Monthly Archives: April 2021

29 వరకు ఏకాంతంగా శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు

కోవిడ్‌ 19 వ్యాప్తి నేపథ్యంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ఏప్రిల్‌ 29 వరకు ఆలయంలోనే ఏకాంతంగా జరుగనున్నాయి. నేడు శ్రీరామనవమిని పురస్కరించుకొని.. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో బుధవారం ఉదయం ధ్వజారోహణంతో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రధాన కంకణబట్టర్‌ శ్రీరాజేష్‌ కుమార్‌ భట్టర్‌ ఆధ్వర్యంలో ధ్వజారోహణం కార్యక్రమం జరిగింది. అనంతరం శ్రీరామనవమి, పోతన జయంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో రమేష్‌ బాబు, ఎఇఒ మురళీధర్‌, సూపరింటెండెంట్లు వెంకటాచలపతి, వెంకటేశయ్య, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ ధనంజయులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Read More »

కరోనా చికిత్స పొందుతూ.. టాలీవుడ్‌ నిర్మాత మృతి

టాలీవుడ్‌ నిర్మాత సిఎన్‌.రావు (చిట్టి నాగేశ్వరరావు) కరోనా బారినపడి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో సిఎన్‌ రావు జన్మించారు.   తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి సంయుక్త కార్యదర్శిగా, తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి కార్యవర్గ సభ్యుడిగా, తెలుగు చలన చిత్ర నిర్మాతల సెక్టార్‌ సెక్రటరీగా, సౌత్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌ అఫ్‌ కామర్స్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యునిగా సిఎన్‌.రావు బాధ్యతలను నిర్వర్తించి సేవలందించారు. గతంలో ఫిల్మ్‌ ఫెడరేషన్‌ అఫ్‌ ఇండియా ఎగ్జిక్యూటివ్‌ ...

Read More »

గుంటూరు కోర్టులో కరోనా కలకలం

గుంటూరు జిల్లా కోర్టులో కరోనా కలకలం రేపింది. మొత్తం 17 మంది వైరస్‌ బారిన పడ్డారు. వీరిలో న్యాయమూర్తులు, న్యాయశాఖ సిబ్బంది, న్యాయవాదులు కూడా ఉన్నారు. ఇదిలా ఉండగా, ఇటీవల కరోనా బారిన పడిన, కోర్టు అసిస్టెంట్‌ నాజర్‌గా పనిచేస్తున్న రవి చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందారు. ముగ్గురు న్యాయమూర్తులు, ఇద్దరు బార్‌ కౌన్సిల్‌ సభ్యులు, 12 మంది న్యాయశాఖ సిబ్బంది కరోనాతో వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు.

Read More »

నాసిక్‌ జాకీర్ హుస్సేన్ హాస్పిటల్‌లో ఘోర ప్రమాదం

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం సంభవించింది. నాసిక్‌లోని ప్రముఖ జాకీర్‌ హుస్సేన్‌ ఆసుపత్రిలో ఆక్సిజన్‌ ట్యాంక్‌ లీక్‌ అవడంతో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆసుపత్రి వెలుపల ఉన్న ఆక్సిజన్‌ ట్యాంకర్లలో ఒక ట్యాంక్‌ నుంచి భారీగా ఆక్సిజన్‌ లీక్‌ కావడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఆక్సిజన్‌ ట్యాంక్‌ నుంచి పెద్ద ఎత్తున లీక్‌ కావడంతో ఆ ప్రాంతమంతా తెల్లని గ్యాస్‌ వ్యాపించింది. దీంతో సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకుని నివారణ చర్యలు చేపట్టారు. నిపుణులు గ్యాస్‌ అదుపు చేసేందుకు ...

Read More »

ఏపీ లో కరోనా తో ఒకే కుటుంబంలో నలుగురు మృతి

కరోనా రెండోదశ తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. కృష్ణాజిల్లా విజయవాడలోని ఓ న్యాయవాది కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. కరోనాతో నాలుగు రోజుల వ్యవధిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు కరోనాతో మృతి చెందారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. మంగళవారం తెల్లవారుజామున కరోనాతో న్యాయవాది దినేశ్‌ తండ్రి మృతి చెందగా, మధ్యాహ్నం దినేశ్‌ మృతి చెందారు. కాగా, మూడు రోజుల క్రితం కరోనాతో దినేశ్‌ తల్లి, బాబాయి మృతి చెందారు.

