Monthly Archives: October 2020

రాగల 4, 5 గంటల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు..

రాగల 4, 5 గంటల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. ఐఎండి వాతావరణ సూచనల మేరకు.. రాగల నాలుగైదు గంటలు అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముంది. విశాఖ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, ప్రకాశం, కడప, అనంతపురం, కర్నూలు పలుచోట్ల తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది. భారీ ...

Read More »

వరద ప్రభావిత ప్రాంతాల్లో జగన్ ఏరియల్ సర్వే

 వాగులు, వంకలు పొంగిపొర్లడంతో వరదనీరు ముంచెత్తింది. వేలాది ఎకరాల్లో చేతికి రావల్సిన పంట దెబ్బతింది. భారీ వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు, పరిశీలించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏరియల్ సర్వే చేశారు. ఇప్పటికే  పలుసార్లు అధికారులు, మంత్రులతో సమీక్ష నిర్వహించారు. అటు వరద కారణంగా నష్టపోయిన రాష్ట్రానికి సహాయం చేయాలని కేంద్రానికి లేఖ రాశారు. ప్రాధమిక అంచనా ప్రకారం  4 వేల 450 కోట్ల నష్టం వాటిల్లిందని..తక్షణ సహాయంగా 2 వేల 250 కోట్లు విడుదల చేయాల్సిందిగా కేంద్ర హోంమంత్రి అమిత్ ...

Read More »

శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి

శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 4,01,818 క్యూసెక్కుల భారీ వరద వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు పది గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. అవుట్‌ ఫ్లో 4,96,497గా ఉంది. అలాగే ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 883.80 అడుగులకు చేరింది. ప్రాజెక్ట్‌ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలకు.. ప్రస్తుతం నీటి నిల్వ 208.72 టీఎంసీ లుగా నమోదు అయ్యింది. మరోవైపు కుడిగట్టు జలవిద్యుత్‌ కేంద్రంలో ...

Read More »

మోహన్‌బాబు చేతికి ‘ఆండ్రాయిడ్‌ కట్టప్ప’

ఆహా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఆండ్రాయిడ్‌ కట్టప్ప’ సినిమా రీమేక్‌ హక్కులను మోహన్‌బాబు సొంతం చేసుకున్నారు. ఆ సినిమాలో ప్రధానపాత్రధారిగా కనిపించేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. కథ ప్రకారం విదేశాల్లో ఉన్న కొడుకు తండ్రి బాగోగులు చూసుకునేందుకు ఓ రోబోను సిద్ధం చేస్తాడు. కొడుకు స్థానంలో వచ్చిన ఆ రోబోపై తండ్రి చాలా అభిమానం పెంచుకుంటాడు. సినిమాలో వృద్ధుడికి, రోబోకు మధ్య చాలా ఆసక్తికర సన్నివేశాలు ఉంటాయి. ఆ వృద్ధుడి పాత్రలోనే మోహన్‌ బాబు నటిస్తారు.

Read More »

‘నిన్నిలా నిన్నిలా’ ఫస్ట్‌లుక్‌

భద్రం ఫేమ్ అశోక్‌ సెల్వన్‌ – నిత్యామీనన్‌ – రీతూవర్మ హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న ‘నిన్నిలా నిన్నిలా’ సినిమా టైటిల్‌ ఫస్ట్‌లుక్‌ను, పోస్టర్‌ ని చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. బాపినీడు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌ పై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ రొమాంటిక్‌ కామెడీ ఎంటర్టైనర్‌ ద్వారా ఐ.వి.శశి అనే యువ దర్శకుడు పరిచయం అవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలను జరుపుకుంటోంది.

Read More »

డైరెక్టర్‌గా మారిన లేడీ విలన్.. ఫస్ట్‌లుక్ అదుర్స్

సీనియర్ హీరో శరత్‌కుమార్ వారసురాలిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వరలక్ష్మి నటిగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. తొలినాళ్లలో హీరోయిన్‌గా పలు సినిమాల్లో నటించినా బరువు పెరగడంతో అవకాశాలు సన్నగిల్లాయి. దీంతో రూటు మార్చి విలనిజం చూపించడం మొదలుపెట్టింది. దీంతో లేడీ విలన్‌గా ఆమెకు తెలుగు, తమిళ భాషల్లో ఇప్పుడు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. అయితే నటనపై బోరు కొట్టిందో ఏమో వరలక్ష్మి ఇప్పుడు డైరెక్టర్ అవతారమెత్తింది.

