Monthly Archives: August 2020

వైసిపిలో చేరిన పంచకర్ల రమేష్‌బాబు

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు,  మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు వైసిపిలో చేరారు.  తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ సమక్షంలో శుక్రవారం ఆయన వైసిపిలో చేరారు. సిఎం జగన్‌ వైసిపి కండువా కప్పి రమేష్ బాబును పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎంపి విజయసాయిరెడ్డి, మంత్రులు అవంతి శ్రీనివాస్‌, వెల్లంపల్లి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

కరోనా కారణం చూపి ఎన్నికలు వాయిదా వేయలేం : సుప్రీం కోర్టు

 కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా వేయాలని ఆదేశాలు జారీ చేయలేమని, ఈ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘమే నిర్ణయాలు తీసుకుంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బీహార్‌లో కరోనా పూర్తిగా పోయిన తరువాత అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని, అంతవరకు ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను విచారణకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఇంకా నోటిఫికేషన్‌ కూడా వెలువడకముందే ఇటువంటి పిటిషన్‌ దాఖలు చేయడం తొందరపాటు చర్య అని జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. పిటిషనర్‌ అవినాశ్‌ ఠాకూర్‌ స్పందిస్తూ, ప్రజా ప్రాతినిథ్య చట్టం ...

Read More »

ఎపిలో 4 లక్షలకు చేరువలో కరోనా కేసులు

ఎపిలో కరోనా వ్యాప్తి ఏమాత్రమూ తగ్గలేదు. కేసుల సంఖ్య, మరణాల సంఖ్య అంతకంతకూ పెరగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 10,621 కేసులు నమోదవ్వగా.. అదే సమయంలో కరోనాతో బాధపడుతూ 92 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 3,90,195 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 3,633 మంది మృతిచెందారు. ప్రస్త్తుతం 94,209 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 2,95,248 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. గడిచిన 24 గంటల్లో 8,528 మంది కరోనా నుంచి ...

Read More »

నాన్న నెమ్మదిగా కోలుకుంటున్నారు : ఎస్‌పి చరణ్‌

కరోనాతో చెన్నై ఎంజిఆర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ గాయకుడు ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం నిలకడగా ఉంది. ఈ మేరకు ఆయన కుమారుడు ఎస్‌పి చరణ్‌ తెలిపారు. ‘గురువారం నాన్నకు ఫిజియో థెరపీ చికిత్స చేశారు. నాన్న ఆరోగ్యం నిలకడగానే ఉంది. నెమ్మదిగా కోలుకుంటున్నారు. అయితే నాన్నను నేను చూడలేదు. వైద్యుల చికిత్సకు ఆయన స్పందిస్తున్నారు. నాన్నకు చికిత్స అందిస్తున్న ఎంజిఆర్‌ వైద్యులకు, అలాగే నాన్న అభిమానులు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు. భవిష్యత్‌లో మరిన్ని వివరాలు తెలియజేస్తా’ అంటూ చరణ్‌ పేర్కొన్నారు.

Read More »

ఎపిపిఎస్‌సి ఫలితాలు విడుదల

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఎపిపిఎస్‌సి) పలు పోస్టుల కోసం నిర్వహించిన పరీక్షల ఫలితాలను విడుదల చేసింది. రెవెన్యూ శాఖలోని డిప్యూటీ సర్వేయరు, ఎపి టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ సర్వీస్‌లోని టౌన్‌ ప్లానింగ్‌ అండ్‌ బిల్డింగ్‌ ఓవర్‌సిర్‌, పబ్లిక్‌ హెల్త్‌ ల్యాబరేటరీస్‌ అండ్‌ ఫుడ్‌ అడ్మినిస్ట్రేషన్‌లోని ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్‌ పోస్టుల కోసం కమిషన్‌ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పోస్టులకు అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను కమిషన్‌ కార్యదర్శి పిఎస్‌ఆర్‌ ఆంజనేయులు గురువారం విడుదల చేశారు. అర్హత సాధించిన అభ్యర్థుల ...

Read More »

వైసిపిలో చేరనున్న టిడిపి మాజీ ఎమ్మెల్యే రమేష్‌ బాబు

టిడిపి మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌ బాబు రేపు వైసిపిలో చేరనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సమక్షంలో ఆయన వైసిపి కండువా కప్పుకోనున్నారు. విశాఖకు రాజధానిగా టిడిపి వ్యతిరేకించడాన్ని నిరసిస్తూ కొన్ని నెలల కిందటే ఆయన టిడిపికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా వైసిపిలో చేరాలని నిర్ణయించుకున్నారు.

