Monthly Archives: March 2021

సీనియర్ నటుడు కార్తీక్‌కు అస్వస్థత

సీనియర్‌ నటుడు కార్తీక్‌ అస్వస్థతకులోనైనట్లు కుటుంబసభ్యులు తెలిపారు. పలు తెలుగు, తమిళ చిత్రాల్లో హీరోగా నటించిన కార్తిక్‌, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ ప్రచారానికి సిద్ధమయ్యారు. ఇటీవల అన్నాడిఎంకె – బిజెపి కూటమికి మద్దతిస్తున్నట్లు ప్రకటించారు. ప్రచారం ముగించుకుని శనివారం రాత్రి ఇంటికి వెళ్లిన ఆయన అస్వస్థతకు లోనయ్యారని, వెంటనే చెన్నైలోని అడయార్‌ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

Read More »

ప్రభుత్వం ఎస్‌బిఐకు 4.10 కోట్ల కమిషన్‌ చెల్లించింది

రాజకీయ పార్టీలకు చెందిన ఎలక్టోరల్‌ బాండ్లను దాతలు 13 విడతల్లో విక్రయించినందుకు కమిషన్‌గా ప్రభుత్వం రూ. 4.10 కోట్లు చెల్లించిందని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బిఐ) తెలిపింది. ఎలక్టోరల్‌ బాండ్లను ముద్రించేందుకు అదనంగా రూ. 1.86 కోట్లు చెల్లించిందని సమాచార హక్కు చట్టం (ఆర్‌టిఐ) ద్వారా అడిగిన ప్రశ్నకు సమాధానం తెలిపింది. ఎలక్టోరల్‌ బాండ్ల విక్రయం ద్వారా ప్రభుత్వం ఎస్‌బిఐకి ఎంత కమిషన్‌ చెల్లించిందో సంబంధిత వివరాలు తెలపాలంటూ లోకేష్‌ గుప్తా అనే వ్యక్తి ఒక పిటిషన్‌ను దాఖలు చేశారు. 15 విడతల్లో ...

Read More »

మహారాష్ట్ర నుంచి ఆ రాష్ట్రానికి వచ్చే బస్సులపై నిషేధం

కరోనా వైరస్‌ మహారాష్ట్రను కల్లోలం చేస్తోంది. తగ్గినట్టే తగ్గి ఆ రాష్ట్రంలో మళ్లీ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండటంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం పలు జిల్లాల్లో లాక్‌డౌన్‌లు విధిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో పొరుగున ఉన్న మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శనివారం నుంచి మహారాష్ట్ర నుంచి మధ్యప్రదేశ్‌కు, మధ్యప్రదేశ్‌ నుంచి మహారాష్ట్రకు వెళ్లే బస్సులపై ప్రభుత్వం నిషేధం విధించింది. సిఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు నిషేధం విధించారు. పొరుగు రాష్ట్రం నుంచి వచ్చే ...

Read More »

‘దశ్యం-2’ తెలుగు రీమేక్‌

 ‘దృశ్యం’ సినిమాకు సీక్వెల్‌గా రాబోతున్న ఈ సినిమాలో ఆరేళ్ల తర్వాత ఎదురైన పరిస్థితుల చుట్టూ కథ నడుస్తుంది. మలయాళం సినిమాలో మొదటి సినిమా నటీనటులనే సీక్వెల్‌లోనూ తీసుకున్నారు. అదే పద్ధతి తెలుగులో కూడా పాటిస్తున్నారని ఇటీవల బయటికొచ్చిన ఒక ఫొటో స్పష్టం చేస్తోంది. తెలుగు రీమేక్‌లో వెంకటేష్‌ సరసన మీనా నటిస్తుండగా.. వీరి కూతుళ్లుగా ‘దశ్యం’లో నటించిన కృతిక జయకుమార్‌, ఎస్తేర్‌ అనిల్‌లే కనిపించనున్నారు. వరుణ్‌ తల్లిదండ్రులుగా నటించిన నదియా, నరేష్‌ ఈ సినిమాలోనూ కొనసాగనున్నారు. ఇక మలయాళంలో దృశ్యం-2లో హైలైట్‌గా నిలిచిన ఐజీ ...

Read More »

ట్రంప్‌ రిసార్టులో కరోనా కలకలం

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు చెందిన రిసార్టులో కరోనా కలకలం రేగింది. ట్రంప్‌కు ఫ్లోరిడాలో మార్‌ ఎ లాగో అనే రిసార్టు ఉంది. అందులో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. అయితే, ఎంత మంది ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌ వచ్చిందనే విషయాన్ని క్లబ్‌ మేనేజ్‌మెంట్‌ స్పష్టంగా వెల్లడించలేదు. దీంతో రిసార్టును తాత్కాలికంగా మూసివేశారు. రిసార్టు క్లబ్‌ మేనేజ్‌మెంట్‌ మాట్లాడుతూ… బీచ్‌ క్లబ్‌, లా కార్ట్‌ డైనింగ్‌ రూమ్‌లో సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని తెలిపింది. సిడిసి నిబంధనలకు అనుగుణంగా బాన్‌క్వెట్‌, ...

