Monthly Archives: November 2020

గవర్నర్‌తో ముగిసిన నిమ్మగడ్డ భేటీ..

గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌తో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కమార్‌ భేటీ ముగిసింది. బుధవారం ఉదయం రాజ్‌భవన్‌లో సుమారు 45 నిమిషాల పాటు గవర్నర్‌తో నిమ్మగడ్డ చర్చలు జరిపారు. ఎన్నికలు నిర్వహించాల్సిన ఆవశ్యకత, ఎన్నికలపై ఇప్పటి వరకు చేపట్టిన చర్యలపై గవర్నర్‌తో చర్చించినట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వ వైఖరిపై రమేష్‌కుమార్‌ గవర్నర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. పొరుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నా ఎపిలో కరోనా పేరుతో ఎన్నికలను అడ్డుకుంటున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. చర్చలు ముగిసిన అనంతరం నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ నేరుగా ...

Read More »

ఖుష్బూకు తప్పిన ప్రమాదం

సినీ నటి, బిజెపి నాయకురాలు ఖుష్బూకు ప్రమాదం తప్పింది. బుధవారం ఉదయం ఆమె ప్రయాణిస్తున్న కారరును ట్యాంకర్‌ ఢీకొీట్టింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో కారులోని ఎయిర్‌బెలూన్స్‌ తెరుచుకోవడంతో ఆమె సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. ఈ విషయం గురించి తెలుపుతూ ఖుష్బూ స్వయంగా ఓ ట్వీట్‌ చేశారు. ‘కడలూరు వెళ్తుండగా మార్గమధ్యంలో మెల్మర్వతూర్‌ వద్ద మేం ప్రయాణిస్తున్న కారుని ట్యాంకర్‌ ఢీకొీట్టింది. అయితే ఎయిర్‌ బెలూన్స్‌ తెరుచుకోవడం వల్ల సురక్షితంగా బయటపడ్డాం. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు’ అని పేర్కొన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ...

Read More »

వైఎస్‌ఆర్‌ సున్నా వడ్డీ పంట రుణాల పథకం ప్రారంభం

వైఎస్‌ఆర్‌ సున్నా వడ్డీ పంట రుణాల పథకం చెల్లింపులను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వర్చువల్‌ విధానంలో మంగళవారం విడుదల చేశారు. 14.58 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.510 కోట్లకు పైగా జమ చేయనున్నారు. అక్టోబర్‌లో దెబ్బతిన్న పంటలకు కూడా పెట్టుబడి రాయితీని విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ.. పంట రుణాలపై రైతులకు వడ్డీ రాయితీ పూర్తిగా చెల్లించామన్నారు. రైతులకు ఎంత చేసినా తక్కువేనన్నారు. రైతుల అకౌంట్లలో నేరుగా డబ్బు జమ అవుతుందన్నారు. ఇప్పటివరకు 90 శాతానికి పైగా హామీలను నెరవేర్చామన్నారు. గతంలో ...

Read More »

పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన మంత్రి అనిల్‌కుమార్

రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కమార్‌ యాదవ్‌ మంగళవారం ఉదయం పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. అక్కడ జరుగుతున్న నిర్మాణ పనుల పరిశీలించి, అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. తొలత పోలవరం ప్రాజెక్టు హిల్‌వేపై నుండి ప్రాజెక్టు స్పిల్‌వేపై జరుగుతున్న కాంక్రీట్‌ నిర్మాణ పనులను పరిశీలించారు. ఆ తరువాత స్పిల్‌వే 45వ బ్లాక్‌ దగ్గర జరుగుతున్న పనులు పరిశీంచారు. అనంతరం 45వ బ్లాక్‌ నుంచి 1వ బ్లాక్‌ వరకూ కాలినడకన వెళ్తూ పనులను పరిశీలించారు. ఆయన వెంట ఉన్న సూపరింటెండెంట్‌ ఇంజనీరు నాగిరెడ్డి, చీఫ్‌ ఇంజనీరు ...

Read More »

కొత్త హెయిర్‌ స్టైల్‌.. కొత్త లుక్‌తో మహేశ్‌ బాబు!

టాలీవుడ్‌ హీటో మహేశ్‌ బాబు కొత్త హెయిర్‌ స్టైల్‌తో కొత్త లుక్‌లో అదరగొడుతున్నాడు. మహేష్‌ బాబుకు సంబంధించిన అప్‌డేట్స్‌ను ఆయన భార్య నమ్రతా ఎప్పటికప్పుడు తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ ద్వారా అభిమానులతో పంచుకుంటోంది. ఆమె తాజాగా పోస్ట్‌ చేసిన మహేశ్‌ బాబు కొత్త లుక్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ”తెల్లవారుజామున 3 గంటలకు విమానం కోసం ఎదురుచూస్తోన్న మహేశ్‌ బాబు” అనే క్యాప్షన్‌తో ఆమె ఈ ఫొటోను పోస్ట్‌ చేసింది. కొత్త హెయిర్‌ స్టైల్‌లో మహేశ్‌ బాబు చాలా యంగ్‌గా కనపడుతోన్న తీరు ...

