Monthly Archives: May 2021

నేడు 14 మెడికల్‌ కాలేజీలకు జగన్‌ శంకుస్థాపన

రాష్ట్రంలో కొత్తగా 14 వైద్య కళాశాలలకు నేడు (సోమవారం) సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ఆయన వర్చువల్‌ విధానం ద్వారా 14 వైద్యకళాశాలలకు శంకుస్థాపన చేస్తారు. పార్లమెంటుకు ఒకటి వంతున 16 మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేస్తుండగా.. ఇప్పటికే పులివెందుల, పాడేరు వైద్యకళాశాలలకు శంకుస్థాపన పూర్తయింది. మిగతా 14 మెడికల్‌ కాలేజీలకు సోమవారం శంకుస్థాపన చేస్తారు. 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఒకేసారి 4 వైద్య కళాశాలలను ఏర్పాటు చేశారు.

Read More »

ఏపీలో జూన్‌ 30 వరకు వేసవి సెలవులు పొడిగింపు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి వ్యాప్తి విపరీతంగా ఉన్న నేపథ్యంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ కొనసాగుతుండటంతో అన్నీ ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవులను జూన్‌ 30 వరకు పొడిగిస్తున్నట్లుఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు పాఠశాల విద్యా కమిషనర్‌ చిన వీరభద్రుడు ఉత్తర్వులను జారీ చేశారు. వాస్తవానికి ఈ విద్యా సంవత్సరం జూన్ 3వ తేదీతో ముగియనుంది. జూన్‌ 12వ తేదీ నుంచి అన్ని తరగతులకు ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహించనున్నారు. పదో తరగతి విద్యార్థుల విషయంలో ప్రధానోపాధ్యాయులు అవసరమైన విద్యా సహాయాన్ని ...

Read More »

సూపర్ స్టార్ కి విషెస్ చెప్పిన ‘ప్రిన్స్’

తెలుగు చిత్ర సీమలో సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకుని మూడు వందలకి పై చిలుకు చిత్రాలలో నటించిన కృష్ణ. తన సినీ కెరీర్ లో ఎన్నో సాహసాలని చేసిన సూపర్ స్టార్ కృష్ణ నేటితో (సోమవారం) 78వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయన తనయుడు, హీరో మహేష్‌ బాబు ట్విటర్‌ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘హ్యాపీ బర్త్‌డే నాన్న. నేను ముందుకెళ్లడానికి ఎప్పుడూ నాకు అత్యుత్తమైన మార్గాన్ని చూపించినందుకు ధన్యవాదాలు. మీరు అనుకునేదాని కంటే ఎక్కువగా మిమ్మల్ని ప్రేమిస్తుంటాను నాన్న’ ...

Read More »

కేసీఆర్‌ దారిలోనే ఈటల

ఏది ఏమైనా ఈ రాజకీయ అనిశ్చిత్తిలో ఉండిపోయిన మాజీ మంత్రి ఈటల గ్రహశాంతి జరిపిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. యాగాలు చేస్తే గండం గట్టెక్కి మళ్లీ పూర్వ వైభవం కలిసివస్తుందనే ఉద్దేశంతో ఆ కార్యక్రమాలు జరిపిస్తున్నట్లు తెలుస్తోంది. గడిచిన మూడు రోజులుగా శామిర్‌పేట్‌లోని ఆయన నివాసంలో జరుగుతున్న పూజలు దీనికి బలం చేకూరుస్తోంది. తాజా పరిణామాల నుండి ఉపశమనం పొందేందుకు, రాబోయే రాజకీయ భవిష్యత్తు సాఫీగా సాగేందుకు, శత్రువుల నుండి రక్షణ కోసం మాజీ మంత్రి ఆరుగురు పండితులతో యాగాలు, పూజలు చేయడం ఇప్పుడు ఆసక్తిగా ...

Read More »

మోదీకి మమతా బెనర్జీ దిమ్మదిరిగే కౌంటర్

మమతా బెనర్జీ మరోసారి విరుచుకుపడ్డారు. యాస్ తుఫాను నష్టంపై ప్రధానితో సమీక్ష సమావేశానికి బెంగాల్ సీఎం అలస్యంగా వచ్చారని, ప్రధానిని కించపరిచేలా, అమర్యాదగా ఓ ముఖ్యమంత్రి ప్రవర్తించడం గతంలో ఎన్నడూ చూడలేదని ప్రధాన మంత్రి కార్యాలయం చేసిన వ్యాఖ్యలపై దీదీ మండిపడ్దారు. మీడియాకు పీఎంఓ తప్పుడు సమాచారం ఇస్తోందని దుయ్యబట్టారు. మమ్మల్ని ఇంతలా అవమానించవద్దని, అసెంబ్లీ ఎన్నికల్లో మాకు ఘన విజయం సాధించడంతో మీరు ఓర్వలేకపోతున్నారని మమతా తూర్పారబట్టారు. ‘‘ఈ విధంగా నన్ను అవమానించవద్దు.. మాకు ఘన విజయం లభించింది, అందుకే మీరు ఇలా ప్రవర్తిస్తున్నారు? గెలవడానికి మీరు ...

