Monthly Archives: November 2020

తీరం దాటిన తుపాను…పలు చోట్ల భారీ వర్షాలు

నివర్‌..షివర్‌ పుట్టిస్తోంది. పుద్చుచేరి సమీపంలో తీరం దాటి అతి తీవ్ర తుపాను నుండి తీవ్ర తుపానుగా బలహీనపడింది. బుధవారం రాత్రి 11.30 గంటల నుంచి, గురువారం తెల్లవారు జామున 2.30 గంటల మధ్య నివర్‌ తుపాన తీరం దాటినట్లు వాతావరణ శాఖ పేర్కొంది. తుపాను అలజడికి తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. చలికి తోడు, వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు బెంబెలెత్తుతున్నారు. తుపాను తీరం దాటాక గంటకు 120-145 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు పేర్కొన్నారు. ...

Read More »

నివర్‌ తుఫాన్.. భారీగా కురుస్తున్న వర్షాలు

నివర్‌ తుపాన్‌ బుధవారం తీరం దాటింది. పుద్చుచేరి సమీపంలో తీరం దాటి అతి తీవ్ర తుపాను నుండి తీవ్ర తుపానుగా బలహీనపడింది. బుధవారం రాత్రి 11.30 గంటల నుంచి, గురువారం తెల్లవారు జామున 2.30 గంటల మధ్య నివర్‌ తుపాన తీరం దాటినట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఈదురుగాలులు 100-110కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, అవి గంటకు 120 వేగం వరకు పుంజుకుంటాయని వాతారణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు భారత్‌లో వచ్చిన ఏడు రకమైన తుపానుల్లో..ఇది ఐదవదని, బలమైనదని చెప్పారు. ...

Read More »

పెను తుఫానుగా నివర్‌..

బంగాళాఖాతంలో కొనసాగుతున్న నివర్‌ తుఫాను మరికొన్ని గంటల్లో పెను తుఫానుగా మారనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బుధవారం అర్థరాత్రికి లేదా గురువారం ఉదయానికి కరైకల్‌-మమల్లపురం వద్ద తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. బుధవారం సాయంత్రం కడలూరుకి 180 కిమీలు, పుదుచ్చేరికి 190 కిమీల దూరంలో తుఫాను కేంద్రీకృతమై ఉన్నట్లు తెలిపింది. తుపాను గంటకు 11 కిమీల వేగంతో తీరం వైపుగా కదులుతున్నట్లు తెలిపింది. కొన్ని గంటల్లో పెను తుఫానుగా మారుతుందని తెలిపింది. తీరం దాటే సమయంలో గాలుల వేగం 120 కిమీల నుంచి ...

Read More »

ఆస్కార్‌ బరిలో ‘జల్లికట్టు’

మరో మలయాళ చిత్రం తన సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. లిజో జోసి పెల్లిస్సెరీ దర్శకత్వం వహించిన ‘జల్లికట్టు’ చిత్రం 93వ ఆస్కార్‌ పురస్కారాల పోటీకి భారతదేశం తరపున వెళ్లనుంది. ఉత్తమ చిత్రాల పోటీలో నిలవనుంది. ”శకుంతలాదేవి, గుంజన్‌ సక్సేనా, ఛపాక్‌, గులాబో సితాబో, చెక్‌పోస్ట్‌, స్కై ఈజ్‌ పింక్‌.. వంటి 27 చిత్రాలను పరిశీలించిన అనంతరం జల్లికట్టును ఎంపిక చేసినట్లు ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా జ్యూరీ బోర్డ్‌ చైర్మన్‌ రాహుల్‌ రావైల్‌ తెలిపారు. మనుషుల్లో దాగున్న క్రూరత్వాన్ని, జంతువుల పట్ల మానవుల తీరును ...

Read More »

దేశంలో మళ్లీ కరోనా విజృంభణ

దేశంలో కరోనా తగ్గుముఖం పట్టినట్లు పట్టి, మళ్లీ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో నమోదైన గణాంకాలే అందుకు నిదర్శనం. గత 24 గంటల్లో దేశంలో 44, 376 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 92, 22, 217కు చేరువైంది. గడిచిన 24 గంటల్లో 37, 816 మంది కోలుకోగా, మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య కూడా 86 లక్షలను దాటింది. అదేవిధంగా 481 మంది మృతి చెందగా, ఇప్పటి వరకు 1,34, 699 మంది కరోనాకు బలయ్యారు. భారత్‌లో ...

Read More »

తమిళనాడును వణికిస్తున్న ‘నివర్‌’..

