Monthly Archives: November 2020

నివర్‌ తుపాను పై సిఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌

 బంగాళాఖాతంలో ఏర్పడిన నివర్‌ తుపాన్‌పై జిల్లా కలెక్టర్లు, ఎస్పీ లు, అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. తుపాను నేరుగా ఎపి ని తాకకపోయినా, సమీప ప్రాంతంలో దాని ప్రభావం ఉంటుందని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సిఎం సూచించారు. ఈ తుపాను ప్రభావం బుధవారం నుంచి గురువారం వరకు ఉంటుందని, సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని రకాలుగా సన్నద్ధం కావాలని అధికారులను ఆదేశించారు.

Read More »

ప్రేమలో పడిన అమీర్‌ఖాన్‌ కుమార్తె

బాలీవుడ్‌ స్టార్‌ హీరో అమీర్‌ఖాన్‌ కుమార్తె ఐరాఖాన్‌ ప్రేమలో పడినట్లు వార్తలొస్తున్నాయి. గత కొన్నేళ్లుగా అమీర్‌ఖాన్‌కు ఫిట్‌నెస్‌ ట్రైనర్‌గా వ్యవహరిస్తున్న నపూర్‌… ఐరాఖాన్‌కు కూడా లాక్‌డౌన్‌ నుంచి ఫిట్‌నెస్‌ కోచ్‌గా మారారు. ఈ క్రమంలోనే నపూర్‌ వ్యక్తిత్వం ఐరాకు నచ్చడంతో.. అతనితో ప్రేమలో పడినట్లు… వీరిద్దరూ కొన్ని నెలలుగా డేటింగ్‌లో ఉన్నటు ప్రచారం సాగుతోంది. ఇప్పటికే ప్రేమ విషయాన్ని ఐరా తల్లికి చెప్పగా.. ఆమె కూడా అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. దీంతో ఈ జంట ఇటీవల అమీర్‌ఖాన్‌ ఫామ్‌హౌస్‌లో స్నేహితులతో కలిసి పార్టీ కూడా ...

Read More »

కంగనా రనౌత్‌కు ఊరట

దేశ ద్రోహం కేసులో బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌కు ఉపశమనం కలిగింది. ఈ కేసులో కంగనాతో పాటు ఆమె సోదరి రంగోలి ఛాందెల్‌లకు అరెస్టు నుంచి మధ్యంతర రక్షణ కల్పిస్తూ బాంబే హైకోర్టు మంగళవారం ఉత్తర్వులు వెలువరించింది. వచ్చే ఏడాది జనవరి 8 న ముంబయి పోలీసుల ముందు విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ముంబైలోని బాంద్రా మేజిస్ట్రేట్‌ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు అనుగుణంగా వీరిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. కంగనా, ఆమె సోదరి సోషల్‌ మీడియాలో పోస్టుల ద్వారా విద్వేషం, మత ఉద్రిక్తతను ...

Read More »

కుటుంబసభ్యులతో కలసి తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్రపతి

తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని మంగళవారం ఉదయం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కుటుంబసభ్యులతో కలసి దర్శించుకున్నారు. రాష్ట్రపతి వెంట రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ఉన్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న రాష్ట్రపతి దంపతులకు టిటిడి ఛైర్మన్‌ వైవి.సుబ్బారెడ్డి, జెఈవో పి.బసంత్‌కుమార్‌, ఆగమ సలహాదారులు శ్రీనివాసాచార్యులు, అర్చక బృందంతో కలిసి ఇస్తికఫాల్‌ స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం వస్త్రం, తీర్థప్రసాదాలను వారికి ఛైర్మన్‌ అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ నారాయణ భరత్‌ గుప్తా, ఇంటెలిజెన్స్‌ ఐజి శశిధర్‌ రెడ్డి, టిటిడి సివిఎస్‌ఒ గోపినాథ్‌ జెట్టి, ...

Read More »

రాంగోపాల్‌ వర్మకు తెలంగాణ హైకోర్టు షోకాజ్‌ నోటీసులు

దిశ ఎన్‌ కౌంటర్‌ చిత్రాన్ని ఆపాలంటూ.. దిశ ఘటన నిందితుల కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో.. దర్శకుడు రాంగోపాల్‌ వర్మకు తెలంగాణ హైకోర్టు షోకాజ్‌ నోటీసులను జారీ చేసింది. దిశా ఎన్‌ కౌంటర్‌ మృతుల కుటుంబాలు ఇప్పటికే మనోవేదనకు గురవుతున్నాయని పిటిషనర్‌ తరపు న్యాయవాది కృష్ణమూర్తి కోర్టుకు తెలిపారు. ఇప్పుడు ఈ సినిమా తీసి వారిని గ్రామంలో కూడా ఉండనివ్వకుండా చేస్తున్నారని కోర్టుకు చెప్పారు. ఈ సినిమాలో వారిని దోషులుగా చూపే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. దిశ ఎన్‌ కౌంటర్‌ చిత్రం విడుదల ...

