Monthly Archives: December 2020

లండన్‌ నుంచి వచ్చిన ప్రయాణికుల్లో ఐదుగురికి కరోనా!

సోమవారం రాత్రి లండన్‌ నుంచి ఢిల్లీ విమానాశ్రయం చేరుకున్న ప్రయాణికుల్లో ఐదుగురికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. లండన్‌ నుంచి విమానంలో మొత్తం 266 మంది ఢిల్లీ చేరుకున్నారు. వారి నమూనాలను పరీక్షల నిమిత్తం నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ (ఎన్‌సిడిసి)కి పంపారు. అనంతరం కరోనా నిర్ధారణ అయిన వారిని అక్కడి నుంచి కరోనా కేర్‌ సెంటర్‌కు పంపారు. కరోనా నోడల్‌ అధికారి ఎఎన్‌ఐకి ఈ వివరాలు తెలియజేశారు.

Read More »

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు కరోనా పాజిటివ్‌

టాలీవుడ్‌ ప్రముఖ హీరోయిన్‌ రకుల్‌ప్రీత్‌సింగ్‌ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని మంగళవారం ఆమే స్వయంగా ట్విటర్‌ వేదికగా తెలిపారు. ‘నేను కరోనా టెస్టు చేయించుకోగా పాజిటివ్‌ అని తేలింది. వెంటనే హోం క్వారంటైన్‌లోకి వెళ్లాను.’ అని పేర్కొన్నారు. అలాగే ఇటీవల తనను కలిసిన వారంతా టెస్టులు చేయించుకోవాలని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రకుల్‌ ప్రస్తుతం క్రిష్‌ దర్శకత్వంలో వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా రూపొందుతున్న సినిమాలో నటిస్తున్నారు.

Read More »

కొత్తరకం స్ట్రెయిన్‌ వైరస్‌కు ఆరువారాల్లో వ్యాక్సిన్‌

కొవిడ్‌ -19 స్ట్రెయిన్‌కు ఆరువారాల్లో వ్యాక్సిన్‌ తయారు చేయగలమని జర్మనీకి చెందిన బయోఎన్‌టెక్‌ సంస్థ తెలిపింది. బయోఎన్‌టెక్‌ సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఉగుర్‌ సాహిన్‌ ఈ మేరకు ప్రకటన చేశారు. అత్యవసర వినియోగం కింద అనుమతించిన ఫైజర్‌ వ్యాక్సిన్‌ ప్రభావం చూపగలదని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ వ్యాక్సిన్‌లో వెయ్యి కంటే ఎక్కువ అమైనో ఆమ్లాలను కలిగి ఉందని, కొత్త వైరస్‌పై కూడా ప్రభావం చూపగలదని అన్నారు.

Read More »

కర్నాటకలో తొలిదశ పోలింగ్‌ ప్రారంభం

కర్నాటక పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తొలిదశ పోలింగ్‌ నేడు ప్రారంభమైంది. రెండు విడతల్లో జరగనున్న ఈ ఎన్నికల్లో నేడు తొలి దశ పోలింగ్‌ కొనసాగనుండగా.. రెండోదశ పోలింగ్‌ ఆదివారం జరగనుంది. రాష్ట్రంలోని 5,700 గ్రామ పంచాయతీలకు జరగనున్న ఈ ఎన్నికల ఫలితాలు ఈ నెల 30న విడుదల కానున్నాయి. రాష్ట్రంలో 6,004 గ్రామ పంచాయతీలు ఉండగా 300 పైగా గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. రాష్ట్రంలోని మూడు కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం ...

Read More »

సోషలిస్టులకు బిజెపి వ్యతిరేకం : ఉండవల్లి అరుణ్‌కుమార్‌

సోషలిస్టులకు బిజెపి వ్యతిరేకమని, బిజెపిలో చేరాలనుకునే వారు వాస్తవం తెలుసుకోవాలని మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. బిజెపి అన్ని పార్టీల లాంటిది కాదని, ఆ పార్టీకి ఒక ఐడియాలజీ ఉందన్నారు. ఢిల్లీలో జరిగే గొడవ క్యాపిటలిస్టులకు, సోషలిస్టులకు అని ఆయన విశ్లేషించారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి, అద్వానీ వంటి నేతలకు ఆర్‌ఎస్‌ఎస్‌ ఎలా చెక్‌ పెట్టిందో గ్రహించాలన్నారు. పోలవరం ప్రాజెక్టుపై మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పై వ్యాఖ్యలు చేశారు. అలాగే ప్రాజెక్టు విషయంలో అలసత్వం ...

