Monthly Archives: November 2020

ప్రేమ వివాహం చేసుకోబోతున్న ప్రభుదేవా

ప్రముఖ డ్యాన్స్‌ కొరియోగ్రాఫర్‌, దర్శకుడు ప్రభుదేవా మరోసారి వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ప్రభుదేవా తన భార్య రామలతతో మనస్పర్థలు వచ్చి విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. కాగా, ప్రభుదేవా ప్రముఖ హీరోయిన్‌ నయనతారని పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు హల్‌చల్‌ చేశాయి… కానీ పెళ్లి జరగలేదు. తాజాగా ప్రభుదేవా తన బంధువునే ప్రేమించారని, ఆమె కూడా అతని ప్రేమను అర్థం చేసుకుందని కోలీవుడ్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే పెళ్లి వార్తలపై ఇప్పటివరకు ప్రభుదేవా మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. గతేడాది ప్రభుదేవా దర్శకత్వం వహించిన ...

Read More »

బీహార్‌ ఎన్నికల్లో ఎన్‌డిఎకు ఎదురుదెబ్బలు

బీహార్‌ ఎన్నికల్లో చాలా స్వల్ప తేడాతో బిజెపి-జెడి(యు) కూటమి గెలుపొందింది. ఈ కూటమికి 125సీట్లు రాగా, మహాగత్‌బంధన్‌కు 110సీట్లు వచ్చాయి. అయితే, ఈ రెండు కూటములు మధ్య ఓట్ల వాటా తేడా చాలా తక్కువగా కేవలం 0.2శాతం మాత్రమే వుంది. ఈ ఎన్నికల్లో గెలుపొందినప్పటికీ ఎన్‌డిఎకు చాలా ఎదురుదెబ్బలు తగిలాయని పీపుల్స్‌ డెమోక్రసీ తన సంపాదకీయంలో పేర్కొంది. 2019 లోక్‌సభ ఎన్నికలతో పోల్చితే ఈసారి బిజెపి కూటమి 12.4శాతం ఓట్లు పోగొట్టుకుందని పేర్కొంది. ప్రభుత్వ వ్యతిరేకత, నితీష్‌ కుమార్‌ ప్రభుత్వం పట్ల నెలకొన్న అసంతృప్తి ...

Read More »

జనవరి నాటికి ఏపీ లో కొత్త జిల్లాలు

ప్రతీ లోక్‌సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ప్రకటిస్తామని, ఇవి 25 లేదా 26 గా ఉంటాయని ప్రభుత్వం గత ఏడాది ఆగస్టులో తెలిపింది. జనవరి నాటికి కొత్త జిల్లాలు ఏర్పాటు కావచ్చునన్న సూచనలతో.. వాటికి అవసరమైన మౌలిక సదుపాయాలపై అధికారులు చర్చిస్తున్నారు. జిల్లాలో ఉద్యోగులు ఎందరు ? ఏయే హోదాల్లో పని చేస్తున్నారు ? సొంత భవనాలు ఎన్ని ? అద్దె భవనాల్లో ఎన్ని.. తదితర లెక్కలు తీస్తున్నారు. పోలీసు శాఖ కూడా కొత్త జిల్లాల్లో తమ కార్యాలయాల ఏర్పాటు పై కసరత్తు మొదలుపెట్టింది.కొత్త ...

Read More »

బేబీ బాయ్ తో డార్లింగ్‌

నటి చార్మీ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో  ఓ పిక్‌ పోస్టు చేశారు. అది ఇప్పుడు ఇంటర్నెట్‌లో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. ఇంతకు ఏంటా పిక్‌ అనుకుంటున్నారు. తన కుక్క పిల్లను డార్లింగ్‌ ప్రభాస్‌ లాలిస్తున్న ఫోటో అది. చూసేందుకు ఎంతో పెద్దదిగా ఉన్న ఆ కుక్కకు తొమ్మిది నెలలేనట. ఈ విషయాన్ని చార్మి ఇన్‌స్టా పిక్‌ షేర్‌ చేస్తూ చెప్పారు. నా తొమ్మిది నెలల బేబీ బాయ్తో డార్లింగ్‌ అంటూ పోస్టు చేశారు. ఇది అలాస్కన్‌ మాలమ్యూట్‌ జాతికి చెందినది. ఇటీవల ఇటలీలో రాధేశ్యామ్‌ చిత్రీకరణ ...

Read More »

బాబాయ్ .. అబ్బాయ్

వెంకటేష్‌, రానా కలిసి ఒక సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా రానానే వెల్లడించాడు. కరోనా హడావుడి అంతా ముగిసిన తరువాత ఆ సినిమా ప్రకటన వస్తుందని సమాచారం. ‘గతంలో కథలు వినడానికి టైమ్‌ దొరికేది కాదని, ఇప్పుడు కరోనా కారణంగా టైమ్‌ దొరికిందని, అలా దొరికిన కథల్లో బాబాయ్ -అబ్బాయ్ల కథ ఒకటి అని’ రానా తెలిపాడు. అయితే ఈ కథ ఎవరు చెప్పారు? డైరక్టర్‌ ఎవరు? అన్నదానిపై ఆయన స్పష్టత ఇవ్వలేదు.

