Monthly Archives: December 2020

నేడే వెబ్‌ ఆప్షన్లకు చివరి అవకాశం

ఉపాధ్యాయ బదిలీల్లో వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవడంతో పాటు సవరణలకు శుక్రవారం అర్ధరాత్రి వరకు అవకాశం కల్పిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. సచివాలయంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయులు లేక మారుమూల పాఠశాలలు మూతపడకుండా ఉండాలనే ఉద్దేశంతో 16 వేల ఖాళీలను బ్లాక్‌ చేశామన్నారు. పోస్టుల బ్లాకింగ్‌ ఎత్తేస్తే రాష్ట్రవ్యాప్తంగా మారుమూల ప్రాంతాల్లో ఉన్న 145 మండలాల్లోని 5,725 పాఠశాలల్లో 10,198 పోస్టులు భర్తీ కావని చెప్పారు. గురువారం సాయంత్రం వరకు 76,119 మంది బదిలీలకు దరఖాస్తు ...

Read More »

ఎఫ్‌ 3 మూవీ షూటింగ్‌ ప్రారంభం

వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌ హీరోలుగా నటించి మెప్పించిన చిత్రం ఎఫ్‌ 2. దీనికి సీక్వెల్‌గా ఎఫ్‌3 సినిమా కూడా రాబోతుంది. ఈ చిత్ర షూటింగ్‌ గురువారం హైదరాబాద్‌లో జరగ్గా.. దీనికి ముఖ్య అతిధిగా అల్లు అరవింద్‌ హాజరై క్లాప్‌కొట్టి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా 2018లో ఎఫ్‌ 2 మూవీ షూటింగ్‌ ప్రారంభమైనప్పుటి ఫొటో.. తాజాగా గురువారం షూటింగ్‌కు క్లాప్‌ కొట్టిన ఫొటోస్‌ని చిత్ర దర్శకుడు అనీల్‌ రావిపూడి ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. కాగా ఈ సినిమాను దిల్‌రాజు నిర్మిస్తున్నారు. ఎఫ్‌3 మూవీలో నటిస్తున్న స్టార్‌ ...

Read More »

సంక్రాంతి పండుగ నెల రోజుల ముందే వచ్చింది : జగన్‌

సంక్రాంతి పండుగ నెల రోజుల ముందే వచ్చిందా అన్నట్లు ఉందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో గురువారం ఏర్పాటు చేసిన బిసి సంక్రాంతి వేడుకల్లో సిఎం జగన్‌ పాల్గొన్నారు. వేదిక మీదకు చేరుకొని జ్యోతిరావ్‌ పూలే, దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అననంతరం సిఎం మాట్లాడుతూ.. మహిళా అభ్యుదయంలో మరో చరిత్రకు శ్రీకారం చుట్టామన్నారు. ఇదే వేదికపై 18 నెలల క్రితం సిఎంగా ప్రమాణ స్వీకారం చేశానని తెలిపారు. బిసి కార్పొరేషన్లలో ...

Read More »

అమరావతిలో హై టెన్షన్‌

అమరావతి రాజధాని రైతుల ఉద్యమం నేటితో సంవత్సరం అవుతున్న నేపథ్యంలో అమరావతి జెఎసి ఆధ్వర్యంలో రాయపూడిలో జనభేరి సభ నిర్వహిస్తున్నారు. అనేక ఆంక్షలు, నిర్బంధాలతో రైతులు ఉద్యమాన్ని సంవత్సరం పూర్తి చేశారు. ముఖ్యమంత్రి జగన్‌ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా రైతులు రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో ఆందోళనలు చేపట్టారు. ఇదిలా ఉండగా.. మూడు రాజధానులకు అనుకూలంగా మందడంలో కూడా దీక్షలు చేస్తున్నారు. గతంలో అమరావతి శంకుస్థాపన ప్రాంతమైన ఉద్దండరాయనిపాలెం, అమరావతి రైతులకు, మూడు రాజధానుల కోసం ఆందోళన చేస్తున్న వారికి ఘర్షణ ...

Read More »

చంద్రబాబు కాన్వాయ్‌ను అడ్డుకున్న పోలీసులు

ఎపి రాజధానిగా అమరావతిని కొనసాగించాలని అమరావతి ప్రాంత రైతులు చేస్తున్న నిరసనలు నేటికి ఏడాది కావడంతో అమరావతి జెఎసి ఆధ్వర్యంలో రాయపూడిలో జనభేరి సభను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సభకు వివిధ రాజకీయ పార్టీ నాయకులు హాజరవుతున్నారు. ఈ క్రమంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు రాయపూడి సభకు వెళ్తుండగా ఆయన కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఉద్దండరాయుని పాలెం వెళ్లేందుకు కాన్వాయ్‌కు అధికారులు అనుమతి ఇవ్వలేదు. దీంతో టిడిపి నాయకులు, రైతులు ఆందోళనకు దిగడంతో చివరకు రెండు వాహనాలకు అనుమతి ఇచ్చారు. కాన్వాయ్‌లో ...

