Monthly Archives: May 2021

రైతు భరోసా నిధులు విడుదల చేసిన జగన్‌

రైతన్నకు అన్ని విధాలుగా భరోసాగా నిలుస్తోన్న ఏపీ ప్రభుత్వం.. హొఆర్థిక ఇబ్బందులను సైతం లెక్క చేయకుండా ఇచ్చిన మాటకు కట్టుబడి గత రెండేళ్ల మాదిరిగానే మూడో ఏడాది కూడా ‘వైఎస్సాఆర్‌ రైతు భరోసా’ తొలి విడత సాయం విడుదల చేసింది. తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి రైతుల ఖాతాల్లో నగదు జమ చేశారు.ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..హొరైతులకు మేలు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. ‘వైఎస్సార్‌ రైతు భరోసా’ కింద మూడో ...

Read More »

భారత్‌కు చేరుకున్న మరో 1200 ఆక్సిజన్‌ సిలిండర్లు

కరోనా రెండవ ఉప్పెనలో కొట్టుమిట్టాడుతున్న భారత్‌కు సాయం అందించేందుకు పలు దేశాలు ముందుకు వచ్చాయి. అందులో భాగంగా బ్రిటన్‌ పంపిన మరో 1200 ఆక్సిజన్ల సిలిండర్లు భారత్‌కు గురువారం చేరుకున్నాయి. ఈ ఆక్సిజన్‌ సిలిండ్లరు భారత్‌కు సరఫరా చేసేందుకు సహకరించిన ఖతర్‌ ఎయిర్‌ వేస్‌కు విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిండమ్‌ బగ్చి కృతజ్ఞతలు తెలిపారు. ‘యుకెలోని బ్రిటీష్‌ ఆక్సిజన్‌ కంపెనీ నుండి 1200 ఆక్సిజన్‌ సిలిండర్లను బహుమతిగా పొందాము. వీటిని తీసుకువచ్చేందుకు సహకారం అందించిన ఖతర్‌ ఎయిర్‌ వేస్‌కు ధన్యవాదాలు’ అని ట్వీట్‌ ...

Read More »

సోనూసూద్‌ ‘ఆక్సిజన్‌ ప్లాంట్లు’

కరోనా సెకండ్‌ వేవ్‌ దెబ్బకి ఆసుపత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి. దీంతో బెడ్స్‌తో పాటు ఆక్సిజన్‌ కొరత వేధిస్తోంది. దీంతో హీరో సోనూసూద్‌ కీలక నిర్ణయం తీసుకున్నాడు. కోవిడ్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఆక్సిజన్‌ ప్లాంట్లను నెలకొల్పాలనే సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పటికే ఫ్రాన్స్‌ నుంచి ఓ ప్లాంట్‌కు ఆర్డర్‌ చేశామని, మరో 10-15 రోజుల్లో అక్కడ నుంచి ఆక్సిజన్‌ ప్లాంట్‌ రాబోతున్నట్లుగా సోనూసూద్‌ తెలిపాడు. ఇంకొన్ని దేశాల నుంచీ ప్లాంట్లను కొనుగోలు చేసేందుకు చర్చలు జరుపుతున్నట్లుగా ఆయన ప్రకటించాడు.

Read More »

అసెంబ్లీకి రాజీనామా చేసిన బిజెపి ఎమ్మెల్యేలు

పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీలో బిజెపికి బలం తగ్గింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులు 77 మంది విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఇద్దరు ఎమ్మెల్యేలు శాసన సభకు రాజీనామా చేయడంతో ఆ సంఖ్య 75కు తగ్గింది. ఆ ఇద్దరు కూడా బిజెపి ఎంపిలు కావడం గమనార్హం. పార్టీ అధిష్టానం సూచన మేరకు నితీష్‌ ప్రమాణిక్‌, జగన్నాధ్‌ సర్కార్‌ తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తూ అసెంబ్లీ స్పీకర్‌కు లేఖలనిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వ ఏర్పాటు చేయగల సత్తా ఉన్న ఐదుగురు బిజెపి ...

Read More »

ఆ వైద్యుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 25 లక్షల పరిహారం

కరోనా పోరులో భాగంగా రోగుల కోసం అహర్నిశలు శ్రమిస్తూ మహమ్మారికి బలైన 43 మంది వైద్యుల కుటుంబాలకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఆర్థిక సాయం ప్రకటించారు. ఒక్కొక్క కుటుంబానికి రూ. 25 లక్షల రూపాయలను అందిస్తున్నట్లు బుధవారం తెలిపారు. అదేవిధంగా ఫ్రంట్‌ లైన్‌ కార్మికులకు ఏప్రిల్‌, మే, జూన్‌ నెలలకు గానూ ప్రోత్సహాకాలు ప్రకటించారు. అధికారిక ప్రకటన ప్రకారం ఏప్రిల్‌,మే, జూన్‌ నెలలకు గానూ వైద్యులకు రూ. 30 వేలు, నర్సులకు రూ. 20 వేలు, ఇతర కార్మికులకు రూ. 15 వేలు, అంతేకాకుండా ...

