Monthly Archives: October 2020

తెలుగు రాష్ట్రాలకు శుభవార్త…పండుగ వేళ ప్రత్యేక రైళ్లు

దసరా పండుగ వేళ.. ప్రయాణీకుల సౌకర్యార్థం రైల్వే శాఖ దేశవ్యాప్తంగా 666 మెయిల్‌ / ఎక్స్‌ప్రెస్‌ లను ప్రత్యేకంగా నడపనుంది. కరోనా నేపథ్యంలో.. చాలా వరకు రైళ్ల సర్వీసులను నిలిపేసిన రైల్వే శాఖ .. ప్రస్తుతం పండుగ నేపథ్యంలో.. దేశవ్యాప్తంగా 392 ప్రత్యేక రైళ్లను ఈనెల 20 వ తేదీ నుండి వచ్చే నెల 30 మధ్య నడపనుంది. వీటికి అదనంగా 50 రోజులపాటు పండుగ ప్రత్యేక రైళ్లు కూత పెట్టనున్నాయి. కేవలం పండుగ నేపథ్యంలో.. ఈ సర్వీసులను అందిస్తున్నామని, నవంబర్‌ 30 తర్వాత ...

Read More »

దారిద్ర్య బాధలు పోవాలంటే ఇలా చేయండి !

మానవ జీవితంలో దారిద్య్రాలు అనేక రకాలు. సంపద లేక కొందరు, ఆరోగ్యం లేకుండా, సంతానం లేక ఇలా అనేక రకాల దారిద్య్రాలు ఉంటాయి. వీటినించి విముక్తి పోవడానికి పూర్వీకులు చెప్పిన పరిహారాలలో సులభమైనది, ఖర్చులేనిది తెలుసుకుందాం.. ప్రతి రోజూ పఠించాల్సిన దారిద్ర్య విమోచక స్తోత్రం.. జగన్మాత శ్రీమహాలక్ష్మీ స్మరణం అన్ని రకాలైనటువంటి దారిద్ర్యాల నుంచి విముక్తి కలిగిస్తుంది. దీనికోసం లక్ష్మీదేవి 108 నామాలైన “శ్రీలక్ష్మీ అష్టోత్తర శతనామా” లను నిత్యం చదివితే, సర్వ దరిద్రాలు తొలుగుతాయని, సాక్షాత్తూ ఆ పరమేశ్వరుడే పార్వతీదేవికి వివరించాడు. ముందుగా ...

Read More »

కుంకుడుకాయలతో తలస్నానం చేస్తే జుట్టు పెరుగుతుందా..

కుంకుడు కాయల రసం నాచురల్ షాంపూగా పని చేస్తుంది. జుట్టుకి పోషణనిస్తుంది. దాంతో, జుట్టు మెరుస్తూ ఉంటుంది. జుట్టు ఒత్తుగా కూడా పెరుగుతుంది. కుంకుడుకాయల్లో ఉన్న విటమిన్స్ వల్ల జుట్టు డ్రై గా అవ్వకుండా ఉంటుంది. సిల్కీ, స్మూత్ హెయిర్ మీ సొంతమవుతుంది. స్కాల్ప్ మీద ఫంగస్ పెరగడం వల్ల చుండ్రు సమస్య వస్తుంది. కుంకుడు కాయలు స్కాల్ప్ ని పూర్తిగా శుభ్రపరుస్తాయి. దాంతో స్కాల్ప్ మీద ఫంగల్ గ్రోత్ ఉండదు. రెగ్యులర్‌గా కుంకుడుకాయలతోనే తలస్నానం చేస్తూ ఉండడం వల్ల చుండ్రు సమస్య పూర్తిగా ...

Read More »

తేనె vs బెల్లం.. బరువు తగ్గేందుకు, డయాబెటిక్స్‌కు ఏది ఉత్తమం?

మన భారతీయ వంటకాల్లో ఎక్కువగా బెల్లాన్నే ఉపయోగిస్తారనే సంగతి తెలిసిందే. మన పూర్వికులు కూడా చక్కెరకు బదులుగా బెల్లాన్నే వాడేవారు. అందుకే.. అప్పటివారు ఇప్పటికీ స్ట్రాంగ్‌గా ఉంటున్నారు. బెల్లంలో పోటాషియం, మెగ్నీషియం, విటమిన్ B1, B6తోపాటు విటమిన్-C కూడా ఉంటుంది. కడుపులోని విషతుల్యాలను బయటకు పంపేసే మంచి ఫైబర్ కూడా ఇందులో ఉంది. దీనివల్ల జీర్ణ వ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. ఆయుర్వేద వైద్యులు.. ఒక కప్పు వెచ్చని నీటిలో బెల్లం కలుపుకుని తాగితే మంచిదని చెబుతుంటారు. కొంతమంది భోజన తర్వాత కొన్ని బెల్లం నీళ్లు ...

