Monthly Archives: August 2020

కట్టుదిట్టంగా ‘దిశ’

‘దిశ’ చట్టాన్ని మరింత సమర్ధవంతంగా అమలు చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ క్రిమినల్‌ లా సవరణ బిల్లుకు త్వరగా ఆమోదం లభించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. వీలైనంత త్వరగా ప్రత్యేకకోర్టులు, ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ల ఏర్పాటుకు ప్రయత్నించాలన్నారు. దిశ చట్టం అమలుపై సీఎం జగన్‌ గురువారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు

Read More »

పెన్మత్స సురేష్‌బాబుకు బీఫాం అందజేత

ఎమ్మెల్సీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా ఖరారైన పెన్మత్స సురేష్‌బాబుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బీఫాం అందజేశారు. సురేష్‌బాబు వెంట మంత్రి బొత్స సత్యన్నారాయణ, వైఎస్సార్‌సీపీ విజయనగరం జిల్లా రాజకీయవ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు ఉన్నారు. ఇటీవ‌ల రాజ్య‌స‌భ‌కు ఎన్నికైన మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ ఎమ్మెల్సీ ప‌ద‌వికి రాజీనామా చేయ‌డంతో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ ఏర్ప‌డింది. ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి వైఎస్సార్‌సీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి, దివంగ‌త పెన్మత్స సాంబ‌శివ‌రాజు కుమారుడు సురేష్‌బాబును అభ్య‌ర్థిగా దించారు.

Read More »

చంద్రబాబు పై మండిపడ్డ హోమ్ మంత్రి సుచరిత

పాదయాత్ర ద్వారా మహిళల కష్టాలు తెలుసుకొని ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్ చేయూత కార్యక్రమాన్ని ప్రారంభించారని హోం మంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు. తాడేపల్లిలో సుచరిత గురువారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలు వైఎస్సార్ చేయూత పథకంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. 23 లక్షల మంది మహిళకు వైఎస్సార్ చేయూత ద్వారా లబ్ది చేకూరిందన్నారు.హోం మంత్రి మాట్లాడుతూ..’ అమూల్, రిలియన్స్ వంటి సంస్థలతో ఒప్పందం చేసుకోవడం ద్వారా మహిళలు ఆర్దికంగా స్థిరపడ వచ్చు. వైఎస్సార్ చేయూత పథకంపై ...

Read More »

పారదర్శక పన్నుల విధాన వేదిక ప్రారంభించిన మోదీ

దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి పన్ను వ్యవస్థలో మరిన్ని సంస్కరణలు తెచ్చేందుకు ‘పారదర్శక పన్నుల విధాన వేదిక’ ఉపయోగపడుతుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఢిల్లీ వేదికగా మోదీ గురువారం పారదర్శక పన్నుల విధాన వేదిక కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు.నిజాయితీగా పన్ను చెల్లించేవారికి ఇలాంటి పారదర్శక వేదికలు మరింత లబ్ధి చేకూరుస్తాయి. పన్ను సంస్కరణల్లో పాలసీ ఆధారిత పరిపాలన అవసరం ఉందని మోదీ వెల్లడించారు. ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజానికి పన్ను సంస్కరణలు అవసరమని తెలిపారు. కరోనా కష్ట కాలంలోనూ రికార్డు స్థాయిలో ...

Read More »

ఏపీలో నాలుగు రోజులు భారీవర్షాలు

వాయువ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతంలో రేపు అల్పపీడనం ఏర్పడనుందని, దీని ప్రభావంతో రాగల 4 రోజుల పాటు రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె. కన్నబాబు తెలిపారు. తీరం వెంబడి గంటకు 45-55 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని, అలలు 3 నుండి 3.5 మీటర్ల ఎత్తు ఎగిసిపడే అవకాశముందని పేర్కొన్నారు. సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదన్నారు. ...

