Monthly Archives: January 2021

నిపుణుల కమిటీపై విమర్శలను ఖండించిన సుప్రీంకోర్టు

వ్యవసాయ చట్టాలపై నియమించిన నిపుణుల కమిటీపై వచ్చిన విమర్శలను సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలపై రైతులకు, కేంద్రానికి మధ్య నెలకొన్న ప్రతిష్టంభనను పరిష్కరించేందుకు గత వారం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. చట్టాలపై నిర్ణయం తీసుకునే అధికారం కూడా కమిటీకి లేదని తేల్చి చెప్పింది.  బుధవారం విచారణ సందర్భంగా కోర్టు ఈ విధంగా వ్యాఖ్యానించింది. ఇరువైపులా వాదనలు విని, నివేదికను సమర్పించాలని కమిటీని ఆదేశించామని, అలాంటప్పుడు పక్షపాతంగా వ్యవహరించేందుకు అవకాశం ఎక్కడ ఉందని కోర్టు ప్రశ్నించింది. ...

Read More »

కరోనా భయంతో ఈ వ్యక్తి మూడు నెలలుగా ఎయిర్‌పోర్టులోనే..!

మూడు నెలలుగా విమానాశ్రయంలోనే ఉంటున్న ఒక వ్యక్తిని శనివారం అమెరికా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతనిని విచారించాక అసలు విషయం తెలుసుకుని అవాక్కవడం అధికారుల వంతయింది. ఇంతకీ విషయం ఏమిటంటే.. భారతీయ సంతతికి చెందిన 36 ఏళ్ల ఆదిత్య సింగ్‌ కరోనా సోకుతుందేమోనన్న భయంతో విమానాశ్రయంలోనే ఉండిపోయినట్లు వివరించాడు. కాగా, ఆదిత్య సింగ్‌ కాలిఫోర్నియాలోని లాస్‌ఏంజిల్స్‌ శివారులో నివసిస్తున్నాడు. హాస్పటాలిటీలో మాస్టర్స్‌ డిగ్రీ చేసినట్లు తెలిపారు. అక్టోబర్‌ 19న  లాస్‌ ఏంజిల్స్‌ నుండి విమానంలో చికాగోలోని ఓహెర్‌ విమానాశ్రయానికి వచ్చాడని, అప్పటి నుండి అక్కడే ...

Read More »

మహేష్‌బాబు న్యూ లుక్

మహేష్‌బాబు ఒక్కోసినిమాకి ఒక్కోలా డిఫరెంట్‌ లుక్‌లో కనిపిస్తారు. సినిమాలో ఆయన చేసే పాత్ర కోసం తనకు తానే వైవిధ్యభరితంగా మారిపోతారు. దీనికి ‘ఖలేజా’, నిజం, ‘పోకిరి’ వంటి సినిమాలనే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కాగా, ఆయన వయసుతో సంబంధం లేకుండా ఆకర్షణీయంగా కనిపించడానికి ఏ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.. చర్మ రహస్యం ఏంటీ అని ఆయన్ను పలుమార్లు మీడియా ప్రశ్నించినా.. ఎప్పటికప్పుడు చిరునవ్వుతోనే సమాధానం చెప్పి దాటవేస్తుంటారు. అయితే ఇటువంటి ప్రశ్నలన్నింటికీ చెక్‌ పెట్టడానికే తాజాగా ఆయన చర్మ రహస్యానికి గల కారణమేంటో బయటపెట్టారు. ఆయన చర్మాన్ని ...

Read More »

నాడు సీఐ గా..నేడు వైసీపీ ఎంపీ గా అందర్నీ ఆకర్షించిన గోరంట్ల మాధవ్

గోరంట్ల మాధవ్.. పోలీస్ శాఖలో సర్కిల్ ఇన్స్ పెక్టర్. తన విధి నిర్వహణలో నిజాయితీగా వ్యవహరించారనే పేరు సంపాదించారు. తాను పనిచేసిన చోట్ల ప్రజల మన్ననలు పొందారు. పోలీస్ అధికారుల సంఘం నేతగా… పోలీసులను తిట్టిన అధికార ఎంపీపైకే మీసం మెలేసి.. నాలుక కోస్తా అని వార్నింగ్ ఇచ్చారు. దీంతో అధికార పార్టీకి, ప్రత్యేకించి కొందరు నేతలకు ఆయనపై కక్ష పెరిగింది. ఆయనకు కూడా ప్రజల్లో మంచి ఇమేజ్ వచ్చింది. రాజకీయాల్లోకి రావాలని ఆయన మొగ్గు చూపారు. దీంతో ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీ విరమణ ...

Read More »

దేవినేని ఉమ అరెస్ట్‌..గొల్లపూడి సెంటర్‌లో ఉద్రిక్తత

మాజీ మంత్రి దేవినేని ఉమ దీక్షతో గొల్లపూడి సెంటర్‌ ఉద్రిక్తంగా మారింది. మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలకు నిరసనగా.. మంగళవారం విజయవాడ గొల్లపూడి సెంటర్‌లోని ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద దీక్ష చేపట్టేందుకు సిద్ధమయిన దేవినేని ఉమ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోవిడ్‌ నిబంధనల కారణంగా దీక్షకు అనుమతి లేదని ముందే చెప్పిన పోలీసులు.. ఆయన అక్కడకు రాగానే అరెస్టు చేశారు. పోలీసు వాహనాన్ని అడ్డుకునేందుకు టిడిపి కార్యకర్తలు ప్రయత్నించారు.    గొల్లపూడికి ఎమ్మెల్యే వంశీ, వసంత కృష్ణప్రసాద్‌లు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ...

