Monthly Archives: March 2021

కర్నూలు ఎయిర్‌పోర్ట్‌ ప్రారంభం

కర్నూలు ఎయిర్‌పోర్టు ప్రారంభమైంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఓర్వకల్లులో నిర్మించిన విమానాశ్రయంలో జ్యోతి వెలిగించి, ప్రత్యేక తపాలా స్టాంపు ఆవిష్కరించారు. టెర్మినల్‌ భవనం దగ్గర దివంగత మాజీ సిఎం రాజశేఖర్‌ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం విమానాశ్రయాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ.. కర్నూలు చరిత్రలో ఈ రోజు ఎప్పటికీ నిలిచిపోతుందన్నారు. చంద్రబాబు రిబ్బన్‌ కట్‌ చేసి వదిలేశారని, యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేశామని, న్యాయ రాజధానికి ఇక విమానాలతో కనెక్టివిటీ పెరిగిందని అన్నారు. ఒకేసారి నాలుగు విమానాలు పార్క్‌ చేసుకునే ...

Read More »

భారత్‌ బంద్‌కు .. లారీ ఓనర్స్‌, విద్యుత్‌ ఉద్యోగుల జెఎసి మద్దతు

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు నల్ల చట్టాలను రద్దు చేయాలని, విశాఖ స్టీల్‌ ప్లాంటు ప్రైవేటీకరణను వ్యతిరేకంగా చేపట్టనున్న భారత్‌ బంద్‌కు ఆంధ్రప్రదేశ్‌ లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ బుధవారం మద్దతు ప్రకటించింది. ఈ బంద్‌ సందర్భంగా లారీలను ఎక్కడికక్కడే నిలుపుదల చేస్తున్నట్లు అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైవి ఈశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే ఎపి విద్యుత్‌ ఉద్యోగుల జెఎసి కూడా భారత్‌ బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. బంద్‌ సందర్భంగా ఎక్కడికక్కడే మధ్యాహ్నం ఆందోళనలు నిర్వహించాలని జెఎసి చైర్మన్‌ చంద్రశేఖర్‌ రాష్ట్రంలోని ...

Read More »

ఎపిలో పెరుగుతున్న కరోనా.. 585మందికి పాజిటివ్‌గా నిర్ధారణ

ఎపిలోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత 24గంటల్లో 35,066మందికి పరీక్షలు చేయగా 585మంది పాజిటివ్‌గా నిర్ధారణయింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,95,121కి చేరాయి. అలాగే చిత్తూరు, గుంటూరు, కర్నూలు, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున నలుగురు మరణించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మృతుల సంఖ్య 7,197కి చేరింది. అయితే.. యాక్టివ్‌ కేసులు 2,946 ఉన్నాయి. ఈమేరకు రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ బులెటిన్‌ విడుదల చేసింది. అలాగే రాష్ట్రంలో ఇప్పటివరకు 1,48,40,401శాంపిళ్లను ఆరోగ్యశాఖ పరీక్షించింది.

Read More »

అమిర్‌ఖాన్‌కు కరోనా

బాలీవుడు స్టార్‌ అమిర్‌ఖాన్‌ కరోనా బారిన పడ్డారు. ఇటీవల ఆయనకు కోవిడ్‌-19 పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా నిర్ధారణయింది. మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతున్న విషయం విధితమే. ఇటీవలే పలువురు బాలీవుడు నటులు ఆశిష్‌ విద్యార్థి, రణ్‌బీర్‌ కపూర్‌, కార్తిక్‌ ఆర్యన్‌, దర్శకుడు సంజరులీలా భన్సాలిలు కూడా ఈ వ్యాధి బారిన పడ్డారు. ప్రస్తుతం అమిర్‌ఖాన్‌ హోమ్‌ క్వారంటైన్‌లో ఉన్నారు. తన సిబ్బంది కూడా కోవిడ్‌ పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు

Read More »

తొలి డోసు టీకా తీసుకున్నా…’మహా‘ ముఖ్యమంత్రి భార్యకు కరోనా

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాకరే భార్య రష్మీ ధాకరే కరోనా బారిన పడ్డారు. ఈ నెల 11న జెజె ఆసుపత్రిలో ముఖ్యమంత్రి, ఆయన భార్య కరోనా వ్యాక్సిన్‌ తొలి డోసు తీసుకున్న సంగతి విదితమే. అయినప్పటికీ ఆమె కరోనా బారిన పడ్డారు. సోమవారం రాత్రి కోవిడ్‌ పరీక్షల్లో పాజిటివ్‌ అని తేలిందని..ప్రస్తుతం అధికారిక నివాసంలో క్వారెంటైన్‌లో ఉన్నారని అధికారులు వెల్లడించారు. ఇటీవల రాష్ట్ర పర్యాటక మంత్రి, ఉద్దవ్‌ కుమారుడు ఆదిత్య థాకరేకు కరోనా వచ్చిన సంగతి విదితమే. కాగా, మహారాష్ట్రలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ...

