Monthly Archives: September 2020

రియా చక్రవర్తి బెయిల్‌ తిరస్కరణ

డ్రగ్స్‌ కేసులో గత వారం అరెస్ట్‌ అయిన నటి రియాచక్రవర్తికి ముంబయి కోర్టు బెయిల్‌ను తిరస్కరించింది. కేసు ప్రాథమిక దశలో ఉందని, ఈ సమయంలో రియాను బెయిల్‌పై విడుదల చేస్తే.. ఈ కేసులో ఇతర నిందితులను ప్రభావితం చేయవచ్చని కోర్టు పేర్కొంది. అలాగే సాక్ష్యాధారాలను దెబ్బతీసే అవకాశం ఉందని తెలిపింది. దీంతో నిందితురాలికి  బెయిల్‌ పొందే అర్హతలేదని  సెషన్స్‌ కోర్టు జడ్జి తెలిపారు. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ కోసం డ్రగ్స్‌ను సేకరించడాన్ని నాన్‌ బెయిలబుల్‌ కేసుగా  పేర్కొ‌న్నా‌రు.  ఈ కేసులో స్వాధీనం చేసుకున్న డ్రగ్స్‌ ...

Read More »

25 మంది ఎంపిల‌కు కరోనా..

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల మొదటిరోజున నిర్వహించిన కరోనా పరీక్షల్లో 25 మంది స‌భ్యు‌ల‌కు పాజిటివ్‌గా నిర్థారణైంది. మీనాక్షిలేఖి, అనంత్‌కుమార్‌ హెగ్డే, పర్వేష్‌ సాహిబ్‌ సింగ్‌ వంటి వారు ఈ జాబితాలో ఉన్నారు. కాగా, పార్లమెంటు సమావేశం మొదటిరోజున సుమారు 200 మంది సభ్యులు సభకు హాజరయ్యారు. సందర్శకుల గ్యాలరీలో మరో 30 మంది ఉన్నారు. కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో పలు జాగ్రత్తలు తీసుకున్నారు.

Read More »

హైదరాబాద్‌ టు ముంబయి. బుల్లెట్‌ ట్రైన్‌కు ప్రణాళికలు

హైదరాబాద్‌-ముంబయిని కలుపుతూ బుల్లెట్‌ రైలును నడిపేందుకు కేంద్రం యోచిస్తోంది. త్వరలో దేశవ్యాప్తంగా ఏడు కొత్త బుల్లెట్‌ రైలు ప్రాజెక్టులను చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా ఒక రైలు మార్గాన్ని హైదరాబాద్‌ నుంచి ముంబయికి నిర్మించనుంది. ఈ ఏడు ప్రాజెక్టులకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డిపిఆర్‌)లను సిద్ధం చేయాలని జాతీయ హైస్పీడ్‌ రైలు కార్పొరేషన్‌ను కేంద్రం ఆదేశించింది. ఈ ప్రాజెక్టుల అంచనా వ్యయం దాదాపు రూ.10 లక్షల కోట్లు ఉంటుందని ఓ సీనియర్‌ అధికారి తెలిపారు. దేశంలో తొలి బుల్లెట్‌ ...

Read More »

ప్రియుడితో కలిసి గోవా ట్రిప్‌లో నయనతార!

కథానాయిక నయనతార ప్రస్తుతం గోవా ట్రిప్‌లో ఉన్నారు. ఈ ట్రిప్‌ను ఫుల్‌గా ఎంజారు చేస్తోందట అమ్మడు. సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన ఫొటలోను చూస్తుంటే నిజమే అనిపిస్తుంది. గత కొన్నేళ్లుగా నయనతార, విఘ్నేశ్‌ ప్రేమలో ఉన్నట్లు వార్తలు హల్‌చల్‌ చేశాయి. ఈ విషయాన్ని ఇద్దరూ మీడియా ముందు పరోక్షంగా చెప్పారనుకోండి. నయన్‌తో సన్నిహితంగా ఉన్న ఫొటోలను విఘ్నేశ్‌ తరుచూ పోషల్‌మీడియాలో షేర్‌ చేస్తుండటం కూడా వీరి బంధానికి బలం చేకూరుస్తున్నాయి. ఆ ఫొటోలు చూసిన వారెవరైనా ఇట్టే చెప్పేస్తారు వారు రిలేషన్‌లో ఉన్నారని. ఇప్పుడు ...

Read More »

ఇసెట్‌కు 85.84 శాతం హాజరు

ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టు (ఇసెట్‌)కు 85.84 శాతం విద్యార్థులు హాజరయ్యారు. 36,989 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 31,891 మంది విద్యార్థులు సోమవారం పరీక్ష రాసినట్లు ఎపి ఉన్నత విద్యామండలి సెట్ల కన్వీనరు ఎం.సుధీర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో 72 పరీక్షా కేంద్రాలను, హైదరాబాద్‌లో 3 కేంద్రాలను ఉన్నత విద్యామండలి ఏర్పాటు చేసింది. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు అగ్రికల్చర్‌ ఇంజినీరింగ్‌, బయోటెక్నాలజీ, బిఎస్‌సి మేథమెటిక్స్‌ సిరామిక్‌ టెక్నాలజీ, కెమికల్‌ ఇంజినీరింగ్‌, సివిల్‌ ఇంజినీరింగ్‌, సిఎస్‌ఇ, ఇఇఇ ...

