Monthly Archives: November 2020

కరోనాలోనూ ఓటు వేయడం అభినందనీయం: మోడీ

బీహార్‌లో ఎన్నికల ప్రచార ఘట్టం చివరి దశకు చేరుకుంది. మంగళవారం ఉదయం ఫోర్బెస్‌గంజ్‌ హవాయి అడ్డా ప్రచార ర్యాలీలో ప్రజలనుద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించారు. బీహార్‌ ప్రజలు కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొంటూ ఎన్నికల్లో ఓట్లు వేయడాన్ని అభినందించారు. ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉండడం అభినందనీయమన్నారు. ఎన్నికల ప్రక్రియను ఇంత సమర్థవంతంగా కొనసాగించినందుకు ఎన్నికల సిబ్బందికి చప్పట్లు కొట్టి హర్షం వ్యక్తం చేశారు. బీహార్‌ ప్రజల ఆశలను తెలుసుకున్నామని, ఎన్నికల్లో గెలుపొందాక వీటిని నెరవేరుస్తామని పేర్కొన్నారు. అనంతరం కోసిలో జరగనున్న మరో ప్రచార ర్యాలీలోనూ మధ్యాహ్నం 12.30 ...

Read More »

తిరుమలలో సెలబ్రిటీల సందడి..

తిరుమలలో సెలబ్రిటీల సందడి నెలకొంది. తిరుమల వెంకటేశ్వరుడిని ప్రముఖులు మంగళవారం దర్శించుకున్నారు. హీరోయిన్‌ అనన్య మంగళవారం ఉదయం విఐపి విరామ సమయంలో వెంకటేశ్వరుడిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనాన్ని అందించగా టిటిడి అధికారులు తీర్థప్రసాదాలను అందజేశారు. కోవురు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డి, తెలంగాణ దేవరకద్ర ఎమ్మెల్యే ఆళ్ళ వెంకటేశ్వర రెడ్డి, మధ్యప్రదేశ్‌ సిఎస్‌ గోపాల్‌ రెడ్డి లు విఐపి దర్శనం చేసుకున్నారు. దర్శనం అనంతరం ...

Read More »

ప్రయివేట్‌ వర్శిటీల్లో 50శాతం సీట్లు కన్వీనర్‌ కోటా కింద భర్తీ: జగన్‌

 ప్రయివేటు వర్శిటీల్లో 50శాతం సీట్లు కన్వీనర్‌ కోటా కింద కేటాయించాలని, కన్వీనర్‌ కోటాలో పేదపిల్లలకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ప్రభుత్వమే చేస్తుందని సిఎం తెలిపారు. ఉన్నత విద్యారంగంలో తీసుకురావాల్సిన మార్పులపై సిఎం జగన్‌ సోమవారం క్యాంపు కార్యాలయంలో మంత్రులు, ఇతర ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో అనేక నిర్ణయాలు చేశారు. ఆన్‌లైన్‌ తరగతుల విధానంపై మరింత దృష్టి సారించాలని ఆయన పేర్కొన్నారు. అలాగే విద్యాసంవత్సరం ఆలస్యమైందని విద్యార్థులపై ఒత్తిడి పెంచొద్దని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం, యూజీసీ మార్గదర్శకాలను కూడా పరిశీలించి తగిన నిర్ణయాలు తీసుకోవాలని సిఎం ...

Read More »

కృష్ణుడిగా మహేశ్‌ అదుర్స్‌!

తమ అభిమాన హీరోల సినిమాల కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తూ ఉంటారు. ఫలానా దర్శకుడితో తమ హీరో సినిమా తీసే బాగుంటుంది.. ఫలానా హీరోయిన్‌తో జోడీ కట్టి చిందులేస్తే సూపర్‌.. ఇలా తమ హీరోలపై అభిమానులు ఎన్నో కలలు కంటుంటారు. ముఖ్యంగా స్టార్‌ హీరోల విషయంలో ఫ్యాన్స్‌ చేసే హడావుడి అంతాఇంతా కాదు. ఈ అభిమానుల్లో కొందరు హార్డ్‌కోర్‌ ఫ్యాన్స్‌ ఉంటారు. వారు తమ హీరోను అభిమానించే తీరే వేరుగా ఉంటుంది. ఇలాంటి వారుకొందరు తమ హీరో ఫలానా పాత్రలో నటిస్తే బావుంటుందని ...

Read More »

మధ్యప్రదేశ్‌ ఉప ఎన్నికల్లో బిజెపికి ఓటమి తప్పదా?

మధ్యప్రదేశ్‌లో నవంబర్‌ మూడో తేదీన 28 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగుతున్నాయి. కాంగ్రెస్‌ను వీడి బిజెపిలో చేరిన జ్యోతిరాదిత్య సింధియాకు చెందిన 25 మంది ఎమ్మెల్యేల రాజీనామాలతోపాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలు చనిపోవడంతో 28 స్థానాలకు ఎన్నికలు జరగుతున్నాయి. కాంగ్రెస్‌ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలందరికీ బిజెపి సీట్లు ఇచ్చింది. దీంతో ఈ సీట్లలో ఇప్పటి వరకు ఉన్న బిజెపి నేతలు అసంతృప్తిలో ఉన్నారు. తమకు కాకుండా కాంగ్రెస్‌ నుండి వచ్చిన వారికి టిక్కెట్లు ఎలా ఇస్తారని వీరు బిజెపి నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఆరు ...

Read More »

వరలక్ష్మి కుటుంబానికి హోంమంత్రి పరామర్శ

ప్రేమోన్మాది దాడిలో బలైన ఇంటర్‌ విద్యార్థిని వరలక్ష్మి కుటుంబాన్ని హోంమంత్రి మేకతోటి సుచరిత సోమవారం పరామర్శించారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.10 లక్షల చెక్‌ను అందజేశారు. ఆమె కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సుచరిత మాట్లాడుతూ.. వరలక్ష్మి ఘటన చాలా బాధాకరమన్నారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరుగుతోందని, నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని పేర్కొన్నారు. వరలక్ష్మి కుటుంబానికి పూర్తిస్థాయిలో రక్షణ కల్పిస్తామన్నారు. ‘ ఈ హత్యలో నిందితునికి ఇతరులెవరైనా సహకరించారా ? అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతోంది. ...

Read More »

ఫార్ములా మారుతోంది..!

క్లిష్ట పరిస్థితులెప్పుడూ కొత్త అవకాశాలకు దారులు తెరుస్తాయి. లాక్‌డౌన్‌ పరిస్థితుల్లో వినోదరంగం మరిన్ని వేదికలుగా విస్తరిస్తోంది. ఓటిటి అందుకు ఉదాహరణ. పెద్ద పెద్ద బడ్జెట్లతో, ఘనమైన తారాగణంతో పనిలేకుండా ఔత్సాహిక దర్శక నిర్మాతలు, కథకులూ మెరుగైన ప్రయోగాలు చేసే అవకాశం ఏర్పడింది. థియేటర్లు దొరుకుతాయా? లేదా? అన్న చింత లేదిక. అగ్రనటుల ఉరవడిలో కనీసం చిన్న చోటైనా దొరుకుతుందా అన్న బెంగ అక్కర్లేదిక. ఆల్రెడీ … ఆ ప్రయత్నం మొదలైంది. షార్ట్‌ ఫిలిమ్స్‌ పేరిట వందలు వేలుగా యూట్యూబ్‌లో క్రియేటివిటీని పోగేస్తున్న సృజనకారులకు ఓటిటి ...

Read More »