Read More »

తెలంగాణాలో డిగ్రీ, పిజి పరీక్షలు వాయిదా.

తెలంగాణాలో పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా అక్కడ స్కూళ్లు మూతపడిన విషయం విధితమే. తాజాగా ఆ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని యూనివర్శిటీల పరిధిలో ప్రస్తుతం జరుగుతున్న సెమిస్టర్‌ పరిక్షలనూ వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ పాపిరెడ్డి తెలిపారు. ఈ మేరకు అన్ని విశ్వవిద్యాలయాలకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం జరుగుతున్న పరీక్షలు యథాతథంగా కొనసాగుతాయని ఆయా యూనివర్శిటీలు మంగళవారం ప్రకటించిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో ఉన్నత విద్యామండలి సమీక్షలో ఈ మేరకు యూనివర్శిటీలకు ...

Read More »

ఎంపి రేవంత్‌రెడ్డికి కరోనా

తెలంగాణా కాంగ్రెస్‌ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మల్కాజ్‌గిరి ఎంపి రేవంత్‌రెడ్డికి కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయన ట్విటర్‌ వేదికగా మంగళవారం వెల్లడించారు. ప్రస్తుతం తాను హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపారు. అలాగే ఇటీవల తనను కలిసిన వారు జాగ్రత్తలు పాటించాలని కోరారు.

Read More »

67వ జాతీయ అవార్డుల ఫైనల్‌ లిస్ట్‌

జాతీయ సినిమా అవార్డులను ప్రతి సంవత్సరం మే 3వ తేదీన ప్రకటిస్తారు. అయితే గత సంవత్సరం కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడింది. అవార్డుల లిస్టును మార్చి 22వ తేదీన సోమవారం ప్రకటించారు. కాగా, ప్రకటించిన లిస్టులో ఫీచర్‌ ఫిల్మ్‌ విభాగంలో 461 సినిమాలు, నాన్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ విభాగంలో 220 సినిమాలు ఉన్నాయి. అలాగే 13 రాష్ట్రాల నుండి ఎంట్రీలు పంపడం జరిగింది. వాటిలో నుంచి విభాగాల వారీగా.. ఉత్తమ అవార్డులను ఎంపిక చేయడం జరిగింది. అవి ఏ కేటగిరికి చెందిన ఏ ...

Read More »

జెడ్‌పిటిసి, ఎంపిటిసి ఎన్నికలు జరపాలని ఆదేశించలేం : హైకోర్టు

ఎపిలో జెడ్‌పిటిసి, ఎంపిటిసి ఎన్నికలపై హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. జెడ్‌పిటిసి, ఎంపిటిసి ఎన్నికలు వెంటనే జరపాలని తాము ఆదేశాలు ఇవ్వలేమని వ్యాఖ్యానించింది. జెడ్‌పిటిసి, ఎంపిటిసి ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఇసి)ను ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఎస్‌ఇసి నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ఎన్నికలు నిర్వహించడం లేదంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు. జెడ్‌పిటిసి, ఎంపిటిసి ఎన్నికలకు నోటిఫికేషన్‌ ఇచ్చి ఎన్నికలు నిర్వహించకపోవడం రాజ్యాంగ, చట్ట విరుద్ధంగా ప్రకటించాలని, ఏ దశలో ఎన్నికలు ఆగిపోయాయో అక్కడి నుంచి కొనసాగించేలా ఆదేశాలివ్వాలని హైకోర్టును కోరారు. ఇందులో ...

Read More »

ట్రంప్‌ రీ ఎంట్రీ ..

అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ సోషల్‌మీడియాల్లోకి రీఎంట్రీ ఇవ్వనున్నారు. సామాజిక మాధ్యమాలైన ట్విటర్‌, ఫేస్‌బుక్‌ సహా ఇతర వేదికలు ఆయన ఖాతాలను నిషేధించిన సంగతి తెలిసిందే. మరి ఈ రీఎంట్రీ ఎందులోననేగా అనుమానం. ట్రంప్‌ తానే స్వయంగా మరో కొత్త సామాజిక మాధ్యమాన్ని ప్రారంభించనున్నారని, రెండు లేదా మూడు నెలల్లో ప్రారంభంకావచ్చని ఆయన సీనియర్‌ సలహాదారు వెల్లడించారు. ఈ కొత్త మాధ్యమం ద్వారా నెటిజన్ల ముందుకు రాబోతున్నారని, 2020 ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌నకు అధికార ప్రతినిధిగా వ్యవహరించిన జేసన్‌ మిల్లర్‌ మీడియాకు తెలిపారు.

Read More »