Monthly Archives: April 2021

హీరోయిన్ సమీరా రెడ్డికి కరోనా

సమీరా రెడ్డి కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఆదివారం సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. ‘నాకు కరోనా వైరస్‌ పాజిటివ్‌ అని తేలింది. ఇంట్లో క్వారంటైన్‌లో ఉన్నాను. ప్రస్తుతానికి నేను క్షేమంగానే ఉన్నాను. నా ముఖం మీద చిరునవ్వు తీసుకొచ్చే ఎందరో నా చుట్టూరా ఉన్నారు. ఇక ఇలాంటి సమయంలోనే మనం పాజిటివ్‌గా ధఅడంగా ఉండాలి’ అని సమీరా తెలిపారు. సమీరా ట్వీట్‌ కు స్పందించిన అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలంటూ కామెంట్లు చేస్తున్నారు. వ్యాపారవేత్త అక్షరు వార్డేను 2014 లో ...

Read More »

నేటి నుండి రెండో డోసు.. 5 లక్ష‌ల వైద్య సిబ్బందికి

రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడత టీకా వేయించు కున్న వైద్య సిబ్బంది ( ఆరోగ్య కార్యకర్తలు)కు రెండవ డోసు వేయడానికి రంగం సిద్దమైంది. సోమవారం నుండి వీరికి రెండవ డోసు వేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మంది వైద్య సిబ్బందికి రెండవ డోసు వేయనున్నారు. టీకా పంపిణీలో కొరతతో పాటు, వృద్ధా అవుతోందన్న వార్తల నేపథ్యంలో ఈ మొత్తం ప్రక్రియను పర్యవేక్షిం చడానికి ఒక యాప్‌ను కూడా ప్రభుత్వం రూపొం దించింది.ఈ ...

Read More »

మూడో రోజూ 2 లక్షలు దాటిన కరోనా కేసులు

దేశంలో ఏరోజుకారోజూ కరోనా కేసులు కొండల్లా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 2,34,692 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు దేశంలో నమోదైన గరిష్ట స్థాయి సంఖ్య ఇదే. గత మూడు రోజులుగా వైరస్‌ కేసులు 2 లక్షలను మించిపోతున్నాయి. శనివారం విడుదల చేసిన జాబితాలోని సంఖ్యతో కలుపుకుని ..దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 1,45,26,609 కేసులు పొగయ్యాయి. అదేవిధంగా గడిచిన 24 గంటల్లో 1,341 మంది మృతి చెందారు. దీంతో మొత్తంగా 1,75,649 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 16,79,740 యాక్టివ్‌ ...

Read More »

ప్రముఖ కమెడియన్‌ ‘వివేక్‌’ మృతి..

చిత్ర పరిశ్రమను వరస విషాదాలు వెంటాడుతున్నాయి. గత కొంతకాలంగా వరసగా నటీనటులు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ప్రముఖ కమెడియన్‌ వివేక్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మరణించారు. శుక్రవారం వివేక్‌కు గుండెపోటు రావడంతో చెన్నైలో ఓ ప్రయివేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్సనిచ్చిన వైద్యులు వివేక్‌ పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. అయితే, వివేక్‌ కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న మరుసటి రోజే గుండెపోటు రావడంతో తమిళ సినీ ఇండిస్టీ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యింది.

Read More »

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామికి కరోనా

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జనతాదళ్‌ (సెక్యులర్‌) నేత హెచ్‌డి కుమారస్వామి కరోనా బారిన పడ్డారు. శనివారం వచ్చిన ఫలితాల్లో కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. గత కొన్ని రోజులుగా తనతో సన్నిహితంగా మెలిగిన వారంతా ఐసోలేషన్‌లో ఉండాలని, కోవిడ్‌ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. బసవ కళ్యాణ్‌ నియోజకవర్గానికి ఉప ఎన్నికల జరుగుతుండగా..ఆ అభ్యర్థి తరపున గత కొన్ని రోజులుగా కుమారస్వామి ప్రచార ర్యాలీలో పాల్గన్నారు. కాగా, గత నెల 23న కోవిడ్‌ వ్యాక్సిన్‌ తొలి డోసు తీసుకున్నారు.

Read More »

తిరుపతి ఉప ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికకు పోలింగ్‌ ప్రారంభమైంది. శనివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు కొనసాగనుంది. నెల్లూరు జిల్లాలోని నాలుగు, చిత్తూరు జిల్లాలో మూడు అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో 17,10,699 మంది ఓటర్లున్నారు. వీరిలో మహిళలు 8,71,943 మంది, పురుషులు 8,38,540 మంది. 2,470 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రధాన పార్టీలతో పాటు మొత్తం 28 మంది పోటీలో ఉన్నారు.