Read More »

‘బింబిసారుడు’గా కళ్యాణ్‌రామ్‌

నందమూరి కళ్యాణ్‌రామ్‌ హీరోగా, నిర్మాతగా ప్రయోగాలు చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. తాజాగా ఆయన మరో ప్రయోగాత్మక చిత్రంతో ముందుకువస్తున్నారు. ‘బింబిసార’ సినిమాలో ఆయన నటిస్తున్నారు. సీనియర్‌ ఎన్‌టిఆర్‌ జయంతి సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ లుక్‌ మోషన్‌ పోస్టర్‌ను చిత్రయూనిట్‌ శుక్రవారం విడుదల చేసింది. క్రూరుడైన బింబిసారుడు ఫోజులో ఠీవీగా కూర్చున్న కళ్యాణ్‌రామ్‌ లుక్‌ చాలా విభిన్నంగా ఉంది. ఈ తరహా పాత్రలో కళ్యాణ్‌రామ్‌ తొలిసారి నటిస్తున్నారు. ఆ పాత్ర లుక్‌, బ్యాక్‌డ్రాప్‌ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.

Read More »

జల వనరుల శాఖపై జగన్‌ సమీక్ష

జల వనరుల శాఖపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. పోలవరం సహా ప్రాధాన్యత ప్రాజెక్టుల నిర్మాణ ప్రగతిపై సమీక్షిస్తున్నారు. ఈ సమావేశంలో జల వనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Read More »

కాసేపట్లో మోడీ ఏరియర్ సర్వే

 కాసేపట్లో యాస్‌ తుపాను ప్రభావం అధికంగా పడిన ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో ప్రధాని మోడి ఏరియల్‌ సర్వే చేపట్టనున్నారు. ఈ విషయాన్ని ప్రధానమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఆ రెండు రాష్ట్రాల్లోనూ ప్రధాని సమీక్ష సమావేశాలను చేపట్టనున్నారని, ఏరియల్‌ సర్వే సైతం చేపడతారని స్పష్టం చేసింది. సైక్లోన్‌ కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలను ప్రధాన మంత్రి విమానంలో నుంచి ప్రత్యక్షంగా పరిశీలిస్తారు. యాస్‌ తుఫాను వల్ల ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాలలో ఏ మేరకు ప్రభావం పడిందీ అంచనా వేయడానికిగాను నిర్వహించే సమీక్ష ...

Read More »

నాగార్జున సినిమాలో యాంకర్‌ రష్మి

నాగార్జున, ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమాను తీయబోతున్నారని తెలిసిందే. ఇందులో కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవల షుటింగ్‌ మొదలైంది. కరోనా కారణంగా నిలిచిపోయిన ఈ చిత్ర నిర్మాణం త్వరలో సెట్స్‌ మీదకు రానున్నది. తాజా సమాచారం ప్రకారం ఇందులో యాంకర్‌ రష్మీ గౌతమ్‌ కీలకపాత్రలో నటించబోతున్నారని తెలుస్తోంది. నాగార్జున సినిమాల్లో యాంకర్స్‌ నటించడం కొత్తకాదు. ‘సోగ్గాడే చిన్ని నాయన’ సినిమాలో అనసూయ నటించడం తెలిసిందే.

Read More »

కరోనా నివారణ చర్యలపై ఏపీ కేబినెట్‌ సమావేశం

కరోనా నివారణపై మంత్రివర్గ సమావేశం మంగళగిరి ఏపిఐఐసి బిల్డింగ్‌ 6వ ఫ్లోర్‌లో గురువారం జరిగింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గ్రూప్‌ అఫ్‌ మినిస్టర్స్‌ కమిటీ కన్వీనర్‌ ఆళ్ల నాని అధ్యక్షతన సమావేశం జరిగింది. కరోనా నియంత్రణ, బ్లాక్‌ ఫంగస్‌ నివారణకు తీసుకోవలసిన చర్యలు, వ్యాక్సిన్‌, ఆక్సిజన్‌ బెడ్స్‌, బ్లాక్‌ ఫంగస్‌ ఇంజక్షన్స్‌పై కర్ఫ్యూ అమలు జరుగుతున్న తీరు పలు అంశాలపై మంత్రుల కమిటీ చర్చించింది. ఈ సందర్భంగా కరోనా కష్ట కాలంలో ప్రాణాలు తెగించి రోగులకు వైద్య సేవలు ...

Read More »