Monthly Archives: December 2020

ఇళ్ల పట్టాల పైలాన్‌ను ఆవిష్కరించిన సిఎం జగన్‌

శ్రీకాళహస్తి మండలం ఊరందూరుకు సిఎం జగన్‌ సోమవారం చేరుకున్నారు. పేదలందరికీ ఇళ్లు పైలాన్‌ను సిఎం ఆవిష్కరించారు. మరికొద్దిసేపట్లో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను సిఎం పంపిణీ చేయనున్నారు. అనంతరం వైఎస్సార్‌ జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణ పనులకు భూమి పూజ చేస్తారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. తొలివిడతలో భాగంగా 5,548 ఇళ్ల నిర్మాణానికి సోమవారమే ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టనున్నారు. కాలనీని ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు 8,600 మొక్కలు నాటారు.

Read More »

బాలీవుడ్‌లో రష్మికకు క్రేజీ ఆఫర్

రష్మిక బాలీవుడ్‌లో మరో క్రేజీ ఆఫర్‌ను అందుకుంది. ఏకంగా బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ సినిమాలో కథానాయికగా నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది. వికాస్‌ భల్‌ దర్శకత్వంలో అమితాబ్‌ ప్రధాన పాత్రలో రూపొందే సినిమాలో నటించడానికి రష్మిక ఓకే చెప్పింది. తండ్రీ, కూతుళ్ల మధ్య నడిచే అనుబంధాలు, భావోద్వేగాల కథతో రూపొందే ఈ చిత్రంలో అమితాబ్‌కు కూతురిగా రష్మిక నటించనుంది. ఇందులో ప్రముఖ నటి నీనా గుప్తా కూడా కీలక పాత్ర పోషిస్తోంది. రిలయన్స్‌ ఎంటర్‌ టైన్‌మెంట్‌ సంస్థ నిర్మించే ఈ చిత్రం షూటింగ్‌ ...

Read More »

మేయర్‌గా 21 ఏళ్ల అమ్మాయి ప్రమాణ స్వీకారం

కేరళలో ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచిన 21 ఏళ్ల ఆర్యా రాజేంద్రన్‌ తిరునవనంతపురం నగర కార్పొరేషన్‌ మేయర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. మొత్తం 100 మంది ఉన్న సభ్యుల మండలిలో 54 ఓట్లు ఆమె సాధించడంతో మేయర్‌గా ఎన్నికయ్యారు. దీంతో ఇప్పటి వరకు మేయర్‌ పదవి అధిరోహించిన అతి చిన్న వయస్కురాలు ఆమె కావడం విశేషం. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వామపక్ష ప్రజాతంత్ర కూటమి (ఎల్‌డిఎఫ్‌)నుండి ముడవా ముంగళ్‌ వార్డుకు కౌన్సిలర్‌గా పోటీ చేసి ఆర్యా గెలుపొందిన సంగతి విదితమే. ...

Read More »

ప్రత్యేక ఎస్టీ కమిషన్‌కు ఉత్తర్వులు

కేంద్రం ఆమోదంతో ఎపి ప్రభుత్వం ప్రత్యేక ఎస్టీ కమిషన్‌ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రత్యేక నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ సందర్భంగా డిప్యూటీ సిఎం పుష్పశ్రీవాణి మట్లాడుతూ.. ప్రత్యేక ఎస్టీ కమిషన్‌ కోసం పోరాడుతున్నామని పేర్కొన్నారు. గిరిజన హక్కులు కాపాడేందుకు ఈ కమిషన్‌ను తీసుకొచ్చారని తెలిపారు. జగన్‌కు గిరిజనులంతా రుణపడి ఉంటారని పుష్పశ్రీవాణి పేర్కొన్నారు.

Read More »

రేపటి నుంచి కరోనా వ్యాక్సిన్‌ ‘డ్రై రన్‌’

 కరోనా వ్యాక్సిన్‌ ‘డ్రై రన్‌’కు కేంద్రం ఎంపిక చేసిన నాలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ కృష్ణా జిల్లాను ఎంపిక చేసింది. రాష్ట్ర వైద్య శాఖ ఆదేశాల మేరకు ఆదివారం నుంచి వ్యాక్సిన్‌ ట్రయల్‌ రన్‌ను నిర్వహించేందుకు కృష్ణా జిల్లా అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఈ మేరకు కరోనా వ్యాక్సిన్‌ ‘డ్రై రన్‌’ను ఆదివారం నిర్వహించనున్నామని కలెక్టర్‌ ఇంతియాజ్‌ వెల్లడించారు. 27న ఐటి రిలేటెడ్‌ డ్రై రన్‌, 28న లాజిస్టిక్‌ రిలేటెడ్‌ మాక్‌ డ్రిల్‌, 29న వాక్సినేషన్‌ ...

