Monthly Archives: February 2021

’ఉప్పెనం‘త ప్రేమతో సుకుమార్

గురువు దగ్గర విద్య నేర్చుకున్న తర్వాత ఆ శిష్యుడు ప్రయోజకుడైతే ఆ గురువు ఆనందమే వేరు.. ఇప్పుడు ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ అదే ఆనందంలో వున్నారు. ‘ఉప్పెన’ సినిమాతో ప్రేక్షకుల అభినందనలతో పాటు విమర్శకుల ప్రశంసలు పొందుతున్న దర్శకుడు బుచ్చిబాబు, సుకుమార్‌ దగ్గర దర్శకత్వ శాఖలో శిక్షణ పొందాడు. సుకుమార్‌ తరహాలోనే విభిన్నమైన, సాహసోపేతమైన ప్రేమకథను ఓ ప్రేమకావ్యంలా మలిచాడు. ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరణ.. వసూళ్ల సునామీతో దూసుకుపోతుంది. ”బుచ్చిబాబు నాపెద్ద కొడుకు, నేను పుత్రోత్సాహంలో వున్నాను..” అంటూ వేదికపై చెప్పిన దర్శకుడు ...

Read More »

వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి పాద‌యాత్ర ప్రారంభం

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీసీ ఎంపీ విజయసాయి రెడ్డి ఆధ్వర్యంలో శనివారం ఉదయం పాదయాత్ర చేపట్టారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం నుండి స్టీల్ ప్లాంట్ కూర్మన్నపాలెం మెయిన్ గేట్ వరకు పాదయాత్ర సాగనుంది. పాదయాత్రలో మంత్రులు ధర్మాన కృష్ణదాస్, అవంతితో పాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, నేతలు హాజరయ్యారు. 

Read More »

‘చెక్‌’ 70 శాతం జైలులోనే

నితిన్‌, ప్రియా వారియర్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ నటించిన ‘చెక్‌’ సినిమా ఈనెల 26న విడుదల కాబోతుంది. ఈ సినిమాలో నితిన్‌ ఖైదీగా నటించాడు. చంద్రశేఖర్‌ ఏలేటి దర్శకుడు. సాయిచంద్‌ చెస్‌ కోచ్‌గా నటించాడు. సినిమాలో 70 శాతం చిత్రీకరణ జైలులోనే సాగుతుంది. ప్రేక్షకుడికి బోర్‌ కొట్టకుండా ఆద్యంతం ఆహ్లాదకరంగా తీర్చిదిద్దామని దర్శకుడు అంటున్నారు. ఈ సినిమా విడుదల తర్వాత ఈ తరహా కొత్త సినిమాలు తెలుగులో వస్తాయని నిర్మాత ఆనంద ప్రసాద్‌ ఆశిస్తున్నారు.

Read More »

అంతర్వేది ఆలయంలో కొత్త రథాన్ని ప్రారంభించిన జగన్

తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలకు హాజరైన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నూతనంగా తయారు చేసిన రథాన్ని ప్రారంభించారు. అనంతరం భక్తులతో కలిసి సీఎం జగన్ నూతన రధాన్ని తాడుతో లాగారు. 2020 సెప్టెంబర్‌లో రథాన్ని కొందరు గుర్తుతెలియని వ్యక్తులు దగ్ధం చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఇప్పటి వరకు కూడా నిందితులు ఎవరు అనే విషయాన్ని ప్రభుత్వం తేల్చలేకపోయింది. మరోవైపు ఈనెల 28 వరకు స్వామి కళ్యాణోత్సవాలు కూడా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగానే ...

Read More »

‘చక్ర’ అవార్డుల పారితోషికం పెంపు

పరమవీరచక్ర, అశోక్‌చక్ర అవార్డులు పొందిన వారికి ఇప్పటివరకూ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోన్న రూ.10 లక్షలు పారితోషికాన్ని కోటి రూపాయలకు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ప్రకటించారు. మహావీర, కీర్తిచక్ర అవార్డులకు ప్రస్తుతం రూ.8 లక్షలు ఇస్తున్నారని, ఇకపై రూ.80 లక్షలు ఇస్తామని తెలిపారు. వీరచక్ర, శౌర్యచక్ర అవార్డులు అందుకున్న వారికి పారితోషికాన్ని రూ.6 లక్షల నుంచి రూ.60 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. చిత్తూరు జిల్లా తిరుపతిలోని ఎంఆర్‌పల్లి పోలీసు గ్రౌండ్‌లో గురువారం నిర్వహించిన ఇండో-పాక్‌ యుద్ధ విజయోత్సవ వేడుకల (విజయ జ్వాల)లో ఆయన పాల్గొన్నారు. తొలుత ...