Read More »

చిన్నారులు, మహిళల కోసం ‘అభయం’

మహిళలు, చిన్నారుల కోసం అభయం ప్రాజెక్టును తీసుకొచ్చినట్లు ముఖ్యమంత్రి వైఎస్‌. జగన్మోహనరెడ్డి తెలిపారు. క్యాంపు కార్యాలయంలో వర్చువల్‌ విధానంలో ఆన్‌లైన్‌ ద్వారా సోమవారం ప్రారంభించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ ప్రాజెక్టును విశాఖలో పైలెట్‌ ప్రాజెక్టుగా అమలు చేయనున్నట్లు తెలిపారు. విజయవాడ, ఇతర ప్రాంతాలకు తర్వాత అమలు చేస్తామన్నారు. ముఖ్యంగా ప్రయివేటు క్యాబ్‌లు, ఆటోల్లో ప్రయాణించే మహిళలనుద్దేశించి ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు వివరించారు. దాదాపు లక్ష ఆటోలను అభయం పథకం కిందకు ప్రభుత్వం తీసుకురానుందని పేర్కొన్నారు. ఆటోల్లో ఆభయ‌ మొబైల్‌ ఆప్షన్‌ ఉంటుందని, బటన్‌ నొక్కిన ...

Read More »

పలువురు ఐఎఎస్‌, ఐఆర్‌ఎస్‌ అధికారుల బదిలీ

రాష్ట్రంలో వెయింటింగ్‌లో ఉన్న పలువురు ఐఎఎస్‌, ఐఆర్‌ఎస్‌ బాధ్యతలు అప్పగిస్తూ, ఆయా స్థానాల్లో ఉన్న అధికారులను ఇతర శాఖలకు ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఆదివారం ఉత్తర్వులను విడుదల చేశారు. వెయిటింగ్‌లో వున్న ఎంవి శేషగిరిరావును స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ల శాఖ ఐజిగా నియమిస్తూ ఆపోస్టులో వున్న సిద్దార్థ జైన్‌ను సర్వే అండ్‌ సెటిల్‌మెంట్స్‌కు కమిషనర్‌గా నియమించింది. అలాగే వెయిటింగ్‌లో వున్న ఐఆర్‌ఎస్‌ అధికారి కె రవీణ్‌ కుమార్‌రెడ్డిని ఎపిఐఐసి ఎండిగా, ఎం రమణారెడ్డిని ...

Read More »

ద్విపాత్రాభినయంతో ప్రేక్షకులను అలరించనున్నా హీరో నాని

నేచురల్‌స్టార్‌ నాని మరోసారి ద్విపాత్రాభినయంతో ప్రేక్షకులను అలరించనున్నారు. ఆయన తదుపరి చిత్రం ‘శ్యామ్‌ సింగరారు’చిత్రంలో ఇలా కనిపించనున్నారు. 1960 నాటి ఒక ప్రాత్ర, ప్రస్తుత జనరేషన్‌కు లింక్‌గా మరోపాత్రలో నటించనున్నారు. కోల్‌కత్తా, హైదరాబాద్‌లలో పునర్జన్మల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది.నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై వెంకట్‌ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాయిపల్లవి, క్రితిశెట్టి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.ఈ ఏడాది ‘వి’ సినిమాతో నాని ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇప్పుడు ‘టక్‌ జగదీష్‌’ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈ సినిమా పూర్తికాగానే రాహుల్‌ సంక్రిత్యాన్‌ ...

Read More »

బేబీ బంప్‌లో అనుష్క శర్మ

కరోనా పుణ్యమా అని బిజీ బిజీగా ఉండే సినీ తారలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. కేంద్రం తిరిగి సినిమా థియేటర్లకు, షూటింగులకు గ్రీన్‌ సిగల్‌ ఇవ్వడంతో సెట్స్‌లో వడివడిగా అడుగులు పెడుతున్నారు. ఇటీవలే పలువురు బాలీవుడ్‌ నటులు షూటింగ్స్‌లో పాల్గొంటున్నారు. తాజాగా నటి అనుష్క శర్మ కూడా సెట్స్‌లోకి అడుగుపెట్టారు. త్వరలో తల్లి కాబోతున్న ఆమె ..తగు జాగ్రత్తలు తీసుకుంటూ యాడ్‌ షూటింగ్‌లో పాల్గొన్నారు.

Read More »

పేర్ని నాని కుటుంబ సభ్యులకు జ‌గ‌న్ ప‌రామ‌ర్శ

ఇటీవలే మాతృ వియోగం పొందిన రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ఇంటికి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శించారు.  నాని మాతృమూర్తి నాగేశ్వరమ్మ అనారోగ్యంతో బాధపడుతూ గురువారం కన్నుమూసిన విషయం తెలిసిందే. దీంతో సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి మచిలీపట్నం వెళ్లారు.

Read More »