Monthly Archives: March 2021

కృష్ణానది రిటైనింగ్‌ వాల్‌కు జగన్ శంకుస్థాపన

విజయవాడ కనకదుర్గమ్మ వారధి నుంచి కోటినగర్‌ వరకు కృష్టా నది ఎడమవైపున వరద రక్షణ గోడ (రిటైనింగ్‌ వాల్‌) నిర్మాణానికి సిఎం వైఎస్‌ జగన్‌ బుధవారం శంకుస్ధాపన చేశారు. 1.5 కిలోమీటర్ల మేర రూ.122.90 కోట్ల వ్యయంతో కృష్ణా నది వరద ఉధృతిని తట్టుకునేలా రిటైనింగ్‌ వాల్‌ను నిర్మించనున్నారు. ఈ గోడ నిర్మాణంతో కృష్ణా నది కరకట్టకు చెందిన రాణీగారితోట, తారకరామానగర్‌, భూపేష్‌గుప్తా నగర్‌ ప్రాంతాలలో నివాసముంటున్న సుమారు 31 వేల మంది ప్రజలకు వరద ముంపు నుంచి శాశ్వత ఉపశమనం కలుగనుంది.

Read More »

కరోనాతో ఆస్పత్రిలో చేరిన మహారాష్ట్ర సిఎం భార్య

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాకరే భార్య రష్మీ థాకరేకు కరోనా సోకింది. కరోనా చికిత్స నిమిత్తం మంగళవారం ఆమె ఆస్పత్రిలో చేరినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. మార్చి 22న ఆమెకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణైందని, అప్పటి నుండి హోమ్‌ క్వారంటైన్‌లో ఉంటున్నట్లు వెల్లడించారు. కాగా, ముఖ్యమంత్రి కుమారుడు, రాష్ట్ర మంత్రి ఆదిత్య థాకరే కూడా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఈనెల 11న ఉద్ధవ్‌ థాకరే, ఆయన రష్మీలు కరోనా వ్యాక్సిన్‌ మొదటి డోసు తీసుకున్నారు. రష్మీ థాకరే శివసేన అనుబంధ పత్రిక ‘సామ్నా’కు ...

Read More »

భారత్‌-పాక్‌ల మధ్య మళ్లీ చిగురించనున్న సంబంధాలు..!

భారత్‌-పాక్‌ల మధ్య సంబంధాలు మళ్లీ చిగురించున్నాయి. ఈ దిశగా పాక్‌ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. తొలుత వాణిజ్య సంబంధాలు పునరుద్ధరించుకునే దిశగా పాకిస్తాన్‌ అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం భారత ప్రభుత్వంతో ఇమ్రాన్‌ సర్కార్‌ చర్చించనున్నట్లు సమాచారం. భారత్‌ నుండి చక్కెర, పత్తిని దిగుమతి చేసుకోవడంపై పాకిస్తాన్‌ ఆర్థిక వ్యవహారాల క్యాబినేట్‌ కమిటీ నిర్ణయించబోతోందని అనధికారిక సమాచారం. కమిటీ సమావేశం బుధవారం ఉదయం 11.30 గంటలకు నిర్వహించనుందని తెలుస్తోంది. జమ్ముకాశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దును చేసి.. రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా మోడీ ...

Read More »

కేరళలో వెంకటేష్ ‘దృశ్యం-2’

వెంకటేష్‌ హీరోగా నటిస్తున్న ‘దృశ్యం’ సీక్వెల్‌ మార్చి 1న పట్టాలెక్కిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రబందం ఇప్పుడు మిగిలిన భాగం షూటింగ్‌ కోసం కేరళకు వెళ్లింది. అక్కడ జరిగే షెడ్యూల్‌తో సినిమా మొత్తం పూర్తవుతుంది. ‘దృశ్యం’ తొలిభాగంలో నటించిన నటీనటులే దాదాపు ఈ సీక్వెల్‌లోనూ, అవే పాత్రలలో కన్పిస్తారు. అయితే ‘దృశ్యం’ తెలుగు రీమేక్‌కు నటి శ్రీప్రియ దర్శకత్వం వహించగా, సీక్వెల్‌ను మలయాళ దర్శకుడు జీతూ జోసఫే తీస్తున్నారు. ఈ చిత్రాన్ని వేసవి చివరిలో విడుదల చేయాలని ...

Read More »

ప్రధాని ఎన్నికల ర్యాలీ సందర్భంగా డ్రోన్లు నిలిపివేత

వచ్చే నెలలో పుదుచ్చేరిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం పర్యటించనున్నారు. ఈ సందర్భంగా భద్రతా చర్యల రీత్యా అక్కడ డ్రోన్లు, ఇతర మానవరహిత వైమానిక వాహనాలపై నిషేధం విధించారు. ఈ మేరకు జిల్లా మెజిస్ట్రేట్‌ పూర్వా గార్గ్‌ ఉత్తర్వులు ఇచ్చారు. పుదుచ్చేరి ప్రాంతమంతా సెక్షన్‌ 144 సిఆర్‌పిసి కింద ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఉత్తర్వులను ఎవరైనా ఉల్లఘింస్తే వారిపై సెక్షన్‌ 188, ఇతర సంబంధిత చట్టాల ప్రకారం చర్యలు తీసుంటామని తెలిపారు.

