Monthly Archives: February 2021

విశాఖ ఉక్కుపై అసెంబ్లీలో తీర్మానం

విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతలతో ఎయిర్‌పోర్ట్‌ లో మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకూ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విశాఖ ఉక్కు పరిశ్రమ ఎదుర్కొనే ఇబ్బందులు, అనాదిగా వెంటాడుతున్న సొంత గనుల సమస్య పై 3 పేజీల నివేదిక, మెమొరాండం ను ఉక్కు పరిరక్షణ కమిటీ కన్వీనర్‌ జె.అయోధ్యారాం, చైర్మన్‌ సిహెచ్‌.నరసింగరావు, ఆదినారాయణ, మంత్రి రాజశేఖర్‌, గంధం వెంకటరావు, తదితరులు సిఎం కు అందజేశారు. 8 మంది కార్మిక నేతలు 40 నిమిషాలు సమస్యలను వివరించగా, సిఎం ...

Read More »

నిర్మాతగా చిన్నారి పెళ్లికూతురు

‘చిన్నారి పెళ్లికూతురు’ ఫేమ్‌ అవికా గోర్‌ నిర్మాతగా మారారు. ఆచార్య క్రియేషన్స్‌ బేనర్‌పై ‘నెపోలియన్‌’ చిత్ర నిర్మాత భోగేంద్ర గుప్తా మడుపల్లి కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ సినిమాలో అవికా గోర్‌, సాయి రోనక్‌ హీరో హీరోయిన్లు. ప్రముఖ యాడ్‌ ఫిల్మ్‌ మేకర్‌ మురళీ నాగ శ్రీనివాస్‌ గంధం దర్శకత్వం వహించనున్నారు.

Read More »

రేపు విశాఖ కు జగన్‌

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి రేపు విశాఖపట్నానికి వెళ్లనున్నారు. బుధవారం ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి విశాఖలోని శారదా పీఠం వార్షికోత్సవాలకు సిఎం హాజరుకానున్నారు. అనంతరం స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యోగుల జెఎసి ని సిఎం జగన్‌ కలవనున్నారు.

Read More »

‘చావు కబురు చల్లగా’సాంగ్‌లో అనసూయ

అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీ వాసు నిర్మాతగా కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా నూతన దర్శకుడు కౌశిక్‌ పెగళ్లపాటి తెరకెక్కిస్తున్న చిత్రం ‘చావు కబురు చల్లగా’. ఈ సినిమా ఐటమ్‌ సాంగ్‌లో అనసూయ నటిస్తోంది. ఈ చిత్రాన్ని మార్చి 19న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సినిమా పాటలను ప్రముఖ ఆడియో కంపెనీ ఆదిత్య మ్యూజిక్‌ వారు విడుదల చేస్తున్నారు.

Read More »

దేశవ్యాప్తంగా అన్నదాతలు భారీ ర్యాలీలు

నల్లచట్టాలను రద్దు చేయాలంటూ ఢిల్లీ సరిహద్దుల్లో అన్నదాతలు చేస్తున్న పోరాటం 83వ రోజుకి చేరుకుంది. అయితే సరిహద్దుల్లో రైతులు తక్కువగా వున్నారంటూ వస్తోన్న వార్తలపై రైతు నేతలు స్పందించారు. ఇది సుదీర్ఘంగా కొనసాగే పోరాటమని, సరిహద్దుల్లో రైతులు తక్కువ మంది ఉండటం కూడా వ్యూహంలో ఒక భాగమేనని అన్నారు. ఇది ఆందోళనను వ్యాప్తి చేయడంపై ఆధారపడి ఉంటుందని అన్నారు. ఆందోళనకు మద్దతుగా రాష్ట్రాలలో భారీ ర్యాలీలు నిర్వహించడంపై దృష్టి పెట్టామని అన్నారు. రైతు నేత రాకేష్‌ తికాయిత్‌ దేశవ్యాప్తంగా మహాపంచాయత్‌లను నిర్వహిస్తున్నారని.. రానున్న పదిరోజుల్లో ...

Read More »

విశాఖకు చేరుకున్న బైక్‌ ర్యాలీ

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినదిస్తూ.. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం కొనసాగుతోన్న మోటారు సైకిల్‌ ర్యాలీ రెండో రోజు మంగళవారం జిల్లాలో కొనసాగి, సాయంత్రం విశాఖ జిల్లాకు వెళ్ళింది. కాకినాడలో బహిరంగ సభ అనంతరం సర్పవరం జంక్షన్‌, పిఠాపురం, గొల్లప్రోలు, కత్తిపూడి, అన్నవరం మీదుగా తునికి చేరుకుంది.అక్కడ కూడా బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక నాయకులకు అడుగడుగునా ఘన స్వాగతం లభించింది. విద్యార్థి యువజన సంఘాలతోపాటు కార్మిక, కర్షక, ప్రజా సంఘాల నేతలు ...

