Monthly Archives: September 2020

డ్రగ్ కేసులో బెయిల్ నిరాకరణ.. హైకోర్టుకు వెళ్తున్న హీరోయిన్లు

కన్నడ సినీ పరిశ్రమలో కలకలం సృష్టించిన డ్రగ్స్ కేసులో హీరోయిన్లు సంజన గల్రాని, రాగిణి ద్వివేది అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. వీరి బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. సంజన, రాగిణికి బెయిల్ మంజూరు చేయడానికి ప్రత్యేక (నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సస్ యాక్ట్) కోర్టు నిరాకరించింది. ఇదే కేసులో నిందితులుగా ఉన్న మరికొంత మంది బెయిల్ పిటిషన్లను ఈరోజు (సెప్టెంబర్ 30న) కోర్టు విచారించనుంది. మరోవైపు ఇదే కేసులో నిందితులుగా ఉన్న శివప్రకాష్, వినయ్ కుమార్‌ల యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్‌ను కూడా కోర్టు తిరస్కరించింది. అలాగే, ఈవెంట్ ...

Read More »

వెంకయ్య నాయుడికి కరోనా పాజిటివ్‌

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడికి కరోనా పాజిటివ్‌ నిర్థారణ అయినట్లు ఉపరాష్ట్రపతి కార్యాలయం నిన్న (మంగళవారం) ట్విట్టర్‌ వేదికగా ప్రకటించింది. ప్రస్తుతం వెంకయ్య నాయుడు ఆరోగ్యంగా ఉన్నారని, ఎలాంటి కరోనా లక్షణాలు లేవని, నిన్న ఉదయం సాధారణంగా కొవిడ్‌-19 పరీక్షలను చేయించుకున్నప్పుడు ఉపరాష్ట్రపతికి కరోనా పాజిటివ్‌ అని తేలిందని వివరించారు. ఆయనను హోం క్వారంటైన్‌లో ఉండాలని వైద్యులు సూచించారు. ఆయన భార్య ఉష కు కరోనా నెగిటివ్‌ వచ్చిందని, ఆమె ఐసొలేషన్‌లోకి వెళ్లారని కార్యాలయం పేర్కొంది.ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడికి కరోనా పాజిటివ్‌ అని తెలియగానే.. దేశవ్యాప్తంగా ...

Read More »

అనంతపురం ఉప్పొంగుతోన్న వాగులు, వంకలు

గత రాత్రి నుండి కురిసిన భారీ వర్షానికి అనంతపురంలోని వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పెద్దవడుగూరు మండలంలోని వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో మిడుతూరు వైపు హైవే పైకి వెళ్లే మార్గంతోపాటు మరో రెండు మార్గాలు జలదిగ్బంధమయ్యాయి. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఉరవకొండ పట్టణంలో తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. పెద్దవడుగూరు మండలంలోని పందుల వాగు పొంగి ప్రవహిస్తుండటంతో పలు గ్రామాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాగు ఉధఅతికి ఆర్టీసీ బస్సు రహదారిపై చిక్కుకుంది. బస్సులో ఉన్న 20 మంది ...

Read More »

ఎపిలో స్కూళ్ల పున:ప్రారంభం మరోసారి వాయిదా!

ఎపిలో అక్టోబరు 5 నుంచి పాఠశాలలు పున్ణప్రారంభించాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం మరోసారి తన నిర్ణయాన్ని వాయిదా వేసుకుంది. స్కూళ్లను నవంబరులో ప్రారంభించాలని తాజాగా నిర్ణయించింది. కరోనా పరిస్థితులు ఇప్పటికీ సద్దుమణగకపోవడంతో ఈ మేరకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. తాజా నిర్ణయం ప్రకారం నవంబర్‌ 2న స్కూళ్లు తెరుచుకోనున్నాయి. పాఠశాలల ప్రారంభంతో సంబంధం లేకుండా జగనన్న విద్యాకానుక పథకాన్ని మాత్రం అక్టోబరు 5న ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఓ ప్రభుత్వ పాఠశాలలో జరిగే కార్యక్రమంలో పాల్గొని సిఎం జగన్‌మోహన్‌ రెడ్డి ఈ పథకాన్ని లాంఛనంగా ...

Read More »

ఆర్‌.ఆర్‌.ఆర్‌లో జూనియర్‌ భీమ్‌, సీతారామ్‌లుగా వీళ్లే !

ప్రముఖ దర్శకుడు ఎస్‌ఎస్‌.రాజమౌళి తెరకెక్కించే సినిమా అంటే ప్రేక్షకుల్లో ఎప్పుడూ ఉత్కంఠ నెలకొంటుంది. ప్రతీ చిత్రంలో ఏదో ఒక కొత్తదనంతో రాజమౌళి ప్రేక్షకులను అలరిస్తుంటారు. ఈ క్రమంలోనే.. ఎస్‌ఎస్‌.రాజమౌళి తెరకెక్కించనున్న ఆర్‌.ఆర్‌.ఆర్‌ (రౌద్రం.రణం.రుధిరం) సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘బాహుబలి’ రచయిత విజయేంద్ర ప్రసాద్‌ కథ రాశారు. ఎంఎం.కీరవాణి బాణీలను జోడించారు. ఈ సినిమాలో అజరు దేవగణ్‌, శ్రియ అతిథి పాత్రల్లో కనిపించి సందడి చేయనున్నారు. వచ్చే ఏడాది ...