Read More »

నాకు పాలిటిక్స్‌ సెట్‌ కావు : చిరంజీవి

ప్రముఖ నటి సమంత అక్కినేని ఓటీటీ ఆహా వేదికగా ‘సామ్‌ జామ్‌ షో’కి హోస్ట్‌గా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఈ షోలో విజరు దేవరకొండ, తమన్నా వంటి పలువురు నటీనటులు పాల్గొన్నారు. తాజాగా ఈ షోలో మెగాస్టార్‌ చిరంజీవి పాల్గొన్నట్లు.. క్రిస్మస్‌కు ముందే వార్తలు హల్‌చల్‌ చేశాయి. ఆ వార్తల్ని నిజం చేస్తూ.. చిరంజీవి పాల్గొన్న మెగా షో క్రిస్మస్‌ కానుకగా ‘ఆహా’లో విడుదల చేశారు. సమంత ఈ షోలో చిరంజీవిని కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నల్ని అడిగారు. ఈ షోలో చిరంజీవి రాజకీయాల ...

Read More »

ఎపిఎస్‌ఆర్‌టిసి సరికొత్త యాప్‌.. ఇక అన్ని సేవలూ అందులోనే.

ప్రయాణికుల సౌలభ్యం కోసం ఎపిఎస్‌ఆర్‌టిసి సరికొత్త యాప్‌ను అందుబాటులోకి తేనుంది. ఒకటి కాదు, రెండు కాదు.. దాదాపు 15 సేవలను ఈ యాప్‌ ద్వారా అందించేందుకు ఎపిఎస్‌ఆర్‌టిసి రెడీ అవుతోంది. ఇందుకోసం యూనిఫైడ్‌ టికెటింగ్‌ సొల్యూషన్‌ యాప్‌ (గతంలో ప్రథమ్‌) ప్రవేశపెట్టబోతోంది. ప్రస్తుతం ఆర్‌టిసిలో ఆన్‌లైన్‌ అడ్వాన్స్‌ టికెట్‌ బుకింగ్‌, బస్‌ ట్రాకింగ్‌, పార్శిల్‌ బుకింగ్‌లకు మూడు వేర్వేరు యాప్‌లున్నాయి. ఇకపై ఈ సర్వీసులన్నీ ఒకే యాప్‌లో లభ్యమవ్వనున్నాయి. దీని ద్వారా ముందుగా టికెట్‌ బుక్‌ చేసుకున్న బస్‌ను పాసింజర్‌ సమయానికి అందుకోలేకపోయినా.. అదే ...

Read More »

అనపర్తి లో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందించడాన్ని నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్‌ సత్తి సూర్యనారాయణ రెడ్డి పేర్కొన్నారు. శనివారం నియోజకవర్గ కేంద్రమైన అనపర్తి కొత్తూరు లో 1546 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సంక్షేమ పథకాలైన పింఛను ఇళ్ల స్థలాలు వంటి వాటికి లబ్ధిదారులు దరఖాస్తు చేసుకున్న 90 రోజుల్లో ప్రయోజనం చేకూర్చే దిశగా తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. కొత్తూరు లో 1546, ...

Read More »

ఇడుపులపాయ నుండి బయలుదేరిన జగన్

కడప జిల్లాలో మూడు రోజుల పర్యటనలో భాగంగా.. వేంపల్లె మండలంలోని ఇడుపులపాయ వ్యవసాయ క్షేత్రానికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి విచ్చేశారు. పులివెందులలో జరిగిన క్రిస్మస్‌ ప్రార్థనలకు బయలుదేరివెళ్లారు. ముఖ్యమంత్రి పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్టమైన భద్రతా చర్యలను చేపట్టారు. శుక్రవారం ఉదయం 8.40 నిమిషాలకు ఇడుపులపాయలోని తన గెస్ట్‌ హౌస్‌ నుండి ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి కాన్వారు ద్వారా హెలీప్యాడ్‌ వద్దకు చేరుకున్నారు. అనంతరం ఎంపి అవినాష్‌ రెడ్డితో కలిసి ముఖ్యమంత్రి హెలికాప్టర్‌ ద్వారా పులివెందులకు వెళ్లారు. ...

Read More »

క్రిస్మస్‌ సంబరాల్లో.. కలర్‌ఫుల్‌ డ్రెస్‌ లో సమంత.

క్రిస్మస్‌ సంబరాల్లో అక్కినేని సమంత మునిగిపోయారు. కలర్‌ ఫుల్‌ డ్రెస్‌ లో కనువిందు చేస్తున్నారు. పెళ్లి తర్వాత కూడా ఆమె గ్లామర్‌గా కనిపిస్తూ.. ట్రెండ్‌ క్రియేట్‌ చేస్తున్నారు. సమంత అక్కినేని ఓ వైపు సినిమాలు.. మరోవైపు ది ఫ్యామిలీ మేన్‌ 2 వెబ్‌ సిరీస్‌తో బిజీగా ఉంటూనే మధ్యమధ్యలో సామ్‌ జామ్‌ షోతో అభిమానులను ఆకట్టుకుంటున్నారు. సామ్‌ జామ్‌ షోలో సమంత చేస్తున్న ఇంటర్వ్యూలు కూడా టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌ అవుతున్నాయి. ‘ఏం మాయ చేసావె’ సినిమాలో నాగచైతన్య సరసన నటించిన సమంత అతన్నే ప్రేమించి ...

Read More »