Monthly Archives: March 2021

గుంతకల్లు చైర్‌ పర్సన్‌, వైస్‌ చైర్‌ పర్సన్లు ఏకగ్రీవం

గుంతకల్లు మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌గా 28వ వార్డు కౌన్సిలర్‌ నంగినేని భవాని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 24వ వార్డు కౌన్సిలర్‌ సీబీ నైరుతి రెడ్డి.. భవాని పేరును ప్రతిపాదించగా, 32వ వార్డు కౌన్సిలర్‌ సుధాకర్‌, 34వ వార్డు కౌన్సిలర్‌ చాంద్‌ బాషా బలపరచారు. అదేవిధంగా వైస్‌ చైర్మన్‌గా 23వ వార్డు కౌన్సిలర్‌ మైమున్‌ పేరును 29వ వార్డు కౌన్సిలర్‌ సి.చాంద్‌ బాషా ప్రతిపాదించగా, 17వ వార్డు కౌన్సిలర్‌ నాగరత్న, 33వ వార్డు కౌన్సిలర్‌ విద్యారాణి బలపరచారు. దీంతో చైర్‌ పర్సన్‌గా నంగినేని భవాని, వైస్‌ చైర్‌ ...

Read More »

భారత్‌లో విజృంభిస్తున్న బ్రిటన్‌, దక్షిణాఫ్రికా, బ్రిటన్‌ కరోనా వేరియంట్స్‌

భారత్‌లో బ్రిటన్‌, దక్షిణాఫ్రికా, బ్రిటన్‌ కరోనా వేరియంట్స్‌ విజృంభిస్తున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఈ రకానికి చెందిన 400 కేసులను గుర్తించామని ప్రభుత్వం ప్రకటించింది. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఈ కొత్త వేరియంట్స్‌ వెలుగుచూశాయని, రెండు వారాల్లోనే 158 కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోందని తెలిపింది. మార్చి 4న 242 కేసులను గుర్తించినట్లు తెలిపింది. ఈ మూడు కరోనా వేరియంట్లు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయని తెలిపింది. గతంలో కరోనా బారిన పడిన వారికి కూడా ఇవి తిరిగి సోకే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ...

Read More »

ఏపీ మానవ హక్కుల కమిషన్‌ ఛైర్‌పర్సన్‌, సభ్యుల ఎంపిక

రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ ఛైర్‌పర్సన్‌, సభ్యుల ఎంపికపై సచివాలయంలో రాష్ట్ర మానవ హక్కుల కమిటీ ఛైర్‌పర్సన్‌, సిఎం వైఎస్‌.జగన్‌ అధ్యక్షతన బుధవారం సమావేశమయ్యారు. ఈ సమావేశానికి కమిటీ సభ్యులు శాసనమండలి ఛైర్మన్‌ ఎంఎ.షరీఫ్‌, శాససనభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం, హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత హాజరయ్యారు. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ ఛైర్‌పర్సన్‌, సభ్యుల పేర్లను హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత ప్రతిపాదించారు. ఇందుకు ఎంపిక కమిటీ ఆమోదం తెలిపింది. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ గా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి ...

Read More »

కరోనా పంజా.. 200లకు చేరువలో మరణాలు

దేశంలో కరోనా మళ్లీ పంజా విసురుతోంది. ఇటీవల కాస్త తగ్గుముఖం పట్టిన ఈ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. కొద్దిరోజులుగా వరుసగా రోజువారీ కేసులు గణనీయంగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. గడచిన 24 గంటల్లో 28,903 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ బుధవారం తెలిపింది. దీంతో మొత్తం పాజటివ్‌ కేసుల సంఖ్య 1,14,38,734కు చేరింది. కొత్తగా 17,741 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు 1,10,45,284 మంది డిశ్చార్జి అయ్యారు.మరోవైపు కరోనా మరణాలు కూడా పెరుగుతున్నాయి. 24 గంట్లో 188 మంది మృత్యువాతపడగా.. మొత్తం ...

Read More »

బిజెపి ఎంపి ఆత్మహత్య…!

హిమాచల్‌ ప్రదేశ్‌ బిజెపి ఎంపి రామ్‌ స్వరూప్‌ శర్మ (62) ఆత్మహత్య చేసుకున్నారు. ఢిల్లీలోని ఆయన నివాసంలోని గదిలో ఉరివేసుకుని కనిపించారని..ఆసుపత్రికి తరలించగా, చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారని పోలీసులు తెలిపారు. ఈ కేసును సూసైడ్‌ కోణంలో విచారణ చేపడుతున్నామని ఢిల్లీ పోలీస్‌ పిఆర్‌ఒ చిన్మరు బిశ్వాల్‌ చెప్పారు. మండి నుండి రెండవ సారి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న శర్మది ఆత్మహత్యగా ప్రాథమిక విచారణలో నిర్థారణకు వచ్చామని పేర్కొన్నారు. కాగా, ఘటనాస్థలంలో ఎటువంటి ఆత్మహత్య నోటు దొరకలేదని తెలిపారు. బుధవారం ఉదయం శర్మ వ్యక్తిగత సహాయకుడు..తలుపులు ...

