ్బంది కి సీఎం జగన్ శుభవార్త

108 సిబ్బంది కి సీఎం జగన్ శుభవార్త

అంబులెన్స్‌ డ్రైవర్లకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభవార్త చెప్పారు. డ్రైవర్లకు జీతాలను భారీగా పెంచారు. డ్రైవర్ల సర్వీసుకు అనుగుణంగా రూ.18 నుంచి 20 వేల వరకు జీతాలు పెంచుతున్నట్లు ప్రకటించారు. బుధవారం తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా గుంటూరు జీజీహెచ్‌ ఆస్పత్రిలో నాట్కో కేన్సర్‌ బ్లాక్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ 108 సిబ్బంది జీతాలు పెంపు విషయాన్ని వెల్లడించారు. ఇంతకు ముందుకు డ్రైవర్లకు నెలకు రూ.10వేలు జీతం వస్తుండగా, ఇకపై వారి సర్వీసుకు అనుగుణంగా రూ.18వేల నుంచి ...

Read More »

కరోనా బారిన పడిన ప్రముఖ టీవీ నటి

లాక్ డౌన్ అనంతరం వెండితెర, బుల్లితెర నటులు ఉత్సాహంగా షూటింగ్ లను ప్రారంభించారు. అయితే, కరోనా తన పని తాను చేసుకుపోతోంది. ఈ క్రమంలో షూటింగ్స్ లో పాల్గొంటున్నవారు కరోనబారిన పడుతున్నారు. ఇటీవల ఇద్దరు టీవీ నటులకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. తాజాగా మరో బుల్లి తెర స్టార్ కు కూడా వైరస్ పాజిటివ్ వచ్చింది. ‘నా పేరు మీనాక్షి’, ‘ఆమె కథ’ వంటి పాపులర్ సీరియల్స్ లో హీరోయిన్ గా నటిస్తోన్ననవ్య స్వామి కూడా వైరస్ బారిన పడ్డట్లుగా ...

Read More »

108,104 అంబులెన్స్ లను ప్రారంభించిన సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రప్రభుత్వం వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకంలో అనేకమార్పులు తీసుకొచ్చింది. రాష్ట్రంలో 95 శాతం కుటుంబాలకుపైగా ఆరోగ్యశ్రీ ద్వారా భరోసా కల్పించేందుకు ఒకేసారి  1088 వాహనాలను (108–104 కలిపి)ప్రవేశపెట్టారు.  బుధవారం ఉదయం 9.30 గంటలకు విజయవాడ బెంజ్‌ సర్కిల్‌ సెంటర్ లో జెండా ఊపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖామంత్రి ఆళ్ల నాని, పంచాయతీరాజ్‌ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు. పట్టణ ప్రాంతాల్లో అయితే ఫోన్‌ చేసిన ...

Read More »