Read More »

అమరావతి రైతులకు వార్షిక కౌలు, పెన్షన్‌ విడుదల

అమరావతి రైతులకు వార్షిక కౌలు, రెండు నెలల పెన్షన్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. వార్షిక కౌలు చెల్లింపునకు రూ.158 కోట్లు, రెండు నెలల పెన్షన్‌ చెల్లింపునకు రూ.9.73 కోట్లు ఆయా రైతులు, రైతు కూలీల ఖాతాల్లో జమ చేయనుంది. ఈ మేరకు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బత్స సత్యనారాయణ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. రాజధాని రైతు కూలీల పెన్షన్‌ రూ.5 వేలకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిందని, కానీ ప్రతిపక్షాలు కోర్టుకు వెళ్లడంతో అది సాధ్యపడలేదని తెలిపారు. అందువల్లే ఈసారి రూ.2,500 ...

Read More »

హీరో సూర్యకు మద్దతుగా నిలిచిన అశ్వనీదత్‌

తెలుగు, తమిళంలో స్టార్‌ ఇమేజ్‌ను సంపాదించుకున్న హీరో సూర్యకు వైజయంతీ మూవీస్‌ అధినేత అశ్వనీదత్‌ మద్దతు తెలిపారు. ఇటీవల సూర్య నిర్మాణంలో జ్యోతిక నటించిన చిత్రాన్ని ఒటిటిలో రిలీజ్‌ చేయడం పట్ల కోలీవుడ్‌ నిర్మాతల మండలి, థియేటర్ల యాజమాన్యం రచ్చ చేసిన సంగతి తెలిసిందే.. అయితే తాజాగా సూర్య నటించిన ”సూరారై పోట్లు (ఆకాశం నీ హద్దురా)” సినిమాను కూడా ఒటిటిలోనే రిలీజ్‌ చేయబోతున్నట్లు ప్రకటించాడు. సూర్య నిర్ణయంపై పలువురు రకరకాలుగా స్పందిస్తున్నారు. సింగం డైరెక్టర్‌ హరి సూర్య నిర్ణయంపై పునరాలోచించాలని సలహా ఇవ్వగా.. ...

Read More »

శుక్రవారం లక్ష్మీదేవిని ఈ స్తోత్రం పారాయణం చేస్తే సంపద !

శ్రావణమాసం.. చివరి శుక్రవారం. ఈరోజు అమ్మవారిని ఆరాధిస్తే సకల శుభాలు. అందులోనూ శ్రీలక్ష్మీదేవిని ఆరాధిస్తే ఐశ్వర్యం ప్రాప్తి. కావల్సిందల్లా భక్తి, శ్రద్ధ. అమ్మవారిని ప్రాతఃకాలంలో, సాయంకాలంలో కింది స్తోత్రంతో పారాయణం చేయండి. తప్పక విశేష లాభాలు కలుగుతాయి. ఆ శ్లోకం వివరాలు. నమస్తేఽస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే |శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోఽస్తు తే ‖ 1 ‖ నమస్తే గరుడారూఢే కోలాసుర భయంకరి |సర్వపాపహరే దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే ‖ 2 ‖ సర్వజ్ఞే సర్వవరదే సర్వ దుష్ట భయంకరి |సర్వదుఃఖ హరే ...

Read More »

కొబ్బరి నూనెలో ఇవి కలిపి రాస్తే జట్టు రాలడం తగ్గి.. బాగా పెరుగుతుంది..

హెయిర్ ఫాల్ సమస్య ఈ మధ్యకాలంలో సర్వసాధారణమైపోయింది. మనలో చాలామంది ఈ సమస్యను ఫేస్ చేస్తున్నారు. అనేక రెమెడీస్ ను ట్రై చేస్తాం. అలాగే వివిధ ఖరీదైన హెయిర్ ప్యాక్స్ ను పాటిస్తాం. హెయిర్ ఫాల్ ను ట్రీట్ చేయడానికి పోషకవిలువలున్న ఆహారం హెల్ప్ చేస్తుందన్న విషయం వాస్తవమే. ఐతే, కొన్ని సార్లు ఈ ఇష్యూ అనేది కుదుళ్ళ నుంచి ప్రారంభం అవుతుంది. కాబట్టి జుట్టు కుదుళ్ళు స్ట్రాంగ్ గా ఉండేలా కేర్ తీసుకోవాలి. అందుకు ముఖ్యమైన విధానం ఇంట్లో తయారుచేసిన హెయిర్ ఆయిల్ ...

Read More »