Monthly Archives: September 2020

టీఆర్ఎస్‌ భవన్‌లో జాతీయ జెండా ఆవిష్కరించిన కేటీఆర్

ఇవాళ భారతదేశంలో హైదరాబాద్ రాష్ట్రం విలీనం అయిన రోజు. ఈ సందర్భంగా విలీన దినోత్సవాన్ని పురస్కరించుకుని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. తెలంగాణ భవన్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ జెండాను ఆవిష్కరించారు. 1947 ఆగస్టు 15న బ్రిటిష్ వారి పాలన అంతమై భారతదేశమంతటా స్వాతంత్య్ర సంబరాలు జరుపుకున్నారు. కానీ దేశం నడి బొడ్డున ఉన్న హైదరాబాద్ సంస్థాన ప్రజలకు ఆ అదృష్టం లేకుండా ...

Read More »

ఎపిలో ఎంసెట్‌ పరీక్షలు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌లో ఎంసెట్‌ పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఈ నెల 23 వరకు ఇంజనీరింగ్‌ పరీక్షలు జరగనున్నాయి. 23 నుంచి 25 వరకు మెడిసిన్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ ప్రవేశ పరీక్షలకు ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 118 సెంటర్లను ఏర్పాటు చేసింది. మొత్తం 2,72,900 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనలు విద్యార్థులు తప్పనిసరిగా పాటించాలి. మాస్క్‌ ధరించిన విద్యార్థలను మాత్రమే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ప్రభుత్వం నిర్దేశించిన సమయంలోపు విద్యార్థులు పరీక్ష కేంద్రాల వద్దకు చేరుకోవాలి. ...

Read More »

అల్లు అర్జున్ పై పోలీసులకు ఫిర్యాదు

సినీ హీరో అల్లు అర్జున్‌‌పై సమాచార హక్కు సాధన స్రవంతి ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. ఆయన కరోనా నిబంధనలు పాటించలేదని ఆరోపించారు. అతనిపై చర్యలు తీసుకోవాలంటూ బుధవారం ఆదిలాబాద్‌ జిల్లా నేరడిగొండ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కుంటాల జలపాతం సందర్శనను అధికారులు నిలిపివేసినా అల్లు అర్జున్‌ సహా పుష్ప సినిమా నిర్మాణ బృంద సభ్యులు కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘిస్తూ జలపాతాన్ని సందర్శించడంతోపాటు, తిప్పేశ్వర్‌లో అనుమతులు లేకుండా చిత్రీకరణ చేశారన్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల తన కుటుంబసభ్యులతో పాటు స్నేహితులతో కలిసి కుంటాల జలపాతాన్ని సందర్శించిన సంగతి ...

Read More »

దెబ్బకు వణికిపోయిన బండ్ల గణేష్

కమెడియన్‌గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత నిర్మాతగా మారి ఫుల్ పాపులారిటీ సంపాదించారు బండ్ల గణేష్. ఆ వెంటనే మరో అడుగు ముందుకేసి పాలిటిక్స్ లోకి వెళ్లిన ఆయన.. పొలిటీషియన్‌గా మాత్రం తుస్సుమన్నాడు. ఇక బిజినెస్‌మెన్‌గా, పవన్ కళ్యాణ్ వీరాభిమానిగా మనోడు చెప్పే ప్రతి విషయం ఆసక్తికరంగానే ఉంటూ వార్తల్లో నిలుస్తుంటుంది. ఈ మధ్యకాలంలో అయితే సోషల్ మీడియాలో యమ యాక్టివ్ కావడంతో ఏదో ఒక రూపంలో ఆయనకు సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ కోవలోనే తాజాగా ఓ ఇష్యూ జనాల్లో చర్చనీయాంశంగా ...

Read More »

నితిన్‌ గడ్కరీకి కరోనా

 కేంద్ర మంత్రులంతా వరుసగా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా రోడ్డురవాణా, హైవే, సూక్ష్మ, చిన్న, మధ్య పరిశ్రమల శాఖ మంంత్రి నితిన్‌ గడ్కరీకి కోవిడ్‌-19 సోకింది. ఈ విషయాన్ని బుధవారం సాయంత్రం ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు. ‘ నిన్న ఒంట్లో నలతగా అనిపించి, డాక్టర్‌ను సంప్రదించాను. పరీక్షలు నిర్వహించగా..కోవిడ్‌-19 అని తేలింది. ప్రస్తుతం నా ఆరోగ్యం బాగానే ఉంది. స్వీయ నిర్బంధంలో ఉన్నా’ అని ట్వీట్‌ చేశారు. ఇటీవల కాలంలో తనను కలిసిన వారందరూ జాగ్రత్తగా ఉండాలని, ప్రోటోకాల్‌ అనుసరించాలని, సురక్షితంగా ఉండండి అటూ ...