Read More »

లోటస్‌ పాండ్‌లో కొనసాగుతున్న షర్మిల రెండోరోజు దీక్ష

తెలంగాణలో నిరుద్యోగుల సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ వైఎస్‌ షర్మిల చేపట్టిన దీక్ష రెండో రోజూ కొనసాగుతోంది. లోటస్‌ పాండ్‌లోని తన నివాసంలోనే ఆమె దీక్ష కొనసాగిస్తున్నారు. శుక్రవారం ఉదయం వైద్యులు ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇందిరాపార్కు సమీపంలోని ధర్నా చౌక్‌ వద్ద ఆమె గురువారం ఉదయం ‘ఉద్యోగ దీక్ష’ చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే సాయంత్రం 5 గంటలకు సమయం ముగిసిందని, దీక్షాస్థలిని ఖాళీ చేయాలని పోలీసులు కోరారు. దీంతో లోటస్‌పాండ్‌లోనైనా దీక్ష కొనసాగిస్తానంటూ షర్మిల తెలుగుతల్లి ఫ్లైఓవర్‌ మీదుగా కాలినడకన ...

Read More »

తమిళ నటుడు వివేక్‌కు గుండెపోటు.. పరిస్థితి విషమం.

 ప్రముఖ తమిళ హాస్యనటుడు వివేక్‌ (59) తీవ్రమైన గుండెపోటుతో మద్రాసులోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో శుక్రవారం చేరారు. అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కార్డియాక్‌ అరెస్ట్‌తో వివేక్‌ బాధపడుతున్నారని వైద్యులు నిర్ధారించారు.  గురువారం చెన్నైలోని ఓమందూరు సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో వివేక్‌ కోవిడ్‌ టీకా తీసుకున్నారు. డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బందికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. అనంతరం వివేక్‌ మీడియాతో మాట్లాడుతూ.. వ్యాక్సిన్‌ తీసుకోవడం ద్వారానే ఈ భయంకర వైరస్‌ నుంచి మనల్ని మనం కాపాడుకోగలమని అన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ...

Read More »

కరోనా ప్రభావిత నగరాల్లో ఢిల్లీ ముందంజ

దేశంలో అత్యధికంగా కరోనా ప్రభావితమైన నగరాల్లో ఢిల్లీ తొలి వరుసలో ఉంది. కేసులు నమోదులో ఆర్థిక నగరాన్ని తన్ని దేశ రాజధాని ముందుకు వచ్చింది. ఢిల్లీలో కొన్ని రోజులుగా వైరస్‌ కోరలు చాచుతోంది. దేశ వ్యాప్తంగా కరోనా 2.0 వేవ్‌ నడుస్తుండగా.. ఢిల్లీలో మూడవ వేవ్‌ కొనసాగుతోంది. బుధవారం ఢిల్లీలో 17,282 కేసులు నమోదు కావడమే ఇందుకు నిదర్శనం. ఆసుపత్రులు కూడా కిటకిటలాడుతున్నాయి. దీంతో వీకెండ్‌ కర్ఫ్యూను ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రకటించిన సంగతి విదితమే. ముంబయిలో ఇప్పటి వరకు అత్యధికంగా నమోదైన కేసులు ...

Read More »

పవన్ కళ్యాణ్ కు కరోనా పాజిటివ్

పవన్ కళ్యాణ్‌కి కరోనా పాజిటివ్ అని కన్ఫర్మ్ అయినట్లు తెలుపుతూ ఓ నోట్ రిలీజ్ చేశారు. ”జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు కొవిడ్‌ సోకినట్లు నిర్ధారణ కావడంతో నిపుణులైన వైద్యుల ఆధ్వర్యంలో ఆయనకు చికిత్స జరుగుతోంది. ఈనెల 3వ తేదీన తిరుపతిలో పాదయాత్ర, బహిరంగ సభలో పాల్గొని పవన్‌ హైదరాబాద్‌ చేరుకున్నారు. అనంతరం కరోనా టెస్ట్‌ చేయించుకోగా, నెగెటివ్‌ వచ్చింది. అయినా వైద్యుల సూచన మేరకు ఇన్ని రోజులు వ్యవసాయ క్షేత్రంలో క్వారంటైన్‌లో ఉన్నారు. తాజాగా కొద్ది పాటి జ్వరం, ఒళ్లు నొప్పులు ఇబ్బంది ...

Read More »