Read More »

ఫిబ్రవరిలో అన్ని తరగతులు!.. అధికారులకు జగన్‌ ఆదేశం

ఫిబ్రవరి ప్రథమార్ధంలో అన్ని తరగతులకూ పాఠశాలలు తెరిచే విషయంపై ఆలోచన చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. రోజువారీ తరగతుల నిర్వహణపై కూడా ఆలోచన చేయాలని చెప్పారు. పాఠశాల విద్యాశాఖపై సిఎం తన క్యాంపు కార్యాలయంలో సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యాసంస్థల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామన్నారు. నాడు-నేడు ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించామన్నారు. పిల్లలు పాఠశాలకు రాకపోతే తల్లిదండ్రులకు సందేశం వెళ్లాలని, గ్రామ వాలంటీర్‌తో యోగక్షేమాలు కనుక్కోవాలని తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోని వెల్ఫేర్‌ ...

Read More »

నేను కూడా తెలుగింటి అల్లుడినే

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, నభా నటేష్‌ హీరో హీరోయిన్లుగా నటించిన ‘అల్లుడు అదుర్స్‌’ చిత్రంలో ‘గజ’గా మెప్పించారు సోనూసూద్‌. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలైంది. తాజాగా ఈ చిత్రం సక్సెస్‌ మీట్‌ను చిత్ర బృందం ఏర్పాటు చేసింది. శనివారం హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో సోనూసూద్‌ మాట్లాడుతున్నంత సేపూ అభిమానులు హర్షధ్వానాలతో చప్పట్ల మోత మోగింది. ఆ వేదికపై హీరోకి కూడా లభించనంత ఆదరణ ఈయనకు లభించింది. ఈ సందర్భంగా వేదికపై మాట్లాడిన సోనుసూద్‌ తెలుగు వారితో ఉన్న అనుబంధాన్ని ...

Read More »

కరోనా వ్యాక్సిన్‌ పంపిణీలో భారత్‌ ప్రపంచ రికార్డు !

కరోనా వ్యాక్సిన్‌ పంపిణీలో భారత్‌ ప్రపంచ రికార్డును నెలకొల్పింది. తొలిరోజు అత్యధిక సంఖ్యలో కరోనా టీకాలను పంపిణీ చేసిన దేశంగా భారత్‌ రికార్డుకెక్కింది. టీకా పంపిణీ ప్రారంభమైన తొలిరోజే దేశవ్యాప్తంగా 2,07,229 మందికి వ్యాక్సిన్‌ ఇచ్చామని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. అమెరికా, యూకే, ఫ్రాన్స్‌ దేశాల్లో ఒకే రోజు వేసిన టీకాల సంఖ్య కంటే ఎక్కువగా భారత్‌ టీకాలను వేసిందని కేంద్ర ఆరోగ్యశాఖ అదనపు కార్యదర్శి మనోహన్‌ అగ్నాని ప్రకటించారు. రెండో రోజు కూడా మొత్తం 17,072 మందికి వ్యాక్సిన్‌ కొనసాగిందని కేంద్రం తెలిపింది.

Read More »

ప్రముఖ నిర్మాత వి.దొరస్వామి రాజు కన్నుమూత

ప్రముఖ నిర్మాత వి.దొరస్వామి రాజు కన్నుమూశారు. అనారోగ్య కారణంగా ఆయన మృతి చెందారు. దొరస్వామి రాజు నిర్మాతగా మారక ముందు సినిమాలను విఎంసి పేరుతో పంపిణీ చేశారు. గుంతకల్లు కేంద్రంగా రాయలసీమ అంతటా వి.ఎం.సి. సంస్థ విస్తరించింది. తొలిసారి ఎన్టీఆర్‌ ‘సింహబలుడు’ చిత్రాన్ని దొరస్వామిరాజు విడుదల చేశారు. వి.ఎం.సి. బ్యానర్‌ ద్వారా డ్రైవర్‌ రాముడు, వేటగాడు, యుగంధర్‌, గజదొంగ, ప్రేమాభిషేకం, కొండవీటి సింహం, జస్టిస్‌ చౌదరి సినిమాలను విడుదల చేశారు. ఇప్పటివరకు 400 సినిమాలను వి.దొరస్వామి రాజు పంపిణీ చేశారు. కిరాయిదాదా చిత్రం ద్వారా ...

Read More »

ఎన్టీఆర్‌ కు భారతరత్న రాకుండా సొంతవాళ్లే అడ్డుపడ్డారు : లక్ష్మీపార్వతి

నేడు ఎన్‌టిఆర్‌ 25 వ వర్థంతిని పురస్కరించుకొని.. హైదరాబాద్‌ ఎన్టీఆర్‌ ఘాట్‌ లో లక్ష్మీ పార్వతి, నందమూరి బాలకృష్ణ, చంద్రబాబు, తదితరులు రామారావుకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ తెలుగు అకాడమీ చైర్‌ పర్సన్‌ లక్ష్మీ పార్వతి మీడియాతో మాట్లాడుతూ.. నందమూరి తారక రామారావు గొప్ప నాయకుడు, ఎందరికో స్ఫూర్తిప్రదాత అని కొనియాడారు. ఎన్టీఆర్‌ కు భారతరత్న రాకుండా సొంత కుటుంబ సభ్యులే అడ్డుపడ్డారని లక్ష్మీపార్వతి వ్యాఖ్యానించారు. టిడిపి అధికారంలో ఉన్నప్పుడే కేంద్రం పై ఒత్తిడి చేస్తే ఎప్పుడో వచ్చేదన్నారు. ఎన్టీఆర్‌ కు భారతరత్న ...

Read More »