Monthly Archives: April 2021

నాలుగు లక్షలకు చేరువలో కరోనా కేసులు

 దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. దేశవ్యాప్తంగా రోజురోజుకూ కొత్త కేసులు పెరగడమే కాకుండా.. అత్యధిక సంఖ్యలో మరణాలు కూడా సంభవిస్తున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 3,86,452 కరోనా కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ శుక్రవారం వెల్లడించింది. దీంతో మొత్త కోవిడ్‌ కేసుల సంఖ్య 1,8a7,62,976కు చేరింది. ఇక గురువారం ఒక్కరోజే 3,498 మంది కరోనాబారిన పడి మరణించారు. మొత్తం మరణాల సంఖ్య 2,08,330కు చేరింది. అలాగే దేశవ్యాప్తంగా శుక్రవారం ఉదయానికి 31,70,228 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ...

Read More »

‘నారప్ప’ వాయిదా

వెంకటేష్‌ హీరోగా, దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల తెరకెక్కిస్తున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘నారప్ప’. ఈ చిత్రాన్ని మే 14న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా కూడా వాయిదా పడినట్లు మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు. పరిస్థితులు చక్కబడిన తర్వాత మళ్లీ రిలీజ్‌ డేట్‌ను ప్రకటించనున్నట్టు తెలిపారు.

Read More »

ఎపి కి మరో మూడు లక్షల కోవిషీల్డ్‌ టీకాలు..

ఎపి కి మరో మూడు లక్షల కోవిషీల్డ్‌ టీకాలు చేరుకున్నాయి. సీరం ఇన్‌స్టిట్యూట్‌ తయారు చేసిన కోవిషీల్డ్‌ టీకాలు గురువారం ఉదయం ఢిల్లీ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాయి. ఎయిర్‌పోర్టు నుండి టీకాలను వ్యాక్సిన్‌ నిల్వ కేంద్రానికి తరలించారు. అక్కడి నుంచి వైద్యారోగ్యశాఖ ఆదేశాల మేరకు ఆయా జిల్లాలకు పంపిణీ చేయనున్నారు.

Read More »

ఎపి ఇంటిలిజెన్స్‌ ఎస్‌పి రాంప్రసాద్‌ కరోనాతో మృతి

ఎపి ఇంటిలిజెన్స్‌ ఎస్‌పి రాంప్రసాద్‌ 10 రోజులుగా కరోనాతో పోరాడుతూ గురువారం ఉదయం కన్నుమూశారు. పోలీస్‌ శాఖలో సమర్థవంతమైన అధికారిగా రాంప్రసాద్‌కు మంచి పేరు ఉంది. గతంలో విజయవాడ ట్రాఫిక్‌ ఎడిసిపి గా విధులను నిర్వర్తించారు. ప్రస్తుతం కౌంటర్‌ ఇంటిలిజెన్స్‌లో నాన్‌ కేడర్‌ ఎస్‌పి గా ఉన్నారు.

Read More »

ప్రముఖ చిత్రకారుడు చంద్ర కరోనాతో కన్నుమూత

ప్రముఖ చిత్రకారుడు, రచయిత చంద్ర (74) కరోనాతో కన్నుమూశారు. గత మూడేళ్లుగా నరాలకు సంబంధించిన చికిత్స తీసుకుంటున్న చంద్ర కరోనా బారినపడటంతో సికింద్రాబాద్‌లోని మదర్‌ థెరిసా రీహాబిటేషన్‌ సెంటర్‌లో చికిత్స పొందారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందారు. చంద్ర భౌతికకాయాన్ని బంజారాహిల్స్‌ శ్రీనగర్‌ కాలనీలోని నివాసానికి తరలించారు.