Read More »

బీజేపీలో చేరనున్న హీరో విజయ్ తండ్రి

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ గెలుపు వ్యూహాలు రూపొందిస్తోంది. ఈ క్రమంలోనే ప్రముఖులను తమ పార్టీలోకి ఆహ్వానిస్తూ దూసుకుపోతోంది. ముఖ్యంగా సినీ ప్రముఖులపై ఎక్కువ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే గౌతమి, రాధారవి, కస్తూరి రాజా, గాయత్రి రఘురామ్ వంటి వారికి గాలం వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మరో ప్రముఖ వ్యక్తి బీజేపీలోకి వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఆయనెవరో కాదు తమిళ సూపర్‌స్టార్ విజయ్ తండ్రి, దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్. అవును చంద్రశేఖర్ బీజేపీలో చేరనున్నారని ఓ ...

Read More »

దసరా తర్వాత ఆంగ్ల మాధ్యమం పిటిషన్‌పై విచారణ…

ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టాలన్న అంశంపై సుప్రీంకోర్టులో విచారణ మంగళవారం వాయిదా పడింది.  ప్రభుత్వ పాఠశాల్లో ఆంగ్ల మాధ్యమం అమలు చేయాలని రాష్ట్రప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు కొట్టివేసింది. అయితే,  హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బొబ్డే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. దసరా సెలవుల తర్వాత విచారణ జరుపుతామని ధర్మాసనం స్పష్టం చేసింది.

Read More »

తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత.. నేతలు అరెస్ట్‌..

తెలంగాణ శాసనసభ ప్రత్యేక సమావేశాలు మంగళవారం ప్రారంభమైన నేపథ్యంలో.. జిహెచ్‌ఎంసి చట్ట సవరణను వ్యతిరేకిస్తూ, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ఉద్యోగాల భర్తీ కోసం అసెంబ్లీ ముట్టడికి బిజెపి, సిపిఐ, నిరుద్యోగ సంఘాల నేతలు, కార్యకర్తలు ప్రయత్నించారు. దీంతో వారిని పోలీసులు అదుపుచేసే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.రిజర్వేషన్లు ఖరారు చేయకుండా జిహెచ్‌ఎంసి ఎన్నికలను నిర్వహించకూడదంటూ బిజెపి నేతలు డిమాండ్‌ చేశారు. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను అర్హులందరికీ ఇవ్వాలని సిపిఐ నేతలు డిమాండ్‌ చేశారు. ఉద్యోగ నోటిఫికేషన్లను వెంటనే విడుదల ...

Read More »

కోస్తాంధ్రను వణికిస్తోన్న వాయుగుండం

మంగళవారం ఉదయం 6.30 గంటల నుండి 7.30 గంటల మధ్య కాకినాడ సమీపంలో తీవ్ర వాయుగుండం తీరాన్ని దాటినట్లు విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్‌ కన్నబాబు తెలిపారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉభయ గోదావరి జిల్లాలతోపాటు విశాఖ, కృష్ణా జిల్లాలపై దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. తీరం వెంబడి గంటలకు 65 నుండి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి.అలల ఉధృతి ఎక్కువగా ఉండటంతో సముద్రంలోకి మత్స్యకారులెవ్వరూ వేటకు వెళ్లకూడదని మంత్రి కన్నబాబు ...

Read More »

శోభన్‌బాబు బయోపిక్‌ .. హీరో ఎవరంటే..

ఇప్పటికే టాలీవుడ్‌లో జీవిత కథల ఆధారంగా పలు బయోపిక్‌లు తెరకెక్కాయి. ఈ బాటలోనే టాలీవుడ్‌ హీరో శోభన్‌బాబు జీవిత కథ ఆధారంగా మరో బయోపిక్‌ తెరకెక్కబోతున్నట్లు సమాచారం. కాగా, శోభన్‌బాబు పాత్రలో దగ్గుపాటి రాణా నటించబోనున్నట్లు సమాచారం. రాణా ప్రస్తుతం గుణశేఖర్‌ దర్శకత్వం వహిస్తున్న హిరణ్యకశ్యప చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్‌ దశలో ఉంది. మరి ఈ సమయంలో రాణా శోభన్‌బాబు బయోపిక్‌లో నటిస్తారా? లేదా అనేదానిపై స్పష్టతనివ్వాల్సి వుంది.

Read More »

రాష్ట్రాలకు ప్రత్యేక ప్యాకేజీ .

కరోనా మహమ్మారి కారణంగా కుదేలైన ఆర్థికవ్యవస్థకు ఊతం అందించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ రాష్ట్రాలకు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించారు. మూలధన వ్యయ ప్రాజెక్టుల కింద రాష్ట్రప్రభుత్వాలకు రూ. 12వేల కోట్లను 50 ఏళ్ల వడ్డీ లేని రుణాన్ని అందిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మొత్తంలో రూ.1600కోట్లను ఈశాన్యరాష్ట్రాలకు, రూ.900 కోట్లను ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లకు ఇస్తున్నట్లు తెలిపారు. మిగిలిన రూ. 7500 కోట్లను మిగిలిన రాష్ట్రాలకు అందిస్తున్నట్లు తెలిపారు. ముందుగా ప్రకటించిన సంస్కరణలను ప్రవేశపెట్టిన రాష్ట్రాలకు రూ.2000వేల కోట్లు ఇవ్వబడుతుందని అన్నారు. ఈ ...

Read More »