Monthly Archives: August 2020

ప్రణబ్‌ ముఖర్జీ కన్నుమూత

ప్రణబ్‌ ముఖర్జీ కన్నుమూత

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ (84) కన్నుమూశారు. కరోనా వైరస్‌ బారినపడిన ఆయన చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిశారు. కోవిడ్‌తో పాటు ఇతర అనారోగ్య సమస్యలు కూడా తలెత్తడంతో గతకొంత కాలంగా ఆర్మీ ఆస్పత్రిలోనే ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ రావడంతో ఆరోగ్యం విషమించి మృతిచెందినట్లు ఆయన కుమారుడు అభిజిత్‌ ముఖర్జీ సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. ఆయన మృతిపట్ల కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. రాష్ట్రపతిగా, కేంద్రమంత్రిగా, కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్‌ నేతగా ప్రణబ్‌ భారత రాజకీయాల్లో తనదైన గుర్తింపు పొందారు.

Read More »

ఎంత దూరమైనా వెళతా.. జగన్‌ను కలుస్తా: బాలయ్య

సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలయ్య సక్తికర వ్యాఖ్యలు చేశారు. హిందూపురంను జిల్లాగా ప్రకటించాలని.. దీని కోసం ఎంత దూరమైన వెళతానని.. అవసరమైతే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కూడా కలిసి కోరతానని చెప్పుకొచ్చారు. బాలయ్య ఇటీవలే హిందూపురం జిల్లా ఏర్పాటుకు సంబంధించి ముఖ్యమంత్రి జగన్‌కు లేఖ రాశారు. జిల్లాల పునర్విభజన జరిగితే హిందూపురంను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. తాజాగా మరోసారి వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి కంటే కక్ష సాధింపులు చర్యలే ఎక్కువ ఉన్నాయని.. రాజధాని లేకున్నా టీడీపీ హయాంలో తెలంగాణ ...

Read More »

జర్నలిస్టు ఇంటిని ధ్వంసం చేసిన దుండగులు

చిత్తూరు జిల్లా సోమల మండలం కందూరులో దుండగులు రెచ్చిపోయారు. ఓ జర్నలిస్టు ఇంటిని ధ్వంసం చేశారు. స్థానికుడైన వెంకట నారాయణ పదేళ్లగా జర్నలిస్టుగా పనిచేస్తున్నాడు. ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు జర్నలిస్ట్ ఇంట్లోకి చొరబడ్డారు. ఇంట్లో ఉండే సామాన్లు బయటకు విసిరేసి.. ధ్వంసం చేశారు. అందరూ చూస్తుండగానే ఈ ఘటన జరగ్గా.. జర్నలిస్టు ఈ దాడి వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ అరాచకం బయటపడింది. అదే గ్రామానికిపాఠశాల ఛైర్మెన్ గా ఉన్న గాలి భాస్కర్, గాలి సురేష్, మరి కొందరు వ్యక్తులు ...

Read More »

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. కరోనాతో టాలీవుడ్ నిర్మాత మృతి

దేశంలో విలయతాండవం చేస్తున్న కరోనా సినీ ఇండస్ట్రీని కూడా కుదిపేస్తోంది. ఇప్పటికే టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలకు చెందిన ఎందరో సినీ ప్రముఖులు కరోనా బారిన పడి కోలుకోగా.. ఇంకొందరు కరోనాతో పోరాడి కన్నుమూశారు. ఇదిలా ఉండగానే టాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. కరోనా కారణంగా గత రాత్రి టాలీవుడ్ నిర్మాత బోగారి లక్ష్మీనారాయణ కన్ను మూశారు. ఆయన మరణ వార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు తమ తమ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్నిరోజులుగా కరోనా వైరస్‌తో బాధపడుతున్న బొగారి లక్ష్మీనారాయణ సికింద్రాబాద్ యశోద హాస్పిటల్‌లో చికిత్స ...

Read More »

బాలీవుడ్‌లో 99 శాతం మంది డ్రగ్స్‌ వాడుతున్నారు : కంగనా

బాలీవుడ్‌ క్వీన్‌ కంగనా రనౌత్‌ బాలీవుడ్‌ స్టార్స్‌పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. సుశాంత్‌ సింగ్‌ మృతి కేసులో నెపోటిజంపై ఎప్పటికప్పుడు ఇండిస్టీ పెద్దలపై తన పదునైన మాటలతో విమర్శిస్తూ కంగనా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. కౌంటర్లు.. ప్రతికౌంటర్లతో వారిపై విరుచుకుపడుతోంది. తాజాగా మరోసారి బాలీవుడ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇండిస్టీలో 99 శాతం మంది డ్రగ్స్‌ను ఉపయోగిస్తున్నారని పేర్కొంది. డ్రగ్స్‌ను సప్లై చేసేవారిని విచారిస్తే చాలా మంది స్టార్స్‌ జైల్లోనే ఉండాల్సి వస్తుందని పేర్కొన్నారు. అంతే కాకుండా ఓ స్టార్‌ హీరో ...