Read More »

గృహనిర్మాణ శాఖపై జగన్‌ సమీక్ష

గృహనిర్మాణ శాఖపై తాడేపల్లిలోని సిఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి సమీక్ష నిర్వహించారు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధ రాజు, సిఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌, చీఫ్‌ కమిషనర్‌ ఆఫ్‌ ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌, గృహనిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శి అజరు జైన్‌, ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ ప్రతీప్‌ కుమార్‌, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి వై.శ్రీలక్ష్మి, ఏపీ స్టేట్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఎండీ నారాయణ భరత్‌ గుప్తా, ...

Read More »

చింతమనేని ప్రభాకర్‌ అరెస్ట్‌

చింతమనేని ప్రభాకర్‌ను ఏలూరు పోలీసులు గురువారం అరెస్టు చేశారు. పెదవేగి మండలం బి.సింగవరం గ్రామంలో బుధవారం రాత్రి చింతమనేని ప్రభాకర్‌ ప్రచారం నిర్వహించారు. అనంతరం వైసిపి,టిడిపి నేతల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు వైసిపి నేతల ఫిర్యాదు మేరకు ఘటనాస్థలంలో చింతమనేని లేనప్పటికీ ఆయనపైనా కేసు నమోదు చేసి తాజాగా అరెస్ట్‌ చేశారు. పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏలూరు మండలం మాదేపల్లికి వచ్చిన ఆయనను ఏలూరురూరల్‌ పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తీసుకెళ్లారు.

Read More »

నిర్మాతగా అవతారం ఎత్తబోతున్నరవితేజ

రవితేజ నిర్మాత అవతారం ఎత్తబోతున్నట్లు వార్తలస్తున్నాయి. తన పేరు కలిసొచ్చేలా ‘ఆర్‌టీ వర్క్స్‌’ పేరుతో ఆయన ఒక బేనర్‌ను రిజిస్టర్‌ చేయించాడని సమాచారం. ఈ బేనర్లో యంగ్‌, టాలెంటెడ్‌ ఆర్టిస్టులను, దర్శకులను పరిచయం చేస్తూ చిన్న, మీడియం బడ్జెట్లో సినిమాలు నిర్మించాలనుకుంటున్నారు. ఇన్నేళ్ల తన కెరీర్లో తోడ్పాటు అందించిన వాళ్లకు ఈ బేనర్‌ ద్వారా అవకాశాలు అందించడంతో పాటు తనలా ఏ బ్యాగ్రౌండ్‌ లేకుండా పరిశ్రమలోకి వచ్చిన యంగ్‌ టాలెంట్‌కు చేయూత అందించేందుకు రవితేజ ఈ బేనర్‌ పెట్టడాని సినీవర్గాలు చర్చించుకుంటున్నాయి.

Read More »

ఆస్ట్రేలియా వార్తలకు ‘చెక్‌ ‘ పెట్టిన ఫేస్‌బుక్‌

ఆస్ట్రేలియా వినియోగదారులు, వార్తా సంస్థలు, ఇతర సంస్థలు తమ వార్తలను, ఇతర లింక్‌లను షేర్‌ చేయడాన్ని ఫేస్‌బుక్‌ నిలిపివేసింది. దీంతో ఆ దేశ ప్రజలు ఫేస్‌బుక్‌లో వార్తలను చదివే అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలో తాము ఈ నిర్ణయానికి వచ్చినట్టు సంస్థ ప్రకటించింది. న్యూస్‌ రూమ్‌లు, డిజిట్‌ వేదికలైన ఫేస్‌బుక్‌, గూగుల్‌ల మధ్య బేరసారాల్లో నెలకొన్న అసమానతలను తగ్గించే నేపథ్యంలో.. ఆస్ట్రేలియా కొత్త మీడియా కోడ్‌ను తన చట్టంగా రూపొందించడానికి సిద్ధమవుతుండగా ఈప్రకటన వెలువడటం గమనార్హం. వార్తలను పంచుకొన్నందుకు ఆయా సంస్థలకు ఫేస్‌బుక్‌, గూగుల్‌లు ...

Read More »

విశాఖ శారదా పీఠం వార్షికోత్సవాల్లో జగన్‌

విశాఖ శ్రీశారదాపీఠం వార్షికోత్సవాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి బుధవారం పాల్గొని రాజశ్యామల మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజశ్యామల అమ్మవారి ఆలయాన్ని సిఎం దర్శించుకున్నారు. పీఠం ప్రాంగణంలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, తాండవమూర్తి, దాసాంజనేయస్వామి ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం రాజశ్యామల యాగంలో సిఎం జగన్‌ పాల్గొన్నారు. రాజశ్యామల యాగం విశిష్టతను స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి సిఎం జగన్‌ కు తెలిపారు. పీఠంలో సుమారు గంటసేపు సిఎం గడిపారు. ఈ కార్యక్రమంలో పీఠం లోనే అమ్మవారి ప్రసాదాన్ని సిఎం స్వీకరించారు. పీఠంలో నిర్వహించే ...

Read More »