Monthly Archives: January 2021

విజయవాడలో రైతుగర్జన ప్రారంభం

కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్య‌వ‌సాయ‌చట్టాలకు వ్యతిరేకంగా, ఢిల్లీలో రైతుల నిరసనకు మద్దతుగా ఎఐకెఎస్‌, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో విజయవాడలో రైతుగర్జన ర్యాలీ సోమవారం ఉదయం 10గంటలకు ప్రారంభమైంది. వివిధప్రాంతాల నుండి ట్రాక్టర్లలో రైతులు, రైతుసంఘంనాయకులు నగరంలోని పడవలరేవు బిఆర్‌టిఎస్‌ రోడ్డు వద్దకు చేరుకున్నారు. అనంతరం ట్రాక్టర్ల ర్యాలీని ప్రారంభించారు. మోటారు సైకిళ్లపై కూడా ప్రజాసంఘాల నాయకులు ర్యాలీలో పాల్గొన్నారు.. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, రైతుసంఘం రాష్ట్ర నాయకులు వి.కృష్ణయ్య, సిఐటియు రాష్ట్ర నాయకులు ముజఫర్‌ అహ్మద్‌, మాజీమంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, తదతరులు ర్యాలీ అగ్రభాగంలో ...

Read More »

రాష్ట్రంలో 232 కరోనా కేసులు

రాష్ట్రంలో గత 24 గంటల్లో 40,177 మందికి కరోనా పరీక్షలు నిర్వహించిన వైద్యారోగ్యశాఖ 232 మందికి వ్యాధి సోకినట్లు నిర్ధారించింది. నలుగురు చనిపోయారు. మరో 352 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 8,83,082కు, మరణాల సంఖ్య 7,115కు చేరిందని వైద్యారోగ్యశాఖ ఆదివారం విడుదల చేసిన బులిటెన్‌లో పేర్కొంది. 8,72,897 మంది ఇప్పటికే కోలుకోగా, 3,070 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఆదివారం రాష్ట్రంలో అత్యధికంగా చిత్తూరులో 56, కృష్ణాలో 40 కేసులు నమోదు కాగా, అత్యల్పంగా ...

Read More »

చర్చకు సిద్ధమే : విజయసాయిరెడ్డి

విజయనగరంలో రామతీర్థం ఘటనపై రాజకీయం ప్రతి నిమిషానికి వేడెక్కుతోంది. చంద్రబాబు కంటే ముందే ఎంపి విజయసాయిరెడ్డి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోకేష్‌ రమ్మన్నట్లు అప్పన్న సన్నిధికి వస్తానని, చర్చకు సిద్ధంగా ఉన్నామని ఆయన వెల్లడించారు. జగన్‌ను అప్రతిష్ట పాలు చేసేందుకు చంద్రబాబు పూనుకున్నారని విమర్శించారు.అంతకుముందు కొండపైకి వెళ్లేందుకు ఎవరికీ అనుమతి లేదని చెప్పిన పోలీసులు విజయసాయిరెడ్డిని అనుమతించడంతో బిజెపి నాయకులు, కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. తమను కూడా అనుమతించాల్సిందేనని ఎమ్మెల్సీ మాధవ్‌ పోలీసులతో ఘర్షణ పడ్డారు. బిజెపి నేతల ఆందోళన ...

Read More »

ప్రభాస్ రాధే శ్యామ్‌

 ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు రాధేశ్యామ్‌ చిత్రబృందం న్యూఇయర్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. ముందుగా ఎటువంటి ప్రకటనా చేయకుండా ఒక్కసారిగా పోస్టర్‌ రిలీజ్‌ చేయడంతో అభిమానుల్లో ఆనందం తారాస్థాయికి చేరింది.ఈ పోస్టర్‌లో డార్లింగ్‌ ప్రభాస్‌ క్యూట్‌ లుక్స్‌లో దర్శనమిస్తున్నారు. చేతిలో ట్రావెల్‌ బ్యాగ్‌, తలపై స్టైలిష్‌ క్యాప్‌ పెట్టుకుని హ్యండ్‌సమ్‌గా కనిపిస్తున్నారు. ఈ పోస్టర్‌తో పాటు రాధేశ్యామ్‌లో నటిస్తున్న నటీనటులు, టెక్నీషియన్స్‌ వివరాలను కూడా చిత్ర బృందం ప్రకటించింది. ఈ పోస్టర్‌లో ‘మీ హఅదయాలను గెలుచుకోడానికి వచ్చేశాడు.. మీరు మరోసారి అతడి ప్రేమలో పడడం ఖాయం.

Read More »

కేంద్ర మాజీ హోంమంత్రి కన్నుమూత

కేంద్రమాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత బూటాసింగ్‌ (86) శనివారం ఉదయం కన్నుమూశారు. ఆయన మరణం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ,కాంగ్రెస్‌పార్టీ నేత రాహుల్‌గాంధీ ట్విట్టర్‌ ద్వారా తమ సంతాపాన్ని తెలిపారు. పంజాబ్‌లోని జలంధర్‌ జిల్లా ముస్తఫాపూర్‌లో 1934, మార్చి 21న బూటాసింగ్‌ జన్మించారు. జర్నలిస్టుగా కెరీర్‌ను ప్రారంభించిన ఆయన.. అకాలీదశ్‌ పార్టీలో చేరి రాజకీయ జీవితం ఆరంభించారు. ఆ తర్వాత కాంగ్రెస్‌పార్టీలో చేరారు. దళిత నేతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. అంచెలంచెలుగా ఎదుగుతూ.. గాంధీ కుటుంబానికి సన్నిహితులయ్యారు. ఎనిమిది పర్యాయాలు ...

Read More »