Read More »

సమాజానికి నిజమైన మార్గదర్శకులు విలేకరులే

ప్రజాహితమే పరమావధిగా శ్రమిస్తోన్న విలేకరులకు ”జాతీయ పత్రికా దినోత్సవం” సందర్భంగా పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి శుభాభినందనలు తెలిపారు. కుటుంబం, కులం, అధికారం, మతం, ప్రాంతం, ధనం, వ్యవస్థలు, వ్యక్తులు, అభిమానం, అభిరుచులకు అతీతంగా దేనికీ ప్రభావితం కాకుండా పని చేస్తున్న నిఖార్సయిన పాత్రికేయుల పాత్ర విలువ మాటల్లో చెప్పేంత చిన్నది కాదన్నారు. ముందుతరాల వారే స్ఫూర్తిగా నేటి తరం మీడియా సమాజ చైతన్యం, శ్రేయస్సును ఆదర్శంగా తీసుకుని పాటు పడాలని మంత్రి ఆకాంక్షించారు. సాంకేతిక విప్లవాన్ని అందిపుచ్చుకుంటూ వార్త వెనుక ...

Read More »

మన్మోహన్‌సింగ్‌ను ప్రశంసలతో ముంచెత్తిన ఒబామా

‘ ఎ ప్రామిస్డ్‌ ల్యాండ్‌’ పుస్తకంలో భారత మాజీ ప్రధాని, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మన్మోహన్‌సింగ్‌ను మాజీ అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ప్రశంసలతో ముంచెత్తారు. ఉత్తేజపరిచే, ఫలవంతమైన నిర్ణయాలతో ఇద్దరి మధ్య బంధాలు బలపడేలా చేశారని గుర్తుచేసుకున్నారు. భారతదేశంపై తనకున్న ఆసక్తి, మహాత్మాగాంధీ జీవితం, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో ఉన్న సంబంధాల గురించి ఈ పుస్తకంలో ప్రత్యేకంగా రాసుకున్నారు. ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అసాధారణ జ్ఞానం, మర్యాద కలిగిన వ్యక్తి అని పేర్కొన్నారు. నవంబర్‌ 2010లో మొదటిసారి భారత్‌ను సందర్శించానని, ఆ సందర్భంగా.. ‘సున్నితమైన, ...

Read More »

కరోనాపై సంచలన వ్యాఖ్యలు చేసిన బాలకృష్ణ

 నందమూరి బాలకృష్ణ అంటేనే సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్‌ అడ్రస్‌. ఆయన ఏ సినిమా ఫంక్షన్‌కి వెళ్లినా ఏదో ఒక సంచలన వ్యాఖ్యలు చేస్తారు. కాకపోతే ఈసారి మనుషులపై కాకుండా.. కరోనా మహమ్మారిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం నందమూరి బాలకృష్ణ ‘సెహరి’ సినిమా ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసిన ఆయన కరోనా కారణంగా సినిమా ఇండిస్టీ, సినీ కార్మికులు, సామాన్య ప్రజలు ఎన్ని ఇబ్బంది పడుతున్నది తెలిపారు ముఖ్యంగా ఇటువంటి పరిస్థితుల్లోనూ షూటింగ్‌ చేస్తున్న ‘సెహరి’ చిత్ర ...

Read More »

తెలంగాణ లో బాణసంచాపై నిషేధం..

దీపావళి పండుగ వేళ.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బాణసంచా వినియోగాన్ని నిషేధించడానికి తగిన చర్యలు తీసుకోవాలంటూ.. ప్రభుత్వాన్ని గురువారం హైకోర్టు ఆదేశించింది. కోర్టు ఉత్తర్వుల అమల్లో భాగంగా.. బాణసంచా నిషేధానికి తీసుకున్న చర్యలను ఈ నెల 19 న కోర్టుకు వివరించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.     హైకోర్టు ఆదేశాల మేరకు.. రాష్ట్ర వ్యాప్తంగా బాణసంచా విక్రయాలు, కాల్చడాలను నిషేధిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బాణసంచా దుకాణాల మూసివేతకు తక్షణ చర్యలు చేపట్టింది. ఎవ్వరూ నిబంధనలను అతిక్రమించకుండా డిజిపి కలెక్టర్లు, సిపి ...

Read More »

దీపావళికి RRR కన్నుల పండుగ

 దీపావళి కానుకగా…. అభిమానులకు ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా నుండి ఓ ఫొటోను చిత్రయూనిట్‌ విడుదల చేసింది. ఈ ఫొటో రాజమౌళి, చరణ్‌, ఎన్టీఆర్‌లు సాంప్రదాయ దుస్తులను ధరించి వరుసగా కూర్చొని.. స్వీట్లు తింటూ.. ఏవో సరదా సంభాషణలు మాట్లాడుకుంటున్నట్లుగా ఉంది. వెనుక బ్యాంక్‌గ్రౌండ్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌ లైటింగ్‌లో కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట్లో వైరల్‌ అవుతోంది. ప్రస్తుతం సినిమా షూటింగ్‌ జరుగుతున్న నేపథ్యంలో జక్కన్న దీపావళి కానుకగా ఏదో ప్లాన్‌ చేసినట్లుగా అనిపిస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోనే కాకుండా.. వీడియో కూడా విడుదల చేసి ఉంటే ...

Read More »