 ‘నివర్‌’ తుపాన్‌ తమిళనాడును వణికిస్తోంది. అతి తీవ్ర తుపాన్‌గా మారి తమిళనాడు, పుదుచ్చేరి మీదుగా ముంచుకొస్తోంది. ఆంధ్రప్రదేశ్‌కు ‘నివర్‌’ ప్రభావం ఉండటంతో ఎపిలోని తుపాన్‌ ప్రభావిత కొన్ని జిల్లాల్లో అధికారులు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. సముద్రంలో ఉష్ణోగ్రతలు, గాలిలో తేమ ఉండటంతో తుపాన్‌ మరింత బలపడుతూ తీరంవైపుగా వస్తోంది. చెన్నైకి ఆగేయంగా 330 కిలోమీటర్ల దూరంలో నివర్‌ తుపాన్‌ కొనసాగుతోంది. తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్‌ వైపు దూసుకొస్తోంది. బుధవారం సాయంత్రం కరైకల్‌, మామళ్లపురం మధ్య తీరాన్ని తాకుతుందని, తీరం దాటే సమయంలో తుపాన్‌ మరింత ...

Read More »

నివర్‌ తుపాను పై సిఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌

 బంగాళాఖాతంలో ఏర్పడిన నివర్‌ తుపాన్‌పై జిల్లా కలెక్టర్లు, ఎస్పీ లు, అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. తుపాను నేరుగా ఎపి ని తాకకపోయినా, సమీప ప్రాంతంలో దాని ప్రభావం ఉంటుందని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సిఎం సూచించారు. ఈ తుపాను ప్రభావం బుధవారం నుంచి గురువారం వరకు ఉంటుందని, సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని రకాలుగా సన్నద్ధం కావాలని అధికారులను ఆదేశించారు.

Read More »

ప్రేమలో పడిన అమీర్‌ఖాన్‌ కుమార్తె

బాలీవుడ్‌ స్టార్‌ హీరో అమీర్‌ఖాన్‌ కుమార్తె ఐరాఖాన్‌ ప్రేమలో పడినట్లు వార్తలొస్తున్నాయి. గత కొన్నేళ్లుగా అమీర్‌ఖాన్‌కు ఫిట్‌నెస్‌ ట్రైనర్‌గా వ్యవహరిస్తున్న నపూర్‌… ఐరాఖాన్‌కు కూడా లాక్‌డౌన్‌ నుంచి ఫిట్‌నెస్‌ కోచ్‌గా మారారు. ఈ క్రమంలోనే నపూర్‌ వ్యక్తిత్వం ఐరాకు నచ్చడంతో.. అతనితో ప్రేమలో పడినట్లు… వీరిద్దరూ కొన్ని నెలలుగా డేటింగ్‌లో ఉన్నటు ప్రచారం సాగుతోంది. ఇప్పటికే ప్రేమ విషయాన్ని ఐరా తల్లికి చెప్పగా.. ఆమె కూడా అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. దీంతో ఈ జంట ఇటీవల అమీర్‌ఖాన్‌ ఫామ్‌హౌస్‌లో స్నేహితులతో కలిసి పార్టీ కూడా ...

Read More »

కంగనా రనౌత్‌కు ఊరట

దేశ ద్రోహం కేసులో బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌కు ఉపశమనం కలిగింది. ఈ కేసులో కంగనాతో పాటు ఆమె సోదరి రంగోలి ఛాందెల్‌లకు అరెస్టు నుంచి మధ్యంతర రక్షణ కల్పిస్తూ బాంబే హైకోర్టు మంగళవారం ఉత్తర్వులు వెలువరించింది. వచ్చే ఏడాది జనవరి 8 న ముంబయి పోలీసుల ముందు విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ముంబైలోని బాంద్రా మేజిస్ట్రేట్‌ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు అనుగుణంగా వీరిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. కంగనా, ఆమె సోదరి సోషల్‌ మీడియాలో పోస్టుల ద్వారా విద్వేషం, మత ఉద్రిక్తతను ...

Read More »

కుటుంబసభ్యులతో కలసి తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్రపతి

తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని మంగళవారం ఉదయం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కుటుంబసభ్యులతో కలసి దర్శించుకున్నారు. రాష్ట్రపతి వెంట రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ఉన్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న రాష్ట్రపతి దంపతులకు టిటిడి ఛైర్మన్‌ వైవి.సుబ్బారెడ్డి, జెఈవో పి.బసంత్‌కుమార్‌, ఆగమ సలహాదారులు శ్రీనివాసాచార్యులు, అర్చక బృందంతో కలిసి ఇస్తికఫాల్‌ స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం వస్త్రం, తీర్థప్రసాదాలను వారికి ఛైర్మన్‌ అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ నారాయణ భరత్‌ గుప్తా, ఇంటెలిజెన్స్‌ ఐజి శశిధర్‌ రెడ్డి, టిటిడి సివిఎస్‌ఒ గోపినాథ్‌ జెట్టి, ...

Read More »