Read More »

ఏపీలో మున్సిపల్‌ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్‌ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలయింది. ఎన్నికల ప్రక్రియ ఎక్కడ ఆగిందో అక్కడి నుంచే కొనసాగించనున్నట్టు ఎస్‌ఇసి ప్రకటించింది. ఈ మేరకు 75 మున్సిపాలిటీలు, 12 మున్సిపల్‌ కార్పొరేషన్లకు ఎన్నికల ప్రక్రియ కొనసాగనుంది. మార్చి 10 న పురపాలక ఎన్నికలను నిర్వహించనున్నట్లు ఎస్‌ఇసి ప్రకటన విడుదల చేసింది. 14 వ తేదీన ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. మార్చి 3 న మధ్యాహ్నం 3 గంటల్లోపు నామినేషన్ల ఉపసంహరణకు తుదిగడువుగా నిర్ణయమయింది. గత ఏడాది మార్చి 23 న నిర్వహించాల్సిన పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు ...

Read More »

రేషన్‌ డోర్‌ డెలివరీకి హైకోర్టు గ్రీన్‌ సిగ్న‌ల్‌

ఆంధ్రప్రదేశ్‌లో రేషన్‌ డోర్‌ డెలివరీకి హైకోర్టు గ్రీన్‌ సిగల్‌ ఇచ్చింది. రేషన్‌ వాహనాల రంగు మార్చాలన్న ఎస్‌ఇసి ఆదేశాలపై హైకోర్టు స్టే విధించింది. మార్చి 15 వరకు మధ్యంతర ఉత్తర్వులు అమల్లో ఉంటాయని కోర్టు తెలిపింది. తదుపరి విచారణ మార్చి 15 కు వాయిదా వేసింది. ‘ఇంటింటికీ రేషన్‌’ పథకాన్ని గ్రామీణ ప్రాంతాల్లో అడ్డుకోకుండా ఎన్నికల కమిషనర్‌ను ఆదేశించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ఎస్‌ఇసి జారీ చేసిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ వ్యాజ్యం దాఖలు చేశారు. ...

Read More »

గుజ‌రాత్ ముఖ్య‌మంత్రికి క‌రోనా పాజిటివ్‌

గుజ‌రాత్ ముఖ్య‌మంత్రి విజ‌య్ రూపానీకి క‌రోనా పాజిటివ్‌ అని తేలింది. శ‌నివారం అహ్మ‌దాబాద్‌లో మున్సిప‌ల్ ఎన్నిక‌ల ప్ర‌చారస‌భ‌లో మాట్లాడుతూ… రూపానీ కళ్లు తిరిగి ప‌డిపోయారు. దీంతో అధికారులు  ఆయ‌న‌ను ఆస్ప‌త్రిలో చేర్పించారు.   అయితే గ‌త కొన్ని రోజులుగా ఆయన అస్వ‌స్థ‌త‌తో వున్నట్లు చెప్ప‌డంతో వైద్యులు రూపానీకి వైద్య‌ప‌రీక్ష‌లు నిర్వహించారు. వాటితోపాటు కరోనా ప‌రీక్ష‌లు కూడా చేశారు. ఈ ప‌రీక్ష‌ల్లో ఆయ‌న‌కు క‌రోనా పాజిటివ్‌ అని తేలింది.

Read More »

ప్రభావవంతుల జాబితాలో అల్లు అర్జున్‌

ప్రముఖ జి.క్యూ. ఇండియా 25 మంది అత్యంత ప్రభావవంతమైన యువ భారతీయుల జాబితాను విడుదల చేసింది. అందులో తెలుగు హీరో అల్లు అర్జున్‌ ఒకడు కావడం విశేషం. ఇన్నోవేటర్స్‌, గేమ్‌ ఛేంజర్స్‌, ఎంటర్‌ టైనర్స్‌ అయిన వ్యక్తుల ఆధారంగా ఈ జాబితాను తయారు చేసినట్టు తెలుస్తోంది. ఈ జాబితాలో చోటు దక్కించుకోవడానికి ‘అల వైకుంఠపురములో’ చిత్రం సాధించిన విజయం కూడా ఓ కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.

Read More »