Monthly Archives: November 2020

రష్మికకు గూగుల్‌ గుర్తింపు

నటి రష్మిక మడన్నాకు గూగుల్‌ ఇండియా అరుదైన గుర్తింపునిచ్చింది. గూగూల్‌ 2020 సంవత్సరానికి గాను ‘నేషనల్‌ క్రష్‌ ఆఫ్‌ ఇండియా’గా రష్మిక ఎన్నికైనట్టు ప్రకటించింది. గూగుల్‌లో ఈ పదాన్ని టైప్‌ చేస్తే రష్మిక పేరుతో పాటు ఆమెకు సంబంధించిన సమాచారం కనిపిస్తుంది. రష్మిక డ్రస్సింగ్‌ స్టైల్‌ నచ్చడం వల్లే ఆమెకి ఈ గుర్తింపు వచ్చిందని గూగుల్‌ సమాచారం. ఆమె నటించిన తెలుగు, కన్నడ సినిమాలు ఇతర భాషల్లో కూడా డబ్‌ అయి విడుదల కావడంతో ఆమెకు దేశ వ్యాప్తంగా గుర్తింపు వచ్చిందట.

Read More »

ఫిషింగ్‌ హార్బర్లకు జగన్‌ శంకుస్థాపన

మత్స్యకార దినోత్సవం సందర్భంగా మత్స్యకారులకు అంతర్జాతీయ మౌలిక సదుపాయాలతో కూడిన నాలుగు ఫిషింగ్‌ హార్బర్లకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి వర్చువల్‌ విధానంలో శనివారం శంకుస్థాపన చేశారు. తొలిదశలో భాగంగా నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె, తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడ, గుంటూరు జిల్లా నిజాంపట్నం, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిర్మించనున్న నాలుగు ఫిషింగ్‌ హార్బర్లకు శంకుస్థాపన చేశారు. మరో నాలుగు చోట్ల కూడా ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణ పనులు ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దీంతోపాటు 25 ఆక్వాహబ్‌ల నిర్మాణ పనులకు కూడా సిఎం ...

Read More »

తుంగభద్ర పుష్కరాలను ప్రారంభించిన సిఎం జగన్‌

కర్నూలు జిల్లా సంకల్‌బాగ్‌ ఘాట్‌ లో తుంగభద్ర పుష్కరాలను ఎపి సిఎం జగన్‌ శుక్రవారం మధ్యాహ్నం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సిఎం జగన్‌ సాంప్రదాయ దుస్తుల్లో విచ్చేసి, తుంగభద్ర నదికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పసుపు-కుంకుమ, సారెలను సమర్పించి ఆపై హారతి ఇచ్చారు. హోమంలో పాల్గొన్నారు.       పుష్కరాల ప్రారంభోత్సవంలో సిఎం జగన్‌ వెంట మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్‌, బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, గుమ్మనూరు జయరాం, పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. తుంగభద్ర పుష్కరాలు నేటి నుంచి డిసెంబరు ఒకటవ తేదీ వరకు ...

Read More »

హైదరాబాద్‌ పాతబస్తీలో టెన్షన్‌… టెన్షన్‌ – భారీ బందోబస్త్‌!

హైదరాబాద్‌ పాతబస్తీలో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు పాతబస్తీలో చార్మినార్‌ దగ్గరలోని భాగ్యలక్ష్మి ఆలయం వద్దకు వస్తానని, కెసిఆర్‌ కూడా రావాలని, ఫోర్జరీ సంతకం లేఖపై నిజాలు తేల్చుకుందామని సిఎం కెసిఆర్‌కు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ సవాల్‌ విసిరిన సంగతి తెలిసిందే. జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో బిజెపి బైక్‌ ర్యాలీని తలపెట్టింది. దీంతో భాగ్యలక్ష్మి ఆలయం వద్ద పోలీసులు భారీ బందోబస్త్‌ ఏర్పాటు చేశారు. అయితే, బైక్‌ ర్యాలీకి అనుమతి నిరాకరించారు. ఎలాగైన భాగ్యలక్ష్మి ఆలయం వద్దకు వస్తానని బండి సంజయ్‌ చెప్పడంతో ఆ ప్రాంతంలో ...

Read More »

ప్రాంతీయ భాషల్లోనూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలు

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షలు ప్రాంతీయ భాషల్లో కూడా నిర్వహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ కోరారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోడీకి వేర్వేరుగా శుక్రవారం ఉదయం లేఖలు రాశారు. హిందీ, ఇంగ్లీషు భాషల్లో మాత్రమే పరీక్షలు నిర్వహించడం వల్ల ఇతర ప్రాంతీయ భాషల అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. దేశంలోని అన్ని ప్రాంతాల అభ్యర్థులకు సమాన అవకాశాలు ఇచ్చే విధంగా ప్రాంతీయ భాషల్లో పరీక్షలు నిర్వహించాల్సిన ఆవశ్యకతను ఆయన తెలిపారు. అలాగే రాష్ట్రపతికి రాసిన లేఖలో ...