Read More »

అమెరికా ఉపాధ్యక్ష రేసులో కమలా హారిస్

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్న జో బిడెన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత సంతతికి చెందిన కమలా హారిస్‌ను అమెరికా ఉపాధ్యక్ష రేసులో నిలిపారు. వైస్‌ ప్రెసిడెంట్‌గా మహిళను ఎంచుకుంటానని ఇప్పటికే ప్రకటించిన బిడెన్ ఈ పదవికి మొదటి నల్లజాతి మహిళను పోటీలో నిలిపి చరిత్ర సృష్టించారు. బ్లాక్ ఓటర్లను ఆకర్షించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చెక్ పెట్టే వ్యూహంలో భాగంగా బిడెన్ హారిస్ ను ఎంపిక చేశారు. ఈ విషయాన్నిబిడెన్ ట్విటర్ ద్వారా ధృవీకరించారు. దేశంలోని ...

Read More »

రాయలసీమ ఎత్తిపోతల గురించి షెకావత్‌కు జగన్‌ లేఖ

కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌కు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లేఖ రాశారు. కొద్ది రోజుల క్రితం షెకావత్‌ రాసిన లేఖకు జగన్‌ నేడు సమాధానమిచ్చారు. ఏపీ స్పందన లేదంటూ ఈనెల 7న షెకావత్‌ రాసిన లేఖ కరెక్ట్ కాదని సీఎం అభిప్రాయపడ్డారు. కృష్ణానదీ జలాల ట్రిబ్యునల్‌ కేటాయింపుల ఆధారంగానే ప్రాజెక్ట్‌లు నిర్మిస్తున్నట్లు జగన్ చెప్పారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం పాతవాటికి కొనసాగింపు మాత్రమే అన్నారు. అదనంగా నీటి మళ్లింపు, నీటి నిల్వ, అదనపు ఆయకట్టు లేదని సీఎం స్పష్టం చేశారు. ...

Read More »

ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు ప్రమాణం

ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రమాణ స్వీకారోత్సవం నిరాడంబరంగా జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్, బీజేపీ రాష్ట్ర సహాయ ఇంచార్జ్ సునీల్ డియోదర్, మధుకర్ జీ, పురంధేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ, పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. మాజీ మంత్రి మాణిక్యాలరావు, స్వర్ణపాలెస్ ప్రమాద మృతులకు బీజేపీ నేతలు రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు.బాధ్యతలు స్వీకరించిన అనంతరం సోము వీర్రాజు మాట్లాడుతూ రాష్ట్ర, దేశాభివృద్ధి బీజేపీ లక్ష్యమని పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం ఎన్నో ...

Read More »

దేశంలో మరో 53,601 కరోనా కేసులు

భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. పాజిటివ్ కేసులు, మరణాలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 53,601 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 871మరణాలు సంభవించాయి. దీంతో మొత్తంగా దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 22,68,675కి చేరింది. ఇప్పటి వరకు 45,257 మంది కరోనా బారిన పడి మృతి చెందారు.గడిచిన 24 గంటల్లో 47,746 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 15,83,489 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని కేంద్ర ఆరోగ్య ...

Read More »

గ్రామ, వార్డు సచివాలయాలపై సీఎం జగన్ సమీక్ష

గ్రామ, వార్డు సచివాలయాల్లో మరో కీలక అడుగు పడింది. గ్రామ, వార్డు సచివాలయాల కోసం ప్రత్యేకంగా పీఎంయూ కాల్ సెంటర్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించించారు. యంత్రాంగంలో ఎక్కడ దరఖాస్తు ఆగినా పీఎంయూ అప్రమత్తం చేయనుంది. నిర్దేశించిన సమయంలోగా పరిష్కారం అయ్యేలా పీఎంయూను ఏర్పాటు చేశారు. మొదటగా నాలుగు సర్వీసులు, అక్టోబర్ నుంచి 543కి పైగా సేవలను అమలు చేయనున్నారు.సామాజిక తనిఖీ మార్గదర్శకాలను సీఎం విడుదల చేశారు. మారుమూల ప్రాంతాల్లో సచివాలయాలకు నెట్ సదుపాయాన్ని వైఎస్‌ జగన్‌ ప్రారంభించారు. ఇంటర్నెట్ లేని 512 సచివాలయాలను ...

Read More »