Monthly Archives: November 2020

కేబినెట్ భేటీ కీలక నిర్ణయాలు

ఆంధప్రదేశ్‍ ముఖ్యమంత్రి వైఎస్‍ జగన్‍ మోహన్‍ రెడ్డి అధ్యక్షతన సాగిన మంత్రి వర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్‍ నిర్ణయాలను మంత్రి కన్నబాబు మీడియాకు వెల్లడించారు. నూతన ఇసుక విధానానికి కేబినెట్‍ ఆమోదం తెలిపింది. ఇకపై ఇసుకను ఆఫ్‍లైన్‍లోనూ తెచ్చుకోవచ్చని మంత్రి వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక రీచ్‍లను ఒకే సంస్థకు, అదీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థకు అప్పగించాలని కేబినెట్‍ నిర్ణయించింది. ఒక వేళ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ముందుకు రాకపోతే బహిరంగ వేలం వేయాలని మంత్రివర్గం తీర్మానించింది. ...

Read More »

మెట్రో రైల్లో పవన్‌ కళ్యాణ్‌ ప్రయాణం

వకీల్‌సాబ్‌ షూటింగ్‌ నిమిత్తం పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ మియాపూర్‌ వెళ్లాల్సి వచ్చింది. తదనుగుణంగా పవన్‌కళ్యాణ్‌ గురువారం రైల్వే స్టేషన్‌లో సాధారణ ప్రయాణికుడిలా చెకింగ్‌ ప్రక్రియ, ఎంట్రీ విధానాన్ని పాటించారు. మెట్రోరైలులో మియాపూర్‌ వరకు ప్రయాణించారు. ఆ ప్రయాణంలో తోటి ప్రయాణీకులతోనూ ముచ్చటించారు. పవన్‌కళ్యాణ్‌ పక్కనే ద్రాక్షారామం, సత్యవాడ ప్రాంతాలవారు కూర్చున్నారు. అందులో ద్రాక్షారామానికి చెందిన చిన్న సత్యనారాయణ అనే రైతును పలకరించారు. పంటల గురించి అడిగి తెలుసుకున్నారు. దానికి ఆయన స్పందిస్తూ వర్షాల కారణంగా వ్యవసాయం బాగా దెబ్బతిన్నదని ఆయనతో చెప్పారు. తమ కుటుంబలోనూ, ప్రాంతంలోనూ ...

Read More »

మరోసారి 50వేలకు పైగా పాజిటివ్‌ కేసులు..

దేశంలో కొంతమేర తగ్గుముఖం పట్టిన కరోనా కేసుల్లో మరోసారి పెరుగుదల కనిపిస్తోంది. గతకొన్ని రోజులుగా 50వేల కన్నా తక్కువ కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. బుధవారం 46,253 కేసులు నమోదు కాగా, మంగళవారం 38,310 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 50,210 కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్యఆరోగ్య శాఖ ప్రకటించింది. అదే సమయంలో 55వేల మంది కరోనా నుండి కోలుకున్నట్లు వెల్లడించింది. పండుగల సీజన్‌ కావడం, మరికొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరగడం… నేపథ్యంలో కేసులలో పెరుగుదల కనిపిస్తోంది. అలాగే గడిచిన 24 ...

Read More »

తమ్మిలేరు రిటైనింగ్‌ వాల్‌కు జగన్ శంకుస్థాపన

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఏలూరులో బుధవారం పర్యటించారు. కొద్దిసేపటి క్రితమే తమ్మిలేరు రిటైనింగ్‌ వాల్‌కు సిఎం శంకుస్థాపన చేశారు. ఏలూరులో రూ.355 కోట్లకు సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు సిఎం శంకుస్థాపనలు చేశారు. అనంతరం వీవీనగర్‌ వద్ద ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. అక్కడ నుంచి నేరుగా కళ్యాణమండపానికి చేరుకొని మాజీ మేయర్‌ షేక్‌ నూర్జహాన్‌, పెదబాబు కుమార్తె వివాహానికి హాజరై.. నూతన వధూవరులను ఆశీర్వదించారు. తిరిగి హెలిప్యాడ్‌ వద్దకు చేరుకొని తాడేపల్లికి బయలుదేరారు. ఈ పర్యటనలో సిఎం జగన్‌తోపాటు ఉప ముఖ్యమంత్రి ...

Read More »

షూటింగ్‌కి సిద్ధమౌతున్న ఆచార్య

మెగాస్టార్‌ చిరంజీవి ఆచార్య సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చిరుకి జోడీగా కాజల్‌ నటిస్తుంది. కోవిడ్‌ కారణంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్‌ పునఃప్రారంభించడానికి చిత్రయూనిట్‌ సిద్ధమైంది.ఈ నెల తొమ్మిది నుంచి తగు జాగ్రత్తలతో షూటింగ్‌ ప్రారంభమవుతున్నట్లు సమాచారం. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. స్టార్‌ డైరెక్టర్‌ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్‌ భావిస్తోంది.