Read More »

రహస్యంగా పెళ్లి చేసుకున్న ప్రభుదేవా

 ప్రభుదేవా రహస్యంగా రెండో వివాహం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల ప్రభుదేవా.. తన బంధువుల అమ్మాయినే ప్రేమించినట్లు.. ఆమె కూడా ఆయన ప్రేమను అర్థం చేసుకొన్నదని.. త్వరలోనే వారిద్దరూ వివాహం చేసుకోకున్నారని సోషల్‌ మీడియాలో వార్తలు హల్‌చల్‌ చేశాయి. కాగా, తాజా సమాచారం ప్రకారం ఊహించని విధంగా.. ప్రభుదేవా సెప్టెంబరులోనే బీహార్‌కు చెందిన ఫిజియోథెరపిస్ట్‌ను పెళ్లి చేసుకున్నారని సమాచారం. గతంలో ఆయన వెన్నుముక సమస్యతో బాధపడుతుండగా ఫిజియోథెరపీ చికిత్స చేయించుకున్నారు. ఆ క్రమంలో ఫిజియోథెరపిస్ట్‌తో ప్రేమలో పడ్డారట. కొంతకాలం డేటింగ్‌ చేసిన తర్వాత వీరిద్దరూ ...

Read More »

హోం క్వారంటైన్‌లో సల్మాన్‌ఖాన్‌

సల్మాన్‌ ఖాన్‌ హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు. ఆయన లాక్‌డౌన్‌ తర్వాత ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాధే’ చిత్ర షూటింగ్‌లో పాల్గొన్నారట. ఈ సందర్భంగా ఆయన డ్రైవర్‌, వ్యక్తిగత సిబ్బంది తరచూ ప్రయాణాలు చేయాల్సి రావడంతో.. కరోనా బారినపడ్డారు. సల్మాన్‌ఖాన్‌ వారిని వెంటనే చికిత్స కోసం ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చేర్పించారు. తాను కుటుంబ సభ్యులకు 14 రోజుల పాటు దూరంగా ఉండాలని నిర్ణయించుకొని హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు. కాగా, కరోనా లాక్‌డౌన్‌ సమయంలో సల్మాన్‌ఖాన్‌ పన్వెల్‌లోని ఫామ్‌హౌస్‌లో ఉండి వ్యవసాయ పనుల్లో పాల్గొన్నారు. వాటికి ...

Read More »

జనసేనతో బిజెపికి ఎలాంటి పొత్తు ఉండదు

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో జనసేనతో బిజెపికి ఎలాంటి పొత్తు ఉండదని బిజెపి తెలంగాణా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరు స్పష్టం చేశారు. గురువారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జీహెచ్‌ఎంసీ మేయర్‌ పీఠాన్ని బిజెపి కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. బిజెపి వల్లే వరదసాయం ఆగిందని చెబుతున్న కేసీఆర్‌ దమ్ముంటే శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు చార్మినార్‌ వద్ద భాగ్యలక్ష్మి ఆలయం వద్ద ప్రమాణం చేయడానికి రావాలని సవాల్‌ విసిరారు. వరదసాయంపై బిజెపిపై టిఆర్‌ఎస్‌ అసత్య ప్రచారం చేస్తోందని, తన సంతకాన్ని ...

Read More »

మాస్కు ఉంటేనే ఓటు!

జిహెచ్‌ఎంసి ఎన్నికలు డిసెంబర్‌ 1వ తేదీన జరగనున్న సంగతి తెలిసిందే. కరోనా నిబంధనలు పాటిస్తూనే ఎన్నికలను నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో ఎన్నికల సమయంలో తీసుకోవాల్సిన మార్గదర్శకాలను రిలీజ్‌ చేసింది. ఎన్నికల సామగ్రి పంపిణీ, సేకరణ, ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో తప్పనిసరిగా శానిటైజర్‌ అందుబాటులో ఉంచాలి. ఓటర్ల మధ్య భౌతిక దూరం ఉండేలా చూసుకోవాలి. సర్కిళ్లలో ఓటర్లు ఉండేలా పర్యవేక్షించాలి. భౌతిక దూరాన్ని పర్యవేక్షించేందుకు తప్పనిసరిగా వాలంటీర్లను ఏర్పాటు చేయాలి. మాస్క్‌ లేకుండా ఓటర్లను ఓటు వేసేందుకు అనుమతించకూడదు. ...

Read More »

నిమ్మగడ్డపై మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదని మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. రాజ్యాంగ వ్యవస్థలో ఉన్న ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌, చంద్రబాబు లేఖలకు స్పందిస్తూ ఎన్నికలు నిర్వహించాలనుకోవడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా తీవ్రత దృష్ట్యా ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు ఉద్యోగులు సిద్ధంగా లేరని తెలిపారు. నిమ్మగడ్డకు రాజ్యాంగ వ్యవస్థలపై, రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం లేదన్నారు. నిమ్మగడ్డ చిల్లర రాజకీయాలు చేయకుండా హుందాగా ఉండాలని హితవు పలికారు. ఒకవైపు కరోనా ...

Read More »