Read More »

అబ్దుల్‌ సలాం కుటుంబం ఆత్మహత్య పై జగన్‌ స్పందన

నంద్యాలలో ఆత్మహత్యకు పాల్పడ్డ అబ్దుల్‌ సలాం కుటుంబం పై సిఎం జగన్‌ స్పందించారు. సిఎం మాట్లాడుతూ.. ఈ ఘటన బాధ కలిగించిందన్నారు. అబ్దుల్‌ సలాం కుటుంబం విషయం సోషల్‌ మీడియా లో వచ్చిన వెంటనే న్యాయబద్ధంగా ఏం చేయాలనే దిశగా ఆలోచించామన్నారు. ఎక్కడా తనా..మనా బేధం చూపలేదని స్పష్టం చేశారు. మైనార్టీల గురించి గొప్పలు చెప్పుకునే టిడిపి నేత, లాయర్‌ రామచంద్రరావు పోలీసుల తరుపున బెయిల్‌ పిటిషన్‌ ను వేశారని తెలిపారు. ఎవరికైనా న్యాయం ఒకటేనని చర్యలు తీసుకున్నామన్నారు. బాధ్యులయిన పోలీసులను అరెస్టు చేశామని ...

Read More »

పండుగల కన్నా ప్రాణాలు విలువైనవి

 కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ప్రాణాల కంటే విలువైనది ఏదీ లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.  బాణాసంచా  నిషేధంలో తాము జోక్యం చేసుకోబోమంటూ.. కోల్‌కతా హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. పశ్చిమబెంగాల్‌లో టపాసులు కాల్చడాన్ని నిషేధిస్తూ.. కోల్‌కతా హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. బుర్రాబజార్‌ ఫైర్‌వర్క్స్‌ డీలర్స్‌ అసోసియేషన్‌, గౌతమ్‌ రాయ్  ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించేందుకు జస్టిస్‌ డివై.చంద్రచూడ్‌ సింగ్‌ ధర్మాసనం నిరాకరించింది. పండుగలు ముఖ్యమే.. అయితే ప్రాణాలను కాపాడుకోవడం అంతకంటే ముఖ్యమని పేర్కొంది. ప్రతి ...

Read More »

ప్రభుత్వ పరిధిలోకి సోషల్‌మీడియా

సోషల్‌మీడియా, ఆన్‌లైన్‌ న్యూస్‌ పోర్టల్స్‌పై కేంద్ర ప్రభుత్వం కొరడా ఝళిపించింది. ఇకపై ఆన్‌లైన్‌ న్యూస్‌ పోర్టల్స్‌ అయిన నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో, హాట్‌స్టార్‌లతో పాటు సోషల్‌మీడియా వేదికలైన ఫేస్‌బుక్‌, ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌లు ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్లనున్నాయి. ఇవన్నీ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోకి వచ్చేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సంతకం చేసిన ఉత్తర్వులను సోమవారం జారీ చేసింది. ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌లోని సినిమాలు, ఆడియో విజువల్స్‌, వార్తలు, కరెంట్‌ అఫైర్స్‌ వంటి అన్నింటినీ సమాచార ...

Read More »

దుబ్బాక బిజెపిదే..

క్షణక్షణం ఉత్కంఠ రేపిన దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాల్లో బిజెపి విజయం సాధించింది. ఆపార్టీ అభ్యర్థి మాధవనేని రఘునందన్‌రావ్‌, తెరాస అభ్యర్థి సోలిపేట సుజాతపై గెలుపొందారు. 1470 ఓట్ల ఆధిక్యాన్ని సాధించారు. తొలి రౌండ్‌ నుండి ఆధిక్యంలో కొనసాగిన బిజెపి, మధ్యలో కాస్త తడబడిన చివరికి గెలుపు సాధించింది. బిజెపికి 62,772 ఓట్లు రాగా, టిఆర్ఎస్ కు 61,302 ఓట్లు, కాంగ్రెస్ కు 24,819 ఓట్లు వచ్చాయి.

Read More »

గెలుపోటములు సహజం : కెటిఆర్

రాజకీయాల్లో గెలుపు… ఓటములు సహజం.  విజయాలకు పొంగిపోము, అపజయాలకు కుంగిపోము అని మంత్రి కేటీఆర్‌ అన్నారు. దుబ్బాక ఉపఎన్నికలో బిజెపి అభ్యర్థి రఘునందన్‌రావు గెలుపొందిన తర్వాత హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌ లో మంగళవారం మంత్రి కేటీఆర్‌ మాట్లాడారు. దుబ్బాక ఉపఎన్నికలో తెరాసకు ఓటు వేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీని గెలిపించడానికి అహర్నిశలు శ్రమించిన నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఓటమికి గల కారణాలపై లోతుగా సమీక్షిస్తామని కెటిఆర్ అన్నారు.   ఆరున్నరేళ్లలో చాలా విజయాలు సాధించాం. దుబ్బాకలో మేం ఆశించిన ఫలితం రాలేదు. ...

Read More »