Read More »

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సగం మందికే విధులు

కోవిడ్‌ ఉదృతి రీత్యా కేంద్ర కార్యాలయాల్లో పనిచేసే సిబ్బందిని 50 శాతానికే పరిమితం చేయాలని సిబ్బంది వ్యవహారాల శాఖ నిర్ణయం తీసుకుంది. అండర్‌ సెక్రటరీ, అందుకు సమానమైన హోదాలో ఉన్న ఉద్యోగులు, మిగిలిన సిబ్బంది 50 శాతం మాత్రమే పని చేయాలని స్పష్టం చేసింది. డిప్యూటీ సెక్రటరీ, అందుకు సమానమైన హోదా గల ఉద్యోగులు మాత్రం రోజూ ఆఫీసుకు రావాల్సిందేనని ఆదేశించింది. ఆఫీసుకు వచ్చే 50 శాతం సిబ్బందిని కూడా మూడు షిఫ్టుల్లో పని చేయాలని సూచించారు. కంటోన్మెంట్‌ జోన్‌లో నివాసముండే సిబ్బందికి దాన్ని ...

Read More »

జబర్దస్త్‌ ఫేం వర్షకు కరోనా

ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్‌ ఫేం వర్ష కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె లైవ్‌లోకి వచ్చి ప్రకటించారు. ‘రెండు రోజులుగా నా ఆరోగ్యం బాగోలేదు. దీంతో కరోనా పరీక్ష చేయించుకున్నాను. అందులో పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ఈ విషయాన్ని లైవ్‌లోకి వచ్చి ఎందుకు చెప్పాలని అనుకుంటున్నానంటే.. బయట పరిస్థితి మరింత దారుణంగా ఉంది. చనిపోయిన వారిని ప్యాక్‌ చేసి పడేస్తున్నారు. ఈ సంఘటనలను చూస్తుంటే గుండె తరుక్కుపోయి ఈ విషయాన్ని లైవ్‌లో వచ్చి చెప్పాలని అనుకున్నాను’ అని ఆమె అన్నారు. కాగా.. అందరూ ...

Read More »

యుపిలోని ఆ ఐదు నగరాల్లో లాక్‌డౌన్‌పై సుప్రీం స్టే

కరోనా రెండోదశ వ్యాప్తి తీవ్రత నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని ఐదు నగరాల్లో లాక్‌డౌన్‌ విధించాలని ఆలహాబాద్‌ హైకోర్ట్‌ ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టు స్టే విధించింది. హైకోర్ట్‌ తీర్పునకు వ్యతిరేకంగా యుపి ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించడంతో చీఫ్‌ జస్టిస్‌ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. ఈ విషయంలో అమికస్‌ క్యూరీని నియమించింది. కోవిడ్‌ ఉధృతి దృష్ట్యా లక్నో, వారణాసి, ప్రయాగ్‌రాజ్‌, కాన్పూర్‌, గోరఖ్‌పూర్‌లలో లాక్‌డౌన్‌ విధించాలని సోమవారం నాడు ఆలహాబాద్‌ హైకోర్ట్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ఈ తీర్పును సవాల్‌ చేస్తూ నేడు ...

Read More »

ఎపిలో రేపటి నుంచి 1-9 తరగతులకు సెలవులు

ఇంటర్‌ పరీక్షలు యథాతథంగా జరుగుతాయని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సరేష్‌ స్పష్టం చేశారు. టెన్త్‌ పరీక్షలు కూడా షెడ్యూల్‌ ప్రకారమే నిర్వహిస్తామన్నారు. అయితే, 1 నుంచి 9వ తరగతుల వరకు విద్యార్థులకు రేపటి నుంచి సెలవులు ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనాపై సమీక్ష జరిపామని, పాఠశాలల్లో కరోనా వేగంగా విస్తరిస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

Read More »

తెలంగాణ సర్కార్‌కు హైకోర్టు చీవాట్లు

తెలంగాణా ప్రభుత్వానికి హైకోర్టు చీవాట్లు పెట్టింది. కరోనాను నియంత్రించేందుకు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని కెసిఆర్‌ సర్కార్‌పై అత్యున్నత న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. హైకోర్టుకు సమర్పించే నివేదికలో కనీస వివరాలు లేకపోవడంపై మొట్టికాయలు వేసింది. సినిమా హాల్స్‌, పబ్బులు, బార్లలో రద్దీని తగ్గించేందుకు ఏం చర్యలు తీసుకున్నారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ‘పబ్బులు, మద్యం దుకాణాలపై చర్యలు ఏమయ్యాయి..? మీకు ఆదాయమే ముఖ్యమా..?’ అని టిఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. జిల్లా అధికారులు ఇచ్చే కరోనా కేసుల రిపోర్టులకు, ప్రభుత్వం ఇచ్చే పూర్తి రిపోర్టులకు చాలా ...

Read More »