Read More »

జగన్‌ కు ప్రముఖుల శుభాకాంక్షలు

నేడు ఎపి ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి 48 వ పుట్టినరోజును పురస్కరించుకొని.. ప్రముఖుల నుండి శుభాకాంక్షలు సిఎం కు వెల్లువెత్తాయి. సోమవారం ఉదయం తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకులు సిఎం జగన్‌ను ఆశీర్వదించారు. టిటిడి చైర్మన్‌ వైవి సుబ్బారెడ్డి, సిఎం జగన్‌ కు తిరుపతి ప్రసాదాన్ని అందించారు.

Read More »

ప్రముఖ మేకప్‌ మ్యాన్‌ దుర్మరణం

ప్రముఖ మేకప్‌ మ్యాన్‌ షాబు పుల్పల్లి (37) ప్రమాదవశాత్తూ ఆదివారం కన్నుమూశారు. మలయాళ హీరో నివిన్‌ పాలీ వ్యక్తిగత మేకప్‌ ఆర్టిస్ట్‌గా ఉన్న షాబు దుర్మరణం.. సినీ పరిశ్రమలో విషాదాన్ని నింపింది. క్రిస్మస్‌ పండుగ సందర్భంగా.. స్టార్‌ను వేలాడదీసేందుకు చెట్టు ఎక్కిన షాబు అకస్మాత్తుగా అదుపు తప్పి కిందపడిపోయారు. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఆయన్ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించినప్పటికీ.. రక్షించలేకపోయామని ఫిల్మ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఫెఫ్కా) డైరెక్టర్స్‌ యూనియన్‌ ఫేస్‌బుక్‌ పోస్టు ద్వారా వెల్లడించింది. షాబు అకాల మరణం తీరని ...

Read More »

సంక్రాంతికి ఏపీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

సంక్రాంతిని పురస్కరించుకుని ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఏపీఎస్‌ ఆర్టీసీ ఈడీ బ్రహ్మానందరెడ్డి వెల్లడించారు. వచ్చే ఏడాది జనవరి 8 నుండి 13 వరకు 3,607 ప్రత్యేక బస్సులు నడుస్తాయని పేర్కొన్నారు. ఈమేరకు ఈడీ ప్రకటన విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే వారికోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మొత్తం ప్రత్యేక బస్సు సర్వీసుల్లో హైదరాబాద్‌ సహా తెలంగాణాలోని ఇతర ప్రాంతాల నుండి 1251బస్సులు నడపనున్నట్లు పేర్కొన్నారు. బెంగుళూరు నుండి 433, చెన్నై నుండి 133, ఏపీలోని ఇతర జిల్లాల నుండి విజయవాడకు 201, విశాఖకు ...

Read More »

నోబుల్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డుల్లోకి మోహన్‌ బాబు మనవరాలు

కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌ బాబు మనవరాలు, మంచు లక్మీ కుమార్తె విద్యా నిర్వాణ యంగ్‌ చెస్‌ ట్రైనర్‌గా నోబెల్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డుల్లో స్థానం సంపాదించారు. శనివారం నోబుల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ ప్రతినిధి డా. చోకలింగం బాలాజీ సమక్షంలో జరిగిన పరీక్షల్లో విద్యా ఉత్తీర్ణురాలు కావడంతో ఈ రికార్డు సొంతం చేసుకున్నారు. బాలాజీ మాట్లాడుతూ ఆరేళ్ల వయస్సులోనే విద్యా నిర్వాణ చెస్‌ గేమ్‌లో ట్రైనింగ్‌ ఇవ్వడం గొప్ప విషమయని, మా సంస్థ తరుపున రికార్డ్‌ అందించినందుకు హ్యాపీగా ఉందని అన్నారు. నోబుల్‌ ...

Read More »

ఏపీ కేబినెట్ భేటీ కీలక నిర్ణయాలు ఇవే..

ముఖ్యమంత్రి వైఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఏపీకేబినెట్‌ సమావేశం ముగిసింది. రైతు భరోసా పథకం, ఇన్‌పుట్‌ సబ్సిడీ నేరుగా ఆర్టీజీఎస్‌ ద్వారా చెల్లింపులు చేసేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. సమావేశంలో ఇళ్ల పట్టాల పంపిణీ, పక్కా ఇళ్ల నిర్మాణంపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు ఆర్డినెన్స్‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఏపీ సర్వే అండ్‌ బౌండరీ చట్ట సవరణ, ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక పాలసీని కేబినెట్‌ ఆమోదించింది. 6 జిల్లాల్లో వాటర్‌షెడ్ల అభివృద్ధి పథకం అమలుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ...

Read More »