Monthly Archives: December 2020

డిజాస్టర్‌, ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ వాహనాలు ప్రారంభించిన జగన్‌

డిజాస్టర్‌, ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ వాహనాలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి వర్చువల్‌ విధానంలో గురువారం ప్రారంభించారు. క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో డీజీపీ గౌతం సవాంగ్‌తో పాటు పలువురు పోలీసు ఉన్నతాధికారులు పాల్గన్నారు. ఈసందర్భంగా జగన్‌ మాట్లాడుతూ.. ఈ వాహనాలను విపత్తునిర్వహణ సంబంధిత చర్యల్లో సమర్థవంతంగా ఉపయోగించాలన్నారు. వాహనాలను ప్రారంభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

Read More »

కాళికగా రాధికా

కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమరస్వామి భార్య రాధిక ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘దమయంతి’. ఈ చిత్రాన్ని ‘కాళిక’ పేరుతో నట్టి కరుణ, నట్టి క్రాంతి తెలుగులో రీమేక్‌ చేసి విడుదల చేస్తున్నారు. క్వీటీ ఎంటర్‌ టైన్మెంట్‌ పతాకంపై సౌరవ్‌ లోకేష్‌, శరణ్‌ ఉల్తి, జి. కె. రెడ్డి, సాధు కోకిల, తబ్లా నాని, అంజనా నటించారు. నవరసన్‌ దర్శకత్వంలో కన్నడలో సూపర్‌ హిట్‌ సాధించిన ఈ సినిమాను తెలుగులో రీమేక్‌ చేశారు.

Read More »

ఏపీ నూతన సీఎస్‌గా ఆదిత్యనాథ్‌ దాస్‌ బాధ్యతల స్వీకరణ

ఏపీ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆదిత్యనాథ్‌ దాస్‌ గురువారం బాధ్యతలు చేపట్టారు. సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో ప్రస్తుత సీఎస్‌ నీలం సాహ్ని నుండి ఆయన బాధ్యతలు స్వీకరించారు. జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆదిత్యనాథ్‌ నియామకానికి జగన్‌ ఆమోదించారు. సాహ్ని సీఎం ముఖ్యసలహాదారుగా నియమితులయ్యారు.

Read More »

జనవరి నుండి జియో ఉచిత వాయిస్‌ కాల్స్‌…!

జియో వినియోగదారులకు శుభవార్త. ఈ కొత్త ఏడాది పురస్కరించుకుని టెలికాం దిగ్గజ సంస్థ గత ఆఫర్‌ను పునరుద్ధరించింది. 2021, జనవరి 1 నుండి ఇతర నెట్‌వర్క్‌లకు ఉచితంగా కాల్స్‌ చేసుకునే సదుపాయాన్ని తిరిగి కల్పిస్తున్నట్లు ప్రకటించింది. జియో ఏర్పాటు చేసిన తొలి నాళ్లలో డేటాకు మాత్రమే చార్జీలు విధించి…ఉచితంగా వాయిస్‌ కాల్స్‌ చేసుకునే అవకాశం ఉండేది. కాగా, ఇంటర్‌కనెక్ట్‌ యూసేజ్‌ చార్జీల (ఐయూసి) విధానం అమల్లో ఉండటంతో జియో సైతం చార్జీలను వసూలు చేసింది. ఒక నెట్‌ వర్క్‌ నుండి మరో నెట్‌వర్క్‌కు కాల్‌ ...

Read More »

మరో మెగాహీరోకు కరోనా పాజిటివ్‌

తాను కరోనా బారిన పడినట్లు కథానాయకుడు రామ్‌చరణ్‌ మంగళవారం ఉదయం ప్రకటించిన కొన్ని గంటలకే మరో మెగా హీరో కూడా కరోనా బారిన పడ్డారు. నాగబాబు కుమారుడు వరుణ్‌తేజ్‌కు కూడా పాజిటివ్‌ అని తేలింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకున్నారు. ప్రస్తుతం వరుణ్‌తేజ్‌ బాక్సింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఓ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే వెంకటేశ్‌తో కలిసి అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ‘ఎఫ్‌3’లోనూ సందడి చేయనున్నారు.