Read More »

కరోనా వ్యాక్సిన్‌ వేసుకున్న నాగార్జున

అక్కినేని నాగార్జున కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్నారు. నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వ్యాక్సిన్‌ మొదటి డోసు వేయించుకున్నారు. ఈ విషయాన్ని నాగార్జున తన ట్విటర్‌ ద్వారా తెలిపారు. ‘నేను కరోనా వ్యాక్సిన్‌ మొదటి డోస్‌ తీసుకున్నాను. అర్హులైన ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్‌ తీసుకోవాలి. దీనికోసం ఆన్‌లైన్‌లో (covin.gov.in) రిజిస్టర్‌ చేసుకుని, టీకా వేయించుకోవాలి’ అని కోరారు.

Read More »

అరిచినా.. మొరిగినా.. బెదిరేది లేదు : కొడాలి నాని

చంద్రబాబుకు సిఐడి నోటీసులు జారీ చేయడం, దీనిపై టిడిపి నాయకుల విమర్శలపై మంత్రి కొడాలి నాని స్పందించారు. మంగళవారం వైసిపి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అమరావతిలో దళితులను మోసం చేసేలా చంద్రబాబు అండ్‌ కో భారీ భూస్కాంలు చేశారని ఆరోపించారు. సిఆర్‌డిఎ చట్టాలన్ని ఉల్లంఘిస్తూ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఇచ్చిన ఏకపక్ష జిఒలతో దళిత వర్గాలను మోసం చేశారని పేర్కొన్నారు. వారిని బెదిరించి, మోసపూరిత ప్రచారాలు చేసి, నామమాత్రపు ధర చెల్లించి కోటు కాజేశారని విమర్శించారు. అచ్చెన్నాయుడు అరుస్తున్నా.. బుద్ధా వెంకన్న మొరుగుతున్నా.. మేం ...

Read More »

మహారాష్ట్రలో విజృంభిస్తున్న కరోనా

మహారాష్ట్రలో కోవిడ్‌ రెండో దశ ప్రారంభమై కరోనా కేసులు పెరుగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే లాక్‌డౌన్‌ విధించారు. దీనిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం… కోవిడ్‌ను నియంత్రించే విధంగా చర్యలు తీసుకోవాలంటూ మహారాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. కరోనా కేసుల్ని గుర్తించడం, పరీక్షలు చేయడం వంటివి చేయాలని ఆ లేఖలో సూచించింది. ఆ రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కోవిడ్‌ క్రియాశీల కేసుల్ని గుర్తించడం, పరీక్షించడం, వేరుచేయడం, ట్రాక్‌ చేయడం వంటి చర్యలు చాలా పరిమితంగానే జరుగుతున్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌ వెల్లడించారు. ...

Read More »

24 గంటల్లో 30 లక్షలకు పైగా కోవిడ్‌ వ్యాక్సిన్

కోవిడ్‌ నియంత్రణా చర్యల్లో భాగంగా.. వ్యాక్సిన్‌ ప్రక్రియ చురుగ్గా కొనసాగుతోంది. ఇప్పటికే మొదటి, రెండో మోతాదు ప్రక్రియ అమలులో ఉంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 30 లక్షలకు పైగా వ్యాక్సిన్‌ వేయడం జరిగిందని, ఇదే అత్యధికమని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అలాగే 60 ఏళ్ల వయసు పైబడిన వారికి ఈ 15 రోజుల్లో వ్యాక్సిన్‌ వేసిన వారి సంఖ్య కోటికి చేరిందని ఆరోగ్య శాఖ తెలిపింది. గత 24 గంటల్లో 30,39,394 మందికి వ్యాక్సిన్‌ వేయగా, 26,27,099 మందికి తొలి ...

Read More »

ఆస్కార్‌ నామినేషన్‌ జాబితాను విడుదల చేసిన ప్రియాంక దంపతులు

సినీ పరిశ్రమలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్‌ అవార్డులకు సంబంధించిన నామినేషన్స్‌ విడుదలయ్యాయి. 93వ అకాడమీ అవార్డుల ప్రదానం.. అమెరికా కాలమానం ప్రకారం ఏప్రిల్‌ 25న జరగనుండగా, సోమవారం సాయంత్రం ప్రియాంక చోప్రా, నిక్‌ జోనాస్‌లు నామినేషన్‌ జాబితాను విడుదల చేశారు. డేవిడ్‌ ఫించర్‌ దర్శకత్వంలో వచ్చిన మాంక్‌ చిత్రం 10 విభాగాల్లో నామినేషన్లు పొందడం విశేషం. ఇక గత ఏడాది దర్శకత్వ విభాగంలో మహిళలను పట్టించుకోకపోవడంపై ఆస్కార్‌పై తీవ్ర విమర్శలు రావడంతో తొలిసారి ఇద్దరు మహిళలు (క్లో ఝావో, ఎమరాల్డ్‌ ఫెన్నెల్‌) లను ...

Read More »