Read More »

మహేశ్‌ అందానికి ఫిదా అయిన సాయిపల్లవి

టాలీవుడ్‌లో అందమైన హీరో ఎవరంటే.. సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు అని ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. నాలుగు పదుల వయసులోనూ ఆయన అందం ఏమాత్రం తగ్గలేదంటే.. ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆయన అందానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. అందుకే ఆయనను మిల్కీబారు అని ముద్దుగా పిలుస్తారు. ఆయన అందానికి అభిమానులు మాత్రమే కాదు.. సెలబ్రిటీలు కూడా మనసు పారేసుకున్నారు. ఆ కోవలోకి తాజాగా నటి సాయిపల్లవి కూడా చేరారు. ‘మహేశ్‌బాబు ఎంత అందంగా ఉంటాడు… ఏ సమయంలోనైనా ఆయన స్కిన్‌ మెరిసిపోతుంటుంది. కొన్నిసార్లు మహేష్‌ ఫొటోలు చూసి.. లుక్స్‌పరంగా ఒక వ్యక్తి ...

Read More »

కేంద్ర మంత్రి గజేంద్రసింగ్‌తో జగన్‌ భేటీ

ఢిల్లీ పర్యటనలో భాగంగా రెండో రోజైన బుధవారం ఎపి సిఎం జగన్‌మోహన్‌ రెడ్డి కేంద్ర జలశక్తి శాఖమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌తో బేటీ అయ్యారు. తొలి రోజు (మంగళవారం) కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిసిన జగన్‌.. ఎపిలో వరద నష్టానికి నిధులు మంజూరు చేయాలని, విభజన చట్టం హామీలు పరిష్కరించాలని కోరిన విషయం తెలిసిందే. నేడు మరో కేంద్ర మంతి షెకావత్‌ను కలిసిన జగన్‌.. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన విషయాలను చర్చించారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన ఎపి ప్రభుత్వం సవరించిన అంచనాలను కేంద్రం ఆమోదించాలని జగన్‌ ...

Read More »

కేంద్రంతో కష్టం…రైతు సమస్యల పరిష్కారానికి కమిటీ ఏర్పాటు : సుప్రీం

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో అలుపెరుగని యోధుల్లా రైతుల సాగిస్తున్న ఆందోళన జనజీవనానికి ఇబ్బందిగా మారిందని దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. సమస్యను పరిష్కరించడంలో విఫలమైన కేందం తీరుపై అసహనం వ్యక్తం చేసింది. ప్రభుత్వం చేపడుతున్న చర్చలు ఫలించేలా కన్పించట్లేదన్న న్యాయస్థానం… సమస్యను పరిష్కరించేందుకు కమిటీని ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు చెప్పింది. రైతుల ఆందోళనల విరమింప చేయాలని కోరుతూ రిషభ్‌ శర్మ అనే వ్యక్తి పిటిషన్‌ దాఖలు చేయగా…మద్దతుగా పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన ...

Read More »

వెబ్‌ సిరీస్‌లో నటిస్తున్న హన్సిక

 సమంత, నిత్యామీనన్‌, తమన్నా వంటి ప్రముఖ నటీమణులు వెబ్‌సిరీస్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కోవలోకి తాజాగా హన్సిక కూడా చేరింది. పిల్ల జమీందార్‌, భాగమతి సినిమాలను తెరకెక్కించిన అశోక్‌ డైరెక్ట్‌ చేస్తున్న వెబ్‌సిరీస్‌లో హన్సిక నటిస్తోంది. ఈ వెబ్‌సిరీస్‌కు నషా అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ముంబై బ్యాక్‌డ్రాప్‌లో యూత్‌ఫుల్‌ కథతో సాగే ఈ వెబ్‌ సిరీస్‌ షూటింగ్‌ చివరి దశలో ఉన్నట్లు సమాచారం. ఈ వెబ్‌ సిరీస్‌ని అమెజాన్‌ ప్రైమ్‌ వారు నిర్మించగా.. వచ్చే ఏడాది ఆరంభంలోనే పది ఎపిసోడ్‌లతో తమిళ, ...

Read More »

ఢిల్లీకి బయల్దేరిన సీఎం జగన్‌

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పయనమయ్యారు. గన్నవరం ఎయిర్‌ పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి వెళ్లారు. ఈరోజు, రేపు ఢిల్లీలో ఉండనున్న సీఎం జగన్ ఈరాత్రి 9గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సమావేశంకానున్నారు. రాష్ట్ర సమస్యలతోపాటు విభజన చట్టంలోని పెండింగ్ అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో శాంతిభద్రతలు, దిశ చట్టంపై అమిత్‌‌షాతో డిస్కస్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోడీతోపాటు పలువురు కేంద్ర మంత్రులను జగన్ కలిసే అవకాశం ఉంది. అకాల వర్షాలు, వరదల వల్ల జరిగిన పంటనష్టం ...

Read More »