Read More »

భారత్ లో ఒక్క రోజులోనే 4,200 పైగా మరణాలు

భారత్‌లో మృత్యు ఘోష వినిపిస్తోంది. కరోనా తొలి వేవ్‌లో కన్నా రెండవ వేవ్‌లో రికార్డు స్థాయి మరణాలు సంభవిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 4,205 మంది కరోనాకు బలయ్యారు. ఇప్పటి వరకు భారత్‌లో ఈ సంఖ్యే గరిష్టం. మొత్తంగా రెండున్నర లక్షల మందిని కరోనా పొట్టనపెట్టుకుంది. అదేవిధంగా 3,48,421 కొత్త కేసులు వెలుగుచూశాయి. ఈ సంఖ్యతో దేశంలో ఇప్పటి వరకు 2,33,40,938 మంది కరోనా బారిన పడగా…2,54, 197 మంది మహమ్మారి బలి తీసుకుంది. ప్రస్తుతం దేశంలో 37,04,099 యాక్టివ్‌ కేసులున్నాయి. కాగా, కర్ణాటకలో ...

Read More »

ముంచుకొస్తున్న తుపాన్‌..!

భారతదేశంలో కరోనా విలయతాండవం చేస్తున్న వేళ.. తుపాను ముప్పు ముంచుకొస్తుంది. మే 14 నాటికి అరేబియా సముద్రంలో అల్ప పీడనం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయని, మరికొద్ది రోజుల్లో తుపాన్‌ వచ్చే సంకేతాలు ఉన్నట్లు భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇది క్రమంగా ఈ నెల 16 నాటికి బలపడి వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని, బలపడిన అల్పపీడనం క్రమంగా తుపానుగా మారే అవకాశం ఎక్కువగా ఉందని హెచ్చరించింది.

Read More »

నటుడు మన్సూర్‌ అలీ ఖాన్‌కు అస్వస్థత

నటుడు మన్సూర్‌ అలీఖాన్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన స్థానిక అంజిగరైలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో అత్యవసర విభాగంలో చేరారు. మన్సూర్‌ అలీఖాన్‌ మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్నారు. కరోనా పరీక్షల్లో ఆయనకు నెగిటివ్‌ వచ్చినట్లు వైద్యులు తెలిపారు. అయితే ఆయన మూత్ర పిండాల్లో రాళ్ళు ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ కారణంగానే మన్సూర్‌ అలీఖాన్‌ అస్వస్థతకు గురైనట్లు తెలిపారు. ఈ మేరకు ఆయనకు శస్త్ర చికిత్స చేయనున్నారు.

Read More »

తెలంగాణాలో రేపటి నుండి లాక్‌డౌన్‌

కరోనా పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ మంత్రి వర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కెసిఆర్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో బుధవారం నుండి 10 రోజుల పాటు లాక్‌డౌన్‌ విధించాలని నిర్ణయించింది. లాక్‌డౌన్‌ సమయంలో ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు మాత్రమే నిత్యావసరాల, ఇతర వస్తువులు కొనుగోలు చేసేందుకు అవకాశమిచ్చింది. అనంతరం అత్యవసర సేవలు మినహాయించి మిగిలిన సేవలన్నీ నిలిచిపోతున్నాయి. లాక్‌డౌన్‌ సమయంలో నిబంధనలు అమలు అయ్యేలా చర్యలు చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఆదేశించారు.

Read More »

సన్‌రైజర్స్‌ రూ.30కోట్లు విరాళం

కరోనా మహమ్మారిపై పోరాటానికి మద్దతుగా ఐపిఎల్‌ ఫ్రాంఛైజి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ భారీ విరాళాన్ని ప్రకటించింది. ట్విటర్‌వేదికగా సోమవారం కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌తో ఇబ్బందిపడుతున్న వారిని ఆదుకునేందుకు రూ.30కోట్లు విరాళంగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. వివిధ స్వచ్ఛంద సంస్థలతో పాటు కేంద్ర, రాష్ఱ ప్రభుత్వాలు చేపడుతున్న కోవిడ్‌-19 సహాయక చర్యలకు ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు తెలిపింది. ఐపిఎల్‌లో పాల్గన్న ఆటగాళ్లు తమవంతు సాయాన్ని ప్రకటిస్తుండగా.. రాజస్థాన్‌ రాయల్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ యాజమాన్యాలు ఆర్థిక సాయంతో పాటు ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్స్‌, మెడికల్‌ కిట్లను డొనేట్‌ ...

Read More »