Read More »

రేపు ‘ఉక్కు కార్మిక గర్జన’

స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉక్కు కార్మిక గర్జనకు విశాఖ నగరం సిద్ధమౌతోంది. శనివారం(20) సాయంత్రం నాలుగు గంటలకు స్టీల్‌ప్లాంటులోని తృష్ణ మైదానంలో నిర్వహించనున్న ఈ భారీ బహిరంగసభకు విస్తృతం గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున తరలిరా వడం ద్వారా ఈ సభను విజయవంతం చేయాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ పిలుపుని చ్చింది, గురువారం ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఛైర్మన్‌ సి.హెచ్‌ నర్సింగరావు మాట్లాడుతూ బహిరంగ సభకు కార్మిక సంఘాల జాతీయ ...

Read More »

రేపటి నుంచి టెన్త్‌ నామినల్‌ రోల్స్‌

పదోతరగతి నామినల్‌ రోల్స్‌ ఈ నెల 20వ తేది నుంచి స్వీకరించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ ఎ సుబ్బారెడ్డి తెలిపారు. జూన్‌లో జరిగే పదవ తరగతి పబ్లిక్‌ పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధుల నామినల్‌ రోల్‌ సంబంధిత పాఠశాల లాగిన్‌ ద్వారా ఏప్రిల్‌ 5వ తేదిలోపు సమర్పించాలని గురువారం ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. గుర్తింపు ముగిసిన పాఠశాలల వివరాలు ప్రభుత్వ పరీక్షల కార్యాలయం వెబ్‌సైట్‌ షషష.bరవ.aజూ.స్త్రశీఙ.ఱఅ లోపొందుపరిచిన్నట్లు తెలిపారు. 2021 లెక్కల ప్రకారం రాష్ట్రంలో 259 ప్రైవేట్‌ యాజమాన్య పాఠశాలలకు 2019-20 విద్యాసంవత్సరంతో ...

Read More »

నాగార్జునతో కాజల్‌

అక్కినేని నాగార్జున నటిస్తున్న కొత్త సినిమాలో నటి కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటించనుంది. ఈ విషయాన్ని దర్శకుడు ప్రవీణ్‌ సత్తారు ట్విట్టర్‌ వేదికగా వెల్లడించారు. ప్రస్తుతం గోవాలో జరుగుతున్న సినిమా షూటింగ్‌కి స్వాగతం పలుకుతూ శుభాకాంక్షలు తెలిపారు. నాన్‌స్టాప్‌గా షూటింగ్‌ జరిపి ఈ ఏడాదే సినిమా విడుదల చేయాలని చిత్ర యూనిట్‌ ప్లాన్‌ చేస్తుంది.

Read More »

ఆర్బీకే ఛాన‌ల్ ప్రారంభించిన జ‌గ‌న్

రైతుల‌కు స‌మాచారం అందించ‌డ‌మే ల‌క్ష్యంగా   రైతు భరోసా కేంద్రం (ఆర్బీకే)   ఛాన‌ల్‌ను ఏపీ ముఖ్య‌మంత్రి  వైఎస్‌ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గురువారం క్యాంపు కార్యాల‌యంలో ప్రారంభించారు. రైతులకు ఏవైనా  సందేహాలుంటే 155251 టోల్‌ ఫ్రీ నంబర్‌కు ఫోన్‌ చేసి  నివృత్తి చేసుకోవచ్చని తెలిపారు. రబీ ప్రొక్యూర్‌మెంట్‌ 2020–21తో పాటు, 2021–22 ఖరీప్‌ సన్నద్ధతపై క్యాంప్ కార్యాలయంలో సీఎం  జగన్‌ సమీక్ష నిర్వహించారు. 

Read More »

రజినీతో జగపతిబాబు

రజనీకాంత్‌ నటిస్తోన్న సినిమా ‘అన్నాత్తె’. శివ దర్శకత్వంలో రానున్న ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్‌ని నిర్మాణ సంస్థ సన్‌ పిక్చర్స్‌ ట్విటర్‌ ద్వారా తెలిపింది. నటుడు జగపతిబాబు రజనీకాంత్‌తో ముచ్చటగా మూడోసారి స్క్రీన్‌ షేర్‌ చేసుకోబోతున్నారు. ఈ సినిమాలో ఆయన నెగెటివ్‌ రోల్‌లో కనిపించనున్నట్లు సమాచారం. త్వరలోనే చెన్నైలో రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభమవుతుంది. ఇప్పటికే రామోజీఫిలింసిటీలో కొంతభాగం షూటింగ్‌ జరుపుకుంది. దీపావళి కానుకగా నవంబర్‌ 4న ఈ సినిమా విడుదల కానుంది.

Read More »