Read More »

తిరుపతి ఎంపి దుర్గాప్రసాదరావు మృతి

మాజీ మంత్రి, తిరుపతి పార్లమెంట్‌ సభ్యులు బల్లి దుర్గాప్రసాదరావు బుధవారం చెన్నై అపోలో ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. 15 రోజుల క్రితం వెంకటగిరిలోని తన నివాసంలో ఉండగా ఆయనకు తీవ్ర గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అప్పటినుంచి అక్కడే చికిత్స పొందుతున్నారు. అయినా, ఫలితం లేకపోయింది. దుర్గాప్రసాదరావు సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. గురువారం సాయంత్రం నెల్లూరు జిల్లా వెంకటగిరిలో అంతిమ సంస్కారాలు జరగనున్నాయి. ఎంపి మృతి పట్ల చిత్తూరు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ...

Read More »

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల కుదింపు

అసెంబ్లీ వర్షాకాల సమావేశాలపై కూడా కరోనా వైరస్ ప్రభావం పడింది. సభకు వస్తున్న ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులతో పాటు మీడియా సిబ్బందికి సైతం కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీంతో సమావేశాలకు వస్తున్న సభ్యులు కరోనా బారిన పడుతున్నారు. దీంతో వర్షాకాల సమావేశాలు కొనసాగించే అంశంపై ఇప్పుడు చర్చ నడుస్తున్నది. సిబ్బంది కరోనా బారిన పడుతున్న నేపథ్యంలో మండలి చైనర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఈరోజు సమావేశమయ్యారు. వీరిద్దరు అసెంబ్లీ సమావేశాల కుదింపుపై చర్చించినట్లు సమాచారం. ఈ విషయంపై మరోమారు ...

Read More »

భారత్‌లో 50 లక్షలు దాటిన కరోనా కేసులు

 దేశంలో కరోనా విళయతాండవం చేస్తోంది. గడిచిన 24 గంటల్లో 90,123 కేసులు నమోదు కావడంతో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 50,20,360కి చేరింది. అదే సమయంలో 1,290 మరణాలు సంభవించడంతో కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 82,066కు చేరుకుంది. ఒక రోజులో ఇంత పెద్ద సంఖ్యలో మరణించడం ఇదే మొదటిసారి. మరణాల సంఖ్య పెరగుతుండడం అందర్నీ కలవరపెడుతోంది. దేశంలో ఇప్పటి వరకు 39.42 లక్షల మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం 9,95,933 మంది చికిత్స పొందుతున్నారు. గడిచిన 24 గంటల్లో ...

Read More »

కంగనా సెక్యూరిటీ ఖర్చు ఎంతో తెలుసా?

కంగనాకు కేంద్రం భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసింది. ఇదిలా ఉంటే కంగనా సెక్యూరిటీ ఖర్చు ఎంత? ఆ ఖర్చు భరిస్తోంది ఎవరు? అన్న చర్చ మొదలైంది. తాజా సమాచారం ప్రకారం కంగనా సెక్యూరిటీ నెల ఖర్చు రూ.10 లక్షలని తెలిసింది. ఈ భారీ మొత్తాన్ని కంగనా భరించడం లేదట. షాకింగ్‌ విషయం ఏంటంటే ఈ మొత్తాన్ని కేంద్రమే భరిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. శివసేనపై కంగనా తిరుగుబాటును తనకు అనుకూలంగా వాడుకోవాలనే ఉద్దేశంతోనే కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఆమెకు భద్రత ఖర్చులను భరిస్తున్నట్టు వార్తలు ...

Read More »

బిల్‌గేట్స్‌ ఇంట్లో విషాదం

 మైక్రోసాఫ్ట్‌ సహా వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తండ్రి విలియమ్‌ హెన్రీ గేట్స్‌ (94) సోమవారం మృతి చెందారు. హెన్రీగేట్స్‌ 1925 నవంబర్‌ 30న వాషింగ్టన్‌లో జన్మించారు. ‘ఇన్ని సంవత్సరాలు మన జీవితంలో అద్భుతమైన వ్యక్తిని కలిగి ఉండటం అదృష్టంగా భావిస్తున్నాను’ అని బిల్‌గ్రేట్‌ తన బ్లాగ్‌లో రాశారు. ఆయన ఆల్జెమర్స్‌ వ్యాధితో బాధపడుతున్నారని కుటుంబ సభ్యులు మంగళవారం తెలిపారు. ‘ నా తండ్రే నా జీవితంలో నిజమైన బిల్‌ గేట్స్‌. ఆయనలా ఉండేందుకు ప్రతిరోజూ ప్రయత్నిస్తున్నాను. ఆయనను చాలా మిస్‌ ...

Read More »