Read More »

గౌతమ్‌కి మహేశ్‌, నమ్రత సితార పుట్టినరోజు శుభాకాంక్షలు

సూపర్‌స్టార్‌ మహేశ్‌ తనయుడు గౌతమ్‌ ఘట్టమనేని పుట్టినరోజు నేడు(ఆగస్ట్‌ 31). ఈ సందర్భంగా గౌతమ్‌కి మహేశ్‌, నమ్రతా శిరోద్కర్‌, సితార బర్త్‌ డే విషెష్‌ తెలిపారు. ”14లోకి అడుగుపెట్టిన గౌతమ్‌కి పుట్టినరోజు అభినందనలు. ఓ మంచి యువకుడిగా నువ్వు పెరిగి పెద్దవుతున్నందుకు గర్వంగా ఉంది. డొరేమాన్‌ టు అపెక్స్‌ లెజెండ్‌ వరకు నీతో కలిసి నేను జర్నీ చేయడం హ్యాపీగా ఉంది. నీకిది గొప్ప పుట్టినరోజు కావాలి..హ్యాపీ బర్త్‌ డే” అని ట్వీట్‌ చేశారు మహేశ్‌. ”గౌతమ్‌ మా జీవితాల్లోకి వచ్చిన తర్వాత తల్లిదండ్రులుగా ...

Read More »

కడప ఎంపి అవినాష్‌ రెడ్డికి కరోనా!

కడప ఎంపి అవినాష్‌ రెడ్డికి కరోనా సోకింది. సెప్టెంబర్‌ మొదటి వారంలో సిఎం జగన్‌మోహన్‌ రెడ్డి కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు, ఎమ్మెల్యేలు, మీడియా సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో అవినాష్‌ రెడ్డికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన హోం ఐసోలేషన్‌కు వెళ్లిపోయారు.

Read More »

గొప్ప భాషోద్యమకారుడు గిడుగు రామ్మూర్తి: సీఎం జగన్‌

వాడుక భాషాద్యమ పితామహుడు గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆయన సేవలను స్మరించుకున్నారు. ‘గ్రాంధికాన్ని సరళీకరించి వ్యవహారిక భాషలో ఉన్న అందాన్ని.. పలకడంలో ఉండే సౌఖ్యాన్ని తెలియజెప్పిన భాషోద్యమకారుడు గిడుగు రామ్మూర్తి. పండితులకే పరిమితమైన సాహిత్య సృష్టిని వచన భాషతో సామాన్యుల చేతికందించిన.. గిడుగు జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకోవడం తెలుగుని సన్మానించుకోవడమే’ అంటూ ముఖ్యమంత్రి ట్వీట్‌ చేశారు.

Read More »

కరీంనగర్‌‌లో భారీ అగ్ని ప్రమాదం

శ్రీశైలం జల విద్యుత్‌ కేంద్రంలో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదాన్ని ఇంకా మరవక ముందే రాష్ట్రంలో మరో విద్యుత్‌ కార్యాలయంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వివరాలు.. కరీంనగర్‌లోని ఎన్‌పీడీసీఎల్ కార్యాలయం సమీపంలోని ఎలక్ట్రిసిటీ స్టోర్‌లో శనివారం భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. పదుల సంఖ్యలో ఉన్న కొత్త ట్రాన్స్‌ఫార్మర్‌లు అగ్నికి ఆహుతయ్యాయి. ప్రమాదానికి కల కారణాలు స్పష్టంగా తెలియకపోయినప్పటికీ కరెంట్ షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగినట్లు భావిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో అక్కడికి చేరుకొని ఉవ్వెత్తున ఎగిసిపడిన మంటలను అదుపులోకి తెచ్చారు. ...

Read More »

స్వీయ నిర్బంధంలోకి పంజాబ్‌ ముఖ్యమంత్రి

పంజాబ్‌ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ ఇవాళ సెల్ఫ్‌ ఐసోలేషన్‌లోకి వెళ్లారు. నిన్న(శుక్రవారం) నిర్వహించిన అసెంబ్లీ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యేలకు కరోనా పరీక్షలు నిర్వహించగా వారిలో ఇద్దరికి పాజిటివ్‌గా తేలింది. దీంతో వైద్యుల సలహా మేరకు ముఖ్యమంత్రి నేటి నుంచి 7 రోజులపాటు స్వీయ నిర్బంధంలోకి వెళ్లినట్లు మీడియా అధికారి రవీన్‌ తుక్రాల్‌ ట్వీట్‌ చేశారు. కాగా రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎమ్మెల్యేలు, మంత్రులు కలిపి 29 మంది కరోనా బారిన పడ్డారని ముఖ్యమంత్రి ఇటీవల తెలిపిన విషయం తెలిసిందే. అయితే కరోనా సోకిన ...

Read More »