Monthly Archives: February 2021

అంతర్జాతీయ విమానాలపై నిషేధం పొడిగింపు

అంతర్జాతీయ విమాన సర్వీసులపై ఆంక్షలను మార్చి 31వరకు పొడిగించినట్లు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డిజిసిఎ) తెలిపింది. గతంలో విధించిన నిషేధం ఈ నెల 28తో ముగియ నుంది. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. మరోసారి నిషేధాన్ని పొడిగిస్తున్నట్లు డిజిసిఎ ప్రకటించింది. అయితే కార్గో విమానాలు, ఎయిర్‌ బబుల్‌ ఒప్పందంలో భాగంగా నడుస్తున్న ప్రత్యేక విమానాలకు ఈ ఆంక్షల నుండి మినహాయింపు ఇచ్చింది. కాగా, భారత్‌ సుమారు 27 దేశాలతో ఎయిర్‌ బబుల్‌ ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దేశాల ...

Read More »

మాజీ ఎమ్మెల్యే జెసి ప్రభాకర్‌ రెడ్డిపై కేసు నమోదు

అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జెసి ప్రభాకర్‌ రెడ్డిపై మరో కేసు నమోదైంది. జెసి పిఎ ఇంట్లో 130 క్రికెట్‌ కిట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా కిట్లను పంపిణీ చేసేందుకే తీసుకొచ్చారని తేల్చారు. దీంతో జెసి ప్రభాకర్‌ రెడ్డి, పిఎ గౌరీనాథ్‌లపై కేసు నమోదు చేశారు. ఇద్దరిపై 188, 171 సెక్షన్ల కింద కేసు నమోదైంది. స్థానిక జూనియర్‌ కళాశాల సమీపంలోని బృందావనం అపార్ట్‌మెంట్‌లో, జెసి సోదరుల అనుచరుడి పెంట్‌హౌస్‌లో పెద్ద ఎత్తున క్రికెట్‌ కిట్లను పోలీసులు స్వాధీనం ...

Read More »

మార్చి 5వ తేదిన రాష్ట్ర బంద్‌

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు నిరసనగా మార్చి 5వ తేదిన రాష్ట్ర బంద్‌ నిర్వహించాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక పిలుపునిచ్చింది. మోడీ ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానాలకు చెంపపెట్టుగా ప్రజానీకం ఈ బంద్‌లో పాల్గొని, విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది. విజయవాడలోని దాసరి భవన్‌లో శుక్రవారం సాయంత్రం జరిగిన విలేకరుల సమావేశంలో ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక నాయకులు జి.ఓబులేశు, వి.ఉమామహేశ్వరరావు, పి.గౌతంరెడ్డి ఈ మేరకు ప్రకటించారు. అంతకు ముందు విశాఖపట్నంలో ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగిన రాస్తారోకోలో ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఐదవ ...

Read More »

ఆస్కార్‌ రేసులో సూర్య సినిమా

నిజ జీవిత కథ ఆధారంగా సూర్య హీరోగా తెరకెక్కిన ‘సూరారై పోట్రు’ సినిమా 2021 ఆస్కార్‌ పోటీలకు నామినేట్‌ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఆస్కార్‌ బరిలో మూడు విభాగలలో నెక్స్ట్‌ లెవెల్‌ కు ఎంపికైనట్లు సమాచారం. ఈ విషయాన్నీ స్వయంగా నిర్మాణసంస్థ వెల్లడించింది. ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో సూరారై పొట్రు(ఆకాశం నీ హద్దురా) ఉత్తమనటుడు విభాగంలో సూర్య, ఉత్తమనటిగా అపర్ణ బాలమురళి ఎంపికైనట్లు ఆస్కార్‌ విడుదల చేసిన జాబితాలో చూడవచ్చు. ఆస్కార్‌కు నామినేట్‌ అయిన 366 సినిమాల్లో ‘సూరారై పోట్రు’ ఒకటని ...

Read More »

అనుమానంతోనే అనూష హత్య : ఎస్‌పి

అనుమానంతోనే అనూషను తోటి విద్యార్థి విష్ణువర్థన్‌రెడ్డి హత్య చేశాడని నరసరావుపేట రూరల్‌ ఎస్‌పి విశాల్‌గున్నీ తెలిపారు. నరసరావుపేటలో డిగ్రీ విద్యార్థిని హత్యోదంతం సంచలనం రేపింది. శుక్రవారం ఎస్‌పి విలేకర్ల సమావేశంలో హత్యకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. అనూష వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉంటోందని విష్ణుకు అనుమానం వచ్చింది. ఈ క్రమంలోనే ఈనెల 24న అనూషను నరసరావుపేటకు తీసుకెళ్లాడు. అక్కడే ఆమెతో గొడవపడ్డాడు. ఈ నేపథ్యంలో ఆమె గొంతు నులిమి చంపాడు. అనంతరం అక్కడ సాక్ష్యాధారాలు లేకుండా చేయాలని ప్రయత్నించాడని పేర్కొన్నారు. దీనికి సంబంధించి నిందితుడికి ...