Read More »

రాష్ట్ర ఆర్ధిక లోటు రూ. 67,957 కోట్లు

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి : నెలలు గడుస్తున్నా… ఖజానా లోటు మాత్రం తగ్గడం లేదు. ప్రతి నెలా తొమ్మిది నురచి పది వేల కోట్ల రూపాయల వరకు లోటు కనిపిస్తురడగా మొత్తం ఏడు నెలల్లో ఏకంగా 68 వేల కోట్లకు లోటు చేరుకురది. ఆర్ధిక సంవత్సరం తొలి నెలల్లో కరోనా కారణంగా సొరత పన్నుల ఆదాయం తీవ్రంగా తగ్గడం, ఖర్చులు తగ్గకపోవడంతో ఖజానా కష్టాల్లో పడిరది. అయితే నాలుగు నెలలుగా వరుస ఆన్‌లాక్‌లతో అనేక రంగాలపై సడలిరపులు ఇచ్చినప్పటికీ ఆదాయ వ్యయాల మధ్య అరతరం ...

Read More »

రాగల మూడు రోజులు రాష్ట్రంలో వర్షాలు

రాగల మూడు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. తమిళనాడు తీరానికి దగ్గరగా నైరుతి బంగాళాఖాతంలో 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం ఆగేయ, నైరుతి బంగాళాఖాతం ప్రాంతాల్లో 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. వీటి ప్రభావంతో దక్షిణాది రాష్ట్రాలపైకి సముద్రం నుంచి తూర్పుగాలులు వీస్తున్నాయి. మంగళవారం నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు, ...

Read More »

మీడియా ముందు ఏడ్చిన మహిళా ఎంపిపి

 తెలంగాణలోని ములుగు జిల్లా వాజేడు మహిళా ఎంపిపి మీడియాతో తన గోడు వెళ్లబోసుకుంటూ ఏడ్చారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మండలంలో అన్నిటికీ తాను బాధ్యత వహించాల్సిన హోదాలో ఉన్నానని.. కానీ తనమాట ఎవ్వరూ ఖాతరు చేయడం లేదంటూ వెక్కివెక్కి ఏడ్చారు. అధికార పార్టీకి చెందిన తనకే విలువ ఇవ్వకపోతే ఎలాగ అని ప్రశ్నించారు. రైతు వేదికల నిర్మాణంలో లోపాలున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని, ఇదేంటని ప్రశ్నిస్తే.. నువ్వెవరు ? నీ వయస్సెంత ? అంటూ ఎంపిడిఒ అవమానించారని ఆవేదన చెందారు. ఈ పరిస్థితిని ఎమ్మెల్సీ, ...

Read More »

ఈ నెల 6 న ‘ జగనన్న తోడు ‘ ప్రారంభం

‘ జగనన్న తోడు ‘ పథకాన్ని ముఖ్యమంత్రి జగన్‌ ఈ నెల 6 వ తేదీన ప్రారంభించనున్నారు. చిరు వ్యాపారులు, సాంప్రదాయ వృత్తులు చేసుకునేవారికి వడ్డీలేని రుణాలను ఈ పథకం ద్వారా ఇవ్వనున్నారు. ఈ పథకం కింద ఇప్పటివరకు 9.08 లక్షల మందిని అర్హులుగా గుర్తించారు. వీరికి ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ.10 వేల వరకు వడ్డీ లేని రుణాన్ని బ్యాంకుల ద్వారా అందించనున్నారు. ఇందుకుగాను రూ.474 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేయనుంది. ఈ రుణంపై అయ్యే వడ్డీ రూ.52 కోట్లను ప్రభుత్వమే భరిస్తుంది. ...

Read More »

గ్యాంబ్లింగ్‌ ప్రకటనల్లో నటించిన నటులకు నోటీసులు

ఆన్‌లైన్‌ గ్యాంబ్లింగ్‌ ప్రకటనల్లో నటించిన ప్రముఖ నటులకు చెన్నై హైకోర్టు మంగళవారం నోటీసులు జారీచేసింది. తమన్నా, ప్రకాష్‌రాజ్‌, రానా దగ్గుపాటి తదితరులకు నోటీసులు జారీ చేసింది. వీరంతా ఈనెల 19 లోగా సమాధానం చెప్పాలని కోర్టు ఆదేశించింది.ఆన్‌లైన్‌ గ్యాంబ్లింగ్‌ వల్ల చాలామంది ఆత్మహత్య చేసుకున్నారని పిల్‌ దాఖలవడంతో నోటీసులు జారీ చేసినట్లు కోర్టు తెలిపింది.

Read More »