Read More »

అవంతిని కలిసిన హీరో శర్వానంద్‌

సింహగిరిలో మంగళవారం సందడి వాతావరణం నెలకొంది. ఎపి పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌, హీరోశర్వానంద్‌లు లక్ష్మీనృషింహస్వామిని దర్శించుకున్నారు. ఈ సంద్భంగా అవంతి శ్రీనివాస్‌ను, హీరో శర్వానంద్‌ మర్యాదపూర్వకంగా కలిసి పలకరించారు. అనంతరం శర్వానంద్‌ నటిస్తున్న మహాసముద్రం చిత్రం షూటింగ్‌ చేశారు. ఈ చిత్రంలో హీరో కుటంబం, హీరోయిన్‌ అదితీరావు హైదరీలపై సీన్‌ను షూట్‌ చేశారు. సినిమా షూటింగ్‌ను 34రోజుల పాటు విశాఖలో చేశామని, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌లో నిర్మిస్తున్నామని చిత్రయూనిట్‌ తెలిపింది. చైతన్య భరద్వాజ్‌ సంగీతం అందించారు. మహాసముద్రం చిత్రం దర్శకుడు అజరుభూపతి ...

Read More »

రేపు బ్యాంకుల్లో ప్రభుత్వ ఖాతాల క్లియరెన్స్‌

మార్చి 31న దేశంలోని బ్యాంకులన్నీ ప్రభుత్వ వార్షిక ఖాతాల లావాదేవీల ముగింపు క్లియరెన్స్‌ను చేపట్టనున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తం మీద తమ ద్వారా జరిగిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక లావాదేవీల ఖాతాల ముగింపు తుది వివరాలను బ్యాంకులు పూర్తి చేయనున్నాయి. అన్ని బ్యాంకులు తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆర్‌బిఐ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్థిక సంవత్సరం ముగింపు రోజు కావడంతో బుధవారం రోజు బ్యాంక్‌ల్లో సాధారణ ఖాతాదారులకు సేవలను అనుమతించారు. వార్షిక ఖాతాల మూసివేత క్రమంలో ఏప్రిల్‌ 1న, ...

Read More »

‘వైల్డ్‌ డాగ్‌’ నేను కాదు

వైల్డ్‌ డాగ్‌ నేను కాదు. నిర్మాత నిరంజన్‌ రెడ్డి అసలు వైల్డ్‌ డాగ్‌. నిరంజన్‌ రెడ్డి ఈ కథను తీసుకొచ్చారు కాబట్టే ఈ చిత్రాన్ని చేశాను’ అంటున్నారు నాగార్జున. అషిషోర్‌ సాల్మన్‌ దర్శకత్వంలో రూపొందిన ‘వైల్డ్‌డాగ్‌’ చిత్రంలో నాగార్జున జోడీగా బాలీవుడ్‌ నటి దియా మీర్జా నటిస్తోంది. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నెం.6గా తెరకెక్కిన ఈ చిత్రానికి నిరంజన్‌రెడ్డి, అన్వేష్‌ రెడ్డి నిర్మాతలు. ఏప్రిల్‌ 2 ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది.

Read More »

‘ఉక్కు’ ప్రైవేటీకరణపై హైకోర్టులో మాజీ ఐపిఎస్‌ జెడి పిటిషన్‌

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ పరిశ్రమను వ్యతిరేకిస్తూ.. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కార్మికుల ఉద్యమానికి పలువురు ప్రముఖులు మద్దతు తెలుపుతున్నారు. తాజాగా మాజీ ఐపిఎస్‌ అధికారి జెడి లక్ష్మీనారాయణ విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను సవాల్‌ చేస్తూ మంగళవారం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కేంద్ర కేబినెట్‌ తీసుకున్న విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నిలుపుదల చేయాలని ఆ పిటిషన్‌లో కోరారు. పరిశ్రమను ప్రైవేటీకరించడం సమస్యకు పరిష్కారం కాదని, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పరిశ్రమను లాభాల బాట పట్టించవచ్చని పేర్కొన్నారు. 

Read More »

దేశంలో 68 వేల మార్క్‌ను దాటిన కరోనా

గడిచిన 24 గంటల్లో కోవిడ్‌ బారి నుంచి 32,231 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి మొత్తం రికవరీల సంఖ్య 1,13,55,993 కి చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5,21,808 కోవిడ్‌ యాక్టివ్‌ కేసులున్నట్లు వైద్యశాఖ తెలిపింది. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 94.32 శాతం ఉండగా.. మరణాల రేటు 1.34 శాతం ఉంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 9,13,319 కరోనా నిర్థారణ పరీక్షలు చేశారు. వీటితో కలిపి ఇప్పటివరు 24,18,64,161 పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్స్‌ వెల్లడించింది. ...

Read More »