Read More »

చార్‌ధామ్‌ యాత్రను రద్దు చేసిన ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం

ఉత్తరాఖండ్‌లో ప్రతి ఏటా జరిగే చార్‌ధామ్‌ యాత్రను ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం రద్దు చేసింది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తీరథ్‌సింగ్‌ రావత్‌ గురువారం ప్రకటించారు. అలాగే ఆలయాల్లోకి భక్తులను అనుమతించేది లేదని స్పష్టం చేశారు. కేవలం ఆ ఆలయాల్లోని పూజా కార్యక్రమాలు అర్చకులే నిర్వహిస్తారని ఆయన అన్నారు.ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్‌, కేదార్‌నాథ్‌, యమునోత్రి, గంగోత్రిలు ఈ నాలుగు ఆలయాలను చార్‌ధామ్‌లుగా పిలుస్తారు. ఈ నాలుగు ఆలయాల సందర్శన రీత్యా ప్రతిఏటా ...

Read More »

రెండు లక్షలు దాటిన కరోనా మరణాలు

దేశంలో కరోనా మహమ్మారి ప్రాణాంతకంగా మారింది. రోజుకు వేలాది మందిని పొట్టనబెట్టుకుంటూ బెంబేలెత్తిస్తున్నది. గడచిన 24 గంటల్లో 3,293 మంది కరోనా బారినపడి మృత్యువాతపడ్డారు. దీంతో వైరస్‌తో చనిపోయిన వారి సంఖ్య రెండు లక్షలను దాటింది. తాజా మరణాలతో కరోనా మరణాల స్యం 2,01,187కు చేరింది. ఇక తాజాగా గడిచిన 24 గంటల్లో 3,60,960 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,79,97,267కు చేరాయి. బుధవారం ఉదయం నాటికి 29,78,709 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ ...

Read More »

అల్లు అర్జున్‌ కి కరోనా పాజిటివ్

రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ దేశ వ్యాప్తంగా కరోనా సునామి సృష్టిస్తుంది. సినీ ఇండస్ట్రిలో కూడా ఇప్పటికే  అనేకమంది కరోనా పడ్డారు. తాజాగా హిరో అల్లు అర్జున్‌ కు కరోనా సోకింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం తాను ఇంట్లోనే హౌం క్వారంటైన్‌లో ఉన్నానని, గత కొన్ని రోజులుగా తనను కలిసిన వారంతా కరోనా టెస్టులు చేయించుకోవాలని కోరారు. తన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని తెలిపారు. 

Read More »

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఏక్‌నాథ్‌ గైక్వాడ్‌ కరోనాతో మృతి

మహారాష్ట్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, మాజీ ఎంపి ఏక్‌నాథ్‌ గైక్వాడ్‌ (81) కరోనాతో మరణించారు. ఇటీవల కరోనా బారిన పడిన ఆయన ముంబైలోని కాండి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం కన్నుమూశారు. ఆయన కూతురు వర్షా గైక్వాడ్‌ ప్రస్తుతం మహారాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. ఏక్‌నాథ్‌ గైక్వాడ్‌ ముంబయి సౌత్‌ సెంట్రల్‌ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎంపిగా గెలుపొందారు. దేశంలోనే అతిపెద్ద మురికివాడ ఉన్న ముంబయిలోని ధారావి అసెంబ్లీకి 1985 నుండి వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రెండు ...

Read More »

వచ్చే నెలలో 44 ఆక్సిజన్‌ ప్లాంట్లను నెలకొల్పుతాం : కేజ్రీవాల్‌

 ఢిల్లీలో కోవిడ్‌ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఆక్సిజన్‌ కొరత ఏర్పడంతో మృత్యు ఘంటికలు మోగుతున్నాయి. దీనిపై ప్రధాని మోడీ సైతం అసహనం వ్యక్తం చేసిన సంగతి విదితమే. దీంతో కేజ్రీవాల్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ దేశాల నుండి ఆక్సిజన్‌ ట్యాంకర్లు, ప్లాంట్లను దిగుమతి చేసుకుంటోంది. దేశ రాజధానిలో వచ్చే నెలలో 44 ఆక్సిజన్‌ ప్లాంట్లను నెలకొల్పనున్నట్లు అరవింద్‌ కేజ్రీవాల్‌ మంగళవారం తెలిపారు. ఆక్సిజన్‌ ట్యాంకర్ల కొరత ఉందని, ఈ సమస్యను తగ్గించడానికి బ్యాంకాక్‌ నుండి 18 ట్యాంకర్లను దిగుమతి చేసుకుంటున్నామని పేర్కొన్నారు. ...

Read More »