Read More »

నవరాత్రులు ఎలా వచ్చాయో తెలుసా..?

పరమేశ్వరుడు లోకానికి ఆదిదేవుడు. ఈ స్వామివారికి పెళ్లాడానికి పార్వతీదేవి తపస్సు చేస్తారు. ఆ తపస్సుతో ప్రీతిచెంది శివుడు పార్వతీదేవిని పెళ్లి చేసుకుంటారు. పూర్వం దేవతలలో భండాసురుడనే రాక్షసుడు ఉండేవాడు. అతని శివుడు భార్యయైన పార్వతీదేవిని తన సొంతం చేసుకోవాలనుకుంటాడు. అప్పుడు పార్వతీ ఆదిపరాశక్తిగా మారి ఆ రాక్షసుని ఖండించి చంపేస్తారు. అలా మెుదలైన ఈ యుద్ధం పాడ్యమి నుండి నవమి వరకు ఒక్కొక్కరిని వధించసాగారు దుర్గాదేవి. ఆ శక్తితో ఆమె వివిధ శక్తులు నవదుర్గలుగా అవతారాలెత్తుతారు. ఆ అవతారాలే ఇవి.. శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, ...

Read More »

నవరాత్రులు…తొమ్మిది రంగులు…ఏంటి వాటి ప్రత్యేకత?

దసరా నవరాత్రులు. భక్తులకు సందడే సందడి. పూజలు..వ్రతాలు..ఉపవాసాలు ఇలా మహిళలు దసరా పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ముగ్గురమ్మల గన్న మూలపుటమ్మ దుర్గామాతని ఒక్కోరోజు ఒక్కో అవతారంలో కొలుస్తాం. ఈ సందర్భంగా నవరాత్రులు నడిచే తొమ్మిదిరోజులకూ భక్తులు ఒక్కోరోజు ఒక్కో రంగు దుస్తుల్ని ధరించాలని పురాణాలు చెబుతున్నాయి. దసరా నవరాత్రుల్లో అమ్మవారిని తొమ్మిది రూపాల్లో పూజిస్తూ ఉంటారు. లోకకల్యాణం కోసం అమ్మవారు ఒక్కోరోజు ఒక్కో రూపాన్ని ధరించింది. అందువలన అలా అమ్మవారు అవతరించిన రోజున, ఆ రూపంతో అమ్మవారిని అలంకరించి ఆ ...

Read More »

రాష్ట్రంలో నేడు, రేపు అతిభారీ వర్షాలు..

రాష్ట్రంలో నేడు, రేపు అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. వాతావరణ కేంద్ర అధికారిణి డైరెక్టర్‌ స్టెల్లా మాట్లాడుతూ.. తూర్పు మధ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, దీని ప్రభావంతో నేడు అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్నారు. రాగల 24 గంటల్లో అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని తెలిపారు. దీని ప్రభావంతో సోమవారం కోస్తాలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలతోపాటు రేపు అతి భారీ వర్షాలు కురిసే ...

Read More »

కరోనా నాల్గవ దశ మరింత ప్రమాదకరం

 ప్రపంచ వ్యాప్తంగా కేసుల సంఖ్య 40 లక్షల మార్కును దాటడంతో.. కరోనా మహమ్మారి నాల్గవ దశ (తీవ్ర ఉధృతి) లోకి ప్రవేశించిందని అంటువ్యాధుల నిపుణులు పేర్కొంటున్నారు. యూరోపియన్‌ దేశాల్లో రెండో దశలో, అమెరికాలో మూడవ దశలో ఉండగా, భారత్‌, దక్షిణ అమెరికాలు మొదటి దశ ముగింపులో ఉన్నాయని అన్నారు.2019 డిసెంబర్‌, 2020 ప్రారంభంలో చైనాలో కరోనా మహమ్మారి మొదటి దశ ప్రారంభమైంది. అయితే ఫిబ్రవరి చివరి నాటికి చైనా కరోనా వ్యాప్తిని నివారించగలిగింది. దీంతో మొదటిదశ ముగిసింది. యూరప్‌లో మార్చిలో రెండో దశ ప్రారంభమైందని, ...

Read More »