Monthly Archives: May 2021

ఈటలపై భూకబ్జా ఆరోపణలు

తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌పై భూ కబ్జా ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ప్రభుత్వం తమకు 40 ఏళ్ల క్రితం ఇచ్చిన అసైన్డు భూములను మంత్రి ఈటల కబ్జా చేశారని మెదక్‌ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేటకు చెందిన రైతులు ముఖ్యమంత్రి కార్యాలయానికి శుక్రవారం ఫిర్యాదు చేశారు. దీనిపై ముఖ్యమంత్రి కెసిఆర్‌ స్పందించి జిల్లా కలెక్టర్‌తో సమగ్ర విచారణ జరిపి నివేదిక అందజేయాలని సిఎస్‌ సోమేశ్‌కుమార్‌ను ఆదేశించారు. అసైన్డు భూముల విషయంలో వస్తోన్న ఆరోపణల్లో వాస్తవాలను నిగ్గు తేల్చాలని విజిలెన్స్‌ ...

Read More »

టాలీవుడ్‌ యువ దర్శకుడు కరోనాతో మృతి

సినీపరిశ్రమను కరోనా మహమ్మారి అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే సినీపరిశ్రమలో చాలామంది కరోనా బారినపడి మృతి చెందారు. తాజాగా… టాలీవుడ్‌ యంగ్‌ డైరెక్టర్‌ కుమార్‌ వట్టి (39) కరోనాతో పోరాడుతూ కన్నుమూశారు. కరోనా బారినపడిన కుమార్‌ వట్టి.. శ్రీకాకుళంలోని గ్రేట్‌ ఈస్టర్న్‌ మెడికల్‌ స్కూల్‌ అండ్‌ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మృతి చెందారు. ఈ విషయాన్ని విరాట పర్వం డైరెక్టర్‌ వేణు ఉడుగుల ట్విటర్‌లో షేర్‌ చేశారు. ఈ సందర్భంగా కుమార్‌ వట్టి కుటుంబానికి ప్రగాఢసానుభూతి ప్రకటించారు.

Read More »

వ్యాక్సిన్‌ ధరల్లో తేడా ఎందుకు? సుప్రీం కోర్టు ప్రశ్నల వర్షం

వ్యాక్సిన్‌ ధరల్లో తేడా ఎందుకు? వంద శాతం కేంద్రమే ఎందుకు కొనుగోలు చేయదు..? వ్యాక్సినేషన్‌లో ప్రైవేటీకరణ విధానం వద్దు.. పాత విధానం అమలు చేయండి సోషల్‌ మీడియాలో సాయం కోరిన వారిపై చర్యలు తీసుకుంటే కోర్టు ధిక్కారమే అంటూ కేంద్రంపై ప్రశ్నల వర్షం కురిపించిన సుప్రీం కోర్టు. కరోనా వ్యాక్సిన్‌ ధరల్లో తేడా ఎందుకు ఉందని, వంద శాతం వ్యాక్సిన్లను కేంద్రమే ఎందుకు కొనుగోలు చేయకూడదని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దేశంలో కరోనా సంక్షోభం, నిర్వహణ అంశంపై దాఖలైన సుమోటో కేసుపై సుప్రీం కోర్టు న్యాయమూర్తులు ...

Read More »