Read More »

అజారుద్దీన్‌కు తప్పిన ప్రమాదం

 భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌, హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సిఎ) అధ్యక్షుడు, కాంగ్రెస్‌ నేత మహ్మద్‌ అజారుద్దీన్‌ తృటిలో పెను ప్రమాదం నుండి బయటపడ్డారు. బుధవారం ఉదయం ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి రణ్‌తంబోర్‌ తిరిగి వస్తుండగా రాజస్తాన్‌లోని సూర్వల్‌ వద్ద లాల్సాట్‌-కోట హైవేపై కారు బోల్తా కొట్టిందని అజారుద్దీన్‌ వ్యక్తిగత సహాయకుడు తెలిపారు. కాగా, ఈ ఘటనలో ఆయన స్వల్పగాయాలతో బయటపడ్డారని చెప్పారు. ప్రమాదం నుండి తేరుకున్న ఆజారుద్దీన్‌..కుటుంబ సభ్యులతో కలిసి మరో ...

Read More »

గుంకలాంలో ‘వైఎస్సార్‌ జగనన్న కాలనీ’ పైలాన్‌ను ఆవిష్కరించిన జగన్‌

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి బుధవారం విజయనగరంలో పర్యటించారు. ‘నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమంలో పాల్గొన్న సిఎం.. విస్తీర్ణంలో రాష్ట్రంలోనే అతి పెద్దదైన గుంకలాంలోని ‘వైఎస్సార్‌ జగనన్న కాలనీ’ పైలాన్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి జగన్‌ మాట్లాడుతూ.. ఇంతమందికి మంచి చేసే అవకాశం దేవుడు నాకు ఇచ్చాడని హర్షాన్ని వ్యక్తపరిచారు. గత ప్రభుత్వాలతో పోలిస్తే జగన్‌ ప్రభుత్వం ఇచ్చిందని చెప్పుకోవడానికి చాలా చేశానని అన్నారు

Read More »

తెలంగాణను తాకిన కొత్త రకం వైరస్‌

కొత్త రకం కరోనా వైరస్‌ తెలంగాణను కూడా తాకింది. వరంగల్‌కు చెందిన 49 ఏళ్ల వ్యక్తిలో కరోనా కొత్త రకం వైరస్‌ ను సిసిఎంబి నిర్థారించింది.      వివరాల్లోకెళితే.. ఈ నెల 10 న 49 ఏళ్ల వ్యక్తి యూకే నుంచి వరంగల్‌కు వచ్చాడు. ఈ నెల 16 న ఆ వ్యక్తిలో కరోనా లక్షణాలు వెలుగుచూశాయి. దీంతో స్థానికంగా పరీక్షలు చేయించారు. ఈ నెల 22 న ఫలితాలు రాగా వైరస్‌ సోకినట్టు నిర్ధారణ అయింది. వెంటనే అక్కడే ఓ ప్రైవేటు ...

Read More »

రామ్‌ చరణ్‌కు కరోనా పాజిటివ్‌

ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా వైరస్‌ రాజకీయ, సినీ పరిశ్రమను కూడా కలవరపరిచింది. ఇప్పటివరకు చాలామంది సెలబ్రిటీలు సైతం ఈ కరోనా బారినపడ్డారు. ఈ మహమ్మారి ఉధృతి ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ తనకు కరోనా సోకినట్టు ట్విట్టర్‌లో తెలిపారు. ” ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నాను. కరోనా లక్షణాలు ఏవి లేవు. గత కొద్ది రోజులుగా నన్ను కలిసి వాళ్లు పరీక్షలు చేయించుకోండి. త్వరలోనే కోలుకొని శక్తివంతంగా మీ ముందుకు వస్తాను ” అంటూ చెర్రీ ట్వీట్‌ చేశాడు.

Read More »

ఇండియాలో ఆరుగురిలో కొత్త కరోనా లక్షణాలు..!

జన్యు మార్పులు పొందిన కొత్త కరోనా వైరస్‌ ఇండియాలోకి ప్రవేశించింది. యూకే నుంచి భారత్‌ కు వచ్చిన వారిలో కరోనా పాజిటివ్‌ సోకిన వారిని గుర్తించి, వారి నమూనాలను పరీక్షించగా, ఆరుగురిలో కొత్త స్ట్రెయిన్‌ వచ్చినట్లు గుర్తించామని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ కొత్త వైరస్‌ 70 శాతం వేగంగా వ్యాపిస్తుందని, వ్యాక్సిన్‌ తో దీన్ని నియంత్రించ వచ్చా అన్న విషయంలో మాత్రం ఇంకా స్పష్టత లేదని వైద్యాధికారులు తెలిపారు. ఇది ఎంత ప్రమాదకరమన్న విషయమై కూడా పూర్తి అవగాహనకు ఇంకా రాలేదని ...

Read More »