Read More »

నవ్‌దీప్‌ కౌర్‌కు బెయిల్‌ మంజూరు

కార్మిక హక్కుల కార్యకర్త నవ్‌దీప్‌ కౌర్‌కు పంజాబ్‌, హర్యానా కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. హర్యానాలో సోనిపట్‌లోని ఒక పారిశ్రామిక యూనిట్‌ ముందు ధర్నా చేసి…ఆ సంస్థ నుండి డబ్బులు డిమాండ్‌ చేశారన్న ఆరోపణలపై గత నెల 12న నవ్‌దీప్‌ కౌర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఎట్టకేలకు ఆరు వారాల తర్వాత ఆమెకు ఉపశమనం లభించింది. ఆమెకు బెయిల్‌ మంజూరైనట్లు నవ్‌దీప్‌ కౌర్‌ న్యాయవాది అర్ష్‌దీప్‌ సింగ్‌ చీమా తెలిపారు. ఆమె బెయిల్‌ పిటిషన్‌లో, తనపై పోలీసులు తప్పుడు కేసులు బనాయించడంతో పాటు దాడి ...

Read More »

దేవరకొండలో విజయ్‌ ప్రేమ కథ

విజయ్‌ శంకర్‌, మౌర్యాని జంటగా శివత్రి ఫిలిమ్స్‌ పతాకంపై రూపొందిన చిత్రం ‘దేవరకొండలో విజయ్ ప్రేమకథ’. వెంకటరమణ.ఎస్‌ ఈ చిత్రానికి దర్శ కత్వం వహించారు. పడ్డాన మన్మథరావు నిర్మాత. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసు కున్న ఈ సినిమా మార్చి 11న విడుదలకానుంది. ‘ఒక ఊర్లో జరిగే విజరు అనే యువకుడి ప్రేమ కథే ఈ టైటిల్‌కి కారణం. విజరు దేవరకొండ మీద అభిమానంతో ఆయన పేరునే ఈ సినిమాకు పెట్టుకున్నా’ అంటున్నారు దర్శకుడు.

Read More »

ఆరుగురు ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను ప్రకటించిన వైసిపి

అసెంబ్లీ కోటా నుండి ఆరుగురు ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను వైసిపి ప్రకటించింది. ఈమేరకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విలేకర్ల సమావేశంలో పేర్లను ప్రకటించారు. బల్లి కళ్యాణ చక్రవర్తి, మహ్మద్‌ ఇక్బాల్‌, చల్లా భగీరథరెడ్డి, సి.రామచంద్రయ్య, కరీమున్నీసా, దువ్వాడ శ్రీనివాస్‌లు ఉన్నారు.

Read More »

నాని ‘శ్యామ్‌ సింగరాయ‌’ ఫస్ట్‌లుక్‌

నాని ‘టక్‌ జగదీష్‌’, ‘శ్యామ్‌ సింగరారు’ సినిమాలను తెరకెక్కిస్తున్నారు. వీటిలో టక్‌ జగదీష్‌ ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. బుధవారం నాని పుట్టినరోజు సందర్భంగా ‘శ్యామ్‌ సింగరారు’ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. పేరు శ్యామ్‌.. పూర్తి పేరు శ్యామ్‌ సింగరారు… అంటూ నాని తన ట్విటర్‌ ద్వారా ఫస్ట్‌లుక్‌ను రిలీజ్‌ చేశాడు. ఈ చిత్రం కలకత్తా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని రాహుల్‌ సాంకృత్యాన్‌ దర్శకత్వంలో నాగవంశీ నిర్మిస్తున్నారు.

Read More »

మహారాష్ట్రలో 186 మంది విద్యార్థులకు కరోనా

మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తోంది. వాషిం జిల్లాలోని ఒక పాఠశాలకు చెందిన హాస్టల్‌లో 190 కరోనా కేసులు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. 186 మంది విద్యార్థులతో పాటు నలుగురు ఉపాధ్యాయులకు కరోనా సోకిందని అన్నారు. దీంతో ఆ హాస్టల్‌ను కంటైన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటించారు. ఈ విద్యార్థులు అమరావతి, యవాత్మల్‌ జిల్లాల నుండి వచ్చారని, ఈ రెండు జిల్లాల్లో అధికంగా కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. కాగా, గడిచిన 24 గంటల్లో మహారాష్ట్రలో అత్యధికంగా 8వేల కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రజలు కరోనా నిబంధనలను పాటించకపోతే.. కఠిన ...

Read More »