Read More »

ఎన్టీయార్‌ మూవీలో రూ.250 కోట్లతో ఇండో-పాక్‌ యుద్దం సెట్‌

దర్శకధీరుడు రాజమౌళి అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. మల్టీస్టారర్‌ మూవీఁ డివివి దానయ్య దాదాపు రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు . మేజర్‌ షూటింగ్‌ పార్ట్‌ పూర్తయింది. కానీ పలు కీలక సన్నీవేశాలు, అలియా భట్‌, రామ్‌చరణ్‌ల కీలక ఘట్టాలు, ఎన్టీఆర్‌కఁ సంబంధించిన సీన్స్‌, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌కఁ సంబంధించిన సన్నీవేశాలు చిత్రీకరణ బ్యాలెన్స్‌గా ఉందట. త్వరలోనే ఈ సన్నీవేశాలుకు సంబంధించిన షూటింగ్‌ ప్రారంభం కాబోతోంది. ఇదిలా వుంటే ఈ మూవీ తరువాత ...

Read More »

రూపాయి జరిమానా చెల్లించిన ప్రశాంత్‌ భూషణ్‌

కోర్టు ధిక్కరణ కేసులో సుప్రీం కోర్టు విధించిన ఒక రూపాయి జరిమానాను పౌర హక్కుల లాయర్‌ ప్రశాంత్‌ భూషణ్‌ సోమవారం చెల్లించారు. ఈ సందర్భంగా సుప్రీం కోర్టు వెలుపల మీడియాతో మాట్లాడుతూ జరిమానాను చెల్లించానంటే దానర్ధం తాను దోషినంటూ ఇచ్చిన తీర్పును అంగీకరించానని కాదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ తీర్పుకు వ్యతిరేకంగా రివ్యూ పిటిషన్‌ దాఖలు చేసినట్లు చెప్పారు. ఇది కాకుండా, రాజ్యాంగంలోని 129వ అధికరణ కింద తనకు తాను పరిగణనలోకి తీసుకున్న ధిక్కరణ కేసులో ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా ఇంట్రా కోర్టు అప్పీల్‌ ...

Read More »

నేటి నుండి పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు సోమవారం నుండి ప్రారంభకానున్నాయి. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఈ సమావేశాలకు ముందు సాంప్రదాయబద్దంగా నిర్వహించే అఖిల పక్ష సమావేశం రద్దు చేయబడింది. రెండు దశాబ్దాలలో అఖిల పక్ష సమావేశాన్ని రద్దు చేయడం ఇదే మొదటి సారి కావడం గమనార్హం. కాగా, అక్టోబర్‌ 1తో ముగిసే ఈ సెషన్‌ ఎజెండాపై చర్చించేందుకు స్పీకర్‌ ఓంబిర్లా నేతృత్వంలో బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ సమావేశం ప్రారంభమైంది. కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ జోషి, బిజెపి నేత అర్జున్‌ రామ్‌ మేఘవాల్‌, కాంగ్రెస్‌ పార్టీకి చెందిన అధిర్‌ రంజన్‌ ...

Read More »

విజరు దేవరకొండ పేరుతో మోసాలు

టాలీవుడ్‌ హీరో విజరు దేవరకొండ పేరును ఉపయోగించుకొని కొన్ని నిర్మాణ సంస్థలు తప్పుడు ఆడిషన్స్‌ నిర్వహిస్తున్నాయని విజరు దేవరకొండ బృదం పేర్కొంది. అలాంటి వారిని నమ్మి మోసపోవద్దని, విజరు సినిమాకు సంబంధించిన ఆప్‌డేట్స్‌ అధికారికంగా ప్రకటిస్తామని తెలిపింది. విజరు దేవరకొండతో సినిమా తీస్తున్నామంటూ కొన్ని నిర్మాణ సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, ఆయన సినిమాకు ఆడిషన్స్‌ నిర్వహిస్తున్నామంటూ నటీనటులను సంప్రదిస్తున్నాయని పేర్కొన్నారు. అలాంటి నిర్మాణ సంస్థలపై చర్యలు తీసుకోబోతున్నామని తెలిపారు. ‘వరల్డ్‌ ఫేమస్‌’ తరువాత పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో విజరు నటిస్తున్న సంగతి తెలిసిందే. ...

Read More »

ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న నూతన్‌నాయుడి మోసాలు

దళిత యువకుడు శ్రీకాంత్‌కు శిరోముండనం చేసిన కేసులో అరెస్టయిన నూతన్‌నాయుడి మోసాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఉద్యోగాలు, కాంట్రాక్టులు ఇప్పిస్తానని నూతన్‌నాయుడు పలువురిని మోసం చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ప్రభుత్వ రంగ బ్యాంక్‌ డైరెక్టర్‌ పదవి ఇప్పిస్తానని ఓ రియల్టర్‌ దగ్గర నుంచి రూ.12 కోట్లు తీసుకున్నట్లు విచారణలో వెల్లడైంది. మరో వ్యక్తికి అటెండర్‌ ఉద్యోగం ఇప్పిస్తానని ఆ వ్యక్తి నుంచి రూ.5 లక్షలు వసూలు చేసినట్లు తేలింది. ఇప్పటికే శిరోముండనం కేసులో నూతన్‌ నాయుడి భార్య మధుప్రియ సహా ఏడుగురు అరెస్టయిన ...

Read More »