Read More »

ఢిల్లీ వరుస విజయాలు.. హైదరాబాద్‌ వరుస పరాజయాలు.. గెలుపెవరిది?

ఐపిఎల్‌ 2020లో భాగంగా అబుదాబిలోని షేక్‌ జాయెద్‌ స్టేడియం మంగళవారం మరో పోరుకు సిద్ధమైంది. రెండు వరుస విజయాలతో ఊపుమీదున్న ఢిల్లీ క్యాపిటల్స్‌.. రెండు వరుస పరాజయాలతో సతమవుతున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో తలపడనుంది. బౌలింగ్‌, బ్యాటింగ్‌లో తిరుగులేని ప్రదర్శనతో ఢిల్లీ దూసుకుపోతుంటే.. అన్ని విభాగాల్లోనూ పేలవ ప్రదర్శన చేస్తూ సన్‌రైజర్స్‌ డీలాపడిపోయింది. ఢిల్లీ గెలిచినా, సన్‌రైజర్స్‌ ఓడినా హ్యాట్రిక్‌ నమోదు కానుంది. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్‌ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ విభాగాల్లో పూర్తిగా ...

Read More »

వైఎస్‌ఆర్‌ జలకళ పథకాన్ని ప్రారంభించిన సిఎం జగన్‌

వైఎస్‌ఆర్‌ జలకళ పథకాన్ని సిఎం జగన్‌ తన క్యాంపు కార్యాలయంలో శనివారం ప్రారంభించారు. 2 లక్షల మంది రైతులకు ఉచితంగా వ్యవసాయ బోర్లను ప్రభుత్వం వేయనుంది. వైఎస్‌ఆర్‌ జలకళ కోసం ప్రభుత్వం రూ.2,340 కోట్లను కేటాయించింది. ఈ సందర్భంగా సిఎం జగన్‌ మాట్లాడుతూ.. రైతులకు ఇచ్చిన మరో హామీకి శ్రీకారం చుట్టామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల బోర్లను తవ్విస్తామన్నారు. రైతులకు ఉచితంగా బోర్లు వేయిస్తున్నామని వెల్లడించారు. రూ.2,340 కోట్ల ఖర్చుతో చిన్న, సన్నకారు రైతులకు బోర్లను వేయించడంతోపాటు మోటార్లను బిగిస్తామన్నారు. ఫీడర్ల కోసం ...

Read More »

డిగ్రీ అర్హత పరీక్ష రాసిన సినీ నటి హేమ

 సినీ నటి హేమ డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ విశ్వ విద్యాలయం డిగ్రీ అర్హత పరీక్ష ను రాశారు. నల్లగొండ నాగార్జున ప్రభుత్వ కళాశాలలో ఈ అర్హత పరీక్ష రాశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆదివారం పది అధ్యయన కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 987 మంది విద్యార్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 580 మంది పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష ఫలితాలు వెంటనే ఆన్‌లైన్‌లో పెడతామని యూనివర్సిటీ డిప్యూటీ డైరెక్టర్‌ డాక్టర్‌ బి.ధర్మానాయక్‌ తెలిపారు. అర్హత సాధించిన అ్యభ్యర్థులు వెంటనే తమకు నచ్చిన అధ్యయన ...

Read More »

బాలూకు ‘భారత్న రత్న’ కోరుతూ జగన్‌ లేఖ

ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యంకు ‘భారతరత్న’ ఇవ్వాలని ఎపి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన ప్రధాని మోడీకి ఒక లేఖ రాశారు. 4 దశాబ్దాల పాటు సినీ సంగీత ప్రపంచానికి ఆయన చేసిన సేవకు గాను భారతరత్నతో సత్కరించాలని కోరారు. కాగా, కరోనా బారిన పడిన ఆయన చెన్నైలోని ఎంజిఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం మరణించిన సంగతి తెలిసిందే. 16 భాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడటంతో పాటు తనదైన ముద్రతో ఆ పాటలకు ...

Read More »

గాన గంధర్వుడికి కన్నీటి వీడ్కోలు.. బాలు అంత్యక్రియలు పూర్తి

అశ్రు నయనాల మధ్య గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు పూర్తయ్యాయి. చెన్నై శివారులోని ఫామ్‌ హౌస్‌లో అంత్యక్రియలను ప్రభుత్వ అధికార లాంఛనాలతో నిర్వహించారు. ఆయనకు సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు అశ్రు నివాళులు అర్పించారు. బాలును కడసారి చూసేందుకు ప్రముఖులు, అభిమానులు పెద్ద ఎత్తున అక్కడకు వెళ్లారు. తమ అభిమాన గాయకుడికి కన్నీటి వీడ్కోలు పలికారు. ఎపి ప్రభుత్వం తరపున మంత్రి అనిల్‌ యాదవ్‌ హాజరై నివాళులు అర్పించారు. సినీ రంగం నుంచి విజరు, భారతీరాజా, దేవీశ్రీప్రసాద్‌, మనో, తదితరులు హాజరయ్యారు.

Read More »